పెబ్బేరు: డబ్బు సంపాదనే లక్ష్యంగా కొందరు అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తూ సోమవారం పోలీసులకు చిక్కారు. ఈ సంఘటనకు సంబంధించి ఎస్‌ఐ జగదీశ్వర్ తెలిపిన వివరాలు... కర్నూల్ జిల్లా నుంచి గోపాల్‌నాయక్ ఏపీ 31టిఎ 9799 నంబర్ గల మినీ డీసీఎంలో 40 క్వింటాళ్ల రేషన్ బియ్యం నింపి బియ్యంపై కూరగాయల బాక్స్‌లు వేసుకుని బాలనగర్‌కు తరలిస్తుండగా, పక్కా సమాచారంతో పోలీసులు, సివిల్ సప్లయ్ అధికారులు సోమవారం తెల్లవారుజామున పెబ్బేరు సమీపంలో డీసీఎంను పట్టుకున్నారు.
బాలనగర్ మండలం కుచర్లతండాకు చెందిన డ్రైవర్ గోపాల్‌నాయక్, అనంతపురం జిల్లా ధర్మవరంలో ఉంటూ అదే గ్రామానికి చెందిన గిరి అనే వ్యక్తితో కలిసి చుట్టుపక్కల గ్రామాలలో ప్రజల నుంచి తక్కువ ధరకు రేషన్ బియ్యం కొని బాలనగర్, షాద్‌నగర్ ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇక్కడ ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారు.
ఈవిషయం తెలియడంతో సివిల్ సప్లయ్ అధికారులు డీటీ వేణు, నందకిశోర్ డీసీఎంలో ఉన్న బియ్యాన్ని పరిశీలించి రేషన్ బియ్యంగా గుర్తించారు. డ్రైవర్ గోపాల్‌నాయక్, గిరిపై కేసు నమోదు చేశామని, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment