ధనోరా రేషన్ షాపులో పంపిణీకి సిద్ధంగా బియ్యం బస్తాలు
కెరమెరి: ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి ప్రభుత్వం ప్రవేశపెట్టిన అమ్మహస్తం పథకం ప్రస్తుతం కనుమరుగైంది. రేషన్ దుకాణాల ద్వారా వినియోగదారులకు 9 రకాల సరుకులను అందించాలని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. కొంత కాలం పాటు సజావుగా సాగిన సరుకుల పంపిణీ ప్రత్యేక రాష్ట్రం తర్వాత ఆగిపోయింది. అప్పుడు పంపిణీ చేసిన 9 రకాల సరుకుల్లో ప్రస్తుతం బియ్యం, కిరోసిన్ మాత్రమే సరఫరా అవుతున్నాయి. మూడు మాసాల క్రితం వరకు ఇచ్చిన పంచదార కూడా నిలిచి పోవడంతో ప్రధానంగా రేషన్ దుకాణాలు బియ్యానికే పరిమితమయ్యాయి.
వాస్తవ పరిస్థితి ఇలా..
మండలంలోని 16 చౌరధరల దుకాణాల్లో నాలేగళ్ల క్రితం వరకు రేషన్ దుకాణాల్లో అన్ని రకాల సరుకులు దొరిగేవి. పేదలకు 9 రకాల సరుకులు ఇచ్చేవారు. తెలంగాణేర్పడిన తర్వాత బియ్యం. కిరొసోన్ తప్ప మరే ఇతర నిత్యావసర వస్తువులు అందడం లేదు.మండలంలో 16 చౌకధరల దుకాణాలున్నాయి. 8,446 రేషన్ కార్డులుండగా.. 194.568 క్వింటాళ్ల బియ్యంతో పంపిణీ అవుతుంది. కాగా 8,446 లీటర్ల కిరోసిన్ అందజేస్తున్నారు. వీరంతా పేదలు. ప్రభుత్వం కల్పించే నిత్యావసర సరుకులపై ఆధారపడి జీవిస్తున్నారు. గతంలో బియ్యం, గోధుములు, చక్కెర, కందిపప్పు, ఉప్పు, మంచినూనె, కారంపొడి, పసుపు, చింతపండు, ఉప్పు, తదితర నిత్యావసర వస్తువులు ప్రభుత్వం సరఫరా చేసేది. ప్రస్తుతం లబ్ధిదారులకు 6 కిలోల చొప్పున బియ్యం. లీటరు కిరోసిన్ మాత్రమే అందిస్తున్నారు. పోరాగి సిద్ధించుకున్న తెలంగాణలో పూర్తి స్థాయి సరుకులు ఎందుకు సరఫరా చేయడం లేదని లబ్ధిదారులు ప్రశ్నిస్తున్నారు. బియ్యం కూడా నాణ్యతగా లేవని మహిళలు అంటున్నారు. కాగా ఒక బియ్యం బస్తాలో 3 నుంచి 4 కిలోల వరకు కోత వస్తుందని పలువురి ద్వారా తెలిసింది.
లబ్ధిదారుల ఆందోళన
అయితే ఇటీవల రాష్ట్రం ప్రభుత్వం 10 ఎకరాల భూమి ఉన్న వారికి రేషన్ సరుకులు నిలిపి వేయనున్నట్లు ప్రకటించడంతో అనేక మందిలో ఆందోళన మొదలైంది. మండలంలో వివిధ గ్రామాల్లో అనేక మందికి 10 ఎకరాలు పైగానే సాగు భూముల పట్టాల ఉన్నాయని, అయినా వారందరు ప్రభుత్వం అందించే రేషన్ సరుకులపైనే ఆధారపడి జీవిస్తున్నారు. ప్రభుత్వం అనుకున్న ప్రకారంగానే 10 ఏకరాలు ఉన్నవారికి రేషన్ సరుకులు నిలిపి వేస్తే సుమారు వెయ్యి మంది లబ్ధిదారులకు చెందిన రేషన్ సరుకులు అందకుండా పోయే అవకాశం ఉంది. ప్రభుత్వం ఇచ్చేది బియ్యం, కిరోసిన్ అదికూడా నిలిపి వేస్తే ఏం తిని బతకాలని వారు ఆందోళన, ఆవేదన చెందుతున్నారు. తక్షణమే ప్రభుత్వం తన నిర్ణయం వెనక్కు తీసుకోవాలని లబ్ధిదారులు పేర్కొంటున్నారు.
రేషన్ బియ్యం జోకుతున్న డీలర్ , కిరోసిన్ పోస్తున్న సిబ్బంది
Comments
Please login to add a commentAdd a comment