Prahladbhai modi
-
దేశ భద్రత కోసమే ఎన్ఆర్సీ బిల్లు: ప్రహ్లాద్ మోదీ
సాక్షి, కూకట్పల్లి: ఎన్ఆర్సీ బిల్లు పట్ల ప్రజలను ప్రతిపక్షాలు తప్పుదోవ పట్టిస్తూ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ సోదరుడు ప్రహ్లాద్ మోదీ తెలిపారు. శనివారం కూకట్‌పల్లిలోని బీజేపీ సీనియర్ నాయకుడు, అధికార ప్రతినిధి డాక్టర్ కొరడాల నరేష్ నివాసానికి వచ్చిన ఆయన పలువురు కార్యకర్తలతో కలిసి విందు భోజనంలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్ఆర్సీ బిల్లు పట్ల ప్రతిపక్షాలు ఎంత రాద్ధాంతం చేసినా ప్రజలు అర్థం చేసుకొని దేశ భద్రత కోసం బిల్లును అంగీకరిస్తారని ఆయన వివిరించారు. దేశంలో శరణార్థుల పేరుతో ఎంతోమంది అక్రమ చొరబాటుదారులు దేశంలో ఉండి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని ఆయన వివరించారు. కార్యక్రమంలో నాయకులు హరీష్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి, పద్మయ్య, హరికృష్ణ, అరుణ్, బాల్‌రాజ్ తదితరులు పాల్గొన్నారు. కాగా.. గవర్నర్ తమిళిసై సౌందర రాజన్‌ను ప్రహ్లాద్ మోదీ మర్యాదపూర్వకంగా కలిశారు. -
గుజరాత్లో రేషన్ బియ్యం అందట్లేదు
అహ్మదాబాద్: ప్రధాని మోదీ సోదరుడు ప్రహ్లాద్ ఆరోపణ కారణంగా గుజరాత్ పేద ప్రజలకు చౌకబియ్యం అందడం లేదని ప్రధాని మోదీ సోదరుడు, రేషన్ దుకాణదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రహ్లాద్ మోదీ సంచలన ఆరోపణ చేశారు. జాతీయ ఆహార భద్రత చట్టం కింద గుజరాత్‌లోని దాదాపు 17వేల రేషన్ దుకాణాల్లో ‘మా అన్నపూర్ణ యోజన’ పేరుతో రేషన్ బియ్యాన్ని అందజేస్తున్నారు. ఈ రేషన్ దుకాణాలన్నీ ఈ–ఎఫ్‌పీఎస్ సాఫ్ట్వేర్ ద్వారా సెంట్రల్ డాటాబేస్‌తో అనుసంధానమై ఉన్నాయి. దీంతో లబ్ధిదారు తప్పనిసరిగా ఆధార్ వివరాలు, వేలిముద్ర ఇవ్వాలి. లేకుంటే రేషన్ బియ్యం రాదు. చాలా దుకాణాల్లో సాఫ్ట్వేర్ పనిచేయకపోవటంతో లబ్ధిదారులు ఒట్టి చేతుల్తో వెళ్తున్నారని ప్రహ్లాద్ చెప్పారు. -
'రేషన్ డీలర్ల కమిషన్ పెంచాలి'
చాంద్రాయణగుట్ట (హైదరాబాద్) : రేషన్ డీలర్లకు ప్రభుత్వం వెంటనే కమిషన్ పెంచాలని, లేదంటే వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోదరుడు, ఆలిండియా ఫెయిర్ ప్రైస్ షాప్ డీలర్ల సమాఖ్య ఉపాధ్యక్షుడు ప్రహ్లాద్ భాయి మోదీ డిమాండ్ చేశారు. మంగళవారం నగరానికి విచ్చేసిన ఆయన చాంద్రాయణగుట్టలో విలేకరులతో మాట్లాడారు. ప్రజాకర్షణ సంక్షేమ పథకాలతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే ఆదర్శవంతంగా నిలుస్తోందని కితాబునిచ్చారు. అందరి సమస్యలను పరిష్కరిస్తున్న తెలంగాణ సర్కార్ రేషన్ డీలర్ల సమస్యలను మాత్రం విస్మరిస్తోందన్నారు. ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా ఉండే రేషన్ డీలర్ల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలన్నారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం తొలిసారిగా ఫెయిర్ ప్రైస్ షాప్ డీలర్స్ ఫెడరేషన్ సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. అంతకుముందు ఆయన దేవీ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు.