kerosene
-
ఇదేమిటో తెలుసా? 90ల నాటి పిల్లలైతే ఇట్టే చెప్పేస్తారు!
మీరు 90లలో పుట్టారా? మీ సమాధానం ‘అవును’ అయితే పైన కనిపించే ఫొటోను చూస్తే మీ బాల్యం తప్పకుండా గుర్తుకువస్తుంది. ఆ సమయంలో ఈ వస్తువును ప్రతీ ఇంటిలోనూ వినియోగించేవారు. ఆ రోజుల్లో ఇంటింటా కిరోసిన్ వాసన వచ్చేది. వంటవండేందుకు కిరోసిన్ స్టవ్‌తో తంటాలు పడేవారు. మీరు కొంచెం లోతుగా ఆలోచిస్తే ఇదేమిటో ఇట్టే చెప్పేస్తారు. అయితే మీరు దీనిని మరచిపోయి ఉంటే ఇప్పుడు ఆ వివరాలు తెలుసుకుందాం. ఇప్పటికైనా ఇదేమిటో మీకు తెలిసిందా? ఈ వస్తువును ప్రిమస్ పిన్ అని అంటారు. సాధారణంగా దీనిని పిన్ అనే అని పిలుస్తుంటారు. ఈ పిన్ను ఆనాటి రోజుల్లో కిరోసిన్ స్టవ్‌ను శుభ్రపరిచేందుకు వినియోగించేవారు. స్టవ్ బర్నర్ మూసుకుపోయినప్పుడు ఈ పిన్సాయంతో స్టవ్ బర్నర్‌ను శుభ్రం చేసేవారు. ఫలితంగా స్టవ్ పూర్తి ఫ్లేమ్‌తో మండేది. ఈ పిన్ను వినియోగించి స్టవ్‌ను శుభ్రం చేసినప్పుడు కిరోసిన్ బర్నర్ వరకూ చేరుకునేది. నాటి రోజుల్లో అధికశాతం ఇళ్లలో కిరోసిన్ స్టవ్ మాత్రమే ఉన్నకారణంగా, ఈ పిన్ ప్రతీ కిరాణా దుకాణంలో దొరికేది. How many of you know what this is ????? pic.twitter.com/9bzsy15kU5 — Hasna Zaroori Hai 🇮🇳 (@HasnaZarooriHai) June 26, 2023 ‘బాల్యం గుర్తుకు వచ్చింది’ ఈ ఫొటోను ట్విట్టర్లో @HasnaZarooriHai పేరుతో ఉన్న పేజీలో షేర్ చేశారు. ఈ ఫొటోతో పాటు దీనిని ఏమంటారో తెలుసా? అనే ప్రశ్న కూడా అడిగారు. దీనికి చాలామంది సమాధానం రాశారు. కొందరు దీనికి సరైన సమాధానం రాయగా, మరికొందరు తాము జీవితంలో ఇలాంటి వస్తువును చూడలేదని పేర్కొన్నారు. అయితే పలువురు దీనిని చూడగానే తమకు బాల్యం గుర్తుకువచ్చిందంటూ తమ అనుభవాలను షేర్ చేశారు. ఇప్పటి వరకూ ఈ పోస్టుకు 22 లక్షల వీక్షణలు దక్కాయి. 5 వేల మంది దీనిని లైక్ చేశారు. ఇది కూడా చదవండి: ఒకే వేదికపై రెండు పెళ్లిళ్లు.. సంబరపడిన బంధువులకు సడెన్ షాక్! -
ఇంటికి గడియ పెట్టి.. కిరోసిన్ చల్లి
కాటారం: ఓ కుటుంబం ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో కొందరు దుండగులు ఇంటికి గడియ పెట్టి రెండు గుమ్మాలపై కిరోసిన్ చల్లి నిప్పు పెట్టి సజీవ దహనానికి యత్నించారు. ఈ సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం చింతకానిలో బుధవారం అర్ధరాత్రి జరిగింది. బాధిత కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చింతకానిలో దూలం రవి అనే యువకుడు తన తల్లిదండ్రులు దూలం రాజయ్య, రాజేశ్వరిలతో కలిసి ఇంట్లో నిద్రిస్తున్నాడు. అర్ధరాత్రి సమయంలో గాఢనిద్రలో ఉండగా గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి రెండు గుమ్మాలకు గడియ పెట్టి వెంట తీసుకొచ్చిన కిరోసిన్ చల్లి నిప్పంటించారు. మంటల వేడి గమనించిన కుటుంబ సభ్యులు ఇంటి వెనకాల గుమ్మంనుంచి బయటికొచ్చారు. వెంటనే మంటలు ఆర్పి పోలీసులకు సమాచారం అందించారు. ఇంటినుంచి బయటికి వస్తున్న సమయంలో ఇద్దరు వ్యక్తులు పరుగెత్తడాన్ని గమనించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. తమను సజీవ దహనం చేయడానికి కుట్ర పన్నారని ఆరోపించారు. బాధిత కుటుంబ స భ్యులు పలువురిపై అనుమానం వ్యక్తం చేస్తూ ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్టు ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు. -
తండ్రి వివాహేతర సంబంధాన్ని బయటపెట్టిన కొడుకు.. చివరికి ఏం జరిగిందంటే..
అనంతపురం క్రైం: తన వివాహేతర సంబంధాన్ని బయటపెట్టాడన్న కోపంతో కన్నకొడుకునే హత్య చేయాలని చూశాడో కసాయి తండ్రి. అల్లా స్మరణలో నిమగ్నమైన కొడుకుపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. ఈ ఘటన అనంతపురం రెండో పట్టణ పోలీసుస్టేషన్ పరిధిలోని విద్యుత్‌శక్తి నగర్లో చోటు చేసుకుంది. సీఐ జాకీర్ హుస్సేన్ తెలిపిన వివరాల మేరకు.. స్థానిక విద్యుత్‌శక్తి నగర్ రెండో క్రాస్‌లోని ఓ ఇంటి మొదటి అంతస్తులో మహబూబ్‌బాషా (అడ్వొకేట్), షంషాద్‌బేగం దంపతులు నివాసముంటున్నారు. వీరికి మెహరాజ్ హుస్సేన్(21), మరో అమ్మాయి సంతానం. మెహరాజ్ హుస్సేన్ లా మూడో సంవత్సరం చదువుతున్నాడు. చదవండి: వివాహేతర సంబంధం.. భార్యను పలుమార్లు హెచ్చరించాడు.. చివరకు తన తండ్రి వివాహేతర సంబంధం పెట్టుకున్నాడన్న విషయాన్ని మామ అన్వర్‌బాషాకు మెహరాజ్ హుస్సేన్ ఆరు నెలల క్రితం చెప్పాడు. దీంతో అన్వర్‌బాషా.. మహబూబ్‌బాషాను మందలించాడు. అప్పటి నుంచి కొడుకుపై కక్ష పెంచుకున్నాడు. 20 రోజుల క్రితం మహబూబ్‌బాషా భార్య, కుమార్తె హుబ్లీలోని బంధువుల ఇంటికి వెళ్లారు. ఇంకా తిరిగి రాలేదు. ఇదే అదనుగా భావించిన మహబూబ్‌బాషా శుక్రవారం ఓ గదిలో అల్లా స్మరణలో ఉన్న మెహరాజ్ హుస్సేన్‌పై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మెహరాజ్ హుస్సేన్ కాలుతూనే తండ్రిని పట్టుకోబోయాడు. అతను వదిలించుకుని బయటకు వచ్చేశాడు. విషయం తెలుసుకున్న స్థానికులు డయల్ 100, 108కు ఫోన్ చేశారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని.. తీవ్రంగా గాయపడిన మెహరాజ్ హుస్సేన్‌ను, స్వల్ప గాయాలైన అతని తండ్రి మహబూబ్‌బాషాను అంబులెన్స్‌లో సర్వజనాస్పత్రికి తరలించారు. మెహరాజ్ హుస్సేన్ చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా..ఘటన వల్ల మహబూబ్‌బాషా ఇంట్లో వ్యాపించిన మంటలను అగి్నమాపక సిబ్బంది ఆర్పేశారు. -
బంధువుతో ఇష్టం లేని పెళ్లి.. ఇంట్లో ఎవరు లేని సమయంలో..
సాక్షి,తిరువొత్తియూరు( చెన్నై): శరీరంపై కిరోసిన్ పోసుకుని విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన శ్రీపెరంబదూర్‌లో జరిగింది. సందవేలూరు శ్రీనివాస పెరుమాల్ ఆలయం వీధికి చెందిన రమేష్ టాస్మాక్ దుకాణంలో పనిచేస్తున్నాడు. అతనికి భార్య ధనలక్ష్మి, కుమార్తె మోహన ప్రియ (18) ఉన్నారు. మోహనప్రియ కాంచీపురంలోని ప్రైవేట్ కళాశాలలో బీఎస్సీ మొదటి సంవత్సరం చదువుతోంది. ఈ క్రమంలో రమేష్ కుటుంబంతో కలిసి అన్న సెల్వరాజ్ ఇంటికి వెళ్లాడు. మోహన ప్రియ తాను ఇంటికి వెళుతున్నట్లు తల్లిదండ్రులకు చెప్పింది. ఇంటికి వచ్చిన తర్వాత ఏమి జరిగిందో కాని శరీరంపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. మంటలు తాళలేక ఆమె కేకలు వేయడంతో ఇరుగుపొరుగు వారు వచ్చి మంటలను ఆర్పి 108 ద్వారా శ్రీపెరంబుదూర్ ఆస్పత్రిలో చేర్చారు. పరిశీలించిన డాక్టర్లు విద్యార్థిని అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. సుంగువారిసత్రం పోలీసులు కేసు దర్యాప్తుచేపట్టారు. మోహన ప్రియకు బంధువుతో ఇష్టం లేని పెళ్లి చేయడానికి ఏర్పాట్లు చేయడంతో ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. చదవండి: Kukatpally Rave Party: సడన్‌గా పోలీసుల ఎంట్రీ, ఇద్దరు హిజ్రాలు కూడా.. -
హైదరాబాద్: 2 శాతం మంది ఇంకా కిరోసిన్‌పైనే వంట
సాక్షి, హైదరాబాద్: విశ్వనగరం వైపు పరుగులు తీస్తున్న హైదరాబాద్‌లో రెండు శాతం వరకు పేద కుటుంబాలు కిరోసిన్‌పైనే ఆధారపడి వంటావార్పు కొనసాగిస్తున్నాయి. సరిగ్గా ఐదేళ్ల క్రితం ఢిల్లీ, చండీగఢ్ తరహాలో కిరోసిన్ రహిత నగరంగా తీర్చిదిద్దాలనే పాలకుల ప్రయత్నాలు అటకెక్కాయి. పౌరసరఫరాల శాఖ నగరంలో కిరోసిన్ వినియోగం నివారించేందుకు నడుం బిగించినప్పటికీ ఆచరణలో మాత్రం అమలు కావడంలేదు. రేషన్ కార్డులు కలిగి ఉన్న బీపీఎల్ కుటుంబాలను సర్కిల్‌వారీగా గుర్తించి ఎల్పీజీ కనెక్షన్లు మంజూరు చేసే విధంగా ఆయిల్ కంపెనీల డిస్ట్రిబ్యూటర్లకు ఆదేశాలు జారీ చేసినా ఫలితం లేకుండా పోయింది. కేవలం కొత్త కార్డుల జారీలో గ్యాస్ కనెక్షన్ తప్పనిసరి నిబంధనను అమలు చేసి..పాత కార్డుదారులకు మాత్రం కనెక్షన్లు మంజూరు చేయించడాన్ని గాలికి వదిలేసింది. ఉజ్వల అంతంతే... కేంద్ర ప్రభుత్వ ప్రధాన మంత్రి ఉజ్వల యోజన(దీపం) పథకం అమల్లో సైతం పౌరసరఫరాల శాఖ వెనుకబడింది. అప్పట్లో గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ పౌరసరఫరాల విభాగాలు ఉజ్వల యోజన పథకం కింద సుమారు 1,67,198 కుటుంబాలను గుర్తించాయి. అందులో 1,66,522 కుటుంబాలకు ఎల్పీజీ కనెక్షన్ల కోసం సిఫార్సు చేయగా, ఆయిల్ కంపెనీల డి్రస్టిబ్యూటర్లు మాత్రం 84,713 కుటుంబాలకు మాత్రమే కనెక్షన్లు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. చదవండి: మద్యం మత్తులో పోలీసులనే ముప్పు తిప్పలు పెట్టాడు ఇంకా కిరోసిన్ లబ్దిదారులు గ్రేటర్ పరిధిలోని నిరుపేద కుటుంబాలు ఇంకా కిరోసిన్‌పైనే ఆధారపడి వంటావార్పు కొనసాగించడం విస్మయానికి గురిచేస్తోంది. ప్రస్తుతం మొత్తం 17,21,212 రేషన్‌కార్డు కలిగిన కుటుంబాలు ఉండగా, అందులో 3,41,823 కుటుంబాలకు ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్ లేక కిరోసిన్ లబ్దిదారులుగా కొనసాగుతున్నారు. చదవండి: రెండో రోజు ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు గ్రేటర్లో కిరోసిన్ లబ్దిదారులు ఇలా జిల్లా మొత్తం కార్డుల సంఖ్య కిరోసిన్ కార్డులు నెలసరి కిరోసిన్ కోటా (లీటర్లలో) హైదరాబాద్ 6,36,661 1,26,214 207817.0 మేడ్చల్ జిల్లా 5,24,594 89,158 110470.0 రంగారెడ్డి జిల్లా 5,59,957 1,26,451 168225.0 -
కేసు పెట్టిందని యువతి సజీవ దహనం
లక్నో: ఉత్తర ప్రదేశ్‌లో దారుణం చోటు చేసుకుంది. మహోబాకు చెందిన యువతి (30)ని ఓ వ్యక్తి లైంగికంగా వేధించి, కొట్టడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో నిందితుడి తల్లిదండ్రులు ఆ యువతిపై కిరోసిన్ పోసి నిప్పంటించారు. పోలీసులు వివరాల ప్రకారం.. యూపీలోని మహోబాకు చెందిన ఓ యువతిని పొరుగువారు కొట్టి వేధించారు. దీనిపై ఆమె కుల్పహార్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే కేసు నమోదు చేసినందుకు కోపంతో నిందితుడి తల్లిదండ్రులు యువతిపై కిరోసిన్ పోసి నిప్పంటించారు. ఆ యువతి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం ఆమెను ఝాన్సీ ఆస్పత్రికి తలించారు. ఈ ఘటనపై నిందితుడి తల్లిని అదుపులోకి తీసుకుని, కేసు దర్యాప్తు చేస్తున్నట్లు కుల్పహార్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ మహేంద్ర ప్రతాప్ సింగ్ తెలిపారు. -
గర్భిణి సహా 9 మంది కుటుంబ సభ్యుల ఆత్మహత్యాయత్నం
సాక్షి, టీ.నగర్: నెల్లై కలెక్టరేట్లో ఒకే కుటుంబానికి చెందిన పదిమంది సోమవారం ఆత్మహత్యకు యత్నించడం సంచలనం కలిగించింది. నెల్లై తచ్చనల్లూరు సత్రంపుదుకుళం థాట్కో కాలనీకి చెందిన పెరుమాళ్ కుమారుడు అజిత్ లా కోర్సు చదువుతున్నాడు. ఇతను గత ఫిబ్రవరి 12న మానూర్ సమీపాన ఉన్న నరియూత్తు నుంచి అభిషేకపట్టి వెళ్లే అటవీమార్గం ముళ్లపొదల్లో శవమై తేలాడు. స్థలానికి సంబంధించి పాతకక్షల నేపథ్యంలోనే అతడు దారుణ హత్యకు గురైనట్లు తేలింది. దీనిపై మానూరు పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసులో నిందితులను అరెస్ట్ చేయకుండా పోలీసులు సహకరిస్తున్నారని ఆరోపిస్తూ గర్భవతి అయిన హతుని భార్య, తండ్రి పెరుమాళ్, సోదరుడు అరుళ్, అతని తల్లితో సహా కుటుంబీకులు, బంధువులు సోమవారం నెల్లై కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. అంతేకాకుండా తమ వెంట తెచ్చుకున్న కిరోసిన్ ఒంటిపై పోసుకుని నిప్పంటించుకునేందుకు యత్నించారు. అప్రమత్తమైన అక్కడి పోలీసులు వారి నుంచి కిరోసిన్ బాటిల్ స్వాధీనం చేసుకున్నారు. ఈ ఉదంతం కలకలం రేపింది. పోలీసులు వారితో చర్చించారు. కలెక్టర్‌కు వారు కలిసి వినతి పత్రం ఇచ్చేందుకు చర్యలు తీసుకున్నారు. చదవండి: మరదలిపై అనుమానం.. చంపి, శవాన్ని.. -
కిరోసిన్ ఎగ్గొట్టి..
సాక్షి, సిటీబ్యూరో: పేదల సబ్సిడీ కిరోసిన్ పత్తాలేకుండా పోయింది. పౌరసరఫరాల శాఖ ప్రతి నెల కిరోసిన్ కోటా కేటాయిస్తున్నా..ప్రభుత్వ చౌకధరల దుకాణాలకు మాత్రం సరఫరా కావడం లేదు. గత రెండు, మూడు నెలల నుంచి కిరోసిన్ సరఫరా నిలిచిపోయింది. ఫలితంగా లబ్ధిదారులకు కిరోసిన్ అందని దాక్ష్రగా తయారైంది. కమిషన్ పెంపు కోసం సమ్మెలో భాగంగా మధ్యలో కొన్ని నెలలుసంబంధిత ఏజెన్సీలు కిరోసిన్ సరఫరాను నిలిపివేయగా, తాజాగా లాక్‌డౌన్‌తో గత రెండు మాసాలుగా కిరోసిన్ సరఫరా పూర్తిగా నిలిచిపోయినట్లు తెలుస్తోంది. దీంతో ప్రభుత్వ చౌక ధరల దుకాణాల డీలర్లు పాత నిల్వలను లబ్ధిదారులకు కిరోసిన్ సర్దుతున్న తెలుస్తోంది. గత నెలలో ఉచిత బియ్యం పంపిణీ హడావుడి కారణంగా కిరోసిన్ కోటాకు పెద్దగా డిమాండ్ లేనప్పటికి ఈసారి కిరోసిన్ కోటాను లబ్ధిదారులు అడిగి మరి డ్రా చేస్తుండటంతో కిరోసిన్ కొరత నెలకొంది. సంబంధిత అధికారులు మాత్రం కోటా కేటాయించి సరఫరాను గాలీకి వదిలేయడం విస్మయానికి గురిచేస్తోంది. నాలుగు లక్షలపైనే కుటుంబాలు గ్రేటర్ పరి«ధి కిరోసిన్ లబ్ధి కుటుంబాలు సుమారు నాలుగు లక్షలపైనే ఉన్నాయి. పౌరసరఫరాల శాఖ ప్రతి నెల ఎల్పీజీ కనెక్షన్లు లేని కుటుంబాలతోపాటు దీపం కనెక్షన్ కలిగిన కుటుంబాలకు ఒక్కో లీటర్ చొప్పున కిరోసిన్ కోటాను కేటాయిస్తుంది. సంబంధిత కిరోసిన్ ఎజెన్సీలు ప్రతి నెల మొదటి వారంలో ప్రభుత్వ చౌకధరల దుకాణాలకు సరఫరా చేస్తూ వస్తున్నాయి. తాజాగా నెలకొన్న పరిస్థితులతో కిరోసిన్ సరఫరా పూర్తిగా నిలిచిపోయినట్లు తెలుస్తోంది. ఇదీ పరిస్ధితి.. ♦ హైదరాబాద్ జిల్లాలో ఆహార భద్రత కార్డు కలిగిన కుటుంబాలు 5,80,781 ఉండగా అందులో ఎల్పీజీ కనెక్షన్లు లేని కుటుంబాలు 85,897, దీపం కనెక్షన్లు గల కుటుంబాలు 81,105 వరకుఉన్నారు. మొత్తం మీద1,67,002 లీటర్ల కిరోసిన్ కోటా అవసరం ఉంటుంది. ప్రభుత్వ చౌక ధరల దుకాణాల్లో పాత కోటాకు సంబంధించి 10,974 లీటర్ల కిరోసిన్ నిల్వలు అందుబాటులో ఉండగా, మిగిలిన 1,56,028 లీటర్ల కోటాను కేటాయించారు. కానీ, సంబంధిత కిరోసిన్ ఏజెన్సీల నుంచి ప్రభుత్వ చౌకధరల దుకాణాలకు కిరోసిన్ మాత్రం సరఫరా జరుగలేదు. ♦ మేడ్చల్ జిల్లాలో మొత్తం 4,95,267 కార్డులు ఉండగా, అందులో ఎల్పీజీ కనెక్షన్లు లేని కుటుంబాలు 73,933, దీపం కనెక్షన్ కలిగిన కుటుంబాలు 20,249 వరకు ఉన్నాయి. మొత్తం మీద 94,182 లీటర్ల కిరోసిన్ కోటా అవసరం ఉండగా, ప్రభుత్వ చౌకధరల దుకాణాలలో సుమారు 5,823 లీటర్ల కిరోసిన్ నిల్వ ఉంది. దానిని మినహాయించి మిగిలిన 88,359 లీటర్ల కిరోసిన్ కేటాయించారు. కానీ సరఫరాల మాత్రం లేకుండా పోయింది. ♦ రంగారెడ్డి జిల్లాలో 5,24,882 కార్డులు ఉండగా, అందులో ఎల్పీజీ కనెక్షన్లు లేని కుటుంబాలు 1,02,013, దీపం కనెక్షన్‌గల 40,782 కుటుంబాలున్నాయి. మొత్తం మీద 1,42 795 లీటర్ల కిరోసిన్ అవసరం ఉండగా, ప్రభుత్వ చౌకధరల దుకాణాలోల 3254 లీటర్లు అందుబాటు ఉంది. మిగిలిన 139,541 లీటర్లను కేటాయించారు. కానీ..సరఫరా మాత్రం కాలేదు. -
పోలీసుల సజీవ దహనానికి యత్నం
సాక్షి, చెన్నై : చెన్నైకి చెందిన ఇద్దరు అన్నదమ్ముళ్లు తమ మద్దతుదారులతో కలిసి ఓ ఎస్ఐ, మరో ముగ్గురు పోలీసుల్ని సజీవ దహనం చేయడానికి యత్నించారు. వివరాలు.. చెన్నై కొడంగయూరు చిత్తాడి మఠంకు చెందిన కృష్ణమూర్తి(28) శుక్రవారం ఉదయం మోటారు సైకిల్ మీద వెళ్తుండగా, ట్యాంకర్ లారీ ఢీకొంది. దీంతో అతడు స్వల్పంగా గాయపడ్డాడు. తనను లారీ ఢీకొన్నట్టు తన సోదరుడు సురేష్‌కు సమాచారం ఇచ్చాడు. దీంతో మద్దతుదారులతో కలిసి సంఘటన స్థలానికి చేరుకున్న సురేష్ ట్యాంకర్ డ్రైవర్ మురుగన్‌ను చితకబాదాడు. అంతటితో ఆగకుండా అతడ్ని వారి ప్రాంతానికి తీసుకెళ్లి కట్టి పడేశాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న కొడంగయూరు ఎస్ఐ పళని నేతృత్వంలో ముగ్గురు పోలీసులు, జీపు డ్రైవర్ మణికంఠన్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. డ్రైవర్‌ను విడిచి పెట్టాలని సూచించినా, అన్నదమ్ములు వినిపించుకోలేదు. దీంతో కృష్ణమూర్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తన సోదరుడ్ని పోలీసులు జీపులో ఎక్కించడంలో ఆగ్రహానికి లోనైన సురేష్ కిరోసిన్ క్యాన్ తీసుకొచ్చి పోలీసుల మీద పోశాడు. తన సోదరుడ్ని విడిచిపెట్టకుంటే తగల బెట్టేస్తానని, సజీవదహనం చేస్తానని బెదిరించాడు. ఈ హఠాత్పరిణామంతో షాక్‌కు గురైన పోలీసులు అతడ్ని విడిచిపెట్టారు. సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు రంగంలోకి దిగి డ్రైవర్‌ను రక్షించారు. అదే సమయంలో అన్నదమ్ముళ్లతో పాటు వారి అనుచరులు అక్కడి నుంచి ఉడాయించారు. ఆ ఇద్దరి మీద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
కంప్యూటర్ కాలం.. కిరోసిన్ ఫ్యాన్
సాక్షి సిటీబ్యూరో: కిరోసిన్ ఫ్యానా..అదేంటి.. అనుకుంటున్నారా.. అవునండీ.. సిటీలో ఇంకా కిరోసిన్‌ఫ్యాన్లు ఇంకా కొందరు ఉపయోగిస్తున్నారు. నిజాం కాలం నాటి పురాతన ఫ్యాన్లు పాతబస్తీలో అక్కడక్కడా వాడుతున్నారు. ఫ్యాన్ కనుగొన్న తొలినాళ్లలో విద్యుత్‌తో కాకుండా వేడితో తిరిగేలా చేసేవారు. మరో విషయమేమంటే.. ఇప్పటికీ ఇలాంటి ఫ్యాన్లను రిపేరు చేసేవారు కూడా ఉన్నారు. విదేశాలనుంచి దిగుమతి... నిజాం పాలనలో నగరానికి వివిధ దేశాలనుంచి టెక్నాలజీ దిగుమతి అయ్యేది. ముఖ్యంగా ఇళ్లలో వినియోగించే ఫ్యాన్లు, విద్యుత్తు పరికరాలు, వాహనాలు, షాండిలియర్స్, రిఫ్రీజిరేటర్లు తదితర వస్తువులు తయారైంది ఆలస్యం సిటీకి వచ్చేవి. అలా కిరోసిన్ ఫ్యాన్ కూడా ఇంగ్లండ్ నుంచి వచ్చింది. పాతబస్తీలోని పురానీహవేలీ నివాసి మహ్మద్ హనీఫ్ ఇల్యాస్ బాబా ఇంట్లో కిరోసిన్ ఫ్యాన్ ఇంకా పనిచేస్తోంది. డిజైన్ డిఫరెంట్.. దీనిని 1800లో ఇంగ్లాండ్‌లో కనుగొన్నారు. ఫ్యాన్ కింది బాగం గుండ్రంగా ఉంటుంది. ఇందులో కిరోసిన్ వేస్తారు. ఓ చివర దీపం వెలిగిస్తారు. దీపం నుంచి పైపుల ద్వారా వేడి పైకి వెళుతుంది.దీని రూపకల్పనలో నీరు, సల్ఫ్యూరిక్ ఆమ్లం ఉపయోగించారు. కింద వెనుక బాగంలో కాస్త పైప్ ఉంటుంది. ఇందులో వేడితో పాటు గ్యాస్ ప్రవేశిస్తుంది. దీంతో ఆవిరితో ఫ్యాన్ తిరగడం ప్రారంభమవుతుంది. ఎంత వేడి పెంచితే అంత వేగంగా రెక్కలు తిరుగుతాయి. నగరంలోనే అరుదుగా.. 1980 వరకు పాతబస్తీలోని పలు ఇళ్లలో వినియోగించే వారు. విద్యుత్తుతో నడిచే ఫ్యాన్లు మార్కెట్లో వచ్చాక దీనిగురించి ఆలోచించడం మానేశారు. పలు ఇళ్లల్లో పదేళ్ల క్రితం వరకు వినియోగించారని పురానీ హవేలీ నివాసి ముజాహిద్ తెలిపారు. -
గ్యాస్ ఉంటే.. కిరోసిన్ కట్
గ్యాస్ కనెక్షన్ ఉన్న వారికి కిరోసిన్ బంద్ చేయనున్నారు. రేషన్ దుకాణాల ద్వారా ఇచ్చే నీలి కిరోసిన్‌ను ఈనెల నుంచే నిలిపి వేయనున్నారు. ఈ మేరకు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ఉత్తర్వులు జారీ చేసిందని సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు. గ్యాస్ కనెక్షన్లు లేని దీపం పథకం కింద సిలిండర్లు పొందిన లబ్ధిదారులకు మాత్రమే నెలకు లీటర్ చొప్పున కిరోసిన్ ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించినట్లు తెలిపారు. గ్యాస్ సిలిండర్లు ఉన్నవారికి కిరోసిన్ ఇస్తే దానిని బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నారని భావించిన పౌరసరఫరాల శాఖ ఈ మేరకు నిర్ణయం తీసుకుందని చెబుతున్నారు. సాక్షి, మెదక్ : జిల్లా వ్యాప్తంగా 521 రేషన్‌దుకాణాలు ఉండగా 2,14,165 రేషన్ కార్డులు ఉన్నాయి. వాటిలో ఆహారభద్రత(తెల్లరేషన్) కార్డులు 2,01,059 అంత్యోదయ కార్డులు 13018 అన్నపూర్ణ 88 కార్డులు చొప్పున జిల్లాలో ఉన్నాయి. వీరికి నెలకు 2,14,000 లీటర్ల కిరోసిన్‌ను పంపిణీ చేస్తున్నారు. జిల్లాలో నేరుగా తీసుకున్న వాటితో పాటు దీపం, పథకం కింద గ్యాస్పు పొందిన వారితో పాటు అసలే గ్యాస్ కనెక్షన్లు లేని వారు మొత్తం జిల్లాలో 84 వేల కుటుంబాలు ఉన్నాయి. ఈలెక్కన స్వయంగా గ్యాస్కనెక్షన్లు పొందిన వారి సంఖ్య 1,30,165 మంది ఉన్నారు. దీంతో వీరందరికి ఈనెల నుంచి కిరోసిన్ బంద్ కానుంది. కేవలం దీపం పథకం ద్వారా గ్యాస్ పొందిన వారితో పాటు అసలు ఏ గ్యాస్కనెక్షన్ లేనటువంటి 84 వేల కుటుంబాలకు మాత్రమే నెలకు ఒక్కో కుటుంబానికి 1లీటర్ కిరోసిన్ ఇవ్వనున్నారు. ఇంతకు ముందు గ్యాస్కనెక్షన్తో సంబంధం లేకుండా ఒక్కో కార్డుపై రూ.33కు లీటర్ చొప్పున అందించే వారు. ఇక నుంచి అన్ని కుటుంబాలకు ఇవ్వరాదని అధికారులు నిర్ణయించారు. నల్లబజారుకు తరలిస్తున్నారని.. కిరోసిన్ నల్లబజారుకు తరలిపోకుండా ఉండేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ముఖ్యంగా పట్టణాల్లో అందరికి గ్యాస్ కనెక్షన్లు ఉండగా పల్లెలోనూ వివిధ పథకాల కింద కొంత మంది లబ్ధిదారులకు అందించారు. వీరికి రేషన్ కార్డులు ఉండటంతో ప్రతినెలా రేషన్ దుకాణాల ద్వార కిరోసిన్ తీసుకునే వారు. వారిలో కొందరికి కిరోషిన్ అవసరం లేకున్నా తీసుకెళ్లి బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తూ అమ్ముకుంటుండగా, అవసరం లేని వారు రేషన్ షాపుల్లో నుంచి తీసుకెళ్లేవారు కాదు. దీంతో సదరు డీలర్ మిగిలిన దానిని నల్లబజార్లో విక్రయించుకునే వారు. దీంతో గ్యాస్ కనెక్షన్ ఉన్న వారికి కిరోసిన్ నిలిపి వేయాలని పౌరసరఫరాలశాఖ నిర్ణయించి ఈ నెల నుంచి జిల్లాకు కిరోసిన్ నిలిపివేశారు. కరెంట్‌పోతే చీకట్లోనే.. గ్యాస్ కనెక్షన్ ఉన్నవారికి కిరోసిన్ నిలిపివేస్తునట్లు పౌరసరాఫరాలశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో జిల్లాలో 1,30,165 కుటుంబాలకు సంబంధించి గ్యాస్ కనెక్షన్లు నేరుగా తీసుకున్న వారు ఉన్నారు. దీంతో వీరందరికి ఈనెల నుంచే కిరోసిన్ నిలిపివేస్తునట్లు జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు పేర్కొంటున్నారు. కానీ రాత్రి వేళలో కరెంట్ పోయినట్లయితే ఆ కుటుంబాలు చీకట్లో మగ్గే పరిస్థితి నెలకొంటుంది. దీంతో జిల్లాలో ఈ విషయంలో ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయని పలువురు పేర్కొంటున్నాయి. నేడు గ్యాస్ కనెక్షన్ పొందిన వారు ధనవంతులు అనుకుంటే పౌరసరఫరాల శాఖ పప్పులో కాలు వేసినట్లే. గతంలో వంటచెరుకు కోసం అడవులను నరికిన జనాలకు వాటిని నరకటంతో జరిగిన నష్టాలను తెలుసుకొని ఎన్ని ఇబ్బందులు ఎదురైనా గ్యాస్ కనెక్షన్లు తీసుకున్నారు. వారిని అభినందించాల్సిన పౌరసరఫరాలశాఖ, ప్రభుత్వం వారిని ధనవంతుల కింద జమకట్టి కిరోసిన్ కట్ చేయటం సమంజసం కాదని పలువురు పేర్కొంటున్నారు. ఇక నుంచి కిరోసిన్ బంద్ గ్యాస్ కనెక్షన్ ఉన్న వారందరికీ ఈనెల నుంచి కిరోసిన్ నిలిపివేస్తున్నాం. దీపం పథకంలో గ్యాస్ కనెక్షన్లు పొందిన పేదలతో పాటు అసలు గ్యాస్ కనెక్షన్ లేని వారికి మాత్రమే నెలకు ఒక లీటర్ చొప్పున కిరోసిన్ ఇస్తాం. జిల్లాలో మొత్తం 2,14,165 రేషన్ కార్డులు ఉండగా అందులో దీపం పథకం ద్వారా గ్యాస్ కనెక్షన్ తీసుకున్న వారితో పాటు అస్సలు గ్యాస్ కనెక్షన్లు లేనివారు 84 వేల మంది ఉన్నారు. వారికి మాత్రమే నెలకు లీటర్ చొప్పున కిరోసిన్ ఇవ్వటం జరుగుతుంది. ఈలెక్కన 1,30,165 మందికి కిరోసిన్ నిలిపి వేయటం జరిగింది. – శ్రీకాంత్‌రెడ్డి, ఇన్చార్జి డీఎస్వో -
రేషన్ కోట.. సరుకుల కోత
కెరమెరి: ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి ప్రభుత్వం ప్రవేశపెట్టిన అమ్మహస్తం పథకం ప్రస్తుతం కనుమరుగైంది. రేషన్ దుకాణాల ద్వారా వినియోగదారులకు 9 రకాల సరుకులను అందించాలని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. కొంత కాలం పాటు సజావుగా సాగిన సరుకుల పంపిణీ ప్రత్యేక రాష్ట్రం తర్వాత ఆగిపోయింది. అప్పుడు పంపిణీ చేసిన 9 రకాల సరుకుల్లో ప్రస్తుతం బియ్యం, కిరోసిన్ మాత్రమే సరఫరా అవుతున్నాయి. మూడు మాసాల క్రితం వరకు ఇచ్చిన పంచదార కూడా నిలిచి పోవడంతో ప్రధానంగా రేషన్ దుకాణాలు బియ్యానికే పరిమితమయ్యాయి. వాస్తవ పరిస్థితి ఇలా.. మండలంలోని 16 చౌరధరల దుకాణాల్లో నాలేగళ్ల క్రితం వరకు రేషన్ దుకాణాల్లో అన్ని రకాల సరుకులు దొరిగేవి. పేదలకు 9 రకాల సరుకులు ఇచ్చేవారు. తెలంగాణేర్పడిన తర్వాత బియ్యం. కిరొసోన్ తప్ప మరే ఇతర నిత్యావసర వస్తువులు అందడం లేదు.మండలంలో 16 చౌకధరల దుకాణాలున్నాయి. 8,446 రేషన్ కార్డులుండగా.. 194.568 క్వింటాళ్ల బియ్యంతో పంపిణీ అవుతుంది. కాగా 8,446 లీటర్ల కిరోసిన్ అందజేస్తున్నారు. వీరంతా పేదలు. ప్రభుత్వం కల్పించే నిత్యావసర సరుకులపై ఆధారపడి జీవిస్తున్నారు. గతంలో బియ్యం, గోధుములు, చక్కెర, కందిపప్పు, ఉప్పు, మంచినూనె, కారంపొడి, పసుపు, చింతపండు, ఉప్పు, తదితర నిత్యావసర వస్తువులు ప్రభుత్వం సరఫరా చేసేది. ప్రస్తుతం లబ్ధిదారులకు 6 కిలోల చొప్పున బియ్యం. లీటరు కిరోసిన్ మాత్రమే అందిస్తున్నారు. పోరాగి సిద్ధించుకున్న తెలంగాణలో పూర్తి స్థాయి సరుకులు ఎందుకు సరఫరా చేయడం లేదని లబ్ధిదారులు ప్రశ్నిస్తున్నారు. బియ్యం కూడా నాణ్యతగా లేవని మహిళలు అంటున్నారు. కాగా ఒక బియ్యం బస్తాలో 3 నుంచి 4 కిలోల వరకు కోత వస్తుందని పలువురి ద్వారా తెలిసింది. లబ్ధిదారుల ఆందోళన అయితే ఇటీవల రాష్ట్రం ప్రభుత్వం 10 ఎకరాల భూమి ఉన్న వారికి రేషన్ సరుకులు నిలిపి వేయనున్నట్లు ప్రకటించడంతో అనేక మందిలో ఆందోళన మొదలైంది. మండలంలో వివిధ గ్రామాల్లో అనేక మందికి 10 ఎకరాలు పైగానే సాగు భూముల పట్టాల ఉన్నాయని, అయినా వారందరు ప్రభుత్వం అందించే రేషన్ సరుకులపైనే ఆధారపడి జీవిస్తున్నారు. ప్రభుత్వం అనుకున్న ప్రకారంగానే 10 ఏకరాలు ఉన్నవారికి రేషన్ సరుకులు నిలిపి వేస్తే సుమారు వెయ్యి మంది లబ్ధిదారులకు చెందిన రేషన్ సరుకులు అందకుండా పోయే అవకాశం ఉంది. ప్రభుత్వం ఇచ్చేది బియ్యం, కిరోసిన్ అదికూడా నిలిపి వేస్తే ఏం తిని బతకాలని వారు ఆందోళన, ఆవేదన చెందుతున్నారు. తక్షణమే ప్రభుత్వం తన నిర్ణయం వెనక్కు తీసుకోవాలని లబ్ధిదారులు పేర్కొంటున్నారు. రేషన్ బియ్యం జోకుతున్న డీలర్ , కిరోసిన్ పోస్తున్న సిబ్బంది -
సబ్సిడీ కిరోసిన్ ఎత్తివేత!
సాక్షి, హైదరాబాద్: ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా రాష్ట్రంలోని పేదలకు చేరాల్సిన రాయితీ కిరోసిన్ పక్కదారి పడుతోంది. రేషన్ డీలర్ల అత్యాశ, అధికారుల నిర్లక్ష్యం వెరసి కిరోసిన్ యథేచ్ఛగా నల్లబజారుకు తరలిపోతోంది. కిరోసిన్ దందాపై నిఘా కొరవడటంతో వ్యాపారులు అక్రమ మార్గంలో సొమ్ము చేసుకుంటున్నారు. ఏటా రాష్ట్రంలో 33 శాతం మేర కిరోసిన్ బ్లాక్ మార్కెట్‌కు తరలుతున్నట్లు ఇటీవలి పౌరసరఫరాల శాఖ విశ్లేషణలో తేలింది. దేశవ్యాప్తంగానూ ఇదే పరిస్థితి నెలకొనడంతో అక్రమాలకు చెక్ పెట్టేందుకు కిరోసిన్ సరఫరానే పూర్తిగా నిలిపివేసే దిశగా కేంద్ర ప్రభుత్వం ఆలోచనలు చేస్తోంది. ఎత్తివేతకు కేంద్రం మొగ్గు.. అయితే రాష్ట్రంలోని రేషన్ దుకాణాల్లో ఇప్పటికే ప్రవేశపెట్టిన ఎలక్ట్రానిక్ పాయింట్ ఆఫ్ సేల్ (ఇ –పాస్) విధానాన్ని కిరోసిన్ పంపిణీకి కూడా అనుసంధానం చేశారు. ఇటీవలే ఈ విధానం అమల్లోకి రావడంతో డీలర్లు కిరోసిన్ బ్లాక్ మార్కెట్‌కు తరలించే వీలు లేకుండా అడ్డుకట్ట పడుతోంది. ఈ నెలలోనే ప్రస్తుత లెక్కల మేరకే 33 శాతం మేర కిరోసిన్ మిగులు సాధించినట్లు పౌర సరఫరాల శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే ఇ–పాస్ విధానం అన్ని రాష్ట్రాల్లో అమల్లో లేదు. దీంతో దేశవ్యాప్తంగా కిరోసిన్ అక్రమాలకు చెక్‌పడటం లేదు. దేశవ్యాప్తంగా 41శాతం ఏటా అక్రమమా ర్గం పడుతోందని కేంద్రం తన సర్వేలో గుర్తించింది. ప్రస్తుతం దేశంలోనూ, రాష్ట్రంలోనూ నూటికి 95 శాతం మంది దీపం, వంట పొయ్యి లు వాడడం లేదు. దాదాపు ప్రతి ఒక్కరికీ గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని రాయితీ సరఫరాను పూర్తిగా నిలిపివేయా లని కేంద్రం యోచిస్తోంది. దీనిపై ఇప్పటికే కేంద్ర ఆర్థిక సలహాదారు సైతం ప్రభుత్వానికి తమ సిఫారసులు పంపినట్లుగా తెలిసింది. రాయితీ కిరోసిన్ అంతా పెట్రోల్ బంక్‌లకే.. రాష్ట్రంలో ప్రస్తుతం 87లక్షల రేషన్ కార్డులుండగా, 2.79 కోట్ల మంది లబ్ధిదారులున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఒక్కో కార్డుపై నెలకు లీటర్ కిరోసిన్‌ని రూ.29కి సరఫరా చేస్తున్నారు. నిజానికి లీటర్ కిరోసిన్ ధర రూ.40మేర ఉండగా, రూ.11 మేర కేంద్ర ప్రభుత్వం రాయితీని భరిస్తోంది. రాష్ట్రంలో ప్రతి నెలా సరాసరిన 7.60 లక్షల లీటర్ల కిరోసిన్‌ను కేంద్రం సరఫరా చేస్తోంది. అయితే ఈ కిరోసిన్‌ని రేషన్ డీలర్లు పక్కదారి పట్టిస్తున్నారు. ప్రతి నెలా హోల్‌సేల్ డీలర్లు, రేషన్ డీలర్లకు సరఫరా చేయాల్సి ఉండగా, ఒక నెల సరఫరా చేసి మరో నెల తప్పిస్తున్నారు. దీనిపై లబ్ధిదారులకు సరైన సమాచారం లేకపోవడంతో డీలర్ల వద్దే కిరోసిన్ మిగిలిపోతోంది. దీన్ని ఆసరాగా చేసుకుని డీలర్లు కిరోసిన్‌ను పెట్రోల్ బంక్‌లకు విక్రయిస్తున్నారు. ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ ధరలు పైకి ఎగబాకడం డీలర్లకు కాసులు కురిపిస్తోంది. రూ.29కే అందుతున్న కిరోసిన్‌ని ఏకంగా డీలర్లు రూ.40 నుంచి రూ.50కి పెట్రోల్ బంక్ యజమానులకు విక్రయిస్తున్నారు. ఇటీవలే రాయితీ కిరోసిన్‌తో చేస్తున్న కొత్తదందాను తెలంగాణ విజిలెన్స్ గుర్తించింది. ‘ఇంటెరాక్స్ ఎస్టీ 50’అనే కెమికల్‌తో పాటు ముల్తానా మట్టిని వినియోగించి కిరోసిన్‌ను డీజిల్‌గా మార్చేస్తున్నారు. ఇలా తయారు చేసిన నకిలీ ఇంధనాన్ని ఆంధ్రప్రదేశ్‌కు అక్రమంగా రవాణా చేసి, వివిధ పెట్రోల్ బంకులకు విక్రయిస్తున్నారు. ఏటా రూ.100 కోట్ల మేర సాగుతున్న ఈ అక్రమ వ్యవహారం తెలంగాణ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల చొరవతో గత నెలలో బహిర్గతమైంది. ప్రతి ఏటా ఈ విధంగా ఏకంగా రాష్ట్రంలో 33 శాతం మేర కిరోసిన్ బ్లాక్‌మార్కెట్‌కు తరలుతోంది. -
అల్లుడే చంపేశాడు
♦ హారిక మృతిపై తల్లిదండ్రుల ఫిర్యాదు ♦ పోలీసుల అదుపులో నిందితులు నాగోలు : ఎంబీబీఎస్‌లో సీటు రాలేదని, ఎంసెట్ కోచింగ్ కోసం పెట్టిన డబ్బును తీసుకురావాలని తమ కూతురిని అల్లుడే కిరోసిన్ పోసి నిప్పంటించి హత్యచేశాడని హారిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు నిందితులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి భర్త, అత్తమామలను అదుపులోకి తీసుకున్నారు. ఎల్బీనగర్ పోలీసులు తెలిపిన మేరకు.. ఖమ్మం జిల్లాకు చెందిన హారిక (20)తో 2015 సంవత్సరంలో అదే జిల్లాకు చెందిన రిషికుమార్‌తో పెళ్లి జరిగింది. కట్నం కింద రిషికుమార్‌కు రెండెకరాల భూమి, రూ. ఐదు లక్షల కట్నం ఇచ్చారు. వివాహం అయిన తరువాత ఎంసెట్ శిక్షణ కోసం హారిక కొంతకాలం ప్రైవేటు హాస్టల్లో ఉండి కోచింగ్ తీసుకుంది. అయితే ఎంసెట్‌లో సీటు రాలేదు. బీడీఎస్ కోర్సులో సీటు రావడంతో నగరంలోని రాక్‌టౌన్‌లో నివాసముంటున్నారు. రిషికుమార్ కొత్తపేటలోని ఐటీ కార్యాలయంలో పనిచేస్తున్నాడు. ఎంబీబీఎస్‌సీటు రాకపోవడంతో హారికను భర్త మానసికంగా, శారీరకంగా ఇబ్బందులకు గురిచేశాడు. కోచింగ్ కోసం అయిన ఖర్చు ఐదు లక్షల రూపాయలను పుట్టింటి నుంచి తీసుకురమ్మని వేధిస్తున్నాడు. రిషి తల్లిదండ్రులు హరిచంద్, అరుణలు కూడా హారికను వేధిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆదివారం రాత్రి కిరోసిన్ పోసి హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడని కుటుంబ సభ్యులు సోమవారం ఎల్బీనగర్ పోలీసు స్టేషన్ పరిధిలో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎల్బీనగర్ పోలీసులు రిషికుమార్, అతని తల్లితండ్రులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇదిలా ఉండగా హారికను భర్త రిషికుమార్ హత్య చేసి కిరోసిన్ పోసుకుని అంటించి.. తనకు తానుగానే ఆత్మహత్య చేసుకుందని నమ్మించే ప్రయత్నం చేశాడు. ప్రాథమిక సమాచారం మేరకు హత్య చేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. హారిక మృతి చెందిన ప్రమాద స్థలాన్ని రాచకొండ పోలీసు కమీషనర్ మహేష్‌భగవత్ సోమవారం పరిశీలించారు. -
మహిళ ఆత్మహత్యాయత్నం
కేకే.నగర్: పుదుచ్చేరి పోలీస్‌స్టేషన్ ఎదుట బుధవారం మహిళ శరీరంపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించింది. వివరాలు.. పుదుచ్చేరి లాస్‌పేట ప్రాంతానికి చెందిన వెనోనికా(35). ఈమె భర్త నుంచి విడాకులు పొందింది. ఈ స్థితిలో మంగళవారం సాయంత్రం పుదువై పోలీస్‌స్టేషన్ ప్రధాన కార్యాలయం ముందు వెంట తెచ్చుకున్న కిరోసిన్‌ను శరీరంపై పోసుకుని ఆత్మహత్యకు యత్నించింది. అక్కడున్న పోలీసులు వెంటనే ఆమెను అడ్డుకుని కిరోసిన్ క్యాన్‌ను లాక్కున్నారు. పోలీస్‌స్టేషన్‌లో నుంచి క్యాన్‌లో నీళ్లు తెచ్చి మహిళపై పోశారు. అనంతరం ఆమె వద్ద విచారణ జరిపారు. విచారణలో సదరు మహిళ భర్త నుంచి విడాకులు పొందిన స్థితిలో లాస్‌పేట ప్రాంతానికి చెందిన సెంథిల్‌కుమార్ వివాహం చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని తెలిపింది. దీనిపై లాస్‌పేట మహిళా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోకపోవడంతో ఆత్మహత్యకు యత్నించినట్టు పేర్కొంది. దీనిపై పెరియకడై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. మహిళ కళ్లలో కిరోసిన్ పడి అస్వస్థతకు గురికావడంతో చికిత్స కోసం పుదుచ్చేరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
ఇక కిరోసిన్‌పై కూడా సబ్సిడీ కట్?
-
ఇక కిరోసిన్‌పై కూడా సబ్సిడీ కట్?
ముంబై: ఎల్పీజీ సిలిండర్లపై సబ్సిడీలో కోత పెట్టిన కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకోనుంది. కిరోసిన్‌పై సబ్సిడీ కొనసాగించేందుకు సానుకూలంగా లేని ప్రభుత్వం క్రమంగా దీన్ని ఎత్తివేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం గ్యాస్ సిలిండర్‌పై సబ్సిడీ కోత మాదిరిగానే కిరోసిన్ పై సబ్సిడీని కూడా తగ్గించాలని యోచిస్తోంది. ఇంధనాల మార్కెట్ ధరలను సమాజంలోని పేద వర్గాల ప్రయోజనాలకు అనుగుణంగా ఉండే లక్ష్యంతో చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పనిచేస్తున్నారని అధికారులు చెప్పినట్టు తెలిపింది. సబ్సిడీ కిరోసిన్ ధరలను ప్రతి పదిహేను రోజులకు 25 పైసలు పెంచాలని చమురు కంపెనీలను ప్రభుత్వం ఆదేశించింది. పూర్తిగా సబ్సిడీని తొలగించేంత వరకు, లేదా తదుపరి ఆదేశాల వరకు దీన్ని అమలు చేయాలని కోరింది. సబ్సిడీల్లో కోత పెట్టి వినియోగ వస్తువుల ధరలను మార్కెట్ ధరల స్థాయికి తేవాలని ప్రభుత్వం భావిస్తోంది. అలాగే ఎల్పీజీ కు మారడానికి వినియోగదారులను ప్రోత్సహించడంతోపాటు, కాలుష్యం నివారణలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. అయితే దీనిపై అధికారికంగా ప్రకటన వెలువడాల్సి ఉంది. మరోవైపు దీనిపై భారీ సబ్సిడీ అమలు చేస్తున్న డిమాండ్ గణనీయంగా తగ్గింది. 2016-17లో 66 శాతం క్షీణించిన కిరోసిన్ వినియోగం 78,447 లీటర్లకు పడిపోయింది. కాగా మార్చి 2018 నాటికి వంటగ్యాస్ సిలిండర్‌పై సబ్సిడీని పూర్తిగా ఎత్తివేసే వ్యూహంలో సబ్సిడీ వంటగ్యాస్ సిలిండర్ ధర రూ .4 చొప్పున పెంచాలని జూలై 31 న ప్రభుత్వం ఆదేశించిన చమురు కంపెనీలకు ఆదేశించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం, ఢిల్లీ, చండీగఢ్ కిరోసిన్ ఫ్రీ నగరాలుగా ఉన్నాయి. -
రేషన్‌కోత..పేదలకు వెత
♦ నిత్యావసరాల్లో పంచదార, కిరోసిన్‌కు మంగళం ♦ చౌక దుకాణాల్లో సరఫరా నిలిపివేత ♦ దశల వారీగా ప్రజా పంపిణీ వ్యవస్థ నిర్వీర్యం ♦ సామాన్యులకు తప్పని తిప్పలు మార్కెట్లో ధరల మోత.. ప్రభుత్వం రాయితీపై అందజేసే కిరోసిన్, చక్కెరలను నిలిపివేయడంతో ప్రజలపై అదనపు భారం పడుతోంది. బహిరంగ మార్కెట్లో కిలో చక్కెర రూ.40 అమ్ముతుండగా, చౌక దుకాణాల్లో రూ. 13.50కే అందజే సేవారు. ఇంట్లో దీపం, కట్టెల పొయ్యి వెలిగించడానికి కిరోసిన్ ను వినియోగిస్తున్నారు. బహిరంగ మార్కెట్లో నీలి కిరోసిన్ దొరకదు. మామూలు కిరోసిన్ లీటరు ధన రూ. 40 పలుకుతోంది. వీటిని కొనుగోలు చేయాలంటే పేద ప్రజలపై ఆర్థిక భారం పడక తప్పదు. పర్చూరు: దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న వారికి ప్రభుత్వం అందిస్తున్న నిత్యావసర సరుకులపై అతి పెద్ద కోత విధించేందుకు ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం సిద్ధమైంది. తెల్లరేషన్ కార్డుదారులకు అందిస్తున్న రెండు నిత్యావసర వస్తువులు ఇక నుంచి పేదలకు దూరమయ్యాయి. గతంలో చౌక దుకాణాల్లో కందిపప్పు, నూనె, గోధుమపిండి, పసుపు, ఉప్పు, గోధుమలు కూడా అందిస్తుండగా కాలక్రమేణా వాటికి స్వస్తి పలికారు. ఇప్పుడు తాజాగా ప్రభుత్వం మరో రెండు నిత్యావసర వస్తువులను ఈ జాబితాలో చేర్చింది. ప్రస్తుత జూన్ నెల కోటాలో చక్కెర, కిరోసిన్ పంపిణీ చేయడం లేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న ఈ నిర్ణయం చౌక దుకాణాల సరుకులపైనే ఆధారపడుతున్న పేదలపై తీవ్రప్రభావం చూపనుంది. నిర్వీర్యమవుతున్న ప్రజాపంపిణీ వ్యవస్థ... దారిద్రరేఖకు దిగువన ఉన్నవారికి రాయితీపై నిత్యావసర సరుకులు అందించాలన్నది చౌక దుకాణాల ఉద్దేశం. ఈ లక్ష్యం రోజు రోజుకు నీరుగారిపోతుండడంతో ప్రజా పంపిణీ వ్యవస్థ నిర్వీర్యమవుతోంది. ప్రారంభంలో అందజేసిన సరుకుల్లో కోత విధిస్తోంది. చౌక దుకాణాల్లో అందించే గోధుమ పిండి, నూనెకు ఇప్పటికే మంగళం పాడిన ప్రభుత్వం జూన్ నెల నుంచి చక్కెర, కిరోసిన్‌లను కూడా నిలిపివేసింది. కిరోసిన్, చక్కెరపై తాము అందజేసే రాయితీ నిలిపివేస్తున్నామని, వాటి పంపిణీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలే నిర్ణయం తీసుకోవాలని కేంద్రం సూచించడంతో ఈ పరిస్థితి తలెత్తిందని అధికారులు పేర్కొంటున్నారు. ప్రజా పంపిణీలో మారుతున్న నిర్ణయాలపై ప్రజల్లో ఆసంతృప్తి రెట్టింపవుతోంది. చౌక దుకాణాల దుస్థితి.. జిల్లా వ్యాప్తంగా 12 నియోజకవర్గాల్లో 8,68,088 రేషన్‌కార్డులకు గాను 2151 చౌక దుకాణాలు ఉన్నాయి. -
కట్నం కోసమే కడతేర్చారు
- వరకట్న వేధింపులకు బలైపోయిన వివాహిత - ఒంటిపై కిరోసిన్ పోసి నిప్పు పెట్టిన అత్తారింటివాళ్లు - గత నెల 31న ఘటన - చికిత్స పొందుతూ శుక్రవారం మృతి - మెజిస్ట్రేట్‌కు మరణ వాంగ్మూలం - నలుగురిపై హత్య కేసు నమోదు దొర్నిపాడు: అదనపు కట్నం తేవాలంటూ భర్త, అత్తింటివారు వేధిస్తున్నా భరిస్తూ వచ్చిన ఆమె చివరకు తనను చంపేస్తారని మాత్రం ఊహించలేకపోయింది. రోజురోజుకు వేధింపులు పెరుగుతున్నా పుట్టినింటివారు సైతం సర్ధుకుపోవాలని నచ్చజెబుతుండడం, పసి పిల్లలు అనాథలవుతారన్న భయం కారణంగా సహించింది. అదే చివరకు ఆమె చేసిన తప్పిదంగా మారి ప్రాణాలు బలిగింది. భర్త, అత్త, మామ, బావలు కలిసి అతి దారుణంగా నోట్లో గుడ్డలు కుక్కి, చేతులు కట్టేసి పెట్రోల్‌పోసి నిప్పంటించారు. వారం కిత్రం జరిగిన ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాధితురాలు మృత్యువుతో పోరాడుతూ చివరకు శుక్రవారం మరణించింది. ఈ ఘటన దొర్నిపాడు మండలం చాకరాజువేములలో చోటుచేసుకుంది. ఆళ్లగడ్డ ఎల్ఎం కాంపౌండ్‌కు చెందిన విజయకుమార్ కుమార్తె జయమ్మ (22)ను చాకరాజువేముల ఎస్సీకాలనీకి చెందిన గరికెల జయమ్మ, గరికెల పెద్దమునయ్య కుమారుడు బ్రహ్మమునయ్యకు ఇచ్చి11 సంవత్సరాల క్రితం పెళ్లి చేశారు. వీరికి జయసింహ(9), జయవేణి (7) సంతానం. జయమ్మ చాకరాజువేముల ఎస్సీ కాలనీ అంగన్వాడీ కేంద్రంలో ఆయాగా పని చేస్తుండేది. కొంతకాలంగా భర్త, అత్త, మామ, బావ అదనపు కట్నం కోసం వేధిస్తుండడంతో తీవ్ర మానసికక్షోభకు గురైంది. విషయంపై తండ్రి, అన్న, అక్క వద్ద మొరపెట్టుకున్నా సర్దుకుపోవాలని చెప్పడంతో పిల్లలకోసం భరిస్తూ అత్తారింట్లోనే కాలం వెళ్లదీసింది. చివరకు వేధింపులు పెరిగిపోయి గత నెల 31న ఆమె ఒంటిపై కిరోసిన్ పోసి నిప్పు పెట్టారు. విషయం గ్రహించిన స్థానికులు ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తర్వాత మెరుగైన వైద్యం కోసం కర్నూలు సర్వజన ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ కోలుకోలేక జయమ్మ శుక్రవారం తెల్లవారుజామున మృతి చెందింది. మా అమ్మను చంపేశారు.. మా అమ్మను నాన్నతోపాటు పెద్దనాన్న నాగరాజు, నానమ్మ జయమ్మ, అబ్బ మునయ్య చంపేశారు. ఆ రోజు రాత్రి మేం బయటపడుకున్నాం. అమ్మను ఇంట్లోకి తీసుకెళ్లి చేతులు కట్టేశారు. నోట్లో గుడ్డలు కుక్కారు. తర్వాత పెట్రోలు పోసి అగ్గిపెట్టెతో అంటించి పారిపోయారు. మృతురాలి మరణ వాంగ్మూలం.. ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో మృతురాలు ఆళ్లగడ్డ జూనియర్ సివిల్ కోర్టు మెజిస్ట్రేట్‌కు మరణ వాంగ్మూలం ఇచ్చింది. భర్త, అత్త, మామ, బావ కలిసి తన ఒంటికి నిప్పు పెట్టి చంపేశారని చెప్పింది. ఈ మేరకు దొర్నిపాడు పోలీసులు నలుగురిపై హత్యకేసు నమోదు చేశారు. -
కిరో‘సీన్’
ఏలూరు (మెట్రో) : వచ్చే నెల నుంచి రేషన్ కార్డులపై కిరోసిన్ పంపిణీని నిలిపివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇదే అదునుగా డీలర్లు బరితెగించారు. మే నెల కోటాగా జిల్లాకు విడుదలైన కిరోసిన్‌ను బ్లాక్‌మార్కెట్‌కు తరలించారు. జిల్లాలోని 2,040 రేషన్ షాపుల ద్వారా మే నెలలో 1,243 కిలోలీటర్ల కిరోసిన్‌ను కార్డుదారులకు పంపిణీ చేయాల్సి ఉండగా, రాష్ట్ర ప్రభుత్వం కేవలం 759 కిలోలీటర్లు మాత్రమే విడుదల చేసింది. అందరికీ దీపం గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేశామంటూ ఈ నెల కిరోసిన్ కోటాలో 40 శాతం కోత విధించారు. 559 కిలోలీటర్లు బ్లాక్ మార్కెట్‌కు.. వచ్చే నెల నుంచి కిరోసిన్ పంపిణీ నిలిచిపోనుండటంతో ఇదే చివరి అవకాశంగా భావించిన డీలర్లు సుమారు 559 కిలోలీటర్లను బ్లాక్ మార్కెట్‌కు తరలించారు. కార్డుదారుకు లీటర్ రూ.19కి ఇవ్వాల్సిన ఈ కిరోసిన్‌ను రూ.40 నుంచి రూ.50 చొప్పున ధర కట్టి నల్లబజారుకు తరలించారు. జిల్లాకు 759 కిలోలీటర్లు విడుదల కాగా.. ఇందులో 200 కిలో లీటర్లు కూడా వినియోగదారులకు చేరలేదు. కార్డుదారులు రేషన్ డిపోలకు వెళ్లి కిరోసిన్ అడిగితే.. మే నెల నుంచే పంపిణీ నిలిచిపోయిందని అడ్డంగా బొంకారు. బియ్యం, పంచదార తీసుకున్న సమయంలోనే కిరోసిన్ కూడా తీసుకున్నట్టు ఈపోస్ యంత్రాల్లో నమోదు చేసి దొడ్డిదారిన నల్లబజారుకు తరలించారు. వంతపాడిన పౌర సరఫరాల శాఖ ! రేషన్ డీలర్ల వద్ద నుంచి ప్రతినెలా కాసులకు కక్కుర్తి పడుతున్న పౌర సరఫరాల శాఖ ఈ నెలలో కనీసం రేషన్ షాపుల వైపు కన్నెత్తి కూడా చూడలేదు. కిరోసిన్ ఇవ్వడం లేదని కార్డుదారులు బహిరంగంగా చెబుతున్నా చెవికెక్కించుకున్న పాపాన పోలేదు. కిరోసిన్ కోటాకు సైతం పౌర సరఫరాల అధికారులకు ముడుపులు అందిన కారణంగానే మిన్నకుండిపోయారనే విమర్శలు వినిపిస్తున్నాయి. తనిఖీలు నిర్వహిస్తున్నాం కార్డుదారులకు రేషన్ సరుకులు సక్రమంగా అందుతున్నాయా లేదా అనే దానిపై ప్రతినెలా తనిఖీలు నిర్వహిస్తున్నాం. ఎటువంటి అక్రమాలు లేవు. కిరోసిన్ నల్లబజారుకు తరలిందనేది అవాస్తవం. – సయ్యద్ యాసిన్, జిల్లా పౌర సరఫరాల అధికారి -
బియ్యంతో సరి
జంగారెడ్డిగూడెం : భవిష్యత్‌లో రేషన్ డిపోల ద్వారా నిత్యావసర సరుకులేవీ సబ్సిడీ ధరకు పంపిణీ అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. టీడీపీ అధికారంలోకి రాకముందు రేషన్ కార్డులపై 9 రకాల సరుకుల్ని పంపిణీ చేసేవారు. చంద్రబాబు అధికార పగ్గాలు చేపట్టిన తరువాత రేషన్ కార్డులపై ఇచ్చే సరుకులు ఒకదాని వెంట ఒకటిగా తొలగిస్తూ వస్తున్నారు. సబ్సిడీపై ఇచ్చే పంచదార, కిరోసిన్ పేదలకు అందని ద్రాక్షగానే మారాయి. ఎన్టీఆర్ ప్రజా పంపిణీ పథకమంటూ ఆర్భాటంగా ప్రారంభించిన రేషన్ పంపిణీ విధానంలో మొదట్లో బియ్యం, పంచదార, కిరోసిన్‌తోపాటు పామాయిల్, కందిపప్పు, పెసరపప్పు, మినపప్పు, గోధుమ పిండి, కారం, చింతపండు, ఉప్పు వంటి నిత్యావసర సరుకుల్ని తక్కువ ధరకు సరఫరా చేసేవారు. ఆ తరువాత ప్రభుత్వం దశలవారీగా అన్ని సరుకుల పంపిణీపై కోత విధిస్తూ వస్తోంది. చివరకు బియ్యం పంపిణీకి మాత్రమే పరిమితం అవుతోంది. ఈ నెలలో పంచదార, కిరోసిన్ రేషన్ షాపులకు అవసరమైన స్థాయిలో సరఫరా కాలేదు. ప్రస్తుత నెలలో విడుదల చేసిన పంచదార, కిరోసిన్, గత నెలలో మిగిలిన పంచదార, కిరోసిన్ కలిపి ప్రస్తుతానికి పంపిణీ చేస్తున్నారు. పంచదార మొత్తం కోటాలో 30 శాతం, కిరోసిన్ 45 శాతం మాత్రమే జిల్లాలోని రేషన్ డిపోలకు కేటాయించారు. కిరోసిన్ ఇంకా విడుదల కాలేదు. సబ్సిడీ ఉపసంహరించిన కేంద్రం పంచదార, కిరోసిన్‌పై ఇస్తున్న సబ్సిడీని తొలగిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం వాటి పంపిణీకి మంగళం పాడి సబ్సిడీ భారం తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తోంది. నెలనెలా కిరోసిన్ కేటాయింపులు తగ్గిస్తూ వస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఇకపై దానిని పూర్తిగా నిలిపివేసేందుకు కొత్త ఎత్తుగడ వేసింది. కిరోసిన్ రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దుతున్నామంటూ ప్రజలను మాయ చేస్తోంది. రాష్ట్రంలోని అన్ని కుటుంబాలకు గ్యాస్ కనెక్షన్లు ఇస్తున్నామని, అందువల్ల కిరోసిన్ వినియోగం ఉండదని చెబుతోంది. ఇందుకు పైలెట్ ప్రాజెక్టుగా పశ్చిమ గోదావరిని ఎన్నుకుంది. జిల్లాకు 90 వేల గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేయగా, అవి సరిపోవని మరో 80 వేల కనెక్షన్లు కావాలని జిల్లా కలెక్టర్ నివేదించడంతో 1.70 లక్షలకనెక్షన్లు మంజూరు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఆ గ్యాస్ కనెక్షన్లు వినియోగదారులకు ఇంకా అందలేదు. ఈలోగానే కిరోసిన్ పంపిణీ నిలిపివేయడంతో పేదల్లో ఆందోళన నెలకొంది. ఇప్పటికే పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వచ్చే నెల నుంచి రేషన్ షాపుల ద్వారా కిరోసిన్ పంపిణీ నిలిపివేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. వచ్చే నెల నుంచి పంచదార పంపిణీ పూర్తిగా నిలిచిపోనుంది. దీంతో ఆ సరుకుల్ని బహిరంగ మార్కెట్లో కొనుగోలు చేయాల్సిన పరిస్థితి లబ్ధిదారులకు ఏర్పడుతోంది. ఇదిలావుంటే.. బియ్యం వద్దనుకునే వారికి నేరుగా వారి ఖాతాలో నగదు జమ చేయనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. తద్వారా బియ్యం పంపిణీని కూడా దశల వారీగా నిలిపివేసే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. డీలర్ల గతేంటి! రేషన్ డీలర్లను బిజినెస్ బ్యాంక్ కరస్పాండెంట్లుగా నియమిస్తున్నట్టు ప్రభుత్వం గతంలో జీఓ జారీ చేసింది. రేషన్ షాపులను మినీ షాపింగ్‌మాల్స్‌గా మారుస్తామని ప్రకటించింది. ఇవి అమ ల్లోకి రాలేదు. రేషన్ షాపులను మినీ షాపింగ్ మాల్స్‌గా మారిస్తే అన్నిరకాల నిత్యావసర సరుకుల్ని వాటిద్వారా పంపిణీ చేయవచ్చు. రేషన్ డీలర్లను బిజినెస్ కరస్పాండెంట్లుగా నియమిస్తే సామాజిక పెన్షన్లు, కరెంటు బిల్లుల వసూలు, ఉపాధి హామీ కూలీల వేతనాలను పంపిణీ చేయవచ్చు. తద్వారా వారికి ఎంతోకొంత ఆదాయం సమకూరి ఉండేది. నగదు బదిలీ పథకం అమలు చేయడం వల్ల డీలర్లు జీవనోపాధి కోల్పోయే ప్రమాదం ఉంది. జిల్లాలో 11,96,418 లబ్దిదారులకు పంచదార, కిరోసిన్ అందకుండా పోతుంటే, 2,163 రేషన్ షాపుల ద్వారా సేవలు అందిస్తున్న డీలర్ల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారనుంది. ప్రజాపంపిణీ వ్యవస్థ నిర్వీర్యానికి కుట్ర ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు కుట్ర చేస్తోంది. ఇటువంటి నిర్ణయాలను వెనక్కి తీసుకోవాలి. పేదలకు అన్ని నిత్యావసర సరుకుల్ని రేషన్ డిపోల ద్వారా సబ్సిడీపై పంపిణీ చేయాలి. ప్రజావ్యతిరేక నిర్ణయాలను ప్రభుత్వం తక్షణం ఉపసంహరించుకోకపోతే ప్రజల్ని ప్రత్యక్ష ఆందోళనకు సమాయాత్తం చేస్తాం. – బూరుగుపల్లి సూరిబాబు, అధ్యక్షులు, గుడిసెవాసుల సంఘం, జంగారెడ్డిగూడెం ప్రభుత్వానికి పతనం తప్పదు ప్రభుత్వం ప్రజా వ్యతిరేక నిర్ణయాల్ని ఉపసంహరించుకోకపోతే పతనం తప్పదు. ఇప్పటికే ఇచ్చిన హామీలు సరిగా అమలు చేయని ప్రభుత్వం.. పేదవారికి చేరువగా ఉన్న చౌక డిపోలను నిర్వీర్యం చేస్తే తీవ్ర వ్యతిరేకత రావడం ఖాయం. ప్రజాకంటక నిర్ణయాలు మానుకుని, ప్రజలకు చేరువయ్యే పాలన అందించే దిశగా ప్రభుత్వం కృషిచేయాలి. – బి.సాయికిరణ్, చిరుద్యోగి, జంగారెడ్డిగూడెం -
కిరోసిన్ కోటా కట్!
►మున్సిపల్ ప్రాంతాల్లో 4 నుంచి 2 లీటర్లకు కుదింపు ►లీటరు ధర రూ.19 నుంచి రూ.21కి పెంపు ►జిల్లాలో లబ్ధిదారులపై నెలకు రూ.12 లక్షలపైనే భారం ►నిన్న పామాయిల్, చక్కెర.. నేడు కిరోసిన్ ఇందూరు(నిజామాబాద్ అర్బన్) : పేదలకు సబ్సిడీ రూపంలో అందించే కిరోసిన్ కోటాలో కోత విధించారు. లీటరు ధరను రూ.21కి పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో జిల్లా ప్రజలపై తీవ్రంగా భారం పడనుంది. మున్సిపల్ ప్రాంతాల్లోని లబ్ధిదారులకు ఇప్పటివరకు అందించిన 4 లీటర్ల కిరోసిన్‌ను 2 లీటర్లకు కుదించగా.. మండల కేంద్రాల్లోని లబ్ధిదారులకు గ్యాస్ సిలిండర్ ఉంటే ఒక లీటరు, లేకుంటే రెండు లీటర్లను ఇవ్వాలని నిర్ణయించింది. అలాగే గ్రామీణ ప్రాంతాల్లోని లబ్ధిదారులకు సిలిండర్ ఉన్నా.. లేకున్నా ఒక లీటరు మాత్రమే సబ్సిడీ కిరోసిన్‌ను ఇవ్వనుంది. అలాగే కిరోసిన్‌ను ఇది వరకు లీటరుకు రూ.19కి అందించగా, ప్రస్తుతం లీటరుపై అదననంగా రూ.3 లకు పెంచి లీటరు కిరోసిన్‌ను రూ.21కి చేసింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై పేద లబ్ధిదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కుదింపెంత? భారమెంత? జిల్లాలో 3,76,656 రేషన్ కార్డులున్నాయి. ప్రభుత్వం సబ్సిడీ కిరోసిన్ కోటాను తగ్గించడం, ధర పెంచడానికి ముందు 4,93,130 లీటర్ల కిరోసిన్‌ను జిల్లాకు కోటాగా పంపేది. ప్రస్తుతం తీసుకున్న కుదింపు నిర్ణయంతో 92,679 లీటర్లు తగ్గి 4,00,451 లీటర్లకు చేరుకుంది. అంటే దాదాపు లక్షల లీటర్లు జిల్లా సబ్సిడీ కిరోసిన్ కోటాలో కోత పడింది. అత్యధికంగా మున్సిపల్ ప్రాంతాల్లో ఉంటున్న లబ్దిదారులకు 4 నుంచి 2 లీటర్లకు కుదించడంతో ఇక్కడే అత్యధికంగా జిల్లా కోటా కోతకు గురైంది. అదే విధంగా రూ.19 ఉన్న లీటరు కిరోసిన్ ధరను రూ.3లు అదనంగా పెంచి రూ.21కి చేర్చడంతో జిల్లా రేషన్ కిరోసిన్ లబ్ధిదారులపై నెలకు రూ.12,01,353 భారం పడుతోంది. ఒక్కోటి ఎత్తేస్తున్నారు.. వివిధ రకాల రేషన్ పొందే పేద లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్కటి తొలగిస్తూ వస్తోంది. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం చక్కెరపై సబ్సిడీని ఎత్తివేయడంతో రాష్ట్ర ప్రభుత్వానికి భారంగా మారి చక్కెర పంపిణీని ఎత్తేసింది. అలాగే పామాయిల్ సరఫరాను కూడా ఇదే కారణంతో రాష్ట్ర సర్కారు ఎత్తివేసింది. ఫలితంగా రేషన్ పొందే పేద ప్రజలు భారమైన అధిక ధరను వెచ్చించి వంట నూనె, చక్కెరను దుకాణాల్లో కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం కిరోసిన్ కోటాను తగ్గించడం, «లీటరు ధరను పెంచడాన్ని చూస్తే ఏదో ఒక రోజు క్రమ క్రమంగా కిరోసిన్‌ను కూడా ఎత్తివేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇలా రేషన్ దుకాణాల్లో అందించే సబ్సిడీ సరుకులను ఒక్కోటి ఎత్తివేస్తూ ప్రజా పంపిణీ వ్యస్థను క్షిణింపజేస్తోంది. ఈ విషయమై డీఎస్ఓ కృష్ణప్రసాద్‌ను అడుగగా.. సబ్సిడీ కిరోసిన్ కోటాలో కోత విధిస్తూ.. లీటరు ధరను పెంచుతున్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మాకు ఆదేశాలు అందాయని తెలిపారు. దీనిపై జిల్లాలోని సంబంధిత సివిల్ సప్లయి అధికారులకు, రేషన్ డీలర్లకు సమాచారం అందించడం జరిగింది. -
పెళ్లి ఘనంగా నిర్వహించాడని...అమానుషం
భోపాల్: మధ్యప్రదేశ్ లో మరో అమానుషం చోటు చేసుకుంది. సుమారు 500మందికి దాహార్తిని తీర్చే మంచినీళ్ల బావిలో దుండగులు కిరోసిన్ కుమ్మరించారు. దీనికి గల కారణాలను ఆరాతీస్తే.. కుల, వర్ణ వివక్షపై అసహ్యం కలగ మానదు. గ్రామానికి చెందిన ఒక దళితుడు తన కుమార్తెకు మేళ తాళాలతో ఘనంగా వివాహం చేశాడన్న అక్కసుతో ఆధిపత్య కులానికి చెందిన గ్రామస్తులు ఈ ఘాతుకానికి తెగబడ్డారు. దళితులు ఉపయోగించే మంచినీటి బావిలో కిరోసిన్ కలిపారు. మధ్యప్రదేశ్‌లోని మాదా గ్రామంలో ఈ దుశ్చర్య చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే...మధ్యప్రదేశ్ లోని మాదా లో దళితుడైన మేఘ్వాల్ (47) తన కుమార్తె మమత వివాహం ఘనంగా జరిపించాలని అనుకున్నాడు. దీనికోసం భారీ ఏర్పాట్లు చేసుకున్నాడు. అయితే ఈ ఆలోచనే ఆధిపత్య కులాలకు ఆగ్రహం తెప్పించింది. బ్యాండ్ మేళం పెట్టవద్దని హుకుం జారీ చేశారు. తమ ఆదేశాలు ధిక్కరిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. అక్కడితో ఆగలేదు "కట్టుబాట్లు" ఉల్లంఘిస్తే తన కుటుంబానికి సాధారణ బావి నుంచి నీటిని తోడుకోవడానికి వీల్లేదని, స్థానిక ఆలయంలోకి ప్రవేశించకుండా నిరోధించబడతారని గట్టిగా హెచ్చరించారు. అయినా మేఘావాల్ లెక్కచేయలేదు. ఏప్రిల్ 23 బ్యాండ్ బాజాలు, గ్రామంలో ఊరేగింపుతో అట్టహాసంగా ఈ శుభకార్యాన్ని ముగించాడు. ముఖ్యంగా బ్యాండ్ పార్టీతో పూర్తిస్థాయి ఊరేగింపుతో వరుడు పెళ్లి వేదికకు తరలి వచ్చాడు. అదీ ఆధిపత్య కులాలకు మాత్రమే పరిమితమైన ప్రధాన రహదారి గుండా. రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పూర్తి ఆమోదంతో, రైఫిల్స్, బాటన్లు, టియర్ గ్యాస్ లాంటి ముందు జాగ్రత్త చర్యలతో పటిష్ట పోలీసు బందోబస్తు మధ్య శాంతి యుతంగా జరిగింది. ఇదే గ్రామంలోని ఆధిపత్య కుల పెద్దలకు త్రీవ ఆగ్రహం కలిగింది. రెండు రోజులు ప్రశాంతంగా ఉన్నా.. ఆ తర్వాత ఆవేశంతో రగిలిపోయారు. ప్రతీకార చర్యకు దిగారు. గ్రామంలో దళితులంతా తాగేందుకు వినియోగించే మంచినీటి బావిలో కిరోసిన్ ను కలిపారు. ఇది గమనించిన దళితుల పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే ఆ నీటిని పరిశీలించిన అధికారులు...బావిలో నీటిని మోటారుతో తోడించి, వినియోగానికి అవసరమైన విధంగా బావిని శుభ్రం చేయించారు. దీంతో గత ఆరు రోజులుగా, గ్రామంలోని దళిత మహిళలు 2 కి.మీ.ల దూరంలో ఉన్న నదినుంచి నీటినిని మోసుకుంటూ ఇబ్బందులు పడుతున్నారు. అయితే కావాలనే కిరోసిన్ పోసినట్టుగా భావిస్తున్నామని సీనియర్ దుర్విజయ్ సింగ్ వెల్లడించారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు జరగకుండా హ్యాండ్ పంప్ వేయిస్తామని జిల్లా కలెక్టర్ తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామన్నారు. నేరస్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. -
ఇక కిరోసిన్ వంతు..!
► రేషన్ కోటా నుంచి ఎత్తివేసే యోచన ► కొద్ది నెలల్లో సబ్సిడీ కోత ► జూన్ నుంచి నిలిచిపోనున్న చక్కెర పంపిణీ ► కేవలం బియ్యం పంపిణీ కేంద్రాలుగా రేషన్ దుకాణాలు సాక్షి, పెద్దపల్లి: జిల్లాకు సరఫరా అయ్యే సబ్సిడీ కిరోసిన్ కోటాకు ప్రభుత్వం కత్తెర పెట్టింది. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని తెల్లరేషన్ కార్డుదారులకు సరఫరా అయ్యే కోటాలో 60 వేల లీటర్లు తగ్గించింది. మే నెలకు సంబంధించి జిల్లాకు 2.88 లక్షల లీటర్ల కిరోసిన్ రావాల్సి ఉండగా, 2.28 లక్షల లీటర్లు మాత్రమే రానుంది. చక్కెరపై కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఎత్తివేసిన కొద్ది రోజుల్లోనే కిరోసిన్ కోటాకు కోత పెట్టింది. జిల్లాలో జూన్ నుంచి రేషన్ దుకాణాల్లో సబ్సిడీ చక్కెర పంపిణీ నిలిచిపోనుంది. పెద్దపల్లి జిల్లాలో 2,12,037 రేషన్‌కార్డులు ఉన్నాయి. దారిద్య్రరేఖకు దిగువన ఉన్న ఈ కుటుంబాలకు నెల నెలా రేషన్ దుకాణాల ద్వారా కిరోసిన్ పంపిణీ చేస్తున్నారు. వంట గ్యాస్లేని కుటుంబాలకు 2 లీటర్లు, ఉన్న కుటుంబానికి లీటర్ చొప్పున అందిస్తున్నారు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వంటగ్యాస్లేని వారికి 4 లీటర్లు, ఉన్నవారికి 2 లీటర్ల చొప్పున పంపిణీ చేసేవారు. మే నెలకు సంబంధించి జిల్లాకు 2.88 లక్షల లీటర్ల కిరోసిన్ సరఫరా చేయాల్సి ఉంది. కోటాలో 60 వేల లీటర్లు కోత విధిస్తూ కేంద్ర ప్రభుత్వం ఇటీవలే జిల్లాకు ఉత్తర్వులు పంపింది. తాజా ఆదేశాలు ఇవీ.. రాష్ట్ర పౌరసరఫరా శాఖ కమిషనర్ సీవీ.ఆనంద్ తాజా ఉత్తర్వుల ప్రకారం కిరోసిన్ కోటాను మున్సిపల్ కార్పొరేషన్, దాని పరిధిలోని గ్యాస్ కనెక్షన్ లేని వారికి 2 లీటర్లు, గ్రామీణులు, దీపం కనెక్షన్ ఉన్నవారికి లీటరు చొప్పున పంపిణీ చేయాలని పేర్కొన్నారు. మే నుంచి దీనిని అమలు చేయాలని ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం కిరోసిన్ కోటా తగ్గించినందున ప్రభుత్వం ఈమేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో ప్రస్తావించారు. తగ్గిపోతున్న సరుకులు చౌక ధరల దుకాణాల ద్వారా గతంలో తొమ్మిద రకాల నిత్యావసర సరుకులు పంపిణీ చేసేవారు. బియ్యం, చక్కెర, గోధుమలు, కందిపప్పు, పామాయిల్, కారంపొడి, పసుపు, చింతపండు, ఉప్పు, గోధుమ పిండి ఉండేవి. రాష్ట్ర విభజనకు ముందే పలు సరుకులకు మంగళం పాడారు. అప్పట్లోనే గోధుమపిండి, ఉప్పు, కారంపొడి, చింతపండు, కందిపప్పు సరఫరా నిలిపివేశారు. ఆ తర్వాత పామాయిల్‌ను ఆపేశారు. ప్రస్తుతం చక్కెరకు ఫుల్స్టాప్ పెట్టారు. తాజాగా కిరోసిన్ కోటాను కుదించారు. ఇక బియ్యం, గోధుమలు మాత్రం పంపిణీ చేయాల్సి ఉన్నా, చాలా చోట్ల బియ్యం మాత్రమే పంపిణీ చేస్తున్నారు. పక్కదారి పడుతున్నందుకేనా..? కేంద్ర ప్రభుత్వం చక్కెర, కిరోసిన్ పంపిణీపై వివరాలు సేకరించింది. చక్కెర, కిరోసిన్, బియ్యం కోటాలు పేదలకు అందకుండానే పెద్దఎత్తున పక్కదారి పడుతున్నాయని గుర్తించింది. వంట గ్యాస్ కనెక్షన్లు ఉండడంతో, చాలా మంది కిరోసిన్‌ను తీసుకోవడం లేదని, తీసుకున్నా బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటున్నారని, డీలర్లు కూడా పెద్ద ఎత్తున బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నారని అధికారులు నివేదించడంతో కోటా కుదించినట్లు సమాచారం. అదే ఉద్దేశంతోనే చెక్కర పంపిణీ కూడా నిలిపివేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. కొద్ది నెలల్లో కిరోసిన్‌పై సబ్సిడీ పూర్తిగా ఎత్తివేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ నెల యథావిధిగా చక్కెర పంపిణీ బహిరంగ మార్కెట్లో చక్కెర కిలో రూ.43 ఉండగా, కేంద్ర ప్రభుత్వం సబ్సిడీపై రూ.13.50కే తెల్ల రేషన్‌కార్డుదారులకు అందిస్తోంది. సబ్సిడీ భారాన్ని ఇక మోయలేమని కేంద్ర ప్రభుత్వం మార్చిలో స్పష్టం చేసింది. సబ్సిడీ చక్కెర పంపిణీ కొనసాగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా బడ్జెట్లో ఎలాంటి కేటాయింపులు జరపకపోవడంతో చక్కెర పంపిణీ నిలిచిపోనుంది. గతంలో సరఫరా చేసిన చక్కెర గోధాముల్లో నిల్వ ఉండడంతో గత నెలలో రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ చేశారు. ఇంకా నిల్వలు ఉండడంతో ఈ నెలలో కూడా పంపిణీ చేయనున్నారు. -
పెరిగిన ఎల్పీజీ గ్యాస్, కిరోసిన్ ధరలు
న్యూఢిల్లీ : సబ్సిడైజ్డ్ వంట గ్యాస్(ఎల్పీజీ) ధరలు పెరిగాయి. సిలిండర్ కు రెండు రూపాయల పెరిగినట్టు తెలిసింది. అదేవిధంగా కిరోసిన్ రేటు కూడా లీటరుకు 26 పైసలను పెరిగింది. చిన్న చిన్నగా ధరలు పెంచుతూ ప్యూయల్ పై అందిస్తున్న సబ్సిడీలను ప్రభుత్వం తొలగించనున్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వ రంగ ఆయిల్ సంస్థల సమాచారం మేరకు ఎల్పీజీ ధరలు ఢిల్లీలో 14.2కేజీల సిలిండర్ కు రూపాయి 87 పైసలు పెరిగినట్టు వెల్లడైంది. దీంతో ఒక్కో సిలిండర్ రూ.442.77కు చేరింది. ఏప్రిల్ 1నే ఆయిల్ కంపెనీలు సబ్సిడీ గ్యాస్ ఎల్పీజీపై ధరలను పెంచాయి. అప్పుడు రూ.5.57 పెంచుతూ 14.2కేజీల సిలిండర్ ధరను రూ.440.90గా నిర్ణయించాయి. ప్రతినెలా క్రమానుగుణంగా సిలిండర్ రేట్లను పెంచుతూ సబ్సిడీలను తగ్గించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది. అదేవిధంగా నాన్-సబ్సిడైజ్డ్ వంట గ్యాస్ పై అంతర్జాతీయ ట్రెండ్ ల ప్రకారం 92 రూపాయలను ప్రభుత్వం తగ్గించింది. దీంతో ఏప్రిల్ 1 నుంచి ఆ సిలిండర్ పై రేటు రూ.14.50 తగ్గింది. ప్రస్తుతం కిరోసిన్ పై పెంచిన 26 పైసలతో ముంబైలో లీటరు కిరోసిన్ ధర రూ.19.55గా ఉంది. ప్రతినెలా కిరోసిన్ పై కూడా ప్రభుత్వం 25పైసలు చొప్పున సబ్సిడీకి కోత పెట్టాలని యోచిస్తోంది. -
మహిళ సజీవ దహనం
- కిరోసిన్ పోసి నిప్పంటించిన భర్త - రెండో వివాహమే గొడవకు కారణం కర్నూలు : కర్నూలు శరీర్‌నగర్‌కు చెందిన మన్సూర్ అలియాస్ రాజు.. తన భార్య బేబి (30) ఒంటికి నిప్పుపెట్టి సజీవ దహనం చేశాడు. బేబి మొదటి భర్తను వదిలేసి రాజును రెండవ పెళ్లి చేసుకొంది. వడ్డెగేరిలో నివాసం ఉన్నప్పుడు పరిచయం ఏర్పడి పెళ్లి చేసుకొని శరీర్నగర్లో కాపురం ఉంటున్నారు. ఈమెకు కొడుకు, కూతురు సంతానం. అయితే రాజు మరోమహిళను పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నిస్తుండటంతో బేబి నిలదీసింది. 15 రోజుల క్రితం భర్తతో గొడవ పడి సోదరి ఇంటికి వెళ్లింది. ఈ క్రమంలో రాజు ఆదివారం ఉదయం ఇంటికి పిలుచుకొని వచ్చి గొడవ పడ్డాడు. రెండో పెళ్లి విషయంలో ఆమె గట్టిగా నిలదీయడంతో ఆగ్రహించిన రాజు ఆమె ఒంటిపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. తీవ్ర గాయాలకు గురైన ఆమెను కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించింది. కేసు నమోదు చేసుకొని విచారణ జరుపుతున్నట్లు నాల్గవ పట్టణ సీఐ నాగరాజరావు తెలిపారు. -
గర్భిణిపై కిరోసిన్ పోసి నిప్పంటించిన భర్త
-
గర్భిణిపై కిరోసిన్ పోసి నిప్పంటించిన భర్త
మగ బిడ్డకు జన్మనిచ్చి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న తల్లి నిజామాబాద్ క్రైం (నిజామాబాద్ అర్బన్): అదనపు కట్నం తీసుకురావాలని గర్భిణిపై కిరోసిన్ పోసి నిప్పంటించాడో కిరాతక భర్త. తీవ్రంగా కాలిన గాయాలతో బాధపడుతున్న ఆమెను స్థానికులు జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా మగబిడ్డకు జన్మనిచ్చి తాను ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంది. నిజామాబాద్ నగరంలోని నిజాం కాలనీకి చెందిన ఎస్కే ముజీబ్‌తో నిర్మల్ జిల్లా కాలూర్కి చెందిన సానాబేగం (23)కు ఏడాది క్రితం వివాహం జరిగింది. ముజీబ్ ఆటోడ్రైవర్. కొన్ని రోజుల నుంచి భర్త, కుటుంబ సభ్యులు అదనపు కట్నం తీసుకురావాలని సానాబేగంను వేధించడం మొదలు పెట్టారు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి గర్భిణీ అని కూడా చూడకుండా భార్యను ముజీబ్ విపరీతంగా కొట్టాడు. బుధవారం అర్ధరాత్రి ఒంటి గంట ప్రాంతంలో సానాబేగం ఒంటిపై ముజీబ్ కిరోసిన్ పోసి నిప్పటించాడు. మంట లకు తాళలేక ఆమె గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు కొందరు నిద్రలో నుంచి మేలుకుని అక్కడకు చేరుకున్నారు. 100కు ఫోన్ చేసి సమాచారం అందించారు. సానాబేగంను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స జరుగుతుండగానే మగబిడ్డకు జన్మనిచ్చింది. బాబు క్షేమంగా ఉన్నప్పటికీ తల్లి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంది. ఓ పక్క తాను తల్లి అయ్యానన్న సంతోషం, మరో పక్క పుట్టిన బిడ్డను కళ్లారా చూసుకునే భాగ్యం లేక తన దుస్థితికి తీవ్ర మానసిక వేదనకు గురవుతోంది. పోలీసులు బాధితురాలి నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. తన కూతురిని అత్తింటివారు అదనపు కట్నం కోసం తరచూ వేధించేవారని బాధితురాలి తండ్రి షేక్ రజాక్ ఫిర్యాదు చేశాడు. ముజీబ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
నిప్పంటించుకొని మహిళ ఆత్మహత్య
ఓర్వకల్లు: క్షణికావేశంతో ఓ యువతి నిప్పటించుకొని ఆదివారం ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన బ్రాహ్మణపల్లె గ్రామంలో చోటు చేసుకొంది. గ్రామానికి చెందిన కురువ పెద్ద వెంకటస్వామి కుమారుడు రామకృష్ణకు బనగానపల్లె మండలం రామకృష్ణాపురం గ్రామానికి చెందిన జానకి (22)తో రెండేళ్ల క్రితం వివాహైంది. జానకి గత ఏడాది నుంచి మానసిక రుగ్మతకు లోనైంది. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో శరీరంపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకొంది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న ఇన్చార్జ్ ఎస్ఐ మల్లికార్జున, పోలీసులు అక్కడికి చేరుకొని జరిగిన సంఘటనపై కేసు నమోదు చేసుకున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు దర్యాప్తులో వెల్లడి కానున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. -
కూతురుపై కిరోసిన్ పోసి నిప్పంటించింది
-
కూతురుపై కిరోసిన్ పోసి నిప్పంటించింది
ఫరూఖ్‌నగర్(రంగారెడ్డి): రంగారెడ్డి జిల్లాలో ఘోరం జరిగింది. రొట్టెల పిండి పడేసిందని కన్నకూతురిపై కిరోసిన్ పోసి నిప్పంటించిందో తల్లి. ఈ ఘటనలో చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన జిల్లాలోని ఫరూఖ్‌నగర్ మండలం చింతగూడెంలో శనివారం వెలుగుచూసింది. గ్రామానికి చెందిన దొబ్బ చెన్నయ్య, స్వరూప దంపతులకు ఇద్దరు కూతుళ్లు, ఓ కుమారుడు ఉన్నారు. శుక్రవారం రాత్రి రొట్టెల పిండి తీసుకురమ్మని చిన్న కూతరు రాధికను తల్లి దుకాణానికి పంపింది. ఈ క్రమంలో రొట్టెల పిండి తీసుకొని వస్తూ..రాధిక అదుపుతప్పి కిందపడింది. దీంతో పిండి నేలపాలైంది. ఆగ్రహానికి గురైన స్వరూప రాధికను తీవ్రంగా కొట్టడంతో పాటు, చిన్నారిపై కిరోసిన్ పోసి నిప్పంటించింది. ఇది గుర్తించిన స్థానికులు ఆమెను 108 సాయంతో షాద్‌నగర్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. -
తాగిన మైకంలో ఆత్మహత్యాయత్నం
కొవ్వూరు రూరల్ : తాగిన మైకంలో ఓ వ్యక్తి కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించిన సంఘటన తాళ్లపూడిలో శనివారం చోటుచేసుకుంది. బంధువులు, కొవ్వూరు ఆసుపత్రి సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. తాళ్లపూడికి చెందిన ఊబా శ్రీనివాస్ అనే యువకుడు ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో మద్యం మత్తులో కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకోవడంతో శరీరం పూర్తిగా కాలిపోయింది. అతడిని బంధువులు 108లో కొవ్వూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ సుధీర్ ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం పరిస్థితి విషమించడంతో రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. -
రూ.2 పెరిగిన వంటగ్యాస్
న్యూఢిల్లీ: వంటగ్యాస్ ధరను రూ.2 పెంచుతూ ప్రభుత్వ రంగ ఆయిల్ సంస్థలు శనివారం నిర్ణయం తీసుకున్నాయి. దీంతోపాటు విమాన ఇంధనం, కిరోసిన్ ధరలూ పెరిగాయి. సబ్సిడీ సిలిండర్‌పై నెలకు రూ.2 పెంచాలని గత జూలైలో కేంద్రం నిర్ణయించింది. దీని ప్రకారమే సిలిండర్ ధర పెంచినట్లు చమురు సంస్థలు వెల్లడించాయి. కాగా, సబ్సిడీయేతర సిలిండర్‌కు రూ.1, కిరోసిన్‌పై 26పైసలు పెరిగింది. -
కిరోసిన్‌కు మంగళం
తెల్లకార్డుదారులకు పంపిణీ నిలిపివేసే యోచన పీడీఎస్ భారం తగ్గించుకోవాలనుకుంటున్న ప్రభుత్వం కాకినాడ సిటీ : పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని ప్రచా రం చేసుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా అందజేస్తున్న నిత్యావసర సరుకుల్లో కోత పెట్టడానికి రంగం సిద్ధం చేస్తోంది. ఆర్థిక భారం తగ్గించుకొనేం దుకు త్వరలో కిరోసి¯ŒS పంపిణీ లేకుండా పూర్తిగా తొలగిం చేందుకు సిద్ధమౌతోంది. గత ప్రభుత్వాలు కార్డుదారులకు బియ్యంతో పాటు కిరోసిన్, పంచదార, కందిపప్పు, పామాయిల్, గోధుమపిండి సబ్సిడీ ధరలలో పంపిణీ చేసేవి. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత బియ్యం, పంచదార, కిరోసి¯ŒS మినహా మిగిలిన వాటికి మంగళం పాడింది. ఇటీవలనే కిరోసి¯ŒS ధరను పెంచి రేష¯ŒS కార్డుదారులపై భారం వేసింది. ఇచ్చే ఒకటి, రెండు లీటర్లను కూడా ఎత్తివేసే ఆలోచన చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లావ్యాప్తంగా 2,647 చౌకదుకాణాల పరిధిలో 15, 26, 674 మంది అన్నపూర్ణ, అంత్యోదయ అన్న యోజన, తెలుపు కార్డుదారులు ఉన్నా రు. వీరందరికీ ప్రతినెల 2,066 కిలోలీటర్ల కిరోసి¯ŒSను సరఫరా చేస్తున్నారు. గ్యాస్ లేని కార్డుదారులకు అర్బ¯ŒS ప్రాం తాల్లో నాలుగు లీటర్లు, రూరల్ ప్రాంతాల్లో రెండు లీటర్లు పంపిణీ చేస్తుండగా గ్యాస్ ఉన్న కార్డుదారులకు అ న్ని ప్రాంతాల్లో ఒక లీ టరు కిరోసి¯ŒS ఇస్తున్నారు. జిల్లాలో మొత్తం కార్డుదారుల్లో గ్యాస్లేని వారు 2,31,178 మంది, గ్యాస్ ఉన్నవారు 12,95, 496 మంది ఉన్నా రు. ప్రభుత్వం అందరి కీ గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయ ని ప్రకటించి కిరోసి¯ŒS పంపిణీ నిలిపివేయాలని ప్రయత్నిస్తోంది. అయితే కిరోసి¯ŒS అనేది ఒక్క వంటకే కాకుండా ప్రధానంగా విద్యుత్ లేని సమయంలో దీపం వెలిగించుకోవడానికి ఉపయోగపడుతోంది. అటువంటి కిరోసి¯ŒSని ఎత్తివేస్తే దీపం ఏ విధంగా దీపాలు వెలిగించుకుంటామని వినియోగదారు లు ప్రశ్నిస్తున్నారు. వంటగ్యాస్‌కు కిరోసి¯ŒSకు లింకు పెట్ట డం సమంజసం కాదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సమంజసం కాదు పేదలకు ఉపయోగపడే కిరోసి¯ŒS పంపిణీ ఎత్తివేసే ఆలోచన చేయడం సమంజసం కాదు. గ్రామాల్లో గ్యాస్ ఉన్న కార్డుదారులు అనేక సందర్భాల్లో కిరోసి¯ŒSపై ఆధారపడాల్సిన పరిస్థితి ఉంది. విద్యుత్ లేని సమయంలో పేదలకు కిరోసి¯ŒS దీపాలే ఆధారం. – పలివెల వీరబాబు, సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు -
రేషన్ కిరోసిన్‌కు రెక్కలు
ఆరు నెలల్లో రెండు సార్లు పెరిగిన ధర తాజాగా లీటరుపై రూ.2 వడ్డన జిల్లా పేదలపై నెలకు రూ.4.32 లక్షల భారం గీసుకొండ : పెద్ద నోట్ల రద్దు ప్రభావంతో సామాన్యులు నిత్యావసర వస్తువుల కొనుగోలుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా రేషన్ షాపుల ద్వారా సరఫరా చేసే కిరోసిన్ లీటరుకు రూ.2 పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆరు నెలల క్రితమే లీటరు కిరోసిన్‌కు రూ.2 పెంచిన ప్రభుత్వం మళ్లీ రూ. 2 పెంచడంతో కిరోసిన్ వినియోగించే పేదలపై అధికభారం పడనుంది. ధర పెంచుతూ తీసుకున్న నిర్ణయం ఈనెల నుంచే అమలులోకి వస్తుందని ప్రభుత్వం పేర్కొంది. రేషన్ సరుకులు పేదలకు సరిగా అందేలా చూడటానికి సంస్కరణలు ప్రవేశపెడుతున్నామని చెబుతున్న ప్రభుత్వం మరో దారిలో వాటి ధరలను పెంచుతుండటం విమర్శలకు తావిస్తోంది. తద్వారా సామాన్య ప్రజలకు ఇక్కట్లు తప్పడం లేదు. గతం నుంచి ధర పెరుగుదల ఇలా.. గతంలో లీటర్ కిరోసిన్‌ను ప్రభుత్వం రూ.15కు అందజేసింది. దీనిని రూ.2 పెంచి రూ.17తో ఇటీవల వరకు కిరోసిన్ సరఫరా చేశారు. తాజాగా మరో రూ. 2 పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోగా లీటరు కిరోసిన్‌కు రూ.19 చెల్లించాల్సి వస్తుంది. ఇలా ఆరు నెలల్లోనే రెండు సార్లు పెంచడంతో పేదలపై లీటరుకు రూ. 4 భారం పడినట్లయింది. ప్రస్తుత పరిస్థితుల్లో నిరుపేదలు దీపాలు, వంట తయారీ, పవర్స్రేయర్ల వాడకానికి అధికంగా కిరోసిన్‌ను వినియోగిస్తున్నారు. ఈ క్రమంలో ధర పెంచడం వారికి ఆశనిపాతంలా మారనుంది. కాగా, కిరోసిన్ ధర పెరుగుదలతో వరంగల్ రూరల్ జిల్లాలోని పేదలపై ప్రతి నెల రూ.4,32,984 అదనంగా భారం పడనున్నట్లు గణాంకాలు చెబుతున్నారు. జిల్లాలో మొత్తం 464 రేషన్ షాపులు ఉండగా 2,19,462 ఆహార భద్రత కార్డులు ఉన్నాయి. అక్రమాలను నిరోధిస్తే మేలు.. రాష్ట్రప్రభుత్వం పేదల అవసరాలకు కిరోసిన్ సరఫరా చేస్తుండగా.. ఇందులో ఎక్కువ శాతం పక్కదారి పడుతోందని తెలుస్తోంది. ఆహార భద్రత కార్డులు ఉన్న వారికి రాయితీపై లీటరు చొప్పున, గ్యాస్ లేనివారికి రెండు లీటర్ల చొప్పున కిరోసిన్‌ను ప్రతి నెలా ప్రభుత్వం అందిస్తోంది. కిరోసిన్ అధికంగా అవసరం ఉన్న నిరుపేదలు మాత్రమే రేషన్ షాపుల నుంచి తీసుకువెళ్తున్నారు. ఇక ఎక్కువవగా వ్యవసాయ అవసరాలైన ఆయిల్ ఇంజన్లు, పవర్ స్పేయ్రర్లు, తైవాస్ స్పేయ్రర్లు నడిపేందుకు కిరోసిన్‌ను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. కిరోసిన్ హ్యాకర్లు కేవలం కొద్దిమంది లబ్ధిదారులకే కిరోసిన్ ఇచ్చి మిగతా వారికి మొండిచేయి చూపిస్తున్నారు. అలా మిగిలిన కిరోసిన్‌ను నల్లబజార్‌కు తరలిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. హాకర్ల నుంచి రూ.25 నుంచి రూ.30వరకు లీటర్ చొప్పున కిరోసిన్ కొనుగోలు చేసే బయటి వ్యాపారులు లీటరుకు రూ.35 నుంచి రూ. 40 వరకు విక్రయిస్తున్నారు. ఇలాంటి అక్రమాలను నిరోధించేందుకు రేషన్ షాపుల్లో బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేస్తే అక్రమాలకు చెక్ పెట్టవచ్చునని.. తద్వారా తరచూ ధర పెంచకుండా నిరుపేదలను భారం నుంచి కాపాడొచ్చని పలువురు భావిస్తున్నారు. -
ప్రాణం తీసిన అనుమానం
- భార్యకు నిప్పటించిన భర్త -అంకిరెడ్డిపల్లెలో ఘటన కొలిమిగుండ్ల: అనుమానంతో పెళ్లి అయిన రెండేళ్లకే భార్యను కడతేర్చాడు ఓ భర్త. ఈ ఘటన బుధవారం అంకిరెడ్డిపల్లె ఎస్సీ కాలనీలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన శివనారాయణకు బనగానపల్లె మండలం యాగంటిపల్లెకు చెందిన భవాని(22)తో రెండు సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరికి ఇంకా సంతానం కలగలేదు. అయితే, గత కొద్ది రోజుల నుంచి భార్యపై అనుమానం పెంచుకున్నాడు శివనారాయణ. దీంతో ఇరువురి మధ్య తరచు ఘర్షణ జరుగుతుండేది. ఈక్రమంలో బుధవారం ఉదయం మరో సారి భార్యతో గొడవ పడి ఆమె ఒంటిపై కిరోసిన్ పోసి నిప్పు అంటించాడు. ఇంటి ఆవరణలోనే జరిగిన ఈ ఘటనతో ఆమె తీవ్రంగా గాయపడింది. వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం భర్త తాడిపత్రి ప్రభుత్వ వైద్యశాలకు తరలించాడు. పరీక్షించిన వైద్యులు పరిస్థితి విషమంగా ఉందని కర్నూలు ప్రభుత్వ వైద్యశాలకు రెఫర్ చేశారు. అయితే, కొద్దిసేపటికే ఆమె కోలుకోలేక మృతిచెందింది. మృతురాలి తల్లి బాలతిమ్మమ్మ ఫిర్యాదు మేరకు ఎస్ఐ బీటీ వెంకటసుబ్బయ్య శివనారాయణపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
ప్రేమ పేరుతో రెచ్చిపోయిన ఉన్మాది
-
కిరోసిన్ మంటలు!
లీటర్‌పై రూ.4ల పెంపు ప్రతి నెలా రూ.27,26,804 భారం ఆందోళనలో కార్డుదారులు కోడుమూరు రూరల్ : ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా కార్డుదారులకు పంపిణీ చేసే కిరోసిన్ ధరను లీటర్‌పై రూ.4లను పెంచింది. గ్యాస్ కనెక్షన్ ఉన్న కార్డుదారుడు ప్రస్తుతం లీటర్ రూ.15 ఇస్తుండగా, ఇక నుంచి రూ.19 చెల్లించాల్సి ఉంది. గ్యాస్ కనెక్షన్ ఉన్న కార్డుదారుడికి ఒక లీటర్, లేని వారికి 2 లీటర్ల కిరోసిన్ పంపిణీ చేస్తున్నారు. అలాగే కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గ్యాస్ కనెక్షన్ లేని వారికి 4 లీటర్లు పంపిణీ చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయంపై కార్డుదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. నవంబర్ కోటా నుంచి అమలు గ్యాస్ కనెక్షన్ ఉన్న రేషన్ కార్డుదారులకు పంపిణీ చేసే కిరోసిన్‌పై ధర పెంపును నవంబర్ నుంచే అమలు చేస్తున్నారు. జిల్లాలో మొత్తం 10,77,525 రేషన్‌కార్డులుండగా, ఇందులో గ్యాస్ కనెక్షన్ ఉన్న కార్డుదారులు 6,81,701 ఉండగా, కనెక్షన్ లేని వారు 3,95,824 ఉన్నారు. ఈ లెక్కన ప్రతి నెలా గ్యాస్ కనెక్షన్ ఉన్న కార్డుదారులపై రూ.27,26,804 భారం పడనుంది. దీంతో కార్డుదారులు ఆందోళన చెందుతున్నారు. పెంచిన ధరలను తగ్గించాలి కార్డుదారులకు కిరోసిన్ ధరలను పెంచడం దారుణం. పెరిగిన ధరలతో ఇబ్బందుల పడుతున్న ప్రజలపై మరింత భారం మోపడం మంచిది కాదు. పెంచిన ధరలను వెంటనే తగ్గించాలి. -కృష్ణ, సీపీఐ తాలుకా కార్యదర్శి, కోడుమూరు ఈనెల నుంచే అమలు కిరోసిన్ ధర పెరుగుదల ఈ నెల నుంచే అమలవుతుంది. గ్యాస్ కనెక్షన్ లేని కార్డుదారులకు రూ.15లకే లీటర్ పంపిణీ చేస్తాం. -నిత్యానందరాజు, తహసీల్దార్, కోడుమూరు -
పేదల కిరోసిన్‌పై ప్రభుత్వ భారం
నీలి కిరోసిన్ ధర పెంచి పేదల బతుకు ల్లో ప్రభుత్వం నీలి నీడలు నింపుతోంది. చౌక దుకాణాల్లో ఇచ్చే కిరోసిన్ ధర ఒక్కసారిగా రూ. 4 పెంచడంపై నిరుపేదలు, ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారుు. గుడిసెల్లో బుడ్డి దీపాలు వెలగకుండా ప్రభుత్వం చేస్తోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నారుు. కరువుతో పనులు లేక ఇబ్బందిపడుతున్న పేదలకు ఇది అదనపు భారమవుతుందని ప్రభుత్వ నిర్ణయం విరమించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కందుకూరు అర్బన్ : ప్రభుత్వం రేషన్ షాపుల ద్వారా నిరుపేదలకు ప్రతి నెలా సరఫరా చేస్తున్న నీలి కిరోసిన్ ధరలు మంగళవారం నుంచి పెంచనుంది. ఒక్క లీటర్ కిరోసిన్‌పై రూ. 4 పెంచనున్నట్లు ప్రభుత్వం ప్రకటించి పేదలపై భారాన్ని మోపుతోంది. రేషన్‌షాపు దుకాణాల్లో తెల్లరేషన్ కార్డు కలిగిన కార్డుదారుడుకి రెండు లీటర్లు, గ్యాస్ కనక్షన్ ఉన్నవారి ఒక లీటరు చొప్పును పంపిణీ చేస్తున్నారు. ఈ ప్రకారం జిల్లా మొత్తం సుమారు 2016 రేషన్ షాపులకు గాను 8,65,933 లక్షల కార్డులు ఉన్నాయి. ప్రస్తుతం లీటరు కిరోసిన్ రూ. 15లకు పంపిణీ చేస్తున్నారు. తాజాగా సబ్సిడీపై ఇస్తున్న నీలికిరోసిన్పై రూ. 4లు పెంచి జిల్లాలోని పేద ప్రజలపై సుమారు నెలకు 35 లక్షల రూపాయల భారాన్ని మోపడంపై ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలే వర్షాలు లేక సాగుచేసిన పంటలకు నీరు లేక ఎండుముఖపట్టి పేదలు అల్లాడుతున్నారు. కూలీలకు కూలిదొరకక వసలబాట పడుతున్న తరుణంలో ప్రభుత్వం ఆదుకోకపోగా ధరలు పెంచి పేదప్రజల నడ్డివిరుస్తుందని ప్రజలు వాపోతున్నారు. ప్రతి రోజు కూలిపని చేసుకొని జీవనం సాగించే పేదలపై కిరోసిన్ ధరలు పెంచడం దారుణమంటున్నారు. కిరోసిన్ ధర పెంపుపై ప్రజల మండిపాటు రెక్కాడితేగాని డొక్కాడని అనేక కుటుంబాలు గ్యాస్ కనక్షన్ ఉన్నప్పటికీ గ్యాస్ అయిపోతే కొనడానికి డబ్బులు లేక కిరోసిన్‌పై ఆధారపడి వంట చేసుకుంటున్నారని, కరెంటు పోయినపుడు బుడ్డిదీపాలు కూడా వెలిగించుకోకుండా ప్రభుత్వం చూస్తుందని ప్రజలు మండిపడుతున్నారు. నేటికి మారుమూల ప్రాంతాల్లో కరెంటు వసతులు లేని గ్రామాలు ఉన్నాయని, వారి గుడిసెల్లో వెలుతురు నింపే నీలి కిరోసిన్ ఆధారం కూడా లేకుండా ప్రభుత్వం చూస్తుందని ప్రజా సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం ఉన్న ఫళంగా కిరోసిన్‌పై ధరపెంచి పేదలపై భారం మోపడం మోసం చేయడమే అవుతుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైన ప్రభుత్వం పెంచిన కిరోసిన్ ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని ప్రజలు కోరుతున్నారు. -
పేదలపై కిరోసిన్ భారం
బద్వేలు అర్బన్: ప్రభుత్వ చౌక దుకాణాలలో నిరుపేదలకు పంపిణీ చేసే నీలికిరోసిన్ ధరను లీటరు రూ.4 చొప్పున పెంచి పేదలపై ప్రభుత్వం భారం మోపింది. ఈ నెల కోటా నుంచి పెంచిన ధరలు అమలు కానున్నాయి. ప్రస్తుతం రేషన్ దుకాణాలలో గ్యాస్ కనెక్షన్ ఉన్నవారికి లీటరు చొప్పున , గ్యాస్ కనెక్షన్ లేనివారికి 2 లీటర్ల చొప్పున కిరోసిన్ పంపిణీ చేస్తున్నారు. గతంలో ప్రభుత్వం రూ.14.75 పైసలు పంపిణీ చేస్తుండగా డీలర్లు రూ.15లు వసూలు చేస్తుండేవారు. ప్రస్తుతం రూ.4 పెంచడంతో ఆ ధర రూ.19కి చేరుకుంది. నియోజకవర్గంలో మొత్తం 71, 286 రేషన్‌కార్డులు ఉండగా అందులో గ్యాస్ కనెక్షన్లు లేనికార్డులు 25,408 , గ్యాస్ కనెక్షన్లు ఉన్నవి 45,878 కార్డులు ఉన్నాయి. ఇప్పటికే కరువు కారణంగా అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్న పేద ప్రజలను ఆదుకోవాల్సిన ప్రభుత్వం లీటరు కిరోసిన్‌పై రూ.4లు పెంచడం అదనపు భారమని పేద ప్రజలు మండిపడుతున్నారు. ఈనెల నుంచే అమలు: కిరోసిన్ ధరలు పెంచుతూ ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులను ఈనెల నుంచే అమలు చేయనున్నట్లు తెలిసింది. ఇప్పటికే ఆయా రేషన్ డీలర్లను రూ.19 ధర మేరకే డీడీలు తీయాలని రెవెన్యూ అధికారులు ఆదేశించినట్లు తెలుస్తోంది. అయితే కార్డుదారులందరికీ ఈ ధర వర్తిస్తుందా లేక గ్యాస్కనెక్షన్ ఉన్న కార్డుదారులకే ఈధర వర్తిస్తుందా అనేదానికి స్పష్టమైన ఆదేశాలు లేకపోవడంతో డీలర్లు అయోమయానికి గురవుతున్నారు. పేదలపై పెనుభారం : ప్రస్తుతం లీటరు కిరోసిన్‌పై రూ.4లు పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పేదలపై పెనుభారం మోపనుంది. నియోజకవర్గ వ్యాప్తంగా 45,878 మంది గ్యాస్ కనెక్షన్లు ఉన్న కార్డుదారులుండగా వారికి ఇచ్చే లీటర్ కిరోసిన్ ప్రకారం ప్రతినెలా రూ.1, 83,512 భారం పడనుంది. ఒకవేళ ప్రభుత్వం కార్డుదారులందరికీ పెంచిన ధరలు వర్తింపచేస్తే రూ.3,86,776లు భారం పడనుంది. మొత్తం కార్డులు -
కిరోసిన్ పోసుకునీ సూపర్‌మార్కెట్‌కు దూసుకెళ్ళిన మహిళ
- తన కూతురి ఆచూకీ తెలపాలనీ ఆందోళన - అడ్డుకున్న పోలీసులు - ఉద్రిక్తత తిరువళ్లూరు : తిరువళ్లూరులోనీ ప్రవేటు సూపర్మార్కెట్లో పని చేస్తూ గత 15న అదృశ్యమైన యువతి ఆచూకీ తెలపాలనీ కోరుతూ బందువులు చేసిన ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది. తన కుమార్తేను సూపర్ మార్కెట్ యజమానీ బందువులే కిడ్నాప్ చేసారనీ ఆరోపించిన మహిళ ఒంటిపై కిరోసిన్ పోసుకునీ సూపర్ మార్కెట్ లోపలికి దూసుకెళ్ళడంతో ఒక్క సారీగా ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. తిరువళ్లూరు జిల్లా వేపంబట్టు ప్రాంతానీకి చెందిన మునస్వామీ కుమార్తే సంధ్య. పట్టణంలోనీ అలీస్ సూపర్మార్కెట్లో సేల్స్ రంగంలో పని చేస్తూవుంది. ఈ నేపద్యంలో గత 15న ఇంటి నుండి పనికి వెళ్ళిన సంధ్య అప్పటి నుండి అదృశ్యమైయింది. ఈ సంగటనపై సంధ్య తల్లి అరసు సెవ్వాపేట పోలీసులకు పిర్యాదు చేసింది. అయితే పిర్యాదు ఇచ్చి దాదాపు వారం రోజులు దాటుతున్న యువతి ఆచూకీనీ పోలీసులు కనిపెట్టకపోవడంతో ఆగ్రహించిన బంధువులు అలీస్ సూపర్ మార్కెట్ వద్ద ఆందోనకు దిగారు. సూపర్ మార్కెట్ నిర్వాహకుడి బందువుల అరుణ్ తన కుమార్తేను అపహరించాడనీ ఆరోపించిన అమే తల్లి అరస్ ఒంటిపై కిరోసిన్ పోసుకునీ లోపలికి పరుగులు పెట్టింది. దీంతో ఒక్క సారీగా అక్కడ అరుపులు కేకలు వినిపించింది. తన కుమార్తే అచూకీ తెలిపే వరకు తాము ఆందోళననూ విరమించేదీ లేదనీ తేల్చిచెప్పడంతో పోలీసులు వారినీ సముదాయించే ప్రయత్నం చేసారు. ఈ దశలో పోలీసులకు యువతి బందువుల మద్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం నెలకొంది. ఇక లాభం లేదనకున్న పోలీసులు సూపర్‌మార్కెట్ నిర్వాహకులను పిలిపించి విచారణ చేపట్టారు. విచారణలో సూపర్మార్కెట్లో పని చేసే అరుణ్ అనే యువకుడితో వెళ్ళిపోయినట్టు నిర్దారించారు. రెండు రోజుల్లో యువతినీ అప్పగిస్తామనీ హమీ ఇవ్వడంతో సూపర్‌మార్కెట్ నిర్వాహులు హమీ ఇవ్వడంతో వారు శాతించారు. ఇది ఇలా వుండగా పరారైన సంధ్యకు గత రెండు నెలల క్రితం వేరే యువకుడితో నిశ్చితార్ధం అయినట్టు తెలిసింది. -
భర్తకు నిప్పంటించిన భార్య
చికిత్స పొందుతూ మృతి దోమ: ఓ మహిళ కుటుంబ కలహాలతో తన భర్త ఒంటిపై కిరోసిన్ పోసి నిప్పంటించింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన శనివారం మృతిచెందాడు. ఈ సంఘటన మండల పరిధిలోని రాకొండ గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్సై ఖలీల్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన లగచర్ల ఆశప్ప(40), నర్సమ్మ దంపతులు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇదిలా ఉండగా, భార్యాభర్తలు శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో గొడవపడ్డారు. ఘర్షణ పెరగడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన నర్సమ్మ భర్త ఆశప్పపై కిరోసిన్ పోసి నిప్పంటించింది. గమనించిన కుటుంబీకులు ఆయనను చికిత్స నిమిత్తం నగరంలోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో శనివారం మధ్యాహ్నం ఆయన మృతిచెందాడు. మృతుడి తమ్ముడు కృష్ణయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
భర్త వేధింపులకు నవవధువు బలి
► కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్న భార్య ► చికిత్సపొందుతూ జిల్లా ఆస్పత్రిలో మృతి ► మూడు నెలల క్రితమే ఒక్కటయ్యారు! నర్వ : వేదమంత్రాలు, పంచభూతాల సాక్షిగా తాళికట్టిన భర్త వాటిని మరిచాడు. అనుమానం పెంచుకుని సూటిపోటి మాటలతో భార్యను వేధించడంతో ఆమె ఆత్మహత్యాయత్నం చేసింది. చికిత్సపొందుతూ శనివారం కన్నుమూసింది. నర్వ ట్రెయినీ ఎస్ఐ.రాజు కథనం ప్ర కారం ఆ వివరాలు... తల్లిదండ్రులు చనిపోవడంతో కర్నాటక రాష్ట్రానికి చెందిన కమ్మరి గోవిందమ్మ(25), తన ఇద్దరి తమ్ముళ్లతో కలిసి మక్తల్ మండలం పంచదేవ్‌పాడ్‌లో ఉంటున్న మేనమామలు భగవంతాచారి, బాల్‌రాం, బాలస్వామిల వద్దకు సుమారు పదేళ్లక్రితం వచ్చింది. మొదటి వివాహం జరిగిన కొద్ది రోజులకే భర్త పట్టించుకోకుండా వదిలిపెట్టి వెళ్లడంతో తిరిగి మేనమామల వద్దకు చేరింది. అలాగే వదిలేయడం ఇష్టంలేని వారు ఆమెకు ఈఏడాది ఏప్రిల్‌లో నర్వ మండలం జిన్నారం గ్రామానికి చెందిన రాఘవేంద్రచారితో రెండో వివాహం చేశారు. ఇతనికి కూడా ఇది రెండో వివాహం. మొద టి భార్య మృతిచెందిన విషయంలో 8ఏళ్లు జైలుశిక్ష అనుభవించాడు. ఆ వ్యవహారం కోర్టులో ఉండగానే గోవిందమ్మను రెండో వివాహం చేసుకున్నాడు. ఈమె పుట్టింటివారితో ఎక్కువగా మాట్లాడుతుందని, అక్కడ అక్రమ సంబంధాలు ఉన్నాయేమోననే అనుమానంతో వేధించేవాడని ఎస్ఐ తెలిపారు. నిత్యం వీటిని భరించలేక గోవిందమ్మ శుక్రవారం అర్ధరాత్రి ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. మంటలకు తాళలేక కేకలు వేయడంతో కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని నర్వ ట్రెయినీ ఎస్ఐ.రాజు తెలిపారు. -
డీలర్ మాయాజాలం
► కిరోసిన్ పంపిణీ చేసినట్లు ఈపాస్‌లో నమోదు ► 1323 లీటర్ల స్వాహాకు యత్నం హిందూపురం టౌన్ : రేషన్ షాపుల్లో జరుగుతున్న మోసా లను అరికట్టడానికి ప్రభుత్వం ఈపాస్విధానంతో రేషన్ సరుకులు పంపిణీ చేయడానికి శ్రీకారం చుట్టింది. అయితే ఈపాస్ విధానంలోనే మోసం చేయడానికి పూను కున్నాడో డీలర్. అధికారులు గమనించడంతో డీలర్ మోసం బయటపడింది. వివరాలు.. హిందూపురం పట్ట ణంలోని రహమత్‌పురం ఉన్న 9వ ఎఫ్పీ షాపు డీలర్ షఫీ రేషన్‌కార్డు దారులకు కిరోసిన్ పంపిణీలో చేతివాటం ప్రదర్శించాడు. లబ్ధిదారులకు కిరోసిన్ పంపిణీ చేయకుం డానే పంపీణీ చేసినట్లు ఈ పాస్‌లో నమోదు చేయించి ఏకంగా 1,323 లీటర్ల కిరోసిన్‌ను స్వాహా చేయడానికి సిద్ధమయ్యాడు. దీంతో పాటు 1,550 కిలోల మిగిలిన బియ్యం కూడా లేదని అధికారుల తనిఖీలో తేలింది. మోసం బయట పడింది ఇలా.. ప్రతి నెలా 1 నుంచి 5వ తేదీ లోపు కార్డు లబ్ధిదారులకు బియ్యం, పంచదార పంపిణీ చేసే సమయంలో ఆరోజే కిరోసిన్‌ను సైతం పంపిణీ చేసినట్లు లబ్ధిదారులతో ఈ పాస్‌లో నమోదు చేయించాడు. అయితే శనివారం సదరు షాపు వద్దకు కిరోసిన్ కోటా వేయడానికి అధికారులు ట్రక్కును తీసుకెళ్లారు. ఈపాస్‌లో బఫర్ స్టాక్‌ను పరి శీలించగా అప్పటికే కిరోసిన్ కోటాను పంపిణీ చేసినట్లు ఈపాస్‌లో నమోదైంది. దీంతో అధికారులు అవాక్క య్యారు. ఆరా తీస్తే కిరోసిన్‌ను లబ్ధిదారులకు అందజేయనప్పటికీ పంపిణీ చేసినట్లు ఈపాస్‌లో నమోదు చేసి మోసానికి పాల్పడ్డాడని గ్రహించారు. అక్కడికి చేరుకున్న తహశీల్దార్ విశ్వనాథ్, డిప్యూటీ తహశీల్దార్ మైనుద్దీన్, సీఎస్‌డీటీ రాజా పరిశీలించి డీలర్‌పై 6ఏ కేసు నమోదు చేశారు. ఆ షాపు నిర్వహణను మరో డీలర్‌కు అప్పగించినట్లు అధికారులు తెలిపారు. -
కట్నం కార్చిచ్చుకు.. తల్లీకూతురు బలి
పెళ్లి చేసుకుని కొత్త జీవితం ప్రారంభించిన ఆ యువతికి రెండేళ్లకే కష్టాలు మొదలయ్యాయి. కట్నం కోసం భర్తపెట్టే చిత్రహింసలు తట్టుకోలేక పోయింది.. ఒంటిమీది ఆభరణాలను అమ్ముకున్నా ఓర్చుకుంది.. కడుపున పుట్టిన చిన్నారిని చూసుకుని బాధలను దిగమింగుకుంది.. ఇకనైనా మారతాడేమో అన్న చిన్న ఆశ కూడా ఆవిరైపోయింది.. ఇక తాను లేని లోకంలో కూతురు ఎన్ని కష్టాలు పడుతుందో అని.. మదనపడింది. చివరకు తనతో పాటే తీసుకెళ్లాలని నిర్ణయించుకుని.. ఆరునెలల చిన్నారిని నీటిసంపులో వేసి..తాను అగ్నికి ఆహుతైంది. * కూతురిని నీటిసంపులో పడేసి..తాను అగ్నికి ఆహుతై.. * భువనగిరి మండలంలో విషాదం భువనగిరి: కట్నం కార్చిచ్చుకు..తల్లీకూతురు బలయ్యారు. ఈ విషాదకర ఘటన భువనగిరి మండలం గౌస్‌నగర్‌లో ఆదివారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. పోలీసులు, మృతుల బంధువులు తెలిపిన వివరాల ప్ర కారం.. భువనగిరి మండలం గౌస్‌నగర్‌కు చెందిన నల్లమాస వెంకటయ్య, లింగమ్మల కుమారుడు నల్లమాస భాస్కర్‌కు చౌటుప్పల్ మండలం తంగెడపల్లికి చెందిన చిక్కురి యాదగిరిస్వరూపల కుమార్తె మమత(22) తో 2014 ఏప్రిల్ 20న వివాహం జరిగింది. పెళ్లి సమయంలో ఒప్పుకున్న రూ.7.70 లక్షల వరకట్నంలో రూ.7.10 లక్షల వరకు నగదు,అభరణాలు, ఇతర వస్తువులను ము ట్టచెప్పారు. అయితే రెండున్నర సంవత్సరా లు అవుతున్నా కట్నం పూర్తిగా ఇవ్వలేదని ఆ డబ్బులు తేవాలని భాస్కర్ మమతను వే ధించసాగాడు. దీంతో పాటు భాస్కర్ కొంతకాలంగా పనిలేకుండా ఉన్నాడు. జేసీబీ ఆపరేటర్ అయిన భాస్కర్ ఏజీఐ గ్లాస్ఫ్యాక్టరీలో పనిచేస్తూ మానేశాడు. కొన్నినెలలుగా ఇంట్లోనే ఉంటున్నాడు. దీం తోపాటు మమతకు చెందిన బంగారు అభరణాలను తాకట్టు పెట్టాడు. అలాగే మమతకు చెందిన బుట్టాలు అమ్మినట్లు తెలియడంతో దంపతుల మధ్య గొడవలు మొదల య్యాయి. ఈ నేపథ్యంలో బాకి ఉన్న మిగతా కట్నం డబ్బు తీసుకురావాలని మమతను వేధించసాగారు. బంగారం అమ్మిన విషయం మమత తల్లిదండ్రులకు చెప్పడంతో వారు మాట్లాడడానికి వస్తామన్నారు. ఈ విషయంలోనే శనివారం రాత్రి దంపతులు గొడవ పడ్డారు. అందరూ నిద్రిస్తుండగా.. అందరు నిద్రిస్తున్న సమయంలో మమత తన కూతురు భానును నీళ్లసంపులో వేసింది. దీంతో చిన్నారి ఊపిరాడక చనిపోయింది. వెంటనే మరుగుదొడ్డిలోకి వెళ్లి కిరోసిన్ ఒంటిపై పోసుకుని నిప్పంటించుకుంది. దీంతో పెద్ద ఎత్తున మంటలు లేవడంతో ఇంట్లో నిద్రిస్తున్న వారు మేలుకుని బయటకు వచ్చారు. అప్పటికే మమత తలభాగం నుంచి మంటలు పెద్దగా లేవడంతో పందిరికూడా అంటుకుంది. చల్లార్చే ప్రయత్నం చేసినప్పటికీ ఆమె మంటల్లో కాలి చనిపోయింది. అనంతరం పాప కోసం వెతకగా సంపులో శవమై కన్పించింది. విషయం తెలుసుకున్న రూరల్ సీఐ అర్జునయ్య, ఎస్ఐ సాజిదుల్లాలు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ నిర్వహించారు. మమత తండ్రి యాదగిరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరారీలో భర్త భాస్కర్ ఈ సంఘటన జరిగిన వెంటనే మమత భర్త భాస్కర్ కన్పించకుండాపోయాడు.పోలీస్‌లు గ్రామానికి వచ్చి గట్టి బందోబస్తూ ఏర్పాటు చేశారు.సంఘటనకు సంబంధించిన అన్ని అంశాలను పరిశీలించారు. గ్రామస్తులను విచారించారు. నా కూతురును వేధించి చంపారు కట్నం కోసం తన కూతురుని వేధించడం వల్లే చనిపోయింది. పెళ్లి సమయంలో ఒప్పుకున్న కట్నం డబ్బులు ఇచ్చాను. కొంత ఇవ్వాల్సి ఉంటే త్వరలో ఇస్తానని చెప్పాను. అయినా వినకుండా నా కూతురిని చిత్రహింసలు పెట్టడంతో తన కూతురును చంపి తాను ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు చట్టప్రకారం చర్యలు తీసుకోవాలి. - చిక్కురి యాదగిరి మమత తండ్రి వేధింపుల వల్లే అత్తింటి వేధింపుల వల్లే మమత ఈ ఘాతుకానికి పాల్పడింది. కట్నం డబ్బుల కోసం భర్తభాస్కర్ తరుచు వేధించే వాడని తమ విచారణలో తేలింది. ఇందుకు సంబంధించి మృతురాలి తండ్రి ఫిర్యాదు చేశాడు. వేధింపుల కేసు నమోదు చేశాం. - అర్జునయ్య, భువనగిరి రూరల్‌సీఐ -
ఒంటికి నిప్పంటించుకొని యువతి ఆత్మహత్య
ఖానాపురం: ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకొని ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మండలంలోని అశోక్‌నగర్ గ్రామంలో సోమవారం జరిగింది. ఎస్సై దుడ్డెల గురుస్వామి కథనం ప్రకారం... వరంగల్‌లోని దయానంద కాలనీకి చెందిన కోన్‌రెడ్డి అరుణ-వుల్లారెడ్డి దంపతుల కుమార్తె శ్రీవిద్య(28) వరంగల్‌లో పీజీ వరకు చదువుకుంది. కొంతకాలంగా శ్రీవిద్య ఫిట్స్‌తో, మానసిక స్థితి బాగలేక బాధపడుతోంది. ఈ క్రమంలో కొద్దిరోజుల క్రితం అయిన అరుణ ఇంట్లో కిం దపడిపోవడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అరుణ హన్మకొండలోని యశోదా ఆస్పత్రిలో చికిత్స పొం దుతుండగా శ్రీవిద్య తల్లిని ఆస్పత్రిలో చూసి అశోక్‌నగర్‌లోని అమ్మమ్మ అయిన చల్లా శకుంతమ్మ-కొంరారెడ్డి ఇంటికి వచ్చింది. తల్లి పరిస్థితిని చూసి తట్టుకోలేక ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్యకు పాల్పడింది. అవ్మువ్ము ఇంట్లోకి వచ్చి చూసేసరికి అప్పటికే మృతి చెందింది. మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై గురుస్వామి తెలిపారు. -
కొత్తడ్రెస్ కొనివ్వలేదని..
కిరోసిన్ పోసుకుని విద్యార్థిని ఆత్మహత్యాయత్నం పరిస్థితి విషమం.. ఆస్పత్రికి తరలింపు సూర్యాపేట మండల పరిధిలో ఘటన సూర్యాపేట రూరల్ : కొత్త డ్రెస్ కొనివ్వలేదని మనస్తాపానికి గురైన ఓ విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటన సూర్యాపేట మండలం పిల్లలమర్రి గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చివ్వెంల మండలానికి చెందిన బాషపంగు పద్మ భర్త లింగయ్య మృతిచెందడంతో తమ తల్లిగారి గ్రామమైన పిల్లలమర్రిలో కూతురు మహేశ్వరితో కలిసి ఉంటోంది. మహేశ్వరి అడ్డగూడురు గురుకుల పాఠశాలలో పదవతరగతి ఇటీవల పూర్తి చేసుకుంది. అయితే తల్లి పద్మ కొంత కాలంగా హైదరాబాద్‌లో కూలీగా జీవనం సాగిస్తోంది. పదవతరగతి పూర్తి చేసుకున్న మహేశ్వరి అమ్మమ్మ ఇంటి వద్ద ఉంటోంది. సోమవారం నల్లగొండలో నిర్వహించే ఓ కౌన్సెలింగ్ వెళ్లేందుకు తన తల్లిని హైదరాబాద్ నుంచి పిల్లలమర్రి పిలిపించుకుంది. కౌన్సెలింగ్‌కు వెళ్లేందుకు తనకు డ్రెస్, చెప్పులు కొనివ్వమని కోరింది. ప్రస్తుతానికి డబ్బులు లేదని చెప్పులు మాత్రమే కొనిస్తానని కూతురు చెప్పింది. దీంతో మనస్తాపానికి గురైనమహేశ్వరి తల్లి పెన్షన్ డబ్బులు తీసుకువచ్చేందుకు పంచాయతీ కార్యాలయం వద్దకు వెళ్లగానే కిరోసిన్ ఒంటిపై పోసుకుని నిప్పంటించుకుంది. మంటలకు తాళలేక మహేశ్వరి కేకలు వేస్తుండడంతో చుట్టూ పక్కల వారు గమనించి తల్లికి సమాచారం అందించారు. వెంటనే వచ్చి మంటలు ఆర్పి 108 వాహనంలో సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. మహేశ్వరి శరీరం 80 శాతం కాలిపోయినట్లు వైద్యులు పేర్కొంటున్నారు. ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మహేశ్వరి నుంచి సూర్యాపేట తహసీల్దార్ మహమూద్‌అలీ, సూర్యాపేటరూరల్ ఏఎస్ఐ జహంగీర్ వాంగ్మూలం సేకరించారు. మహేశ్వరి తల్లి పద్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సూర్యాపేటరూరల్ ఎస్సై శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. -
కోరిక తీర్చనందుకే...
► వీడిన రాధమ్మ హత్య కేసు మిస్టరీ ► నిందితులను ఎస్పీ ఎదుట హాజరుపర్చిన ఎమ్మిగనూరు పోలీసులు కర్నూలు: ఎమ్మిగనూరు మండలం మల్కాపురం గ్రామానికి చెందిన కురువ గంగప్ప భార్య కురువ రాధమ్మ హత్య కేసు మిస్టరీ వీడింది. బావ కుమారుడు కురువ నాగరాజు తన కోరిక తీర్చమని ఆమెను కోరగా.. అందుకు నిరాకరించినందుకే కుటుంబ సభ్యులంతా కలసి కడతేర్చినట్లు పోలీసులు విచారణ లో తేల్చారు. బనవాసి ఫోరం సమీపంలోని సాయిబాబా గుడి వద్ద ఉన్న నిందితులు కురువ నాగరాజు, కురువ గంగప్ప, కురువ లింగమ్మ, నరసింహులు, కురువ అయ్యమ్మ, కురువ ఈరన్నను గురువారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జిల్లా కేంద్రానికి తీసుకువచ్చి ఎస్పీ ఆకే రవికృష్ణ ఎదుట హాజరపరిచారు. ఆదోని డీఎస్పీ కొల్లి శ్రీనివాసులు, ఎమ్మిగనూరు రూరల్ సీఐ శ్రీనివాసమూర్తితో కలసి వ్యాస్ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ వివరాలను వెల్లడించారు. పత్తికొండ గ్రామానికి చెందిన రాధమ్మకు మల్కాపురం గ్రామానికి చెందిన గంగప్పతో ఎనిమిదేళ్ల క్రితం వివాహమైంది. పెళ్లి అయిన సంవత్సరం నుంచే భర్తతో పాటు కుటుంబ సభ్యులు వేధించడం ప్రారంభించారు. మూర్ఛ రోగముంది... సంసారానికి సరిపోవు.. అంటూ వేధించేవారు. ఈ విషయంలో చాలాసార్లు ఇరువురికి చెందిన పెద్దలు పంచాయితీ కూడా చేశారు. గత నెల 29వ తేదీన రాధమ్మ ఇంట్లో నిద్రిస్తుండగా, ఆమె బావ కుమారుడు నాగరాజు కోరిక తీర్చమని చేయి పట్టుకోగా కేకలు వేసింది. దీంతో ఇంట్లో వారంతా గుమికూడారు. అనవసరంగా చిన్నపిల్లవాడిపై నింద మోపుతున్నావంటూ ఆమె ను కొట్టి మానసికంగా హింసించారు. ఇదే విషయాన్ని పుట్టింటి వారికి చెప్పి పంచాయితీ పెడతానని రాధమ్మ హెచ్చరించిం ది. ఆ మరుసటి రోజు బావ నర్సింహు లు, ఆయన భార్య అయ్యమ్మ, కుమారుడు నాగరాజు, అత్త లింగమ్మ, మామ ఈరన్న కలసి ఇంట్లో ఉన్న రాధమ్మపై కిరోసిన్ పోసి నిప్పం టించారు. తీవ్ర గాయాలైన ఆమె ను ఆసుపత్రి చేర్పించగా చికి త్స పొందుతూ అదే రోజు సాయంత్రం మృతి చెందిం ది. మూడు రోజుల్లో కేసు మిస్టరీని ఛేదించిన సీఐ శ్రీనివాసమూర్తితో పాటు ఎమ్మిగనూరు రూరల్ పోలీసులను ఎస్పీ అభినందించారు. -
ఆడపిల్ల పుట్టిందని..
భార్యకు నిప్పంటించాడు.. వారిది ప్రేమవివాహం. అమ్మాయి తరఫు వారు పెళ్లికి అంగీకరించలేదు. అయినా సరే అతడే కావాలనుకుంది ఆ యువతి. ఆ యువకుడ్నే పెళ్లి చేసుకుని తన ప్రేమను బతికించుకుంది. వారి ప్రేమకు గుర్తుగా ఇద్దరు అమ్మాయిలు జన్మించారు. అయితే మూడో కాన్పులోనూ ఆడపిల్లకే జన్మనివ్వడంతో ఆ మృగాడు.. ఆమెను అంత మొందించాలనుకున్నాడు. గురువారం మద్యం తాగి ఇంటికొచ్చి.. తన భార్యపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. ప్రస్తుతం ఆ మహిళ కాలిన గాయాలతో చావుబతుకుల మధ్య ఆస్పత్రిలో కొట్టుమిట్టాడుతోంది. గోరంట్ల/ హిందూపురం అర్బన్ : మూడో కాన్పులో కూడా ఆడపిల్లకు జన్మనిచ్చిందన్న అక్కసుతో తన భార్యపై కిరోసిన్ పోసి నిప్పంటించి తగలబెట్టాడో ప్రబుద్ధుడు. గోరంట్ల మండలం కళ్లితండాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పూర్తీ వివరాలిలా ఉన్నాయి. పాలసముద్రం పంచాయతీ పుత్తూరు తండాకు చెందిన సుస్మితాబాయి కళ్లితండాకు చెందిన తిరుపాల్‌నాయక్ ఆరేళ్ల క్రితం పెద్దలను ఎదురించి ప్రేమవివాహం చేసుకున్నారు. ఇద్దరూ కూలి పనులు చేసుకుంటూ అన్యోన్యంగా కాపురం చేసుకునేవారు. ఈ క్రమంలో వీరికి ఇద్దరు కుమార్తెలు త్రివేణిబాయి(5), కల్పనాబాయి(3) పుట్టారు. అయితే ఆడపిల్లలంటేనే గిట్టని తిరుపాల్‌నాయక్ ఆమెతో గొడవపడేవాడు. రెండు నెలల క్రితం సుస్మితాబాయి మూడో కాన్పులో కూడా ఆడపిల్లకు జన్మనిచ్చింది. నాటి నుంచి ఆ పసికందును చంపేయాలని తిరుపాల్‌నాయక్ నిత్యం పోరుపెట్టేవాడు. ఇందుకు ఆమె ఒప్పుకోకపోవడంతో భార్యను చంపాలని పథకం రూపొందించుకున్నాడు. గురువారం సాయంత్రం మద్యం సేవించి ఇంటికి వచ్చిన తిరుపాల్‌నాయక్ తన భార్యతో ఇదే విషయమై మళ్లీ గొడవపడ్డాడు. చివరికి ఆమెపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. ఆమె ఆర్తనాదాలు విన్న స్థానికులు మంటలు ఆర్పివేసి సుస్మితాబాయిని స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆమె శరీరం 70 శాతం కాలిపోవడంతో వైద్యుల సూచన మేరకు అక్కడి నుంచి 108లో హిందూపురం ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న మెజిస్ట్రేట్ ఆమె వాగ్మూలాన్ని రికార్డు చేశారు. బాధితురాలి వివరాల మేరకు గోరంట్ల ఎస్ఐ వెంకటేశ్వర్లు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
కట్నం కోసం బాలింతను చంపేస్తారా?
► వరలక్ష్మి ఆత్మహత్య కేసులో నిందితులను శిక్షించాలి ► ఠాణాను ముట్టడించిన బాధిత తల్లిదండ్రులు, బంధువులు వనపర్తి టౌన్ : ‘కట్నం కోసం పచ్చి బాలింతను చంపేస్తారా.. ఈ కేసులో నిందితులను శిక్షించాల్సిందే..’ అంటూ మృతురాలి తల్లిదండ్రులు, బాధిత బంధువులు ఠాణాను నాలుగు గంటలపాటు ముట్టడించారు. చివరకు పోలీసుల జోక్యంతో పరిస్థితి సద్దుమణిగింది. వివరాలిలా ఉన్నాయి. పానగల్ కు చెందిన అలివేల, రాములు దంపతులకు ఇద్దరు కుమార్తెలు, కొడుకు ఉన్నాడు. వీరి చిన్న కుమార్తె వరలక్ష్మి (22) కి మూడేళ్ల క్రితం వనపర్తి పట్టణంలోని రాయిగడ్డకు చెందిన రాఘవేందర్‌తో వివాహమైంది. ఆ సమయంలో రూ.5.5 లక్షలు కట్నంగా ఇచ్చారు. వీరికి రెండేళ్ల కుమారుడితోపాటు పది రోజుల కూతురు ఉన్నారు. కొంతకాలంగా ఆమెను భర్తతోపాటు అత్త అలివేలు, మామ మన్యంలు అదనపు కట్నం కోసం వేధించసాగారు. దీంతో మనస్తాపానికి గురై ఆదివారం ఇంట్లోనే ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని చనిపోయింది. ఈ ఘటనపై బాధిత తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఎస్ఐ గాంధీనాయక్ కేసు దర్యాప్తు చేపట్టిన విషయం విదితమే. కాగా, నిందితులను కఠిన శిక్షించాలంటూ సోమవారం ఉదయం పది నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు వనపర్తి పోలీస్‌సేష్టన్ బాధిత కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు ముట్టడించారు. ‘నేరం చేసిన వాళ్లను భద్రంగా ఠాణాలో పెడతారా..’ అంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. కాగా, ‘పది రోజుల పచ్చి బాలింత అని చూడకుండా భర్త, అత్త, మామలు చితకబాది చంపేశారు.. మా కడుపు కోత ఎవ రు తీరుస్తారు..’ అని బాధిత తల్లిదండ్రులు రాములు, అలివేల రోదించారు. మా బిడ్డ ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదన్నారు. ఎస్ఐ ఏమన్నారంటే.. వరలక్ష్మి మృతిపై తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వరకట్నం, హత్య కింద కేసు నమోదు దర్యాప్తు జరుపుతున్నామని ఎస్ఐ గాంధీనాయక్ తెలిపారు. బిడ్డను పోగొట్టుకున్న బాధ, ఆవేశంలో ఘర్షణలు జరుగుతాయని భావించి నిందితులకు సెక్యూరిటీ ఇచ్చామన్నారు. చట్ట ప్రకారం వారిపై తగు చర్యలు తీసుకుంటామని ఆందోళనకారులకు నచ్చజెప్పారు. దీంతో వారు శాంతించి వెనుదిరిగారు. -
ఇళ్లిస్తారా.. ఆత్మహత్య చేసుకోమంటారా?
► అధికారులను ఘెరావ్ చేసిన కరకట్టవాసులు ► ఒంటిపై కిరోసిన్ పోసుకోబోయిన మహిళ ► అడ్డుకున్న స్థానిక మహిళలు భవానీపురం: తమకు ఇళ్లు ఇవ్వకపోతే ఆత్మాహుతికైనా సిద్ధమేనని కరకట్టవాసులు హెచ్చరించారు. భవానీపురం కరకట్ట సౌత్ రోడ్‌లోని ఇళ్ల తొలగింపునకు నిరసనగా మూడు రోజులుగా జరుగుతున్న ఆందోళన బుధవారం ఉద్రిక్తతకు దారితీసింది. కరకట్టకు ఒకవైపు పట్టాదారులు, మరోవైపు అద్దెదారులు వడివడిగా ఆందోళనలు చేపడుతున్నారు. ఈ క్రమంలో పున్నమి హోటల్ ప్రాంగణంలో రెవెన్యూ అధికారులు ఉన్నారని తెలుసుకున్న అద్దెదారులు అక్కడికి తరలివచ్చి బైఠాయించారు. కొందరు మహిళలు కిరోసిన్ డబ్బాలు తీసుకువచ్చి ఇల్లు ఇవ్వకపోతే తమకు ఆత్మహత్యే శరణ్యమని కన్నీటి పర్యంతమయ్యారు. చంటి పిల్లాడితో వచ్చిన జరీన అనే మహిళ ఆగ్రహావేశాలకులోనై తనవద్ద ఉన్న కిరోసిన్‌ను ఒంటిపై పోసుకోబోతుండగా పక్కను ఉన్నవారు ఆమె చేతిలోని డబ్బాను బలవంతంగా లాక్కుని వారించారు. కాసేపు చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ‘ఓట్లు అడుక్కోవడానికి వచ్చినప్పుడు సొంత ఇల్లా, అద్దె ఇల్లా అని అడగకుండా అందరిచేతా ఓట్లు వేయించుకున్న కార్పొరేటర్ , ఇప్పుడు అద్దెకున్నవారికి ఇల్లు ఇవ్వమని అధికారులు చెబుతుంటే ఏం చేస్తున్నారని స్థానిక కార్పొరేటర్ షేక్ హబిబుల్లాపై ధ్వజమెత్తారు.అధికారుల వేధింపులు ఇలా ఉంటే మరోవైపు వైస్సార్కాలనీలో ఇల్లు పొందిన ఇంటి యజమానులు తమ సామాన్లు బయటపడేస్తున్నారని వాపోయారు. అధికారుల ఘెరావ్ మధ్యాహ్న సమయంలో భోజనానికి వెళ్లేందుకు బయలుదేరిన వీఆర్వోలను చుట్టుముట్టడంతో వారు వెనుతిరిగి లోపలకు వెళ్లిపోయారు. అనంతరం బిల్డింగ్ ఇన్ స్సెక్టర్లు తమ వాహనాలపై వెళ్తుండగా వారిని కూడా అడ్డుకున్నారు. దీంతో బాధితులకు అధికారులకు మధ్య తోపులాట జరిగింది. ఇళ్లు రాసేది తాము కాదని, వేరే అధికారి ఉన్నారని చెప్పినా వారు వినిపించుకోలేదు. ఒకానొక దశలోసహనం కోల్పోయిన బిల్డింగ్ ఇన్స్పెక్టర్ ఆశా మహిళలను పక్కకు తోసేసే ప్రయత్నం చేశా రు. ఇంటికి పట్టాలున్నా ఇల్లు రాయటం లేదు తమ ఇళ్లకు ఎన్టీ రామారావు ఇచ్చిన పట్టాలున్నా అధికారులు ఇల్లు రాయటం లేదని కొందరు ఇంటి యజమానులు ఆందోళన బాట పట్టారు. వంద గజాల ఇంటిలో నలుగురు కాపురముంటుంటే ఒక్కరికే రాస్తామని చెప్పటం ఎంత వరకు న్యాయమని ప్రశ్నిస్తున్నారు. 27వ డివిజన్ వైఎస్సార్సీపీ నాయకుడు అబ్దుల్ ఖాదర్(ట్రావెల్స్)కు సమాచారం ఇవ్వడంతో ఆయన వచ్చి వారి వివరాలను అడిగి తెలుసుకున్నారు. కొన్ని చోట్ల బాత్రూంలకు కూడా ఇల్లు రాసిన అధికారులు పట్టాలున్న తమ ఇంటిలో ఉండే నలుగురికి ఎందుకు రాయరని ప్రశ్నించారు. తమకు ఇళ్లు ఇవ్వకపోతే జేసీబీ కిందపడైనా చస్తాంకాని ఇల్లు ఖాళీ చెయ్యమని ఖరాఖండిగా చెబుతున్నారు. అందరికీ న్యాయం జరిగే వరకు వైఎస్సార్ సీపీ అండగా ఉండి పోరాడుతుందని ఖాదర్ వారికి హామీ ఇచ్చారు. -
కట్నం కోసం తగులబెట్టేందుకు యత్నం
► తప్పించుకున్న వివాహిత ► వడ్డినకొప్ప గ్రామంలో ఘటన శివమొగ్గ : కుమార్తెతో సమానంగా చూడాల్సిన కోడలిని అత్త, మామ, అడపడచు రాచి రంపాన పెట్టారు. అదనపు కట్నం కోసం కోడలిపై కిరోసిన్ పోసి తగులబెట్టేందుకు యత్నించారు. అయితే బాధితురాలు వారి నుంచి తప్పించుకొని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన శివమొగ్గ పొలిసు స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగు చూసింది. శిరసి ప్రాంతానికి చెందిన ప్రియకు మూడు సంవత్సరాల క్రితం శివమొగ్గ నగరం సమీపంలోని వడ్డినకొప్ప గ్రామానికి చెందిన మంజునాథ్‌తో వివాహమైంది. ఈ సమయంలో భారీగా కట్నకానుకలు సమర్పించారు. రెండు నెలలు వీరి కాపురం సజావుగా సాగింది. తర్వాల కట్న వేధింపులు మొదలయ్యాయి. అదనంగా రూ. 25 లక్షలు తీసుకురావాలని మంజునాథ్ తల్లి నీలమ్మ, తండ్రి తిమ్మణ్ణ, వారి కుమార్తె కలిసి ప్రియను రాచి రంపాన పెట్టడంతోపాటు ఓ దశలో చేయి కూడా చేసుకునేవారు. ఈక్రమంలో వారం రోజుల క్రితం మరోమారు వేధింపులకు పాల్పడ్డారు. తాము చెప్పిన మొత్తం తీసుకురాకపోతే చంపివేస్తామని బెదిరించారు. దీనికితోడు తెల్ల కాగితంపై సంతకం చేయించాలని కత్తులతో సైతం బెదిరించారు. అయినప్పటికీ సంతకం పెట్టలేదు. దీంతో అత్తమామలు ప్రియను బంధించి వంటిపై కిరోసిన్ పోశారు. నిప్పు పెట్టేందుకు యత్నించగా ప్రియ తప్పించుకొని ఇంటి బయటకు వచ్చింది. స్థానికులు గమనించి ఆమెను ఆస్పత్రికి తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు శివమొగ్గ ఎస్పీ గ్రామాన్ని సందర్శించి వివరాలు సేకరించారు. పరారీలో ఉన్న అత్త, మామ, అడపడచు కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. -
డీలర్లే అక్రమార్కులు..!
► దారితప్పిన రేషన్ వ్యవస్థ ► నల్లబజారుకు నీలి కిరోసిన్ ► రేషన్ బియ్యమూ పక్కదారి ► కార్డుదారులకిచ్చేది అరకొరే ► 50 మందిపై కేసులు నమోదు సాక్షి, మంచిర్యాల : జిల్లాలో రేషన్ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది. నిరుపేదలకు నిత్యావసర సరుకులు వినియోగదారులకు సక్రమంగా అందడం లేదు. అనేక ప్రాంతాల్లో డీలర్లు వినియోగదారుల పేరిట కోటా విడుదలైనా.. ఆ సరుకు ఇవ్వకుండా కోత విధిస్తున్నారు. వాటిని బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నారు. ఎంతోమంది డీలర్లు షాపుల్లో స్టాక్ పట్టికను నిర్వహించడం లేదు. అసలు రికార్డులు నిర్వహించని, సకాలంలో షాపులు తెరవని వాళ్లూ జిల్లాలో ఎంతోమంది ఉన్నారు. జిల్లా పౌరసరఫరాల శాఖాధికారులు ప్రతి నెల నిర్వహించే సాధారణ తనిఖీల్లో కనీసం 10 నుంచి 20 మధ్యలో డీలర్లు పట్టుబడుతూనే ఉన్నారు. వారికి ప్రతి నెల రెవెన్యూ డివిజనల్ అధికారులు రూ.7 వేలలోపు జరిమానా విధిస్తూ వదిలి పెడుతున్నారు. ఎన్ని జరిమానాలు విధించినా డీలర్ల తీరులో మార్పు రావడం లేదు. ఏడాది కాలంలో విజిలెన్స్, పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించి భారీ మొత్తంలో అక్రమాలకు పాల్పడిన 50 మంది డీలర్లపై కేసులూ నమోదు చేశారు. వారి డీలర్ షిప్ రద్దు చేశారు. రికార్డులు, స్టాక్‌కు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని గుర్తించిన అధికారులు 1067 క్వింటాళ్ల బియ్యం, 8376 నీలి కిరోసిన్, 200క్వింటాళ్ల గోధుమలు, 30 క్వింటాళ్ల కందిపప్పు, 34 క్వింటాళ్ల చక్కెరస్వాధీనం చేసుకున్నారు. అయినా.. క్షేత్రస్థాయిలో డీలర్లలో మార్పు రావడం లేదు. నిరుపేదలకు పంపిణీ చేయాల్సిన నీలి కిరోసిన్ నల్లబజారుకు తరలిస్తూనే ఉన్నారు. రేషన్ బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్నారు. ప్రతి నెలాఖరు వరకు కార్డుదారులందరికీ నిత్యావసర వస్తువులు ఇవ్వాలనే నిబంధనలున్నా.. నెలకు ఐదు రోజులకు మించి రేషన్‌షాపులు తెరవడం లేదనే విమర్శలున్నాయి. మరోపక్క.. ఆ ప్రాంత ప్రజల పరిస్థితులను బట్టి ప్రతి రోజు నాలుగు గంటలు రేషన్ షాపులు తెరిచి ఉంచాల్సి ఉండగా.. కొందరు రోజుకు రెండు గంటలు మాత్రమే షాపులు తె రిచి తర్వాత మూసేస్తున్నారు. దీంతో కార్డుదారులు సరుకుల కోసం రేషన్ షాపులే కాదు.. డీలర్ల ఇళ్ల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి దాపురించింది. క్షేత్రస్థాయిలో రేషన్ షాపులను పర్యవేక్షించాల్సిన పలువురు డీటీ(ఎన్ఫోర్స్మెంట్)ల పనితీరుపైనా విమర్శలొస్తున్నాయి. పలువురు డీటీల అండదండలతో డీలర్లు అక్రమాలకు తెరలేపారు. ముఖ్యంగా మంచిర్యాల పరిధిలో పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. తూర్పు ప్రాంతానికి కేంద్రంగా ఉండడం.. రవాణా వ్యవస్థకు అనుకూలంగా ఉండడంతో పరిసర ప్రాంతాలకు చెందిన డీలర్లు నిత్యావసర వస్తువుల్ని ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నట్లు సమాచారం. ఒకప్పుడు మంచిర్యాల కేంద్రంగా రేషన్ బియ్యం, గోధుమలను ఇతర ప్రాంతాలకు తరలించి బడా వ్యాపారవేత్తలుగా ఎదిగిన వారి మిల్లులు, గోదాములపై మంచిర్యాల ఏఎస్పీ విజయ్‌కుమార్ గతంలో దాడులు నిర్వహించి కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ అక్రమార్కులు సెలైంట్‌గా ఉండడంతో.. తూర్పు ప్రాంత పరిధిలో ఉన్న డీలర్లు ఈ అక్రమ దందాకు తెరలేపినట్లు తెలిసింది. రెండ్రోజులకోసారి జిల్లాలో ఏదో చోట అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం, ఇతర నిత్యావసర వస్తువులు పట్టుబడుతునే ఉన్నాయి. జిల్లాలో 7.38 లక్షల కార్డులు జిల్లాలో 7.38 లక్షల పైచిలుకు ఆహార భద్రత కార్డులున్నాయి. 23లక్షల మందికి రేషన్ సరుకులు అందుతున్నాయి. 1443 రేషన్ షాపుల ద్వారా కార్డుదారులకు నిత్యావసర వస్తువులు పంపిణీ అవుతున్నాయి. కుటుంబంలో ఎంత మంది ఉంటే అంతమందికి 6 కిలోల చొప్పున బియ్యం, ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్ లేని వారికి 2 లీటర్ల కిరోసిన్, గ్యాస్ ఉన్న వారికి లీటర్ కిరోసిన్ ఇవ్వాల్సి ఉంది. కార్డుదారుల్లో సుమారు 3లక్షల మంది ప్రతి నెలా నిత్యావసర సరుకులు రేషన్ షాపుల నుంచి తీసుకోరు. వందలాది మెట్రిక్ టన్నుల బియ్యం, వేలాది లీటర్ల కిరోసిన్ ప్రతి నెలా మిగిలిపోతోంది. దీంతో రేషన్డీలర్లే ఆ బియ్యం, కిరోసిన్‌ను బ్లాక్‌మార్కెట్‌కు తరలిస్తూ లక్షలాది రూపాయలు సంపాదిస్తున్నారు. పలు చోట్ల నిత్యావసర వస్తువుల కోసం షాపులకు వెళ్లిన వినియోగదారులకు అన్ని సరుకులు కాకుండా ఒకటి, రెండు రకాలు మాత్రమే ఇచ్చి పై నుంచి ఇంకా కోటా రాలేదంటూ డీల ర్లు తిరిగి పంపుతున్నారు. దీంతో ఇచ్చిన సరుకులే చాలంటూ.. వినియోగదారులు ఇచ్చిందే తీసుకుని వెనుదిరుగుతున్నారు. మరోపక్క జిల్లాలో మూడొందలకు పైగా రేషన్ దుకాణాలు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల బంధువులకు ఉన్నాయి. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల బంధువులకు షాపులు మంజూరు చేయొచ్చనే నిబంధన ఉండడంతో దాన్ని సాకు గా చేసుకుని కొందరు నేతలు తమ పలుకుబడితో బంధువులకు రేషన్ షాపులు ఇప్పించుకున్నారు. బినామీ పేరిట షాపులు నిర్వహిస్తూ.. నిత్యావసర సరుకులు పక్కదారి పట్టిస్తున్నారు. దీంతో ప్రజలూ సదరు డీలర్లపై ఫిర్యాదు చే సేం దుకు వెనకడుగు వేస్తున్నారు. ఈ విషయంలో ఉన్నతాధికారులు స్పందించి నిబంధనల మేరకు షాపులు నిర్వహించని డీలర్లపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది. కఠినంగా వ్యవహరిస్తాం రేషన్ డీలర్లంద రూ సమయపాలన పాటించడంతోపాటు కార్డుదారులందరికీ ప్రతి నెల విధిగా నిత్యావసర సరుకులు ఇవ్వాలి. కార్డుదారులందరికీ సరుకులందేలా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ప్రతి నెల సాధారణ తనిఖీలు చేపడుతున్నాం. రెగ్యులర్ యాక్టివిటీస్, బోర్డుపై స్టాక్ వివరాలు, సమయపాలన పాటించని వారికి జరిమానాలు విధిస్తున్నాం. సరుకులు పక్కదారి పట్టిస్తున్న వారిపై కేసులు నమోదు చేస్తున్నాం. - ఉదయ్‌కుమార్, జిల్లా పౌరసరఫరాల శాఖాధికారి -
రేషన్‌డీలర్లపై విజి‘లెన్స్’
► హైదరాబాద్‌లో పట్టుబడిన కిరోసిన్ ట్యాంకర్ ► కూపి లాగిన అధికారులు ► పంపిణీ చేయకుండానే చేసినట్లు రికార్డులు ► 11 మందిని విచారించిన అధికారులు గట్టు : మండలంలోని రేషన్ డీలర్లపై విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టారు. తీగ లాగితే డొంక కదలినట్లు హైదరాబాదులో రెండు రోజుల క్రితం పట్టుబడిన కిరోసిన్ వ్యవహారంపై గురువారం రాష్ట్ర విజిలెన్స్ అధికారులు గట్టులో విచారణ నిర్వహించారు. రాష్ట్ర విజిలెన్స్ అడిషనల్ ఎస్పీ వెంకటేశ్వరరావు ఆదేశాల మేరకు ఇన్స్పెక్టర్ శ్రీధర్, నారాయణపేట ఎన్ఫోర్స్మెంట్ ఏఎస్ఓ వనజాక్షి, గద్వాల ఏఎస్ఓ ఓం ప్రకాష్ గట్టు తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు. డిప్యూటీ తహసీల్దార్ ఎల్లయ్య సమక్షంలో 11 మంది రేషన్ డీలర్లను విచారించారు. వివరాల్లోకి వెళితే.. రేషన్ షాపుల ద్వారా రాయితీపై అందజేసే కిరోషన్ను సరఫరా చేయకుండానే చేసినట్లుగా రికార్డుల్లో నమోదు చేశారు. మండలంలోని ఆరగిద్ద-2, చింతలకుంట-2, తుమ్మలచెరువు, రాయాపురం, కుచినేర్ల, యర్సన్‌దొడ్డి,యల్లందొడ్డి, మల్లాపురం, మల్లాపురంతండాల్లో 11 రేషన్ దుకాణాలకు మొత్తం 9199 లీటర్లను సరఫరా చేసినట్లు రికార్డులను సృష్టించినట్లు వారి దృష్టికి వచ్చింది. హైదరాబాదులో విజిలెన్స్ అధికారులు పట్టుకున్న కిరోసిన్ ట్యాంకర్ వ్యవహరంపై కూపి లాగగా గట్టు, మల్దకల్ మండలాలకు చెందిన రేషన్ షాపులకు సరఫరా చేసే కిరోసిన్‌గా గుర్తించినట్లు సమాచారం. 11 రేషన్ షాపులకు కిరోసిన్ సరఫరా చేసినట్లు రికార్డులో నమోదు చేసినట్లు విజిలెన్స అధికారులు గుర్తించారు. అయితే 11 మంది రేషన్ డీలర్లను స్థానిక తహసీల్దార్ కార్యాలయానికి పిలిపించి విచారణ చేశారు. ఆయా షాపులకు పంపిణీ చేసిన సరుకుల వివరాల రికార్డులను పరిశీలించారు. ఏప్రిల్ నెల కోటా కిరోసిన్‌ను రేషన్ దుకాణాలకు సరఫరా చేయలేదని సదరు డీలర్లు అధికారులకు తెలియజేశారు. వీటిపై పూర్తి విచారణ కొనసాగుతుందని, పూర్తి నివేదిక ఉన్నతాధికారులకు అందజేయనున్నట్లు ఇన్స్సెక్టర్ శ్రీధర్ సాక్షికి తెలిపారు. 32వేల లీటర్ల కిరోసిన్ దుర్వినియోగం గద్వాల : నియోజకవర్గంలోని పలు మండలాల్లో మొత్తం 32వేల లీటర్ల కిరోసిన్ దుర్వినియోగం అయినట్లు విజిలెన్స అధికారులు ధ్రువీకరించారు. గురువారం గద్వాలలో వారు విలేకరులతో మాట్లాడారు. నియోజకవర్గంలోని పలు మండలాల్లో విజిలెన్స అధికారులు దాడులు నిర్వహించినట్లు తెలిపారు. 20 వేల లీటర్ల కిరోసిన్ సరఫరా చేసినట్లు బోగస్ రికార్డులు సృష్టించినట్లు తెలిపారు. మిగతా 12వేల లీటర్ల కిరోసిన్ స్టాక్ ఉన్నట్లు రికార్డులు సృష్టించారని తెలిపారు. స్టాక్ ఎక్కడ ఉందో తెలిజేయడం లేదన్నారు. సమావేశంలో విజిలెన్స సీఐ శ్రీధర్ భూపాల్, అధికారులు రాజేష్ చైతన్య, ఖురేష్ ఉన్నారు. మల్దకల్లో.. మండలంలోని పలు గ్రామాల్లో విజిలెన్స అధికారులు దాడులు చేశారు. పెద్దపల్లి, బిజ్వారం, ఉలిగేపల్లి, మేకలసోంపల్లి, సద్దలోనిపల్లి, అడవిరావుల్చెర్వు, నేతువానిపల్లి, మద్దెలబండ, తాటికుంట, కుర్తిరావుల్‌చెర్వు, నాగర్‌దొడ్డి, విఠలాపురం గ్రామాలలోని రేషన్ షాపులను తనిఖీ చేశారు. రేషన్ డీలర్లకు పంపిణీ చేసిన కిరోసిన్ బిల్లులను పరిశీలించారు. 14మంది డీలర్లకు కిరోసిన్ పంపిణీ చేయకుండానే హోల్‌సేల్ డీలర్ బిల్లులు పంపిణీ చేసినట్లు విచారణలో బయటపడినట్లు అధికారులు తెలి పారు. దాడుల్లో విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు రాజేష్, సురేష్, రేవతిలతోపాటు రెవెన్యూ సిబ్బంది తదితరులు ఉన్నారు. -
రేషన్ బియ్యం పట్టివేత
మల్లాపూర్: మల్లాపూర్ మండలం సాతారం, చిట్టాపూర్ శివార్లలో గురువారం ఉదయం రేషన్ దుకాణాల నుంచి అక్రమంగా తరలిస్తున్న బియ్యం, గోధుమలు, కిరోసిన్‌ను ఎస్సై షేక్ జానీపాషా నేతృత్వంలో పోలీసు సిబ్బంది దాడులు చేసి పట్టుకున్నారు. రాయికల్ మండలం ఇటీక్యాలకు చెందిన డీలర్ నారాయణ దుకాణం నుంచి మెట్‌పల్లికి చెందిన లింబాద్రి నాలుగు క్వింటాళ్ల బియ్యం, 16 క్వింటాళ్ల గోధుమలు కొనుగోలు చేసి తరలిస్తుండగా స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. మరో ఘటనలో గొర్రెపల్లి నుంచి మెట్‌పల్లికి చెందిన శేఖర్ అనేవ్యక్తి 200 లీటర్ల కిరోసిన్ తరలిస్తుండగా చిట్టాపూర్ శివారులో స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఆరుగురిపై కేసు నమోదు చేశామని, సరకులతో పాటు నలుగురిని అదుపులోకి తీసుకున్నామని ఎస్సై తెలిపారు. కిరోసిన్ ట్యాంకర్ సీజ్ జగిత్యాల అర్బన్: అదనంగా కిరోసిన్‌ను తరలించిన పౌరసరఫరాల శాఖ ట్యాంకర్‌ను అధికారులు సీజ్‌చేశారు. గురువారం పట్టణంలోని వేంకటేశ్వర ఆటో సర్వీస్ హోల్‌సేల్ కిరోసిన్ డీలర్ దుకాణం వద్దకు కిరోసిన్ పోసేందుకు వచ్చిన ట్యాంకర్లో ఉండాల్సిన 10,048 లీటర్ల కన్నా 3,591 లీటర్లు అదనంగా ఉండడంతో దాడిచేసి అధికారులు ట్యాంకర్‌తోపాటు కిరోసిన్‌ను సీజ్ చేశారు. దాడుల్లో ఏజీపీవో కాశీవిశ్వనాథం, డిప్యూటీ తహశీల్దార్ అంజయ్య, కిరణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. రెండు రేషన్ దుకాణాలపై 6ఏ కేసు బోయినపల్లి: మండలంలోని అనంతపెల్లి, బూర్గుపెల్లి గ్రామాల్లో రేషన్ దుకాణాల నిర్వాహకులపై 6ఏ కేసు నమోదు చేసినట్లు కరీంనగర్ డివిజన్ ఏఎస్వో కె. శ్రీనివాస్ గురువారం తెలిపారు. సివిల్ సప్లై అధికారులు రేషన్ దుకాణాల్లో జరిపిన తనిఖీల్లో నిర్వాహకులు సుమారు వంద లీటర్ల కిరోసిన్ తక్కువగా తీసుకుని ట్యాంకర్ వారికే అమ్మినట్లు తేలడంతో కేసులు నమోదు చేశామన్నారు. -
ప్రేమ వేధింపులకు యువతి బలి
♦ ప్రేమించలేదని కిరోసిన్ పోసి ♦ నిప్పుపెట్టిన యువకులు! ♦ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బాధితురాలి మృతి ఏలూరు అర్బన్: ప్రేమ వేధింపులకు ఓ యువతి బలైన సంఘటన శనివారం పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు మండలం చాటపర్రులో చోటుచేసుకుంది. ప్రేమించలేదని తమ కుమార్తెపై ఇద్దరు యువకులు కిరోసిన్ పోసి నిప్పు పెట్టారంటూ మృతురాలి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. పైడాల సత్యనారాయణ, వెంకటేశ్వరమ్మ దంపతులు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరి కుమార్తె ఇందుమతి(18) ఇంటర్ చ దువుతోంది. అదే గ్రామంలోని కూలిపనులు చేసుకునే దగ్గుమిల్లి చినవిక్కీ అనే యువకుడు ప్రేమిస్తున్నానంటూ ఆమె వెంటపడేవాడు. అతడికి తోడుగా సోదరుడు పెదవిక్కీ, గ్రామంలోనివారి స్నేహితులు నిత్యం వేధించేవారు. విషయం తెలిసి ఇందుమతి తల్లిదండ్రులు ఆమెను చదువు మాన్పించి ఇంటివద్దనే ఉంచుతున్నారు. మూడు రోజుల కిందట తమ ఇంటి దగ్గర బైక్‌పై తిరుగుతున్న చినవిక్కీని గమనించిన ఇందుమతి తండ్రి సత్యనారాయణ అతణ్ని మందలించాడు. ఈ విషయాన్ని చినవిక్కీ అన్న పెదవిక్కీ సీరియస్‌గా తీసుకున్నాడు. తన స్నేహితుల సహకారంతో ఇందుమతి ఉంటున్న వీధిలోని లైట్లు వెలగకుండా ఫీజులు పీకేశాడు. దీంతో ఇందుమతి తల్లిదండ్రులు శనివారం ఉదయం రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన ఎస్సై ఎన్ఆర్ కిషోర్‌బాబు నిందితులు చినవిక్కీ, పెదవిక్కీలను తమకు అప్పగించాలని వారి కుటుంబ సభ్యులకు కబురు పంపారు. దీంతో నిందితుల తరపున కొందరు పెద్దలు పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. ఈ సమస్యను గ్రామంలో పరిష్కరించుకుంటామని చెప్పారు. ఈ క్రమంలో శనివారం మధ్యాహ్నం ఇంట్లో నుంచి ఇందుమతి కేకలు వినిపించడంతో స్థానికులు వెళ్లి మంటల్లో కాలిపోతున్న ఆమెను రక్షించడానికి ప్రయత్నించారు. తీవ్రగాయాలైన బాధితురాలిని ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ ఆమె చికిత్స పొందుతూ మరణించింది. కాగా, శనివారం రాత్రి పొద్దుపోయాక పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. హత్యకాదు.. ఆత్మహత్య: జిల్లా ఎస్పీ ఇందుమతి మృతి ఘటనలో శనివారం రాత్రి పొద్దుపోయాక పోలీసుల తీరు మారింది. జిల్లా ఎస్పీ భాస్కర్ భూషణ్ ఇందుమతి హత్యకు గురైనట్లు తొలుత భావించినప్పటికీ.. పరిస్థితులను గమనించి, అన్ని కోణాల్లో విచారణ చేసిన తరువాత ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని తేలిందన్నారు. నిందితులు ఆమెను ఆత్మహత్యకు ప్రేరేపించినట్లుగా గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. -
ప్రియుడితో పెళ్లి చేయాలని ప్రియురాలి ఆత్మహత్యాయత్నం
► ఉదయం కుందుర్పి పోలీసుస్టేషన్ వద్ద ► కిరోసిన్ డబ్బాతో నిరసన ► సీఐ కార్యాలయం వద్ద కిరోసిన్ పోసుకుని ► ఆత్మహత్యాయత్నం కళ్యాణదుర్గం: ప్రేమించిన యువకుడితోనే పెళ్లి చేయాలంటూ ప్రియురాలు ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన కళ్యాణదుర్గం పోలీస్ సర్కిల్ కార్యాలయ ఆవరణలో గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. కుందుర్పి మండలం బెస్తరపల్లికి చెందిన సుమలత అదే గ్రామానికి చెందిన బంధువు దేవరాజ్ రెండేళ్లుగా ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. వారం రోజుల క్రితం ఇరు కుటుంబాల మధ్య జరిగిన ఘర్షణతో ప్రియుడు దేవరాజు ఆమెకు దూరమయ్యాడు. పెళ్లి జరగకుండా దేవరాజ్ కుటుంబసభ్యులు ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని బాధిత యువతి సుమలత ఫిబ్రవరి 2న కుందుర్పి పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసింది. పెళ్లి చేసుకోకుండా మోసం చేస్తూ, తనతో ఎలాంటి సంబంధాలు లేవని తప్పించుకునే యత్నం చేస్తున్నాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. దేవరాజ్ తండ్రి వెంకటరమణప్ప, తల్లి పుట్టమ్మ, పుట్టమ్మ చెల్లెలు అనితమ్మ పెళ్లి జరగకుండా చేస్తున్నారని గురువారం బాధితురాలు తన తల్లి గంగరత్నమ్మతో కలిసి మరోసారి కుందుర్పి పోలీసులను ఆశ్రయించారు. కిరోసిన్ డబ్బా వెంట పెట్టుకుని దేవరాజ్‌తో పెళ్లి జరగకుంటే చనిపోతానంటూ హెచ్చరించింది. ఎస్హెచ్ఓ ఓబుళపతి ఫిర్యాదు ఆధారంగా ఐపీసీ 417, 420, 506 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. దీంతో సంతృప్తి చెందని సుమలత, తల్లి గంగరత్నమ్మతో కలిసి కళ్యాణదుర్గం సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు. ప్రియుడితో పెళ్లి చేయాలని, లేదంటే చనిపోతానని ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. అక్కడున్న వారు కిరోసిన్ డబ్బా లాక్కుని వారించారు. డీఎస్పీ అనిల్, సీఐ మన్సూరుద్దీన్, టౌన్ ఎస్ఐ శంకర్‌రెడ్డిలు సుమలత తీరుపై మండిపడ్డారు. పోలీసులను బ్లాక్మెయిల్ చేసేలా ప్రయత్నించడం మంచిది కాదని వారించారు. న్యాయం కోసం ప్రయత్నించాలి తప్ప ఇలాంటి సంఘటనలకు పాల్పడటం మంచిది కాదని మందలించారు. అనంతరం సుమలత, దేవరాజుల ప్రేమ వ్యవహారంపై విడివిడిగా విచారించారు. సుమలతకు న్యాయం జరిగేలా ప్రయత్నిస్తామని తాము అన్యాయం చేసిన వారిపై కేసు నమోదు చేయడం బాధ్యతగా తీసుకుంటామని, ఇరువురీ అంగీకారం లేనిది పెళ్లి చేసే అధికారం పోలీసులకు లేదని డీఎస్పీ తెలిపారు. అక్కడే ఉన్న కుందుర్పి జెడ్పీటీసీ మల్లికార్జునతో చర్చించి సమస్య పరిష్కారానికి చొరవ చూపాలని డీఎస్పీ సూచించారు. -
ఇష్టంలేని పెళ్లి:యువతి ఆత్మహత్యాయత్నం
గుడిమల్కాపూర్(హన్వాడ) : తనకు ఇష్టంలేని పెళ్లి చేస్తున్నారంటూ ఓయువతి కిరోసిన్ పోసుకు ని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ సంఘటన గురువారం గుడిమల్కాపూర్‌లో చోటుచేసుకుంది. ఈసంఘటనకు సంబంధించి గ్రామస్తులు తెలిపిన వివరాలు... గ్రామానికి చెందిన భీమయ్య, దేవమ్మ కూతురు చెన్నమ్మకు ఈనెల 13న రంగారెడ్డిజిల్లా గండ్వీడ్ మండలం కొమిరెడ్డిపల్లికి చెందిన ఓ యువకుడితో వివాహం నిశ్చయమైంది. కానీ చెన్నమ్మకు పెళ్లికొడుకు నచ్చలేదు. తనకు ఈపెళ్లి వద్దని పెళ్లి ఏర్పాట్లలో నిమగ్నమైన ఆమె తల్లిదండ్రుల వద్ద చెప్పింది. అయినా వారు పట్టించుకోకుండా పెళ్లి చేసేందుకు సిద్ధమవడంతో మనస్తాపానికి గురైంది. గురువారం తెల్లవారుజామున ఇంట్లోనే కిరోసిన్ పోసుకుని ఒంటికి నిప్పంటించుకుంది. కాసేపటికే గమనించిన కుటుంబీకులు వెంటనే చెన్నమ్మను 108లో జిల్లాసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. జరిగిన సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ లక్ష్మయ్య తెలిపారు. -
నిప్పంటించి.. కళ్లలో కారం చల్లి..
యాలాల: నిద్రిస్తున్న భర్తపై కిరోసిన్ పోసి నిప్పంటించడమే కాకుండా మంటలకు తాళలేక కేకలు పెడుతున్న అతడి కళ్లలో కారం చల్లి మరీ తన కర్కశాన్ని ప్రదర్శించిందో భార్య. తీవ్రంగా గాయపడిన అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా యాలాల మండలం అక్కంపల్లిలో బుధవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. మహబూబ్‌నగర్ జిల్లా హస్నాబాద్‌కు చెందిన ఉద్దెరి రాములు(50) అక్కం పల్లికి చెందిన సావిత్రమ్మను వివాహమాడి ఇల్లరికం వచ్చాడు. వీరికి వెంకటయ్య, ఆంజనేయులు, విజయలక్ష్మి, రాధ, వెంకటలక్ష్మి సంతానం. దంపతుల మధ్య నిత్యం గొడవలు జరిగేవి. ఈ క్రమంలో బుధవారం సాయంత్రం వరకు పొలం పని చేసి రాములు ఇంటికొచ్చాడు. అయితే, కుమారుడు ఆంజ నేయులు కనపడడంతో ఖాళీగా కూర్చొనే బదులు పశువులను పాకలో కట్టేయవచ్చు కదా అంటూ అతడిపై మండి పడ్డాడు. దీంతో ఆగ్రహానికి గురైన సావిత్రమ్మ.. భర్తతో గొడవకు దిగింది. ఇరుగుపొరుగువారు కల్పిం చుకుని ఇద్దరినీ సముదాయించారు. రాత్రి ఏమీ తినకుం డానే ఇంటిముందు ఉన్న కట్టపై రాములు నిద్రకు ఉపక్రమించాడు. సుమారు 11 గంటల ప్రాంతంలో కట్టపై నిద్రిస్తున్న రాములుపై భార్య కిరోసిన్ పోసి నిప్పంటించింది. మంటలకు తాళలేక కేకలు వేస్తున్న భర్త కళ్లలో కారం చల్లడంతో అటు మంటల బాధ, ఇటు కారం మంటతో రాములు ఇంటి బయట ఉన్న మురుగు కాల్వలోకి తలను దూర్చిస్పృహ కోల్పోయాడు. రాములు కేకలు విన్న ఇరుగుపొరుగు అతడిని ఆటోలో తాండూరు జిల్లా ఆస్పత్రికి తరలిం చారు. సావిత్రమ్మ మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా చిన్న కొడుకు ఆంజనేయులతో కలసి ఇంట్లోకి వెళ్లి గడియ పెట్టుకుంది. వాంగ్మూలం తీసుకున్న పోలీసులు విషయం తెలిసిన వెంటనే రూరల్ సీఐ సైదిరెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ షౌకత్ అలీ, ఎస్ఐ అరుణ్‌కుమార్ తాండూరు ఆస్పత్రికి చేరుకుని రాములు నుంచి వాంగ్మూలం సేకరించారు. తన మృతికి సావిత్రే కారణమని రాములు పేర్కొన్నాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రాములు తెల్లవారుజామున చనిపోయాడు. నిందితురాలిని పోలీసులు అదుపులోకి తీసుకుని యాలాల పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. -
‘ఉదండాపూర్’ ప్రాజెక్టు మాకొద్దు..!
రిజర్వాయర్ సర్వే పనులను అడ్డుకున్న గ్రామస్తులు జడ్చర్ల: పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలంలో నిర్మించనున్న ఉదండాపూర్ రిజర్వాయర్ పనులను స్థానిక రైతులు, గ్రామస్తులు అడ్డుకున్నారు. శనివారం సర్వే చేయడానికి వచ్చిన సిబ్బంది నుంచి వల్లూరు, ఉదండాపూర్, సమీప గిరిజన తండాల ప్రజలు సామగ్రిని లాక్కొని వెనక్కి వెళ్లాల్సిందిగా డిమాండ్ చేశారు. ఊరు, భూమి లేకుండా చేసే రిజర్వాయర్ తమకు అక్కర్లేదన్నారు. ‘చివరికి కట్టెలు అమ్ముకుని బతుకుతాం గానీ భూములను, ఊరిని వదిలేది లేదని’ స్పష్టం చేశారు. ఇంతలో ఓ మహిళ ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకునేందుకు యత్నించింది. అక్కడే ఉన్న కొందరు ఆమెను వారించారు. సర్వే సిబ్బంది వాహ నం ఎదుట గొంతుకు ఉరి బిగించుకుని మహిళలు, ప్రజాప్రతినిధులు నిరసన వ్యక్తం చేశారు. గతంలో ఉన్న డిజైన్‌కు అనుగుణంగా తమ భూములకు, ఊళ్లకు,తండాలకు ఇబ్బం లేకుండా ఏడు టీఎంసీల రిజర్వాయర్‌ను నిర్మిస్తే తమకు అభ్యంతరం లేదన్నారు. కానీ ఏకంగా 15-17 టీఎంసీల భారీ రిజార్వాయర్ నిర్మించడానికి తాము వ్యతిరేకమన్నారు. పరిహారంపై స్పష్టమైన హామీలు ఇవ్వకుండా భూములు లాక్కొనాలని చూస్తే ఆత్మహత్యలు చేసుకుంటామన్నారు. విషయం తెలుసుకున్న అధికారులు ఘటనా స్థలానికి వెళ్లి ప్రజలకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి ఈ ఘటనపై ఆరాతీశారు. స్థానిక ప్రజా ప్రతినిధులతో మంత్రి ఫోన్లో మాట్లాడి, సర్వేకు అడ్డుతగల వద్దని, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పడంతో ఆందోళన విరమించారు. -
భర్తను కాపాడబోయి మంటల్లో చిక్కుకున్న భార్య
గుత్తి (అనంతపురం) : అతిగా మద్యం తాగిన భర్త ఒంటిపై కిరోసిన్ పొసుకుని నిప్పంటించుకున్నాడు. ఇది గుర్తించిన భార్య అతన్ని కాపాడటానికి ప్రయత్నించి మంటల్లో చిక్కుకుంది. గమనించిన స్థానికులు వారిని ఆస్పత్రికి తరలించగా.. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ఈ సంఘటన అనంతపురం జిల్లా గుత్తి మండల కేంద్రంలో ఆదివారం చోటుచేసుకుంది. నెల్లూరుకు చెందిన మునికృష్ణ(32) ,గౌరి(28) భార్యాభర్తలు. కొన్నేళ్ల కిందట గుత్తికి వచ్చి స్థిరపడ్డారు. మునికృష్ణ ప్రైవేట్ ట్రావెల్స్‌లో డ్రైవర్‌గా పని చేస్తూ.. మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. కాగా ఆదివారం మద్యం సేవించిన మునికృష్ణ స్నేహితులను వెంటపెట్టుకొని ఇంటికి వచ్చి మళ్లీ మద్యం తాగుతున్నాడు. ఇది చూసిన గౌరి అతని మీద కేకలు వేసింది. దీంతో కోపోద్రిక్తుడైన మునికృష్ణ ఇంట్లో ఉన్న కిరోసిన్‌ను ఒంటిపై పోసుకుని నిప్పంటించుకున్నాడు. ఇది చూసిన స్నేహితులు పారిపోగా.. భార్య అతన్ని కాపాడటానికి ప్రయత్నించి మంటల్లో చిక్కుకుంది. ఇది గమనించిన స్థానికులు మంటలు ఆర్పి వారిని ఆస్పత్రికి తరలించారు. కాగా.. దాదాపు 80 శాతం శరీరాలు కాలిపోయాయని వైద్యులు తెలిపారు. -
4,500 లీటర్ల నీలి కిరోసిన్ స్వాధీనం
గుంతకల్లు: అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలో మంగళవారం చౌక ధరల దుకాణాలకు సరఫరా చేసే కిరోసిన్ భారీగా పట్టుబడింది. స్థానిక ఆలూరు రోడ్డులోని హిందూ శ్మశానం పక్కన ఉన్న ఖాళీ స్థలంలో పీపాల్లో ఉంచిన సుమారు 4,500 లీటర్ల నీలి కిరోసిన్ ను నిల్వ ఉంచారు. సమాచారం అందుకున్న విజిలెన్స్ అధికారులు కిరోసిన్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. -
మనస్తాపంతో మహిళ ఆత్మహత్య
నల్లగొండ జిల్లా హాలియా మండలం రంగుంట్ల గ్రామంలో ఓ మహిళ ఆదివారం ఆత్మహత్య చేసుకుంది. గ్రామస్థుల కథనం ప్రకారం.. డొంకల ముత్యాలమ్మ (55)కు ఓ కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారందరికీ వివాహాలు అయ్యాయి. భర్త ఐదేళ్ల క్రితమే మృతి చెందాడు. కాగా, కుటుంబ పోషణ కోసం ముత్యాలమ్మ రూ.3 లక్షల వరకు అప్పులు చేసింది. ఆదాయం లేకపోవడంతో అప్పులు తీర్చే మార్గం కనిపించక మనస్తాపం చెంది ఆదివారం ఇంటి దగ్గరే వంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకోగా, తీవ్ర గాయాలతో మృతి చెందింది. -
కిరోసిన్ కష్టాలు!
అనంతపురం అర్బన్: ప్రజలకు మెరుగైన సేవలందిస్తామంటూ ఆ శాఖ మంత్రి మొదలు అధికారులు చెప్పుకుంటున్నా పౌరసరఫరాల శాఖలో వాస్తవ పరిస్థితులు తద్భిన్నంగా ఉన్నాయి. గత మూడు నెలలుగా నిత్యావసరాల పంపిణీలో అడుగడుగునా లోపాలు కనిపిస్తున్నాయి. కిందిబేడలు విషయంలో ప్రభుత్వ వైఫల్యం ఉంటే... కిరోసిన్ విషయంలో అధికారులు పర్యవేక్షణ లోపం... హోల్‌సేలర్ తప్పిదం స్పష్టంగా కనిపిస్తోంది. వివరాల్లోకి వెళితే... ఈ నెల కోటా కిరోసిన్‌ని కొన్ని రేషన్ దుకాణాలు, హాకర్లకు సరఫరానే కాలేదు. జిల్లా వ్యాప్తంగా 43 వేల లీటర్లు ఉంటుందని డీలర్లు చెబుతున్నారు. అనంతపురం నగరంలోని దాదాపు 45 మంది డీలర్లు, హాకర్లకు 19 వేల లీటర్లు సరఫరా కాలేదంటున్నారు. కొన్ని చౌక ధర దుకాణాల డీలర్లకు కిరోసిన్ సరఫరా చేయకపోవడం అంటూ ఒక రకంగా ప్రజలను ఇబ్బందికి గురిచేసినట్లే అవుతుంది. డీలర్ల ఫిర్యాదు వరకు మౌనం హోల్‌సేలర్ కిరోసిన్‌ని జిల్లాలోని కొన్ని చౌక ధరల దుకాణాలకు, హాకర్లకు ఈ నెల సరఫరా చేయలేదు. ఈ విషయం అధికారులకు డీలర్లు ఫిర్యాదు చేసేంతవరకు మౌనంగా ఉన్నారు. దీన్ని బట్టి చూస్తే ప్రజా పంపిణీ సక్రమంగా జరుగుతుందా లేదా అనేదానిపై అధికారుల పర్యవేక్షణ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. నిజంగా పర్యవేక్షణ ఉండి ఉంటే హోల్‌సేలర్ సరఫరా కాలేదన్న విషయం వెంటనే తెలిసి ఉండేది. అలా కాకుండా డీలర్లు పిర్యాదు చేసిన తరువాత అధికారుల్లో కదలిక వచ్చిందంటే ఎంత బాధ్యతారహితంగా ఉన్నారో స్పష్టమవుతోంది. లోగుట్టు వ్యవహారమనే విమర్శలు హోల్‌సేలర్ కిరోసిన్ సరఫరా చేయలేదన్న విషయాన్ని డీలర్లు చెప్పే వరకు అధికారులు పట్టించుకోక పోవడం వెనుక లోగుట్టు వ్యవహారం ఉందనే విమర్శలు వినవస్తున్నాయి. ఈ నెల కోటాలో కొన్ని దుకాణాలకు సరఫరాను ఎగనామం పెడితే అది మిగులుగా ఉంటుంది. ఈ మొత్తాన్ని బ్లాక్‌లో విక్రయించే ఎత్తుగడతో భాగంగానే వ్యవహారం నడిపినట్లు ఆరోపలు వినవస్తున్నాయి. కొందరు డీలర్లకు, హాకర్లకు ఈ నెల కోటాని హోల్‌సేలర్ సరఫరా చేయని విషయం కొందరు అధికారులకు తెలిసే జరిగిందనే విమర్శలు ఉన్నాయి. -
అక్రమంగా తరలిస్తున్న కిరోసిన్ పట్టివేత
ఖమ్మం : ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం రుద్రాక్షపల్లిలో అక్రమంగా తరలిస్తున్న 500 లీటర్ల కిరోసిన్‌ను స్థానికులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం సదరు కిరోసిన్‌ను పోలీసులకు అప్పగించారు. అందుకు సంబంధించి ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని.... పోలీస్ స్టేషన్‌కి తరలించారు. సదరు వ్యక్తిని పోలీసులు విచారిస్తున్నారు. -
సాఫ్ట్ వేర్ ఉద్యోగినిపై కిరోసిన్ పోసి నిప్పు
-
సాఫ్ట్ వేర్ ఉద్యోగినిపై కిరోసిన్ పోసి నిప్పు
హైదరాబాద్: డబీర్‌పురాలో దారుణం చోటుచేసుకుంది. గుర్తుతెలియని నలుగురు వ్యక్తులు ఆదివారం ఉదయం డబిర్ పురాలో ఓ యువతిపై కిరోసిన్ పోసి నిప్పంటించారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు బాధితురాలిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యలు తెలిపారు. డబీర్‌పురా ఏసీపీ కార్యాలయానికి సమీపంలో ఘటన జరిగింది. కాగా బాధితురాలు సాఫ్ట్వేర్ ఇంజనీర్ నయీమాగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఎంతటి వారినైనా వదలం మహిళపై దాడి జరిపిన దుండగులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నామని సౌత్ జోన్ డీసీపీ సత్యనారాయణ అన్నారు. ఘటనపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నామన్నారు. దాడికి పాల్పడ్డ వారు ఎంతటి వారైనా వదలబోమని డీసీపీ సత్యనారాయణ మీడియా సమావేశంలో వెల్లడించారు. -
కట్నం కోసం భార్యకు నిప్పంటించిన ‘ఖాకీ’
మద్దూరు: కట్నం కోసం రక్షకబటుడు కర్కోటకుడిగా మారి భార్యపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. వరంగల్ జిల్లా మద్దూరు మండలం వంగపల్లికి చెందిన చెందిన అనిల్‌కుమార్ హైదరాబాద్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. ఇతనికి నల్లగొండ జిల్లా రాజాపేట మండలం పాముకుంటకు చెందిన జంగ మల్లయ్య కుమార్తె సంపూర్ణతో ఐదు నెలల క్రితం వివాహమైంది. ఆమె ప్రస్తుతం గర్భవతి. పెళ్లి అయిన నాటి నుంచి అత్తింటివారు అదనపు కట్నం కోసం వేధిస్తున్నారు. అనిల్ తన తల్లిదండ్రులు, సోదరి అనితతో కలసి ఆదివారం భార్యపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. -
కిరోసిన్ పోసుకొని వివాహిత ఆత్మహత్యాయత్నం
వనపర్తి (మహబూబ్‌నగర్) : ఇంటి పక్కన ఉన్న వారితో జరిగిన వాగ్వాదంతో మనస్తాపం చెందిన ఓ వివాహిత ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసింది. దీంతో 80 శాతం కాలిన గాయాలతో ప్రస్తుతం స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా వనపర్తిలోని పాతబజార్‌లో శనివారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. పాతబజార్ కాలనీలో నివాసముంటున్న రాణి(38) శనివారం తమ ఇంటి పక్కన ఉన్నవారితో గొడవ పడింది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో మనస్తాపం చెందిన రాణి ఇంట్లోకి వచ్చి ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది. శరీరం పూర్తిగా కాలిపోవడంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. -
గ్యాస్ దారిలోనే కిరోసిన్!
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా వంటగ్యాస్‌కు నగదు బదిలీ పథకాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్న కేంద్రం, పేద, మధ్యతరగతి కుటుంబాలకు రాయితీపై సరఫరా చేస్తున్న కిరోసిన్ విషయంలోకూడా ఇదే విధానాన్ని అనుసరించాలనే యోచనలో ఉంది. కిరోసిన్ సరఫరాలో విచ్చలవిడిగా జరుగుతున్న అక్రమాలను నిరోధించేందుకు నగదు బదిలీనే ఉత్తమ మార్గమని ఇప్పటికే పలు కేంద్ర సంస్థలు తేల్చిచెప్పగా, తాజాగా కేంద్ర వ్యయ నిర్వహణ కమిషన్ సైతం ఇదే విషయాన్ని నొక్కి చెప్పడంతో కేంద్రం ఆ దిశగా ఆలోచన చేసింది. రాష్ట్రాల్లోని ఆయిల్ కంపెనీలను సంప్రదించి, ఆధార్, బ్యాంకు సీడింగ్ వివరాలన్నీ లెక్క తీశాక దశలవారీగా ఈ విధానాన్ని అమలు చేయాలని భావిస్తోంది. వంటగ్యాస్ రాయితీపై వేల కోట్లు వెచ్చిస్తున్నా అందులో 25 నుంచి 30 శాతం మేర నిధులు అక్రమార్కుల చేతుల్లోకి వెళుతున్నాయని గుర్తించిన కేంద్రం ఈ ఏడాది జనవరి నుంచి దేశవ్యాప్తంగా నగదు బదిలీ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. రాష్ట్రంలో నగదు బదిలీ కోసం ఆధార్, బ్యాంకు ఖాతాలను అనుసంధానించిన 61.99 లక్షల మంది లబ్ధిదారులకి రాయితీ నేరుగా వారి ఖాతాల్లో జమ అవుతోంది. ఇదే విధానాన్ని కిరోసిన్‌కు వర్తింపజేయాలని గత ఏడాది కేంద్రం భావించినా ఇంతవరకు నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుతం దీనిపై ఆయిల్ కంపెనీల అభిప్రాయాలను సేకరిస్తోంది. ఇటీవలే పెట్రోలియం శాఖ అధికారులు కిరోసిన్‌కు నగదు బదిలీ విషయమై ఆయిల్ కంపెనీల అభిప్రాయాలను సేకరించగా వారు ఆమోదం తెలిపినట్లు సమాచారం. కాగా, రాష్ట్రంలో బహిరంగ మార్కెట్లో లీటర్ కిరోసిన్ రూ.59 వరకు ఉండగా, కేంద్రం రూ.34 రాయితీని భరించి రూ.15కే లబ్ధిదారులకు ఇస్తుంది. రాష్ట్రం పరిధిలో పంపిణీ చేస్తున్న కిరోసిన్‌పై పడుతున్న రాయితీ భారం ఏటా రూ.660 కోట్ల వరకూ ఉంటోంది. అయితే రాయితీ కిరోసిన్ బ్లాక్‌మార్కెట్‌ను అడ్డుకునేందుకు లబ్ధిదారుల ఖాతాల్లో రాయితీ జమ చేయడమే మేలని అధికారులు సూచిం చారు. రాష్ట్రంలో ఆధార్ సీడింగ్ దాదాపు పూర్తి కావడం, 80% మందికి బ్యాంకు ఖాతాలు ఉండటంతో నగదు బదిలీని అమలు చేయడం ప్రయోజనకారిగా ఉంటుందని తెలిపినట్లు సమాచారం. -
2 వేల లీటర్ల కిరోసిన్ పట్టివేత
విజయవాడ : బ్లాక్ మార్కెట్‌కు తరలించడానికి సిద్ధంగా ఉంచిన 2 వేల లీటర్ల కిరోసిన్‌ను రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలం షేర్ మొహమ్మద్ పేటలోని ఆటోనగర్‌లో గురువారం చోటు చేసుకుంది. భారీ ఎత్తున కిరోసిన్ అక్రమంగా గ్రామంలో నిల్వ ఉంచారని జగ్గయ్యపేట ఎమ్మార్వో అనిల్‌కి ఆగంతకులు ఫోన్లో సమాచారం ఇచ్చారు. దాంతో రెవెన్యూ సిబ్బందితో అనిల్ ఆటోనగర్‌లో పలు ప్రాంతాలలో దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా రెండు వేల లీటర్ల కిరోసిన్ స్వాధీనం చేసుకున్నారు. -
138 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
అనంతపురం: అనంతపురం జిల్లాలో విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. గుత్తిలో గురువారం నిర్వహించిన దాడుల్లో గోదాముల్లో అక్రమంగా నిల్వ ఉంచిన 138 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా 3 వేల లీటర్ల కిరోసిన్ ను అధికారులు పట్టుకున్నారు. నిందితులపై కేసే నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
భార్య కాపురానికి మనస్తాపంతో భర్త ఆత్మహత్య
మహబూబ్‌నగర్: జిల్లాలోని వీపనగండ్ల మండలపరిధిలోని మియాపూర్ గ్రామానికి చెందిన సీతాపురం రాముడు(40) అనే వ్యక్తి భార్య కాపురానికి రాలేదని శనివారం రాత్రి ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. నిప్పంటించుకున్న అతన్ని చికిత్స నిమిత్తం వనపర్తి ఏరియా ఆస్పత్రికి వాహనంలో తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. 18 ఏళ్ల క్రితం కొల్లాపూర్‌కు చెందిన శ్యామల అనే మహిళతో రాముడుకు వివాహం జరిగింది. ఏడేళ్లుగా భార్య కాపురానికి రాకుండా తన స్వగ్రామంలో ఉండటంతో శనివారం ఉదయం భర్త కొల్లాపూర్ వెళ్లి గొడవ పడినట్లు, అదే క్రమంలో మనస్తాపానికి గురైన అతను ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నట్లు తెలిపారు. విషయం తెలుసుకున్న ఎస్సై జి.రవిబాబు ఆస్పత్రికి వెళ్లి ఆత్మహత్యకు గల కారణాలను తెలుసుకుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. -
మద్యానికి డబ్బివ్వలేదని నిప్పంటించుకున్నాడు
అడ్డగుట్ట (హైదరాబాద్) : మద్యానికి డబ్బు ఇవ్వలేదని ఓ వ్యక్తి నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన హైదరాబాద్ తుకారాంగేట్ పోలీస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్సై కృష్ణారెడ్డి కథనం ప్రకారం... తుకారాంగేట్ ఇందిరా గాంధీ విగ్రహం సమీపంలో నివసించే లెల్లెల శ్రీనివాస్(40), యాదమ్మ దంపతులు. కాగా నిత్యం శ్రీనివాస్ మద్యం తాగి ఇంటికి వచ్చి భార్యతో గొడవ పడేవాడు. డబ్బులు ఇవ్వకుంటే చచ్చిపోతానని బెదిరించేవాడు. ఈ క్రమంలోనే శుక్రవారం సాయంత్రం 6 గంటలకు ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన శ్రీనివాస్ రాత్రి పది గంటల సమయంలో మద్యం మత్తులో ఇంటికి వచ్చాడు. డబ్బులు ఇవ్వలేదని భార్యతో గొడవపడి తుకారాంగేట్‌లోని కేజీ ఆస్పత్రిలో పని చేసే తల్లి దగ్గరకు వెళ్లాడు. తనకి డబ్బులు కావాలని తల్లిని అడిగాడు. ఆమె కూడా నిరాకరించడంతో అక్కడి నుంచి కోపంగా వెళ్లిపోయాడు. అర్థరాత్రి 1.30 గంటల సమయంలో ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. శనివారం భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. -
ఇంకెన్ని చావులు చదవాలి?
అక్షరాలను ఆస్వాదిస్తారనుకుంటే చావుని చప్పరిస్తున్నారు. ఊరికి మొనగాళ్లవుతారనుకుంటే ఉరికి బలైపోతున్నారు. ప్రకాశిస్తారనుకుంటే కిరోసిన్‌లో అగ్నిస్నానాలు చేస్తున్నారు. మనకు ధైర్యమిస్తారనుకుంటే... దగా చేసి వెళ్తున్నారు. అక్షరాలపై సవారీ చేస్తారనుకుంటే... అంపశయ్యలెక్కుతున్నారు. ఆకాశాన్ని తాకుతారనుకుంటే... మట్టికరుస్తున్నారు. చదవలేక, చావుని వాళ్లు కోరుకుంటుంటే... వాళ్ల చావుల్ని చదవలేక మనం కుమిలిపోతున్నాం. చదవలేక, కక్కలేక మింగుతున్న విషానికి విరుగుడు కావాలి. ఈ కడుపుకోతను మాన్పే చదువులను కనిపెట్టాలి. ఈ ఏడాది జూన్ 26 శుక్రవారం: గుత్తి మండలం, ఎంగిలిబండ గ్రామం. దేవరాజ్, లక్ష్మీదంపతుల కొడుకు ఎ. నారాయణస్వామి. గుత్తిపట్టణంలోని మహాత్మా జూనియర్ కళాశాలలో ఇంటర్ (ఎంపీసీ) సెకండియర్ చదువుతున్నాడు. ఇటీవల విడుదలైన ఇంటర్ పరీక్ష ఫలితాల్లో ఫస్టియర్ మ్యాథ్స్ రెండు పేపర్లలో ఫెయిల్ అయ్యాడు. అప్పటి నుంచి మానసికంగా కుంగిపోయాడు. 25వ తేదీ గురువారం రాత్రి ఇంట్లో విషగుళికలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పరిస్థితి విషమించి శుక్రవారంనాడు ప్రాణాలు వదిలాడు. జూన్ 24 బుధవారం: యాడికి మండలం పి.వెంగన్నపల్లి గ్రామం. నాగేశ్వర్, రాజా మునీశ్వర్‌రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి.. ముగ్గురూ మంచి స్నేహితులు. ఊళ్లోని జిల్లాపరిషత్ స్కూల్లో టెన్త్ చదువుతున్నారు. రాజా మునీశ్వర్‌రెడ్డికి చదువుకన్నా వ్యవసాయం అంటే ఇష్టం. నాగేశ్వరేమో ఇంటి గొడవలతో కలతచెంది ఉన్నాడు. చంద్రశేఖర్ రెడ్డి అమాయకుడు. మునీశ్వర్ రెడ్డి, నాగేశ్వర్లు ఎలా చెబితే అలా! మొత్తానికి రకరకాల వ్యక్తిగత కారణాల వల్ల ముగ్గురికీ చదువంటే అనాసక్తతే. పైగా ఇప్పుడు టెన్త్కొచ్చారు. అది బోర్డ్ ఎగ్జామ్ అని, చాలా కష్టపడి చదివితే కానీ పాస్ అవలేమని అంతా అంటుంటే భయం పెట్టుకున్నారు. దాంతో ఇంట్లో పోరు మొదలుపెట్టారు చదువుకోకుండా వ్యవసాయం పనులు చేస్తామని. వ్యవసాయం తర్వాత చెయ్యొచ్చు. ముందు చదువుకుంటే మంచి ఉద్యోగం వస్తుందని తల్లిదండ్రులు పిల్లలకు నచ్చచెప్పి బడికి పంపారు. కానీ వాళ్లు బడికి వెళ్లినట్టే వెళ్లి వేరుశనగ విత్తనాలను నిల్వచేయడానికి ఉపయోగించే విషపు గుళికలను మింగి ఆత్మహత్య చేసుకున్నారు. జూన్ 3 బుధవారం: కర్నూలుకి చెందిన పుల్లంరాజు (బీఎస్ఎన్ఎల్లో అధికారి), కుమారిల కూతురు స్వర్ణకుమారి. అనంతపురం మెడికల్ కాలేజ్‌లో ఎంబీబీఎస్ ఫస్టియర్ చేస్తోంది. సరిగ్గా చదవలేకపోతున్నాననే మానసిక ఒత్తిడికి లోనయింది. అదే విషయాన్ని ఫ్రెండ్స్‌తోనూ షేర్ చేసుకుంది. జూన్ మూడో తారీఖున స్వర్ణ పుట్టిన రోజు. రెండో తారీఖు అర్ధరాత్రి కేక్‌కట్ చేసి ఫ్రెండ్స్‌తో పార్టీ చేసుకుంది. ఆనందంగా గడిపింది. ఇంతలో ఏమయిందో ఏమో... హాస్టల్లోని తన రూమ్ 121లో.. ఎవరూలేని సమయం చూసి ఫ్యాన్‌కి ఉరేసుకొని ఉసురు తీసుకుంది.. తండ్రికి ఉత్తరం రాసిపెట్టి మరీ. ఆ సూసైడ్ నోట్లో ... ‘మీరు నా కోసం చాలా కష్టపడుతున్నారు. కానీ నేను చదవలేకపోతున్నా. ఎంత చదువుతున్నా ఏమీ గుర్తుండట్లేదు. ఎగ్జామ్స్‌లో ఫెయిల్ అవుతా. నా ఫెయిల్యూర్ని మీరు తట్టుకోలేరు! సారీ డాడీ.. సారీ మమ్మీ! లవ్ యూ బోత్! ఫర్ గివ్ చేయండి!’ అని ఉంది. ఈ నాలుగూ ఈ ఏడాది ఇప్పటి వరకు ఒక్క అనంతపురం జిల్లాలోనే జరిగిన సంఘటనలు. ఏడాది క్రిందట ఆగస్టు 28 గురువారం: నెల్లూరు జిల్లా దగదర్తి మండలం, తిమ్మారెడ్డిపాలెంకు చెందిన పందొమ్మిదేళ్ల సుభాషిణి టీచర్ ట్రైనింగ్ కోర్స్ చేస్తుండేది. ఫస్టియర్‌లో ఒక సబ్జెక్ట్ తప్పింది. దానికి సంబంధించి ఏం మథన పడిందో ఏమో... సప్లిమెంటరీ పరీక్ష రాసిన రోజే అంటే 2014, ఆగస్ట్ 28 సాయంకాలం ఇంట్లో ఎవరూలేని సమయం చూసుకొని కిరోసిన్ పోసుకుని నిప్పు అంటించుకుంది. చికిత్స పొందుతూ మరణించింది. అంతకుముందు ఏడాది విశాఖపట్నం, మధురవాడలోని గాయత్రి ఇంజినీరింగ్ కాలేజీలో రెండో సంవత్సరం చదువుతున్న ఓంకార్ తన సబ్జెక్టులు అర్థం కావడం లేదని, ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నానని తరచు స్నేహితులతో అంటుండేవాడు. ఆ క్రమంలో ఓ రోజు హాస్టల్లోనే ఉండిపోయాడు. లంచ్ బ్రేక్‌లో తోటి విద్యార్థులు వచ్చి చూస్తే ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు! నిజామాబాద్ జిల్లా బడా భీమ్గల గ్రామానికి చెందిన ట్రిపుల్ ఐటీ విద్యార్థిని గురజాల స్రవంతి కూడా ఇలా ఆత్మహత్య చేసుకున్న అమ్మాయే. ఆమె ఆదిలాబాద్ జిల్లా బాసరలోని ట్రిపుల్ ఐటీలో థర్డ్ ఇయర్ చదువుతోంది. సెలవులకు ఇంటికి వెళ్లినప్పుడు ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. చదువులో ఒత్తిడికి లోనై ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని అంతా అనుకున్నారు. ఒత్తిడిని తట్టుకోలేకే... పై సంఘటనల్లోని విద్యార్థుల నేపథ్యం వేరయినప్పటికీ వారందరి ఆత్మహత్యలకు కారణం ఒక్కటే... ఒత్తిడి. అయితే ఇవి మచ్చుకు కొన్ని సంఘటనలు మాత్రమే. ప్రయివేట్ స్కూళ్లు, కళాశాలలు, ఇంజనీరింగ్, మెడిసిన్ డిగ్రీల మీదున్న మోజు.. సమాజం వాటికి ఇస్తున్న విలువ.. ప్రతిభను ర్యాంకుల్లో కొలిచే పద్ధతి.. ఇవన్నీ పిల్లల మీద తెలియని ఒత్తిడిని మోపుతున్నాయి. తట్టుకోలేని సున్నిత మనస్కులైన విద్యార్థులు ఆత్మహత్యలతో అర్ధంతరంగా సెలవు తీసుకుంటుంటే తట్టుకొని నిలబడిన పిల్లలు యంత్రాల్లా మారుతున్నారు. ఈ రెండూ దుష్పరిణామాలకు దారి తీసేవే! ఇలాంటి పరిణామాలు సంభవించకుండా అటు టీచర్లు, ఇటు తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలి. - సరస్వతి రమ, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి ఎప్పటికప్పుడు వాకబు చేస్తుండాలి ఇలాంటి ఘటనలను నివారించడంలో ఇటు తల్లిదండ్రుల పాత్రా, అటు టీచర్ల పాత్ర కూడా కీలకమే. ఇంట్లో పిల్లాడి ప్రవర్తనలో తేడాలొస్తే తల్లిదండ్రులు స్కూల్లో టీచర్లను వాకబు చేయాలి. అలాగే స్కూల్లో పిల్లాడు ఎవరితో కలవకుండా ఉంటుంటే టీచర్లు తల్లిదండ్రులను పిలిపించి మాట్లాడాలి. మొత్తంగా పేరెంట్స్, టీచర్స్ ఇంటరాక్ట్ అవుతూంటే ఇలాంటి దురదృష్టకర సంఘటనలు జరక్కుండా ఆపొచ్చు. అలాగే పేరెంట్స్ పిల్లల శక్తిసామర్థ్యాలను దృష్టిలో పెట్టుకునే భవిష్యత్ ప్రణాళికలు వేయాలి. - డాక్టర్ పి. వీరజారావు, సైకాలజిస్ట్ అండ్ అసిస్టెంట్‌ప్రొఫెసర్, ఉస్మానియా వ్యక్తిత్వ నిర్మాణానికి చోటు ఉండాలి చదువులు, మార్కుల విషయంలో పిల్లలపై ఒత్తిడి రావడానికి మూలకారణం వారి భావి జీవితం పట్ల పెద్దల్లో అభద్రతా భావం ఉండడమే. సమాజంలో ఏదో ఒక వృత్తి లేదా ఉపాధి లభించి గౌరవప్రదంగా జీవించడానికి అనువైన పరిస్థితులు ఏర్పడే వరకు ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉంటాయి. మన విద్యా విధానం విద్యార్థులను యంత్రాలుగా తయారు చేస్తోంది తప్ప జీవితంలో ఎదురయ్యే సమస్యలను ధైర్యంగా ఎదుర్కోగలిగిన వ్యక్తిత్వ నిర్మాణానికి తోడ్పడడం లేదు. - ఎస్.గోవిందరాజులు, రాష్ట్ర కన్వీనర్, ఆల్ ఇండియా సేవ్ ఎడ్యుకేషన్ కమిటీ -
కార్మికుడి ఆత్మహత్యాయత్నం
మెదక్ : ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఓ కాంట్రాక్ట్ కార్మికుడు ఆత్మహత్యాయత్నం చేసుకున్న సంఘటన మెదక్ జిల్లా పుల్కల్ మండలంలోని చార్మినార్ బ్రేవరీస్ కర్మాగారం ఎదుట గురువారం ఉదయం చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. చార్మినార్ బ్రేవరీస్ కర్మాగారంలో గత పది సంవత్సరాలుగా కాంట్రాక్ట్ కార్మికుడిగా పనిచేస్తున్న మిర్యాల కిట్టయ్య(38)ను ఇక ముందు పనికి రావద్దని కాంట్రాక్టర్ చెప్పడంతో మనస్తాపం చెందిన కిట్టయ్య ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. ఇది గమనించిన తోటి కార్మికులు అతన్ని సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
అమ్మా నువ్వు లేక.. నేను లేనమ్మా!
అమ్మా.. నవమాసాలు మోశావు.. కంటికి రెప్పలా పెంచావు.. చిరుప్రాయంలోనే తల్లిలేనివాడ్ని చేయాలనుకున్నావు.. నిను వీడి ఎలా బతికేదమ్మా.. అమ్మా.. నీ పొత్తిళ్లలో పెరిగేటోడ్ని.. నీ చేతి గోరు ముద్దలు తినేటోడ్ని.. నీవు లేకుండా ఎలా ఉంటాననుకున్నావు.. అమ్మా.. నాపై ఎన్నో ఆశలు పెంచుకున్నావు.. నాన్నపై భారం వేయాలనుకున్నావు.. కానీ నీ పేగు తెంచుకుని పుట్టానే.. కడదాకా నీవెంటే ఉంటా నమ్మా.. అంటూ..మంటల్లో కాలిపోతున్న తల్లి వద్దకెళ్లి తీవ్రంగా గాయపడ్డాడు ఓ చిన్నారి. ఆపై తల్లీబిడ్డ మృతిచెందడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ ఘటన శుక్రవారం శ్రీకాళహస్తిలో చోటు చేసుకుంది. ♦ కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య ♦ మంటల్లో గాయపడి రెండేళ్ల కుమారుడు కూడా మృతి శ్రీకాళహస్తి రూరల్: కుటుంబ కలహాలతో ఓ వివాహిత ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని మృతి చెందగా, మంటల్లో గాయపడి రెండేళ్ల కుమారుడు కూడా మృతి చెందిన, సంఘటన శుక్రవారం మండలంలోని ఊరందూరు గ్రామంలో జరిగింది. గ్రామస్తుల కథనం మేరకు, ఊరందూరు గ్రామానికి చెందిన శేషయ్య కుమారుడు శంకర్(28)కు అదే గ్రామానికి చెందిన ఆర్ముగం కుమార్తె అల్లీరాణి(24)తో మూడేళ్ల కిందట వివాహం చేశారు. వీరికి రెండేళ్ల కుమారుడు హర్ష ఉన్నాడు. శంకర్ మండలంలోని ఓ కర్మాగారంలో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. మూడేళ్లపాటు ఆనందంగా సాగిన వీరి కాపురంలో వారం రోజులుగా విభేదాలు తలెత్తాయి. ఈ క్రమంలో శంకర్ కర్మాగారంలో విధులకు వెళ్లగా, శంకర్ తల్లిదండ్రులు కూలి పనులకు వెళ్లారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో అల్లీరాణి వంటింట్లోకి వెళ్లి ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. ఈ సంఘటనలో ఆమెకు తీవ్ర గాయాలు కావడంతో కేకలు వేసింది. స్థానికులు వచ్చి ఆమెను రక్షించేలోపు మృతి చెందింది. కాగా అల్లీరాణి మంటల్లో కాలిపోతున్న సమయంలో తల్లికోసం వెళ్లిన కుమారుడు హర్ష(02) కూడా తీవ్రంగా గాయపడ్డాడు. బంధువులు హర్షను చికిత్స నిమిత్తం శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు తిరుపతికి రెఫర్ చేశారు. చికిత్స పొందుతూ హర్ష మృతి చెందాడు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అల్లీరాణి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రికి తరలించారు. -
1500 లీటర్ల కిరోసిన్ పట్టివేత
ఖమ్మం(కొణిజర్ల): అక్రమంగా తరలిస్తున్న 1500 లీటర్ల కిరోసిన్‌ను సివిల్ సప్లయ్ అధికారులు పట్టుకున్నారు. ఈ ఘటన శనివారం ఉదయం ఖమ్మ జిల్లా, కొణిజర్ల మండలంలో వెలుగులోకి వచ్చింది. మండలంలోని గుబ్బగుర్తి గ్రామానికి చెందిన కిరోసిన్ హాకర్ రేషన్ లబ్ధిదారులకు ఇవ్వకుండా ఖమ్మంలోని ఓ వ్యక్తికి అమ్ముకున్నారు. దీనిపై సమాచారం అందుకున్న అధికారులు దాడులు చేసి కిరోసిన్ తరలిస్తుండగా దారిలో పట్టుకున్నారు. సదరు హాకర్‌పై కేసు నమోదు చేశామని అధికారులు తెలిపారు. -
పాలు అనుకుని కిరోసిన్ తాగిన చిన్నారి..
వర్ని (నిజామాబాద్) : పాలు, కిరోసిన్‌కు తేడా తెలియని పద్నాలుగు నెలల పసివాడు... ఆకలి వేసి డబ్బా కనిపించడంతో పాలు అనుకుని తాగేయడంతో ప్రాణాలు వదిలాడు. ఈ విషాద సంఘటన నిజామాబాద్ జిల్లా వర్ని మండలంలోని కూనీపూర్ గ్రామంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే... గ్రామా శ్రీకాంత్, గాయత్రి దంపతులు కూలీ పనులు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. వీరికి ఈశ్వర్ అనే పద్నాలుగు నెలల కుమారుడు ఉన్నాడు. గత కొంతకాలంగా చిన్నారికి డబ్బా పాలు అలవాటు చేశారు. కాగా మంగళవారం రాత్రి తల్లి వంట పనిలో నిమగ్నమై ఉండగా ఈశ్వర్ అడుకుంటూ వెళ్లి పాల డబ్బా అనుకుని చిన్న సీసాలో నింపి ఉన్న కిరోసిన్ తాగాడు. కొద్దిసేపటికి ఏడుస్తుండడంతో, బాలుడు కిరోసిన్ తాగినట్టుగా గుర్తించిన గాయత్రి స్థానికుల సహకారంతో వర్ని ఆస్పత్రికి తీసుకెళ్లింది. వైద్యుల సూచన మేరకు అక్కడి నుంచి బోధన్‌లోని ప్రైవేటు పిల్లల ఆస్పత్రి కి తీసుకెళ్లింది. పరిస్థితి విషమంగా ఉందని వైద్యుడు చెప్పడంతో... నిజామాబాద్ తీసుకెళ్దామని ప్రయత్నిస్తున్న కమ్రంలోనే తమ కుమారుడు మృతి చెందాడని తల్లిదండ్రులు బోరున విలపించారు. -
అక్రమాలకు రహదారి
రంగు మార్చి.. అడ్డంగా దోచేసి! దారి మళ్లుతున్న నీలి కిరోసిన్ అడ్డాగా మారిన జాతీయ రహదారులు కిరోసిన్ వినియోగం తగ్గడమే అక్రమార్కులకు వరం సాక్షి, కర్నూలు : ప్రజాపంపిణీ ద్వారా పేదలకు అందాల్సిన నీలి కిరోసిన్ దారి మల్లుతోంది. డీజిల్‌గా చెలామణి చేస్తూ అక్రమార్కులు అడ్డంగా దోచేస్తున్నారు. డీజిల్ ధరకు రెక్కలు రావడం.. కిరోసిన్ తక్కువ ధరకు లభిస్తుండటంతో కల్తీ వ్యాపారం జోరందుకుంది. జిల్లా మీదుగా వెళ్తున్న 251.5 కిలోమీటర్ల పొడవు జాతీయ రహదారి ఈ వ్యాపారానికి వేదికగా మారింది. ప్యాపిలి నుంచి తుంగభద్ర నది బ్రిడ్జి వరకు 119 కిలోమీటర్ల 44వ జాతీయ రహదారి ఉండగా.. కర్నూలు నగర శివార్లలోని దిన్నెదేవరపాడు నుంచి చాగలమర్రి మండలం వరకు 132.5 కిలోమీటర్ల పొడవున 18వ జాతీయ రహదారి ఉంది. ఈ రహదారు ల్లోని నీలి కిరోసిన్ అడ్డాల్లో కల్తీ వ్యాపారం యథేచ్ఛగా సాగుతోంది. జిల్లాలో రేషన్ దుకాణాల ద్వారా కార్డుదారులకు ప్రతి నెలా 22వేల కిలో లీటర్ల కిరోసిన్‌ను ప్రభుత్వం సరఫరా చేస్తోంది. దీపం, ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్లు కలిగిన వారికి ప్రతి నెలా లీటరు కిరోసిన్ ఇస్తుండగా.. గ్యాస్ లేని కుటుంబాలకు నాలుగు లీటర్లు పంపిణీ చేస్తోంది. అయితే కిరోసిన్ వినియోగం తగ్గడంతో రేషన్ దుకాణాల్లో విక్రయించే లీటరు రూ.15 కిరోసిన్.. బహిరంగ మార్కెట్లో రూ.25 నుంచి రూ.30 పలుకుతోంది. ప్రధానంగా కర్నూలు, డోన్, ఆదోని, నంద్యాల, ఎమ్మిగనూరు ప్రాంతాల్లో నీలి కిరోసిన్ నల్ల బజారుకు తరలుతోంది. రూపు మారుతోందిలా.. అడ్డదారిలో సేకరించిన నీలి కిరోసిన్‌లో కాస్త కెమికల్ పౌడర్, యాసిడ్ కలిపి మోటార్ సాయంతో డ్రమ్ములో కలిపితే రెండు గంటల్లో డీజిల్ రంగులోకి మారుతుంది. ఇలా డీజిల్‌గా మార్చిన కిరోసిన్ అమ్మకాలు ఒక ఎత్తయితే.. కొందరు లారీ డ్రైవర్లు యాజమానులకు తెలియకుండా నేరుగా కిరోసిన్‌నే ట్యాంకుల్లో పోస్తూ నాలుగు రాళ్లు వెనకేసుకుంటున్నారు. ఈ తరహా అక్రమాలు జిల్లాలో కోకొల్లలు. కల్తీ డీజిల్ వాడినా, నేరుగా కిరోసిన్ వాడినా వాహనాలు దెబ్బతినడంతో పాటు కాలుష్యం పెరుగుతుంది. చౌక దుకాణాల నుంచే కిరోసిన్ పక్కదారి పడుతుండటంతో అడ్డాల్లో అక్రమ వ్యాపారం మూడు లారీలు, ఆరు పీపాలుగా సాగిపోతోంది. ఇలా కలిసొస్తోంది.. లీటరు డీజిల్ ధరకు రెండు లీటర్ల కిరోసిన్ వస్తోంది. మైలేజీ ఒకేలా రావడంతో ఎక్కువ మంది కిరోసిన్ వైపు మొగ్గుచూపుతున్నారు. కర్నూలు, నంద్యాల పట్టణాల్లో రోజుకు 1,500 లీటర్ల కిరోసిన్ ఇలా దారి మల్లుతున్నట్లు అనధికార అంచనా. ప్రస్తుతం ఇళ్లలో కిరోసిన్ వినియోగించే వారు తక్కువయ్యారు. పూరి గుడిసెలోనూ విద్యుత్ వెలుగులు విరజిమ్ముతున్నాయి. ఈ పరిస్థితి అక్రమాలకు ఊతమిస్తోంది. కిరోసిన్ ఇవ్వడమే తప్ప కార్డుదారులు సమర్థంగా వినియోగించుకునే పరిస్థితి కరువైంది. ఫలితంగా బ్లాక్ మార్కెట్ ఊపందుకుంటోంది. చర్యలు చేపడతాం : ప్రభాకర్‌రావు, డీఎస్ఓ పేదలకు చేరాల్సిన నీలి కిరోసిన్ బయటి మార్కెట్‌కు తరలుతున్న విషయం నా దృష్టికి రాలేదు. కల్తీ చేసి వాహనాలకు వినియోగిస్తున్న విషయంపై సిబ్బంది చేత తనిఖీలు చేయిస్తా. అక్రమాలకు పాల్పడే వారిని ఉపేక్షించబోం. -
బాలికకు నిప్పంటించిన వృద్ధురాలు
నల్లగొండ : నల్లగొండ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ వృద్ధురాలు ఆరెళ్ల బాలికపై కిరోసిన్ పోసి నిప్పంటించింది. ఈ విషాద సంఘటన గురువారం నల్లగొండ జిల్లా సూర్యాపేట పట్టణంలోని శాంతినగర్‌లో వెలుగుచూసింది. వివరాలు.. పట్టణంలోని శాంతినగర్‌కాలనీలో బుధవారం అర్ధరాత్రి ఒక వృద్ధురాలు పక్కింటికి చెందిన సాయి మన్విత(6) అనే బాలికపై కిరోసిన్ పోసి నిప్పంటించింది. పాప పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించారు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వృద్ధురాలిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, వృద్ధురాలి బంధువులు మాత్రం ఆమెకు మతిస్థిమితం లేకపోవడం వల్లే ఈ సంఘటన జరిగిందని తెలుపుతున్నారు. (సూర్యాపేట) -
మానసిక వికలాంగుడిపై కన్నతల్లి కర్కశం
కిరోసిన్ పోసి నిప్పంటించిన వైనం చికిత్స పొందుతూ యువకుడి మృతి పెద్దశంకరంపేట: భర్తపై కోపంతో మానసిక వికలాంగుడైన కుమారుడిపై కిరోసిన్ పోసి నిప్పంటించిందో కన్నతల్లి. ఈ ఘటన ఆదివారం మెదక్ జిల్లాలో చోటుచేసుకుంది. పెద్దశంకరంపేట మండలం జూకల్‌కి చెందిన బూర్ల సంగయ్య, సత్యమ్మ దంపతులకు మానసిక వికలాంగుడైన కుమారుడు బూర్ల యేసు (21), ఓ కుమార్తె ఉన్నారు. ఇటీవల సంగయ్య ఆరు కుంటల భూమిని కొనుగోలు చేశాడు. డబ్బు సరిపోకపోవడంతో భార్య వద్ద ఉన్న బంగారు ఇవ్వాలని కోరాడు. ఇదే విషయమై శనివారం రాత్రి ఇద్దరూ గొడవపడ్డారు. ఈ క్రమంలో భర్త మీద కోపంతో యేసుపై కిరోసిన్ పోసి నిప్పు పెట్టింది. తీవ్రంగా గాయపడిన అతడిని స్థానికులు సంగారెడ్డి ప్రభుత్వాస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతు ఆదివారం మృతి చెందాడు. -
ప్రాణం మీదకు తెచ్చిన గచ్చకాయలాట
తొండిచేసి గెలిచావంటూ బాలికపై కిరోసిన్ పోసి నిప్పంటించిన మరో బాలిక హుజూర్నగర్: ఇద్దరు బాలికలు సమీప బంధువులు. గచ్చకాయల ఆట(అచ్చెన గిల్లలాట)లో నేనే గెలిచానంటే.. లేదు నేనే గెలిచా. ఇద్దరి మధ్య పట్టువిడుపు.. తగాదా.. ఆగ్రహావేశాలకు ఓ బాలిక కిరోసిన్ తెచ్చి మరో బాలికపై పోసి నిప్పంటించింది. దీంతో తీవ్రంగా కాలిన గాయాలతో ఓ బాలిక ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంది. నల్లగొండ జిల్లా హుజూర్నగర్ మండలం బూరుగడ్డలో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. మునగాల మండలం బరాఖత్‌గూడేనికి చెందిన 11 ఏళ్ల బాలిక వేసవి విడిదిగా అమ్మమ్మ గ్రామమైన బూరుగడ్డకు వచ్చింది. సమీప బంధువువైన ఎనిమిదేళ్ల బాలికతో స్నేహంగా ఉంటోంది. ఇంటిల్లిపాది వ్యవసాయ పనికి వెళ్తుండడంతో ఇద్దరు కలసి ఆడుకునేవారు. ఈ క్రమంలో మంగళవారం ఇరు కుటుంబాల వారు వ్యవసాయ పనులకు వెళ్లారు. అమ్మమ్మ దగ్గరికి వచ్చిన బాలిక ఇంటి దగ్గర ఇద్దరు కలసి గచ్చకాయల ఆట ఆడారు. ఓ దశలో అమ్మమ్మ ఇంటికి వచ్చిన బాలిక గెలిచింది. లేదు.. లేదు నేనే గెలిచా.. నువ్వు తొండి చేశావంటూ అదే గ్రామానికి చెందిన బాలిక తగాదా పెట్టుకుంది. ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. దీంతో కోపంతో ఊగిపోయిన ఓడిపోయిన బాలిక పక్కనే ఇంట్లో ఓ బాటిల్లో ఉన్న కిరోసిన్‌ను తెచ్చి మరో బాలికపై పోసింది. అగ్గిపెట్టె గీసి అంటించింది. వెంటనే ఇంటికి పరుగుతీసింది. మంటలకు తాళలేక ఆ బాలిక కేకలు వేయడంతో ఇరుగుపొరుగు వచ్చి మంటలు ఆర్పారు. వెంటనే చికిత్స నిమిత్తం హుజూర్నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి విజయవాడకు తరలించారు. ప్రస్తుతం బాలిక పరిస్థితి బాగానే ఉన్నట్లు తెలుస్తోంది. గ్రామంలో ఈ సంఘటన కలకలం సృష్టించింది. -
వివాహితపై హత్యాయత్నం..?
కోడలిపై కిరోసిన్ పోసిన అత్త చిట్టినగర్ : అనారోగ్యంతో ఉన్న కోడలికి వైద్యం చేయించాల్సిన అత్తింటి వారే ఆమె ఒంటిపై కిరోసిన్ పోసి హత్యాయత్నానికి పాల్పడిన ఘటన కొత్తపేట పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం జరిగింది. పోలీసులు, బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం కేఎల్‌రావునగర్ ప్రాంతానికి చెందిన చంద్రకళ 11 ఏళ్ల కిందట గొట్టిపర్తి కిరణ్‌కుమార్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరికి వల్లి పద్మ(9) మహిమ తేజస్వి(5). పిల్లలు ఉన్నారు. పదేళ్ల పాటు సవ్యంగా సాగిన వీరి కాపురంలో ఏడాది నుంచి గొడవలు మొదలయ్యాయి. చంద్రకళకు ఆరోగ్యం సరిగా ఉండకపోవడంతో పాటు భార్య పిల్లలను పట్టించుకుకోకుండా కిరణ్‌కుమార్ తన తల్లి దగ్గరకు వెళ్లేపోయేవాడు. ఆటో నడిపే కిరణ్ మూడు నెలలుగా ఇంటి అద్దె కూడా చెల్లించకపోవడంతో యజమాని గదికి తాళం వేశాడు. దీంతో చంద్రకళ కలరా హాస్పటల్ వద్ద ఉంటున్న తన అక్క దగ్గర ఉంటుంది. ఇదేక్రమంలో కిరణ్‌కుమార్ తాత గారు రాసిన వీలునామా ప్రకారం కోట్ల రూపాయల ఆస్తి కలిసి రావడంతో చంద్రకళకు వేధింపులు ఎక్కువయ్యాయి. సోమవారం ఉదయం హాస్పటల్‌కు వెళ్లేందుకు సిద్ధమైన చంద్రకళ తన మందుల కాగితాలను తెచ్చుకునేందుకు కేటీరోడ్డులోని చిట్టి పార్కు ఎదురుగా ఉన్న అత్త సాయికుమారి వాళ్ల ఇంటికి వెళ్లింది. ఆ సమయంలో ఇంట్లో ఉన్న కిరణ్‌కుమార్ తన సోదరులైన ఏసురాజు, ప్రసాద్‌లతో కలిసి చంద్రకళతో గొడవకు దిగారు. దీంతో ఆవేశంతో అత్త సాయికుమారి చంద్రకళ ఒంటిపై కిరోసిన్ పోయడంతో భయంతో కేకలు వేసింది. స్థానికులతోపాటు చంద్రకళ సోదరి ఆమెను తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. ఫిర్యాదు స్వీకరించేందుకు పోలీసులు అంగీకరించలేదు. బాధితురాలి కుటుంబీకులు స్టేషన్ ఎదుట ఆందోళన చేసేందుకు సిద్ధం కావడంతో ఫిర్యాదు స్వీకరించడమే కాకుండా కిరణ్‌కుమార్, అతని తల్లి, సోదరులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బాధితురాలిని ప్రభుత్వాస్పత్రికి తరలించడంతో పాటు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
నిప్పంటించుకొని విద్యార్థి ఆత్మహత్యాయత్నం
పరిస్థితి విషమం.. గాంధీ ఆస్పత్రికి తరలింపు మెదక్ రూరల్: ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఓ విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన మండల పరిధిలోని బొడుభూపతిపూర్ గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన తలారి కిషన్ రాజమణి దంపతులకు ముగ్గురు పిల్ల లు. అందులో లక్ష్మణ్, రాము కవల పిల్లలు (అన్నదమ్ములు). గ్రామంలో 7వ తరగతి చదువుతున్నారు. కాగా కిషన్, రాజమణి బతుకు దెరువుకోసం కొంతకాలంనుంచి నిజమాబాద్ వెళ్లిపోగా లక్ష్మణ్, రాము తన నానమ్మ వెంకటమ్మ వద్ద ఉంటూ గ్రామంలో చదువుకుంటున్నా రు. శుక్రవారం పాఠశాలకు సెలవు ఉండటంతో ఉదయం నుంచి ఇంట్లోనే పడుకుని ఉన్న లక్ష్మణ్ మధ్యాహ్నం వేళ ఇంట్లో ఎవరూలేని సమయంలో ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పు పెట్టుకున్నాడు.ఇరుగు పొరుగువారు మంటలనార్పి మెదక్ ప్రాంతీయ ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించటంతో గాంధీ ఆస్పత్రికి రెఫర్ చేసినట్లు రూరల్ పోలీసులు పేర్కొన్నారు. కాగా విద్యార్థి ఎందుకు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడో తెలియరాలేదు. ఈ విషయంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై పోచయ్య తెలిపారు. -
భార్య ఒంటిపై కిరోసిన్ పోసి నిప్పంటించిన భర్త
పహాడీషరీఫ్: భార్యతో గొడవ పడిన ఓ కిరాతకుడు ఆమె ఒంటిపై కిరోసిన్ పోసి నిప్పంటించిన సంఘటన పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం...తుక్కుగూడ ప్రాంతానికి చెందిన హనుమళ్ల జ్యోతి (25), సత్తయ్యలు భార్యాభర్తలు. లేబర్ పని చేసే వారికి ఐదేళ్ల కుమారుడు ఉన్నాడు. కాగా సత్తయ్య, జ్యోతిలు తరచూ గొడవ పడుతుండేవారు. ఈ క్రమంలోనే గురువారం రాత్రి కూడా గొడవ పడి ఆగ్రహానికి గురైన సత్తయ్య.. జ్యోతిపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. జ్యోతి అరుపులు గమనించిన స్థానికులు వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం పోలీసుల సాయంతో ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. 60 శాతం కాలిన గాయాలకు గురైన జ్యోతి తనపై భర్తే కిరోసిన్ పోసి నిప్పంటించాడని వాంగ్మూలం ఇచ్చింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. -
కరెంటు ఉంటే..కిరోసిన్ కట్!
న్యూఢిల్లీ: ప్రత్యక్ష నగదు బదిలీ పథకం ద్వారా గ్యాస్ సబ్సిడీ లబ్ధిదారుల సంఖ్యను తగ్గించిన ప్రభుత్వం తాజాగా సబ్సిడీపై కిరోసిన్ పొందుతున్నవారిపై దృష్టి పెట్టింది. 2011 జనాభా లెక్కల ప్రకారం విద్యుత్ సదుపాయం ఉన్న గృహాలను గుర్తించి.. ఆ ఇళ్లకు సబ్సిడీ కిరోసిన్ సదుపాయాన్ని నిలిపేయాలనే ప్రతిపాదన తమకు వచ్చిందని కేంద్ర చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సోమవారం వెల్లడించారు. ఆ ప్రతిపాదనను అధ్యయనం చేసిన తరువాతే నిర్ణయం తీసుకుంటామన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు భారీగా తగ్గినప్పటికీ, రిటైల్ మార్కెట్లో ధరను సమయం వచ్చినప్పుడు తగ్గిస్తామని ప్రధాన్ తెలిపారు. గత ఆర్థిక సంవత్సరం కిరోసిన్ సబ్సిడీ కోసం రూ. 30,575 కోట్లను, ఎల్పీజీ సబ్సిడీ కోసం రూ. 46,458 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేసింది.నగదు బదిలీ వల్ల ఎల్పీజీ సబ్సీడీ భారాన్ని 15శాతం తగ్గించుకుంది. -
మహిళపై కిరోసిన్ పోసి నిప్పంటించిన యువకుడు
గుంటూరు: గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం మునగపాడులో దారుణం చోటు చేసుకుంది. మహిళపై కిరోసిన్ పోసి యవకుడు నిప్పంటించాడు. దాంతో యువతి బిగ్గరగా గట్టిగా కేకలు వేయడంతో... చుట్టుపక్కల వాళ్లు అక్కడికి చేరుకుని మంటలార్పి... పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ఆమెను గుంటూరు ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు వివరించారు. నిందితుడు గత కొంత కాలంగా లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడని బాధితురాలు తన వాంగ్మూలంలో వెల్లడించిందని పోలీసులు పేర్కొన్నారు. -
అక్రమాలపై కృష్ణ చక్రం
సాక్షి, గుంటూరు: బియ్యం, ఇసుక, కిరోసిన్ అక్రమ రవాణాపై గుంటూరు రూరల్ ఎస్పీ పీహెచ్డీ రామకృష్ణ సీరియస్‌గా దృష్టి సారించారు. జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన తొలినాళ్లలోనే ప్రత్యేక టీమ్‌లను ఏర్పాటు చేసి ఇసుక అక్రమ వ్యాపారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించారు.ఇసుక అక్రమ రవాణాకు సహకరిస్తున్న సీఐలు, ఎస్ఐలపై సస్పెన్షన్ వేటు వేశారు. మరి కొందరిని వీఆర్‌కు పంపారు. గతంతో పోలిస్తే ఇసుక అక్రమ రవాణా ఇప్పుడు తగ్గింది. అయితే రాత్రిళ్లు వారి కార్యకలాపాలు అధికమయ్యాయని అందిన ఫిర్యాదుల మేరకు రాత్రి గస్తీని ముమ్మరం చేశారు. జిల్లాలో చౌకధరల దుకాణాల ద్వారా పేదలకు అందాల్సిన రేషన్ సరుకులు బ్లాక్ మార్కెట్‌కు తరలుతున్న విషయం అందరికీ తెలిసిందే. గతంలో విజిలెన్స్ అధికారులు హడావుడి చేసినప్పుడల్లా మిన్నకుండే అక్రమ వ్యాపారులు ఆ తరువాత ఎప్పటిలా తమ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. రాష్ట్ర విభజన అనంతరం దాచేపల్లి, నాగార్జునసాగర్ వద్ద రెండు సరిహద్దు చెక్‌పోస్టులు ఏర్పాటు చేయడంతో అక్రమ రవాణాకు చెక్ పడినట్లేనని అంతా భావించారు. అయితే అక్రమార్కులు అక్కడి ఉద్యోగులను సైతం మేనేజ్ చేసి తమ వ్యాపారాన్ని యథేచ్ఛగా నిర్వహిస్తున్నారు. జిల్లాలో బెల్ట్‌షాపులు రద్దు చేసినప్పటికీ అర్ధరాత్రి వరకూ తెరిచి ఉంచి మద్యం అమ్మకాలు సాగిస్తున్నారని తీవ్ర స్థాయిలో ఫిర్యాదులు అందడంతో రూరల్ ఎస్పీ సీరియస్‌గా ఉన్నారు. రహస్య టీమ్‌ల ఏర్పాటు ... జిల్లాలో అక్రమ వ్యాపారాలు, రవాణాలపై అందుతున్న ఫిర్యాదుల మేరకు గుంటూరు రూరల్ ఎస్పీ పీహెచ్డీ రామకృష్ణ రహస్యంగా తనకు నమ్మకంగా ఉండే అధికారులతో ప్రత్యేక టీమ్‌లను ఏర్పాటు చేశారు. రాత్రి వేళ తనకు వచ్చే సమాచారాన్ని ఈ టీమ్‌లకు అందించి వారి ద్వారా దాడులు నిర్వహిస్తున్నారు. ఈ విధానంలో నాలుగురోజుల్లోనే సుమారు 10 లారీల బియ్యాన్ని పట్టుకున్నారు. దాడులు చేస్తున్నట్లు ఆ ప్రాంతంలోని పోలీస్ అధికారులకు సైతం సమాచారం అందించడం లేదు. వరస దాడులు చేస్తూ అక్రమంగా బ్లాక్‌మార్కెట్‌కు తరలిస్తున్న బియ్యాన్ని పట్టుకున్నచోట స్థానిక అధికారులపై ఎస్పీ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు తెలిసింది. బియ్యంతోపాటు ఇసుక, బెల్టుషాపులపై కూడా ఎస్పీ నియమించిన రహస్య టీమ్ దాడులు చేస్తుండటంతో పోలీస్ అధికారులు హడలిపోతున్నారు. ఇటీవల బియ్యం మాఫియాకు సహకరిస్తున్నారనే కారణంతో దాచేపల్లి ఎస్ఐ కోటేశ్వరరావును వీఆర్‌కు పంపారు. దీంతో అప్రమత్తమైన గురజాల డీఎస్పీ పూజ మాచర్ల, గురజాల నియోజకవర్గాల్లోని రేషన్ డీలర్లతో సమావేశం ఏర్పాటు చేసి హెచ్చరికలు జారీ చేశారు.దీనికితోడు ఇటీవల జరిగిన బదిలీల్లో రాజకీయంగా ఒత్తిడి తెచ్చి పోస్టింగ్‌లు వేయించుకున్న పలువురు సీఐల పనితీరుపైఎస్పీ ప్రత్యేక నిఘా ఉంచినట్లు సమాచారం. -
కిరోసిన్ మాయ !
పలమనేరు: ఆధార్ అనుసంధానంతో జిల్లాలోని కిరోసిన్ దొంగలు బయటపడ్డారు. ఇన్నాళ్లు ప్రతినెలా లక్ష లీటర్ల నీలి కిరోసిన్ నల్ల మార్కెట్‌కు తరలుతున్నట్లు తెలుస్తోంది. అధికారుల లెక్కలు సరిలేని కారణంగా ఇప్పటికీ భారీగానే పక్కదారి పడుతోంది. క్షేత్ర స్థాయిలో అధికారులు నడుం బిగిస్తే గానీ ఈ అక్రమాలకు చెక్‌పెట్టే పరిస్థితి కనిపించడం లేదు. ఆధార్‌తో వెలుగుచూసిన బోగస్‌కార్డులు రేషన్‌కార్డులతో ఆధార్ అనుసంధాన ప్రక్రియ ద్వారా సుమారు లక్ష బోగస్ కార్డులున్నట్లు అధికారులు గుర్తించారు. జిల్లాలో 94 శాతం మాత్రమే ఆధార్ప్రక్రియ పూర్తయింది. మరో 50వేల మందికి పైగా ఆధార్‌కార్డులు అనుసంధానం చేసుకోవాల్సి ఉంది. వీరిలోనూ బోగస్తోపాటు వలస వెళ్లిన వారు ఉన్నారు. ఆధార్ ప్రక్రియతో కిరోసిన్ కోటాను ప్రభుత్వం రెండు నెలలుగా ఆపేసింది. ఇంకా తేలాల్సిన కార్డులు పెండింగ్ ఉండడంతో వీటి పేరునే డీలర్లు ఎంట్రీలు వేసుకొని కిరోసిన్‌ను నొక్కేస్తున్నట్లు అర్థమవుతోంది. ప్రతినెలా పక్కదారి పడుతున్న లక్ష లీటర్ల కిరోసిన్ జిల్లాలో 2,828 చౌక దుకాణాలున్నాయి. వీటి ద్వారా 9,91,018 కార్డుదారులు ప్రతినెలా ఎల్పీజీ లేనివారు రెండు లీటర్లు, ఎల్పీజీ ఉన్న వారు ఓ లీటర్ కిరోసిన్ పొందుతున్నారు. కొందరు డీలర్లు రెండు లీటర్లు పొందేవారికి లీటరు, మరికొంత మందికి అసలు కిరోసిన్ పంపిణీ చేయడం లేదని తెలుస్తోంది. బియ్యం కొనుగోలు చేసేపుడు కార్డులు అందజేస్తే అందులో కిరోసిన్ కూడా తీసుకున్నట్లు ఎంట్రీ చేసిదాన్ని నొక్కేస్తున్నట్లు సమాచారం. ప్రతినెలా దాదాపు లక్ష లీటర్లకు పైగా పక్కదారి పడుతున్నట్లు తెలుస్తోంది. ఇదిగో సాక్ష్యం.. పలమనేరు మండలానికి సంబంధించి అన్ని రకాల కార్డులు కలిపి 21వేలున్నాయి. వీటిలో 12 వేల మందికి రెండు లీటర్లు, ఏడువేల మంది (గ్యాస్ కనెక్షన్ ఉన్నవారు)కి ఓ లీటర్ చొప్పున కిరోసిన్ పంపిణీ అవుతున్నట్లు రికార్డుల్లో ఉంది. ఆ లెక్కన ఏడువేల మందికి మాత్రమే ఇక్కడ గ్యాస్ కనెక్షన్లు ఉన్నట్లు లెక్క. కానీ గ్యాస్ పొందుతున్న వారు పదివేలకు పైగా ఉన్నట్లు ఈ మధ్యనే గ్యాస్ నిర్వాహకులు చేపట్టిన ఆధార్ సీడింగ్‌లో నమోదైంది. దీని ప్రకారం మూడు వేల మంది గ్యాస్ కనెక్షన్లు ఉన్నప్పటికీ రేషన్‌కార్డుల ద్వారా కిరోసిన్ పొందినట్టే లెక్క. ఈ అవకాశాన్ని డీలర్లు వాడుకుని కిరోసిన్ తస్కరిస్తున్నట్లు తెలుస్తోంది. పొంతన లేని అధికారుల లెక్కలు.. జిల్లాలో 9,91,018 కార్డులున్నాయి. ఇందులో వితౌట్ ఎల్పీజీ కార్పొరేషన్లలో 23,977, మున్సిపాలిటీల్లో 66,394, మండల హెడ్‌క్వార్టర్స్‌లో 72,343, గ్రామీణ ప్రాంతాల్లో 6.90 లక్షలు మొత్తం 8.52 లక్షల కార్డులున్నాయి. ఒక లీటర్ పొందే కార్డుదారులు కార్పొరేషన్లలో 31,921, మున్సిపాలిటీల్లో 50,332, గ్రామీణ ప్రాంతాల్లో 1,45 లక్షలు మొత్తం 2.28 లక్షల కార్డులున్నాయి. అన్నీ కలుపుకుంటే 10.80 లక్షల కార్డులు ఉన్నట్లుగా ఉంది. కానీ జిల్లాలోని మొత్తం కార్డులు 9.91 లక్షలే. ఈ విషయమేందో అధికారులే తేల్చాల్సి ఉంది. పూర్తి స్థాయిలో చెక్ పెట్టలేని అధికారులు.. అక్రమాలకు పూర్తిగా చెక్ పెట్టాలంటే సీఎస్డీటీలు వారి వద్దనున్న డైనమిక్ కీ రిజిస్టర్‌ను, ఎల్పీజీ వాడుతున్న కార్డుదారుల వివరాల రిజిస్టర్‌ను సరిచూడాల్సి ఉంది. దీని ప్రకారం అనర్హులను తొలగించి, ప్రతినెలా అలాట్మెంట్ అందజేస్తే గానీ బ్లాక్‌మార్కెట్‌కు తరలే కిరోసిన్‌ను అరికట్టలేని పరిస్థితి ఉంది. ఈ విషయమై డీఎస్వో విజయరాణిని వివరణ కోర గా కిరోసిన్ అలాట్మెంట్ కమిషనర్ కార్యాలయం నుంచి మంజూరవుతుందన్నారు. దీనిపై తమకెటువంటి సమాచారమూ ఉండదని తెలిపారు. పూర్తిస్థాయిలో రేషన్‌కార్డులు, గ్యాస్ సీడింగ్ జరిగితే ఈ అక్రమాలకు చెక్పెట్టొచ్చన్నారు. -
నిరసనాగ్రహం
అద్దంకి: పింఛన్ పీకేశారని ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్న వృద్ధురాలి ఘటన పలువురిని కదిలించింది. బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ కావూరి సుబ్బులు (88) మృతదేహాన్ని అద్దంకి పట్టణంలోని మేదరమెట్ల-నార్కెట్‌పల్లి రాష్ట్రీయ రహదారిలో అంబేద్కర్ విగ్రహం వద్ద నడిరోడ్డుపై ఉంచి శుక్రవారం గ్రామస్తులు, బంధువులు గంటపాటు ధర్నా నిర్వహించారు. పింఛన్ పీకేశారని ఈ నెల ఐదో తేదీన ప్రకాశం జిల్లాలోని అద్దంకి మండలంలో ఉన్న కొంగపాడు గ్రామానికి చెందిన వృద్ధురాలు కావూరి సుబ్బులు ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకొని చికిత్స పొందుతూ బుధవారం మరణించిన విషయం పాఠకులకు విదితమే. ఆమె మృతదేహంతో అద్దంకి వచ్చి న్యాయం చేయాలంటూ మేదరమెట్ల-నార్కెట్‌పల్లి రాష్ట్రీయ రహదారిపై ఎంఆర్పీఎస్, కేవీపీఎస్, సీఐటీయూ సంఘాల ఆధ్వర్యంలో రాస్తారోకోకు దిగారు. దాదాపు గంటపాటు రాస్తారోకో చేశారు. దీంతో స్థానిక ఎస్సై సీహెచ్ వెంకటేశ్వర్లు అక్కడికి వచ్చి సర్థి చెప్పినా వినలేదు. తమకు న్యాయం చేసే వరకూ కలదిలేది లేదని భీష్మించుకు కూర్చున్నారు. సీఐ సాంబశివరావు అక్కడికి చేరుకొని బాధితులకు న్యాయం జరిగేలా తహశీల్దార్‌తో మాట్లాడతామని చెప్పడంతో రాస్తారోకోను విరమించిరు. కలెక్టర్‌తో మాట్లాడిన్యాయం చేస్తాం.. బాధ్యులపై చర్యలకు సిఫారసు చేస్తాం.. రాస్తారోకో విరమించి తహశీల్దార్ కార్యాలయానికి కుల సంఘాల పెద్దలు, వృద్ధురాలి బంధువులు చేరుకున్నారు. అక్కడ తహశీల్దార్ అశోక్ వర్థన్ ఇన్చార్జి ఎంపీడీఓ కృష్ణమోహన్, సీఐ సాంబశివరావు, ఎస్సై సీహెచ్ వెంకటేశ్వర రావు సమక్షంతో అధికారులు బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని, ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకుని వెళ్లి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. కమిటీ సభ్యుల వల్లే వృద్ధురాలు మరణించిందని, వారిపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కేవీపీఎస్ డివిజన్ నాయకులు తంగిరాల వెంకటేశ్వర్లు, ఎంఆర్పీఎస్ నాయకులు అలూరి చిరంజీవి, డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు సీహెచ్ గంగయ్య, కోటేశ్వరరావు, నాగేశ్వరరావు, మృతురాలి బంధువలు పాల్గొన్నారు. -
శుభకార్యానికి పంపలేదని.. కూతురుకు నిప్పంటించి..
పెబ్బేరు: శుభకార్యానికి పంపిం చలేదన్న కారణంతో ఓ తల్లి తన ఏడునెలల చిన్నారిపై కిరోసి న్ పోసి నిప్పంటించింది. తర్వా త తానూ అంటించుకుంది. ఈ సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా పెబ్బేరు మండలం జానంపేటలో జరిగింది. గ్రామానికి చెందిన ఎండీ సాదిక్ ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. మంగళవారం అతని భార్య సుల్తానా తరఫు బంధువు ఇంటికి వచ్చి శుభకార్యానికి పంపించాలని సాదిక్‌ను అడిగాడు. తన కూతురు ఆసియాబేగం ఆరోగ్యం సరిగా లేదని, శుభకార్యానికి పంపించలేనని చెప్పాడు. దీంతో సుల్తా నా తీవ్ర మనస్తాపం చెందింది. మంగళవారం రాత్రి భర్తతో గొడవ పడి, ఇంట్లో కి వెళ్లి గడియపెట్టుకొని కిరోసిన్‌ను తన ఏడు నెలల కూతురుపై పోసి నిప్పంటించింది. ఆ తర్వాత తాను కూడా నిప్పంటించుకుంది. గమనించిన భర్త, చుట్టుపక్కల వారు తలుపులు విరగ్గొట్టి వారిద్దరినీ జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. అక్కడ బుధవారం వేకువజామున ఇద్దరు చనిపోయారు. అత్తింటి వేధింపుల వల్లే తమ కూతురు ఆత్మహత్య చేసుకుందని తల్లిదండ్రులు ఆరోపించారు. -
కార్ఖానలో దారుణం
మంటల బారినపడిన తల్లీ, ఇద్దరు కూతుళ్లు గాంధీ ఆస్పత్రికి తరలింపు ప్రమాదకరంగా ముగ్గురి పరిస్థితి భర్త నిర్లక్ష్యం చేయడం వల్లేనని భార్య వాంగ్మూలం రసూల్‌పురా: అనుమానాస్పదస్థితిలో తల్లి, ఇద్దరు కూతుళ్లు మంటల బారినపడ్డారు. 80 శాతం కాలిన గాయాలతో గాంధీ ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ ఘటన కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని ఏపీ టెక్ట్స్‌బుక్ కాలనీలో చోటుచేసుకుంది. స్థానికులు, కుటుంబ యజమాని దినేష్ కథనం ప్రకారం... కార్ఖాన ఏపీ టెక్ట్స్‌బుక్ కాలనీలో నివసించే దినేష్ సికింద్రాబాద్ పాట్ మార్కెట్లో మామా జ్యుయెలర్స్ నిర్వహిస్తున్నాడు. ఇతనికి భార్య కవిత(40), వైష్ణవి(18), భావన (16) అనే ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. శుక్రవారం ఉదయం 8.30 నుంచి 9గంటల ప్రాంతంలో ముగ్గురికి ఒకేసారి మంటలు అంటుకున్నాయి. దినేష్ ఉంటున్న పైఅంతస్తులో అతని సోదరుడి కుటుంబం నివాసం ఉంటోంది. దినేష్ సోదరుని ఇంటికి వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అరుపులు, కేకలు విని కిందికి దిగివచ్చిన దినేష్ మంటలార్పేందుకు ప్రయత్నించాడు. ఈ ఘటనలో అతని చేతులకు కూడా గాయాలయ్యాయి.ఈ ముగ్గురిని వెంటనే స్థానికుల సహాయంతో గాంధీ ఆసుపత్రికి తరలించారు. భర్త నిర్లక్ష్యం వల్లే... భర్త పట్టించుకోకపోవడంతో మనస్తాపం చెంది తానే వంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నానని కవిత మెజిస్ట్రేట్ ఎదుట వాంగ్మూలం ఇచ్చిందని ఇన్స్పెక్టర్ నాగేశ్వర్రావు తెలిపారు. తల్లి లేకుండా తాము బతకలేమని ఇద్దరు కూతుళ్లు కూడా ఆత్మహత్యకు యత్నించినట్టు కవిత పేర్కొన్నట్టు ఇన్స్పెక్టర్ వెల్లడించారు. అయితే ఇద్దరు పిల్లలు మాట్లాడలేని స్థితిలో ఉన్నట్టు ఆయన తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు. -
కుట్ర బట్టబయలు
సాక్షి ప్రతినిధి, గుంటూరు సరస్వతి సిమెంట్స్‌కు చెందిన భూముల విషయంలో జరిగిన వివాదం వెనుక పెద్ద భాగోతమే నడిచింది. భూమి లేకుండా సిమెంట్ కంపెనీ ప్రతినిధులపై దౌర్జన్యానికి దిగి ఒకరు, తనపై తానే కిరోసిన్ పోసుకుని సిమెంట్ కంపెనీ ప్రతినిధులే తనపై కిరోసిన్ పోసి హత్యాయత్నానికి పాల్పడ్డారని మరొకరు తప్పుడు కేసులు పెట్టారు. రెండు రోజుల తరువాత అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఆ వివరాలు ఇవీ... మాచవరం మండలం చెన్నాయపాలెం గ్రామంలోని సరస్వతి సిమెంట్స్‌కు భూములు అమ్మిన రైతుల్లో కొందరు పత్తిపంటను వేయగా, దానిని తొలగించేందుకు సిమెంట్ కంపెనీ ప్రతినిధులు ఈనెల 8వ తేదీన ప్రయత్నించారు. దీనిని నిలువరించేందుకు రైతులతోపాటు టీడీపీ నేతలు, కార్యకర్తలు కంపెనీ ప్రతినిధులతో వివాదానికి దిగారు. భూములు అమ్మినవారిలో చెన్నాయపాలెం గ్రామానికి చెందిన బండ్ల గురులక్ష్మి కూడా ఉన్నారు. ఆమె మూడు ఎకరాలు అమ్మారు. అయితే ఆమె విశాఖపట్నంలోని తన కుమారుల వద్ద ఉంటోంది. పిడుగురాళ్లలో నివసిస్తున్న ఆమె కుమార్తె గద్దె పూర్ణమ్మ టీడీపీ నేతల చెప్పుడు మాటలు విని ఆ భూమిలో పత్తి పంటను సాగు చేసింది. వారానికి ఒకసారి పిడుగురాళ్ల నుంచి వచ్చి పొలాన్ని పరిశీలించి వెళుతోంది. ఈ క్రమంలో 8వ తేదీన సిమెంట్ కంపెనీ ప్రతినిధులు తన భూమిలోని పంటను తొలగిస్తున్నారని తెలుసుకుని పూర్ణమ్మ కిరోసిన్ డబ్బాతో పొలానికి చేరుకొని సిమెంట్ కంపెనీ ప్రతినిధులతో వివాదానికి దిగింది. ఆ సమయంలో టీడీపీ నేతలు, కార్యకర్తల ప్రోద్బలంతో ఆమె కిరోసిన్‌ను ఒంటిపై పోసుకుని సిమెంట్ కంపెనీ ప్రతినిధులపై బెదిరింపులకు దిగింది. దీనిని అక్కడే ఉన్న కొంత మంది తమ సెల్ఫోన్లలో చిత్రీకరించారు. ఈ విషయం తెలియని టీడీపీ నేతలు సరస్వతీ సిమెంట్స్ ప్రతినిధులపై, వారికి మద్దతుగా వచ్చిన వారిపై తప్పుడు కేసును బనాయించేందుకు మాచవరం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయించారు. ఆమెపై సరస్వతి సిమెంట్ కంపెనీ ప్రతినిధులు, వారి మద్దతుదారులు కిరోసిన్ పోసి హత్యాయత్నానికి పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొనగా 307 సెక్షన్‌కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదిలా ఉండగా, అదే గ్రామానికి చెందిన బచ్చలపూడి రవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు 250 మందిపై అనేక సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఫిర్యాదు చేసిన రవికి సరస్వతీ సిమెంట్స్ యాజమాన్యం కొనుగోలు చేసిన భూముల్లో సెంటు భూమి కూడా లేకపోవడం గమనించదగిన విషయం. భూమి లేని రవి అసలు అక్కడకు ఎందుకు వచ్చాడో టీడీపీ నేతలకే తెలియాలి. ఈ రెండు సంఘటనలు బట్టి చూస్తే సరస్వతి సిమెంట్స్ యాజమాన్యంపై టీడీపీ నేతలు మోపిన కేసులన్నీ తప్పుడు కేసులు, నిరాధారమైవని స్పష్టమవుతోంది. -
కుట్ర బట్టబయలు
సాక్షి ప్రతినిధి, గుంటూరు సరస్వతి సిమెంట్స్‌కు చెందిన భూముల విషయంలో జరిగిన వివాదం వెనుక పెద్ద భాగోతమే నడిచింది. భూమి లేకుండా సిమెంట్ కంపెనీ ప్రతినిధులపై దౌర్జన్యానికి దిగి ఒకరు, తనపై తానే కిరోసిన్ పోసుకుని సిమెంట్ కంపెనీ ప్రతినిధులే తనపై కిరోసిన్ పోసి హత్యాయత్నానికి పాల్పడ్డారని మరొకరు తప్పుడు కేసులు పెట్టారు. రెండు రోజుల తరువాత అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఆ వివరాలు ఇవీ... మాచవరం మండలం చెన్నాయపాలెం గ్రామంలోని సరస్వతి సిమెంట్స్‌కు భూములు అమ్మిన రైతుల్లో కొందరు పత్తిపంటను వేయగా, దానిని తొలగించేందుకు సిమెంట్ కంపెనీ ప్రతినిధులు ఈనెల 8వ తేదీన ప్రయత్నించారు. దీనిని నిలువరించేందుకు రైతులతోపాటు టీడీపీ నేతలు, కార్యకర్తలు కంపెనీ ప్రతినిధులతో వివాదానికి దిగారు. భూములు అమ్మినవారిలో చెన్నాయపాలెం గ్రామానికి చెందిన బండ్ల గురులక్ష్మి కూడా ఉన్నారు. ఆమె మూడు ఎకరాలు అమ్మారు. అయితే ఆమె విశాఖపట్నంలోని తన కుమారుల వద్ద ఉంటోంది. పిడుగురాళ్లలో నివసిస్తున్న ఆమె కుమార్తె గద్దె పూర్ణమ్మ టీడీపీ నేతల చెప్పుడు మాటలు విని ఆ భూమిలో పత్తి పంటను సాగు చేసింది. వారానికి ఒకసారి పిడుగురాళ్ల నుంచి వచ్చి పొలాన్ని పరిశీలించి వెళుతోంది. ఈ క్రమంలో 8వ తేదీన సిమెంట్ కంపెనీ ప్రతినిధులు తన భూమిలోని పంటను తొలగిస్తున్నారని తెలుసుకుని పూర్ణమ్మ కిరోసిన్ డబ్బాతో పొలానికి చేరుకొని సిమెంట్ కంపెనీ ప్రతినిధులతో వివాదానికి దిగింది. ఆ సమయంలో టీడీపీ నేతలు, కార్యకర్తల ప్రోద్బలంతో ఆమె కిరోసిన్‌ను ఒంటిపై పోసుకుని సిమెంట్ కంపెనీ ప్రతినిధులపై బెదిరింపులకు దిగింది. దీనిని అక్కడే ఉన్న కొంత మంది తమ సెల్ఫోన్లలో చిత్రీకరించారు. ఈ విషయం తెలియని టీడీపీ నేతలు సరస్వతీ సిమెంట్స్ ప్రతినిధులపై, వారికి మద్దతుగా వచ్చిన వారిపై తప్పుడు కేసును బనాయించేందుకు మాచవరం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయించారు. ఆమెపై సరస్వతి సిమెంట్ కంపెనీ ప్రతినిధులు, వారి మద్దతుదారులు కిరోసిన్ పోసి హత్యాయత్నానికి పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొనగా 307 సెక్షన్‌కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదిలా ఉండగా, అదే గ్రామానికి చెందిన బచ్చలపూడి రవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు 250 మందిపై అనేక సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఫిర్యాదు చేసిన రవికి సరస్వతీ సిమెంట్స్ యాజమాన్యం కొనుగోలు చేసిన భూముల్లో సెంటు భూమి కూడా లేకపోవడం గమనించదగిన విషయం. భూమి లేని రవి అసలు అక్కడకు ఎందుకు వచ్చాడో టీడీపీ నేతలకే తెలియాలి. ఈ రెండు సంఘటనలు బట్టి చూస్తే సరస్వతి సిమెంట్స్ యాజమాన్యంపై టీడీపీ నేతలు మోపిన కేసులన్నీ తప్పుడు కేసులు, నిరాధారమైవని స్పష్టమవుతోంది. -
అది నీలి కిరోసిన్...
ముస్తఫా కేసు దర్యాప్తు ముమ్మరం ఘటనా స్థలాన్ని మళ్లీ పరిశీలించిన ‘సిట్’ సాక్షి, సిటీబ్యూరో: మెహిదీపట్నం మిలటరీ ఏరియాలో కాలిన గాయాలతో మృతి చెందిన ముస్తఫా (11) ఉదంతంపై నగర పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఇప్పటికే దర్యాప్తు అధికారులకు ఘటనా స్థలంలో కీలక ఆధారాలు లభించాయి. మరోపక్క ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన మిలటరీ ఉన్నతాధికారులు అంతర్గత విచారణను ముమ్మరం చేశారు. ఆదివారం ఘటన జరిగిన మిలటరీ సిగ్నల్ ఇక్యూప్‌మెంట్ ఏరియాను నగర సీసీఎస్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం (సిట్) పోలీసులతో పాటు మిలటరీ అధికారులు మరోసారి సందర్శించి వివరాలు సేకరించారు. ముస్తఫా హత్యకు గురై ఉంటే అందుకు కార ణాలేమిటి? అనే కోణంలో ఆ ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించామని ఓ పోలీసు ఉన్నతాధికారి ‘సాక్షి’కి తెలిపారు. ఘటన జరిగిన రోజే డాగ్‌స్క్వాడ్ ముస్తఫా మృతదేహం పడిన చోటి నుంచి మిలటరీ సిగ్నల్ ఇక్యూప్‌మెంట్ కాంపౌండ్ లోపల ధోబీరూమ్ వద్ద ఉన్న బాత్రూం వద్దకు (ఇక్కడే ముస్తఫా ఒంటికి మంటలంటుకున్నాయి) వెళ్లింది. బాత్రూం నుంచి ముస్తఫా పడిన చోటికి, అక్కడి నుంచి బాత్రూమ్ వరకు ఇలా ఐదుసార్లు పోలీసు శునకం వెళ్లొచ్చింది. అది మరోచోటికి వెళ్లకుండా ముస్తఫా వద్దకే వచ్చి ఆగిందంటే ఘటన ప్రారంభమైన ప్రాంతంలో మరో వ్యక్తి ఉన్నాడా?.. ఉంటే అతను పారిపోయి ఉంటే అటు వైపు డాగ్ ఎందుకు వెళ్లలేదు. అనే ప్రశ్నలు పో లీసులను వేధిస్తున్నాయి. బయట నుంచే కిరోసిన్ తెచ్చారా? ముస్తఫా ఒంటిపై పడింది బ్లూ కిరోసినేనని దర్యాప్తు అధికారులు నిర్థారించారు. ఈ విషయాన్ని మిలటరీ అధికారులూ గుర్తించారు. క్లూస్ టీం కూడా ఘటన జరిగిన సమయంలో ధోబీరూమ్ పక్కనే బాత్రూమ్ ముందు పడిఉన్న (అర లీటర్ ఖాళీ మజా ప్లాస్టిక్)బాటిల్లో ఉన్న నీలి రంగు కిరోసిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కిరోసిన్‌ను ఫోరెన్సీక్ ల్యాబ్‌కు కూడా పంపిచారు. అయితే ఈ కిరోసిన్ ఘటనా స్థలానికి ఎలా వచ్చింది? అనే దానిపై ఆరా తీస్తున్నారు. తెల్ల కిరోసిన్ అయితే ఎక్కడపడితే అక్కడ లభిస్తుంది. అదే నీలి రంగు (ప్రభుత్వం దీన్ని సబ్సిడీపై రేషన్‌షాపుల ద్వారా ప్రజలకు సరఫరా చేస్తోంది) కిరోసిన్. మిలటరీ సిబ్బందికి ఈ కిరోసిన్ సరఫరా కానేకాదు. వారి క్వార్టర్స్‌లో కూడా ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లే ఉన్నాయి. ఇక సైనికుల దుస్తులు ఇస్తిరీ చేసే ధోబీరూమ్లో కూడా ఎక్కడా కిరోసిన్ ఉన్న దాఖలాలు లేవు. బొగ్గుల పెట్టేతో ఇస్తిరీ చేస్తే బొగ్గులకు నిప్పంటించేందుకు కిరోసిన్ వాడతారు. అయితే ఇక్కడ కరెంట్ పెట్టెతో ఇస్తిరీ చేస్తున్నారు కాబట్టి కిరోసిన్ అవసరం లేదు. అలాగే ధోబీ రూమ్ చుట్టుపక్కల ఎక్కడా బొగ్గులు కాని, కాలిన బొగ్గు బూడిద కాని కనిపించలేదు. అలాగే మిలటరీ సిగ్నల్ ఇక్యూప్‌మెంట్ కాంపౌండ్‌లోని ఐదు గదులను కూడా మిలటరీ అధికారుల సహకారంతో పోలీసులు తనిఖీ చేశారు. ఆ గదులలో కూడా ఎక్కడా కిరోసిన్ పెట్టిన ఆనవాళ్లు లేవు. దీంతో ఈ నీలిరంగు కిరోసిన్ మిలటరీ ఏరియాకు బయటి నుంచే వచ్చి ఉంటుందని పోలీసుల భావిస్తున్నారు. కిరోసిన్ ఎక్కడి నుంచి వచ్చిందో కనిపెడితే ముస్తఫా మృతిపై మిస్టరీ వీడే అవకాశం ఉందంటున్నారు. ఘటన స్థలంలో కాలిపోయిన చిన్నపాటి చెట్ల ఆకులతో పాటు కిరోసిన్ పడిన ఆకులను కూడా ఫొరెన్సిక్ ల్యాబ్‌కు తరలించారు. ఆ ఆకులపై పడింది కూడా నీలిరంగు కిరోసినేనని తేలింది. -
అంతటా అప్రమత్తం
తొమ్మిది ప్రాంతాల్లో కంట్రోల్ రూమ్‌ల ఏర్పాటు ప్రత్యేకాధికారుల నియామకం కలెక్టర్ రఘునందన్‌రావు వెల్లడి మచిలీపట్నం : హుదూద్ తుపాను ప్రభావంతో ప్రాణనష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నట్లు కలెక్టర్ ఎం.రఘునందన్‌రావు శనివారం తెలిపారు. కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు. తుపాను పరిస్థితులను అంచనా వేసి రక్షణ చర్యలు తీసుకునేందుకు కలెక్టరేట్, బందరు ఆర్డీవో కార్యాలయంతోపాటు అన్ని ప్రభావిత మండలాల తహశీల్దార్ కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆయా మండలాలకు నియమించిన ప్రత్యేకాధికారులు అక్కడే ఉండి ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందజేయాలని ఆదేశాలు జారీ చేశామని చెప్పారు. తీరప్రాంతంలోని 53 పంచాయతీలు, వాటిలోని 130 శివారు గ్రామాలు తుపాను ప్రభావానికి గురయ్యే అవకాశం ఉన్నట్లు గుర్తించామన్నారు. ఆయా ప్రాంతాల్లో 88,257 మంది జనాభా ఉన్నారని పేర్కొన్నారు. తుపాను ప్రభావం అధికంగా ఉండి నిర్వాసితులను సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సి వస్తే 78 పునరావాస కేంద్రాలను సిద్ధంగా ఉంచినట్లు చెప్పారు. తుపాను ప్రభావిత గ్రామాల్లో బియ్యం, కిరోసిన్‌తో పాటు నిత్యావసర సరుకులను సిద్ధం చేశామని కలెక్టర్ వివరించారు. గ్రామ స్థాయిలో టీమ్‌లను ఏర్పాటు చేసి ఇన్‌చార్జ్‌లను నియమించామని, సెల్ఫోన్ల ద్వారా ఎప్పటికప్పుడు వారి నుంచి సమాచారం సేకరిస్తామన్నారు. తుపాను ప్రభావంతో గ్రామాల్లోకి నీరు చొచ్చుకురావటంతోపాటు పెనుగాలులకు చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలితే వాటి పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. రహదారులు దెబ్బతింటే వెంటనే మరమ్మతులు చేస్తామన్నారు. తుపాను ప్రభావిత గ్రామాల్లో తాగునీటి ట్యాంకులను నింపామని, పారిశుద్ధ్య చర్యల కోసం బ్లీచింగ్ నిల్వ చేసినట్లు వివరించారు. హుదూద్ తుపాను తీరం దాటే వరకు సముద్రంలో అలల ఉధృతి అధికంగా ఉంటుందని, మంగినపూడి బీచ్, హంసలదీవి బీచ్‌లకు పర్యాటకులను అనుమతించబోమని ఆయన చెప్పారు. ఈ బీచ్‌ల వెంబడి పోలీసు గస్తీని ఏర్పాటు చేశామని తెలిపారు. సముద్రంలో చేపలవేటకు వెళ్లిన మత్స్యకారులను తిరిగి రప్పించామని, పరిస్థితి సాధారణ స్థితికి వచ్చే వరకు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని కలెక్టర్ సూచించారు. మచిలీపట్నంలో ఎనిమిదో నంబరు ప్రమాద హెచ్చరిక హుదూద్ ప్రభావం పెరగడంతో మచిలీపట్నంలోని గిలకలదిండి హార్బర్ వద్ద శనివారం ఎనిమిదో నంబరు ప్రమాద హెచ్చరికను ఎగురవేశారు. గిలకలదిండి హార్బర్, మంగినపూడి బీచ్‌లలో చేపల వేటకు ఉపయోగించే బోట్లను నిలిపి ఉంచారు. తుపాను పరిస్థితులపై పోలీసులను అప్రమత్తం చేసేందుకు ఎస్పీ జి.విజయకుమార్ కృత్తివెన్ను తదితర గ్రామాల్లో పర్యటించి అధికారులకు పలు సూచనలు, సలహాలు అందజేశారు. తుపాను హెచ్చరికల నేపథ్యంలో చేపలవేటకు ఉపయోగించే వలలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. విద్యుత్ అధికారులు అప్రమత్తం హుదూద్ తుపాను వల్ల తీవ్ర ఈదురు గాలులు వీచే అవకాశం ఉండటంతో విద్యుత్ అధికారులు అప్రమత్తమయ్యారు. ఈపీడీసీఎల్ పరిధిలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని అధికారులు చెప్పడంతో విజయవాడ నుంచి ఐదుగురు ఏఈలు, 50 మంది సిబ్బందిని విశాఖపట్నం పంపారు. అవసరమైతే సోమవారం ఉదయం మరికొందరిని పంపడానికి సిద్ధంగా ఉన్నారు. తుపాను కారణంగా మచిలీపట్నంతోపాటు జిల్లాలోని తీరప్రాంతంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగితే వెంటనే పునరుద్ధరించేందుకు సిబ్బందిని, సామగ్రిని అందుబాటులో ఉంచారు. ప్రజలకు సాధ్యమైనంత వరకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నామని ఎస్పీడీసీఎల్ ఎస్ఈ మోహన్‌కృష్ణ ‘సాక్షి’ కి తెలిపారు. -
అన్నభాగ్య!
పట్టణ పేదలకు రేషన్ కట్ దసరా, బక్రీద్ తర్వాత అమల్లోకి? కిరోసిన్ రహిత పట్టణ ప్రాంతాలుగా తీర్చిదిద్దడమే లక్ష్యం సాక్షి, బెంగళూరు : అడిగిన సమాచారం ఇవ్వని వారికి సబ్సిడీ సరుకులను నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఇందులో భాగంగానే తొలిదశలో పట్టణాల్లో ఉంటున్న బీపీఎల్, అంత్యోదయ కార్డుదారులకు చౌకదుకాణాల నుంచి అందించే రేషన్‌ను నిలిపి వేసేందుకు రంగం సిద్ధమవుతోంది. అనర్హులను గుర్తించడంతో పాటు కిరోసిన్ రహిథ పట్టణ ప్రాంతాలుగా తీర్చిదిద్దడంలో భాగంగా ప్రభుత్వం ఈ చర్యలకు దిగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇదే గనుక జరిగితే పట్టణాల్లోని పలువురు పేదలు అన్నభాగ్య పథకానికి దూరం కానున్నారు. ప్రస్తుతం రాష్ట్ర మొత్తం మీద కోటి కుటుంబాలు రేషన్ షాపుల నుంచి ప్రతి నలా సబ్సిడీ సరుకులను పొందుతున్నాయి. లబ్ధిదారుల్లో మొత్తం 9,17,987 మంది పట్టణప్రాంతాల్లో(వీరిలో 65,061 మంది అంత్యోదయ లబ్ధిదారులు) నివసిస్తున్నట్లు పౌరసరఫరాలశాఖ గణాంకాలు చెబుతున్నాయి. అంతేకాకుండా 35 లక్షల మంది కొత్తగా బీపీఎల్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. కొత్తగా దరఖాస్తు చేసుకున్నవారికి ఎన్నికల కమిషన్ అందజేసే ఎలొక్టోరల్ ఫొటో ఐడెంటిటీ కార్డ్ (ఎపిక్ కార్డు)తోపాటు ఆధార్ నంబర్‌ను జత చేయడం తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఇదివరకే ఆదేశాలు జారీచేసింది. మరోవైపు ఇప్పటికే రేషన్ కార్డులు ఉన్నవారికి వెంటనే ఆధార్, ఎపిక్‌నంబర్‌ను ఇవ్వాలని పౌరసరఫరాల శాఖ దాదాపు రెండు నెలల ముందే సూచించింది. ప్రభుత్వం అడిగిన సమాచారం ఇచ్చినవారు ఇప్పటికీ లక్షను దాటలేదు. దీంతో సమాచారం ఇవ్వని వారికి రేషన్ నిలిపివేయాలని పౌరసరఫరాల శాఖ భావిస్తోంది. ఇందుకోసం మొదట పట్టణ ప్రాంతాల్లో ఈ నిబంధన అమలు చేసి తర్వాత గ్రామీణ ప్రాంతాలకు వర్తింపజేయాలని పౌరసరఫరాల శాఖ అధికారులు భావిస్తున్నారు. మరోవైపు పట్టణప్రాంతాల్లో సబ్సిడీ ధరలో కిరోసిన్ పొందే వారిని గుర్తించి సరైన గణాంకాలు కేంద్రానికి ఇచ్చినప్పుడు మాత్రమే ఆ మేరకు కేంద్రం నుంచి అదనపు గ్యాస్ పొందడానికి వీలవుతుంది. ఈ ప్రక్రియ ఎంత వేగంగా జరిగితే అంత వేగంగా కర్ణాటకను కిరోసిన్ రహిత పట్టణ ప్రాంతాల రాష్ట్రంగా చేయడానికి వీలవుతుంది. దీంతో ‘ఆధార్’ను రేషన్ కార్డుకు అనుసంధానం చేయడం వల్ల లబ్ధిదారుల సంఖ్యలో ఖచ్చితత్వం పెరుగుతుందనేది పౌరసరఫరాలశాఖ భావన. దీనికి సంబంధించిన ఫైల్ పదిహేను రోజుల ముందే ప్రభుత్వానికి చేరింది. అయితేదసరా, బక్రీద్ పండుగలు వచ్చే నెల మొదట్లోనే వస్తుండడంతో ఈ నిబంధన వల్ల రేషన్ దొరక్కపోతే ప్రజల నుంచి ప్రభుత్వం పట్ల వ్యతిరేకత వస్తుందని ఫైల్‌పై ముఖ్యమంత్రి సంతకం చేయడానికి నిరాకరించినట్లు తెలుస్తోంది. అయితే నవంబర్ నుంచి ఈ నిబంధనలను అమలు చేయాలని పౌరసరఫరాల శాఖ పట్టుదలతో ఉంది. -
కిరోసిన్ పోసుకుని మహిళ ఆత్మహత్యాయత్నం
చిత్తూరు: జిల్లాలోని తిరుపతి రూరల్ మండలం కాలూరులో ఓ వివాహిత ఆత్మహత్యాయత్నం చేసుకుంది. అదనపు కట్నం కోసం భర్తతో సహా అత్తమామలు వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ కిరోసిన్ పోసుకుని ఆ మహిళ ఆత్మహత్యకు యత్నించింది. ప్రస్తుతం గర్భిణిగా ఉన్న ఆమెను రుయా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తీవ్రమైన గాయాలతో చికిత్స పొందుతున్న ఆ మహిళ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. -
ఓఎన్జీసీ లాభం 19% అప్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఆయిల్ దిగ్గజం ఓఎన్జీసీ ఈ ఏడాది తొలి క్వార్టర్(ఏప్రిల్-జూన్)లో రూ. 4,782 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గతేడాది(2013-14) ఇదే కాలంలో ఆర్జించిన రూ. 4,016 కోట్లతో పోలిస్తే ఇది 19% వృద్ధి. ముడిచమురుకి అధిక ధరలు లభించడం ఇందుకు దోహదపడింది. నికరంగా బ్యారల్‌కు 47.51 డాలర్ల ధర లభించినట్లు కంపెనీ తెలిపింది. గతంలో బ్యారల్‌కు 40.33 డాలర్లు నమోదైంది. ఈ కాలంలో సబ్సిడీ చెల్లింపులు 4% పెరిగి రూ. 13,200 కోట్లకు చేరాయి. ప్రభుత్వ నియంత్రిత ధరలకు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు విక్రయించే డీజిల్, కిరోసిన్, ఎల్పీజీలపై ఓఎన్జీసీ వంటి ఉత్పాదక సంస్థలు సబ్సిడీలు చెల్లించే సంగతి తెలిసిందే. కాగా, చమురు వెలికితీత కార్యకలాపాలకు సంబంధించి రూ. 3,828 కోట్లను రద్దు చేసినట్లు(రైటాఫ్) కంపెనీ వెల్లడించింది. ఇక ఈ కాలంలో 5.1 మిలియన్ టన్నుల చమురును ఉత్పత్తి చేయగా, గ్యాస్ ఉత్పత్తి 2% క్షీణించి 5.775 బిలియన్ ఘనపు మీటర్లకు పరిమితమైంది. అమ్మకాలు 13% పుంజుకుని రూ. 21,813 కోట్లను తాకాయి. సబ్సిడీ తరువాత స్థూలంగా బ్యారల్ చమురుకి 6% అధికంగా 109.48 డాలర్లు ధర లభించినట్లు కంపెనీ తెలిపింది. అయితే ఇంధన సబ్సిడీల చెల్లింపు తరువాత 47.51 డాలర్ల చొప్పున గిట్టుబాటు అయినట్లు పేర్కొంది. వెరసి ఒక్కో బ్యారల్ చమురుపై సబ్సిడీ డిస్కౌంట్‌కు 62.33డాలర్లను కేటాయించినట్లయ్యిందని వివరిం చింది. సబ్సిడీ డిస్కౌంట్‌ను మినహాయించకుంటే నికర లాభం రూ. 7,396 కోట్లమేర అధికంగా నమోదయ్యేదని తెలిపింది. కేజీ బేసిన్ పశ్చిమ ప్రాంతంలో కొత్తగా ఆరు ఆయిల్, గ్యాస్ క్షేత్రాలపై దృష్టిపెట్టినట్లు తెలిపింది. రిలయన్స్‌కు విక్రయం వెనిజులాలోని కొరబోబో ప్రాజెక్ట్‌లో ఉత్పత్తి చేసిన చమురులో తొలిసారిగా 1.2 మిలియన్ బ్యారళ్లను రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన జామ్‌నగర్ రిఫైనరీకి విక్రయించినట్లు కంపెనీ వెల్లడించింది. వెనిజులా నుంచి గుజరాత్‌కు 40 రోజుల్లో ఈ షిప్మెంట్ చేరినట్లు తెలిపింది. కొరబోబో ప్రాజెక్ట్‌లో అనుబంధ సంస్థ ఓఎన్జీసీ విదేశ్ ద్వారా 11% వాటాను కలిగి ఉంది. ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో షేరు 1% నష్టంతో రూ. 402 వద్ద ముగిసింది. -
ఐదు మోటార్ సైకిళ్లు దహనం
- పావుగంట వ్యవధిలో - ఒకదాని తర్వాత ఒకటిగా.. - చిలక లూరిపేటలో అర్ధరాత్రి కలకలం - పోలీసులకు సవాల్‌గా మారిన ఘటన చిలకలూరిపేటటౌన్: అర్ధరాత్రి 12 గంటల సమయం.. చిలకలూరిపేట పట్టణ పోలీస్‌స్టేషన్ సమీప ప్రాంతం.. ఇళ్ల ముందు నిలిపిన ఐదు ద్విచక్రవాహనాలు ఒకదాని తర్వాత ఒకటిగా వేర్వేరు చోట్ల దహన మయ్యాయి. ఎవరు చేశారు? ఎందుకోసం చేశారు..? ఒక్కరి పనేనా..? అంతుచిక్కని ఇలాంటి ప్రశ్నలెన్నో.. ఆదివారం అర్ధరాత్రి జరిగిన ఈ వరుస ఘటనలు పట్టణంలో కలకలం రేపాయి. పోలీసులకు పెను సవాల్‌గా నిలిచాయి. పట్టణంలో గుర్తు తెలియని వ్యక్తులు వరుసగా ఐదు ద్విచక్రవాహనాలను దహనం చేసిన ఘటన ఇళ్లలో పార్కింగ్ అవకాశం లేక వాహనాలు బయట నిలిపేవారి గుండెల్లో గుబులు పుట్టించింది. స్టేషన్ వెనుక వీధిలో ఒక మోటార్‌సైకిల్, వినాయకుడి గుడి వీధిలో రెండు, సౌదాగర్ వీధిలో ఒకటి, గుర్రాల చావిడి సమీపంలోని పాత హెచ్‌పీ గ్యాస్ గోడౌన్ వద్ద మరో ద్విచక్రవాహనం ఆదివారం రాత్రి అగ్నికి ఆహుతయ్యాయి. వాహనాలను ఒకదాని తరువాత ఒకటి పావుగంట వ్యవధిలో తగలబెట్టినట్లు బాధితులు అందజేసిన సమాచారం బట్టి తెలుస్తోంది. పోలీస్‌స్టేషన్ వెనుక వాహనం తగలబడుతున్న విషయం గమనించిన వాహనయజమాని భూపతి రాజేశ్వరరావు ఫైర్‌స్టేషన్‌కు సమాచారం అందజేశారు. అగ్నిమాపక వాహనం వచ్చేసరికే బైక్ పూర్తిగా దహన మైంది. వినాయకస్వామి గుడి సమీపంలో, సౌదాగార్ వీధి, పాత గ్యాస్గౌడన్ వద్ద తగలబెట్టిన వాహనాలు ఎందుకు పనికిరాని పరిస్థితి. వినాయకస్వామి గుడి వీధిలో తగలబెట్టిన రెండో వాహనం మాత్రం పాక్షికంగా దహనమైంది. బాధితుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలాలకు వెళ్లి సమాచారం సేకరించారు. గుంటూరు నుంచి క్లూస్ టీమ్ ఎస్ఐ టి.మల్లేశ్వరరావు ఆధ్వర్యంలో సిబ్బంది వచ్చి ఆధారాలు సేకరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వివిధ కోణాల్లో దర్యాప్తు... ఘటన జరిగిన ప్రాంతాలన్నీ పోలీస్‌స్టేషన్‌కు సమీపంలోనే ఉండటం పోలీసులకు సవాలుగా మారింది. మద్యం మత్తులో ఆకతాయిలు చేసిన పనా.. అన్నీ ఒకరే చేశారా.. అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. రెండు మూడు చోట్ల వాహనాలపై పెట్రోలు లేదా కిరోసిన్ పోసి తగలబెట్టి ఉండవచ్చుని క్లూస్ టీమ్ అనుమానం వ్యక్తం చేసింది. పాక్షికంగా వాహనం తగలబడిన చోట కేవలం పెట్రోలు ట్యాంకు పైపు లాగి దానికి నిప్పింటించినట్లు భావిస్తున్నారు. -
బెదిరించేందుకు ప్రయత్నించి.. బలైపోయింది
వేమవరప్పాడులో మహిళ సజీవదహనం రక్షించేందుకు ప్రయత్నించిన వ్యక్తికి తీవ్రగాయాలు వివాహేతర సంబంధం నేపథ్యంలో గొడవే కారణం! వేమవరప్పాడు (కైకలూరు) : బెదిరించేందుకు ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్న మహిళ సజీవదహనమైంది. ఆమెను కాపాడేందుకు ప్రయత్నిం చిన వ్యక్తికి తీవ్రగాయాలయ్యా యి. వివాహేతర సంబంధమే ఈ ఘటనకు కారణమని స్థానికులు చెబుతున్నారు. మండలంలో కలకలం రేపిన ఈ దుర్ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. వేమవరప్పాడు గ్రామానికి చెందిన సంసోను, గురవమ్మ దంపతులకు ఇద్దరు ఆడ పిల్లలు. వారిలో చిన్న కుతూరు బొజ్జ మరియమ్మ(37)కు కలిదిండి మండలం ఎస్ఆర్పీ అగ్రహారం గ్రామానికి చెందిన ఏసుతో 19 సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరికి దేవి, రేవతి అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భర్తతో విభేదాలు రావడంతో పదేళ్ల నుంచి మరియమ్మ పిల్లలతో కలిసి ఉంటోంది. పెద్ద కుమార్తె దేవీకి ఇటీవల వివాహం చేసింది. చిన్నకుమార్తె కూడా కొద్ది రోజులుగా అదే గ్రామంలో నివసిస్తున్న అమ్మమ్మ వద్ద ఉంటోంది. మరియమ్మ గ్రామ శివారులోని పంట పొలం వద్ద ఓ పూరింట్లో నివసిస్తోంది. ఆమె గ్రామంలోని మహిళా కూలీలను భీమవరంలో ఉన్న రొయ్యల ఫ్యాక్టరీలో పనికి తీసుకెళుతూ మేస్త్రీగా వ్యవహరిస్తుంది. ఈ నేపథ్యంలో రెండేళ్ల క్రితం కలిదిండి మండలం పరసావానిపాలేనికి చెందిన ఆటోడ్రైవర్ పరసా గణేష్ (38)తో పరిచయమైంది. వారి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. భయపెట్టేందుకు ప్రయత్నించి.. గణేష్ రెండు నెలలుగా మరియమ్మ ఇంటికి రావడం లేదు. దీంతో ఇద్దరి మధ్య కొద్దిరోజులుగా గొడవ జరుగుతోంది. ఈ క్రమంలో ఆటోలో కూలీలను దించిన గణేష్ శనివారం రాత్రి అమె ఇంటికి వెళ్లాడు. తనను పట్టించుకోవడం లేదని గణేష్‌ను మరియమ్మ నిలదీసింది. ఇద్దరి మధ్య మాటామాటా పెరగడంతో మరియమ్మ చనిపోతానని బెదిరిస్తూ ఒంటిపై కిరిసిన్ పోసుకుంది. అగ్గిపుల్ల వెలిగించి అంటించుకుంటానని చెప్పేలోపే ఆమె చీరకు నిప్పంటుకుని ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఆమెను రక్షించడానికి ప్రయత్నించిన గణేష్‌కు తీవ్ర గాయాలవడంతో బయటకు పరుగుతీశాడు. క్షణాల్లో మరియమ్మ సజీవదహనమైంది. ఇల్లు కూడా కాలి బూడిదైపోయింది. మరియమ్మ ఇల్లు గ్రామ శివారులో ఉండటంతో స్థానికులు ఏం జరిగిందో తెలుసుకునేలోపే ఆమె కన్నుమూసింది. గ్రామస్తుల నుంచి సమాచారం అందుకున్న కైకలూరు అగ్నిమాపక శాఖ సిబ్బంది వచ్చేలోపే ఇల్లు పూర్తిగా కాలిపోయింది. తీవ్రంగా గాయపడిన గణేష్‌ను 108లో ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కైకలూరు టౌన్, టూ టౌన్ అదనపు ఎస్ఐలు దాడి చంద్రశేఖర్, షబ్బిర్ అహ్మాద్, ఆర్ఐ ఇబ్రహీం ఘటనాస్థలాన్ని పరిశీలించారు. మరియమ్మ బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
భార్య ఒంటిపై కిరోసిన్ పోసి...
తిరుమలగిరి :వేదమంత్రాల సాక్షిగా వివాహమాడాడు.. బంధువులందరి సమక్షం లో కలకాలం కాపాడుతానని ప్రమా ణం చేశాడు.. అదనపు కట్నం తేలేదంటూ ఆ .. భార్యనే అగ్నికి ఆహుతి చేశాడు.. కూతురిలా చూసుకుంటామన్న అత్తా, మామ కూడా సహకరించి ఆ అభాగ్యురాలిని కాటికి సాగనంపారు. ఈ దారుణ ఘటన తిరుమలగిరి మండలం వెలిశాలలో శుక్రవా రం రాత్రి చోటు చేసుకుంది. బాధితురాలి వాంగ్మూలం, బంధువులు, స్థాని కులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జాజిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన మమత(25)కు వెలిశాల గ్రామానికి చెందిన పులుసు మల్లేష్‌తో 16 నెలల క్రితం వివాహం జరిగింది. రూ.6 లక్షలు, 3 తులాల బంగారం, ఇతర లాంఛనాలను వివాహ సమయంలో ముట్టజెప్పారు. కొద్దిమాసాలకే వేధింపులు షురూ.. కోటి ఆశలతో కొత్త జీవితంలో అడుగుపెట్టిన ఆ వధువు కలలు కల్లలయ్యా యి. డ్రైవర్‌గా పనిచేస్తున్న భర్త తాగుడుకు బానిసగా మారాడు. ఏదో సాకు చూపుతూ నిత్యం వేధింపులకు గురిచేసేవాడు. ఆరు మాసాల నుంచి అదన పు కట్నం కింద రూ.లక్ష, మరో రెండు తులాల బంగారం కావాలంటూ వేధింపులకు గురిచేశాడు. తల్లిదండ్రులకు చెప్పుకోలేక ఆ అభాగ్యురాలు మెట్టినింటిలోనే నరకయాతన అనుభవించింది. వచ్చాడు.. కొట్టాడు.. ఆపై కాల్చేశాడు.. గ్రామంలో డ్రైవర్‌గా పనిచేస్తున్న మల్లేష్ శుక్రవా రం పూటుగా మద్యం సేవించాడు. ఒంటి గంట రాత్రి ఇంటికి వచ్చి అదనపు కట్నం విషయంలో మమతతో ఘర్షపడ్డాడు. తను ఇక పుట్టింటి వారిని డబ్బులు అడిగేది లేదని స్పష్టం చేయడంతో తీవ్రంగా కొట్టాడు. నువ్వు ఇలా వినవంటూ కిరోసిన్ డబ్బా తీసుకొచ్చి మమత ఒంటిపై పోశాడు. ఆ సమయంలో ఇంట్లోనే ఉన్న మమత అత్త రాజమ్మ, వెంకన్న ఆ మృగాడిని వారించకుండా సహకరించారు. దీంతో రెచ్చిపోయిన మల్లేష్ అగ్గివెలిగించి మమతకు అంటించాడు. కాపాడండి.. కాపాడండి.. ఒంటిపై కిరోసిన్ పోసి నిప్పటించడంతో కాపాడండి.. కాపాడండి అంటూ మమత ఆర్తనాదాలు మిన్నంటాయి. చుట్టుపక్కల వారు దీనిని గమనించి వెంటనే వచ్చారు. అగ్నికి ఆహుతి అవుతున్న మమతను రక్షించేందుకు మంటలు ఆర్పి ఆస్పత్రికి తరలించారు. స్థానికుల దాడితో పరార్ మమతను భర్త, అత్త,మామలు కలిసి హత్య చేసేం దుకు ప్రయత్నించారని గ్రహించి స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘాతుకానికి ఒడిగట్టిన మల్లేష్, అత డి తలిదండ్రులను పట్టుకుని చితకబాదుతుండగా తప్పిం చుకుని పరారయ్యారు. వాంగ్మూలం ఇచ్చి కన్నుమూత తీవ్ర గాయాలపాలైన మమతను స్థానికులు వరంగల్ జిల్లా ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. అయితే అక్కడి నాలుగో తరగతి న్యాయమూర్తి ఎదుట భర్త, అత్త, మామలు అదనపు కట్నం కోసం తన ఒంటిపై కిరోసిన్ పోసి నిప్పంటించారని మమత వాం గ్మూ లం ఇచ్చింది. తదనంతరం పరిస్థితి విషమించడంతో ఆస్పత్రిలోనే చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిర్వహిం చి బంధువులకు అప్పగించారు. మృతురాలి తం డ్రి కుంభం అంజయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ కూతురు రాజయ్య తెలిపారు. -
రేషన్ కట్
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ప్రజాపంపిణీ వ్యవస్థ (పీడీఎస్) ద్వారా రేషన్‌షాపుల్లో ఇచ్చే బియ్యం, కిరోసిన్ కోటాకు కోత పడనుంది. వచ్చే నెల ఇచ్చే రేషన్‌లో కొందరు తెల్ల రేషన్‌కార్డుదారులకు బియ్యం, కిరోసిన్ కట్ చేయనున్నారు. ఆధార్ వివరాలతో సరిపోల్చడం ద్వారా గుర్తించిన బోగస్ యూనిట్లకు, గ్యాస్ కనెక్షన్ ఉన్న కార్డుదారులకు ఈ నిబంధన వర్తింపజేయనున్నారు. బోగస్ యూనిట్లుగా తేలిన వారికి నాలుగు కిలోల బియ్యం, గ్యాస్ కనెక్షన్ ఉన్న వారికి ఒక లీటర్ కిరోసిన్ కట్ చేయనున్నారు. గురువారం రాష్ట్రస్థాయి అధికారుల సమక్షంలో జరిగిన ఎలక్ట్రానిక్ ప్రజా పంపిణీ వ్యవస్థ (ఈపీడీఎస్) సమావేశంలో ఈ నిబంధన ద్వారా వచ్చే నెల జిల్లా రేషన్‌కోటాలో తగ్గే బియ్యం, కిరోసిన్‌లపై అధికారులు ఒక నిర్ధారణకు వచ్చారు. జిల్లాలో ఇప్పటివరకు గుర్తించిన 14 వేలకుపైగా బోగస్ కార్డులు, 2.5 లక్షల యూనిట్ల (వ్యక్తుల)కు గాను వచ్చే నెల రేషన్‌లో దాదాపు 4.8 లక్షల కిలోల బియ్యం, 75 వేల లీటర్ల కిరోసిన్ కోత పడనుంది. ఇందుకు సంబంధించి అన్ని వివరాలను జాయింట్ కలెక్టర్ కె. సురేంద్రమోహన్ సమన్వయపరుస్తున్నారు. ఆధార్ సరిపోల్చిన వివరాలను, ఎల్పీజీ కనెక్షన్ ఉన్న కార్డుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు ఉన్నతాధికారులు చెపుతున్నారు. జిల్లాలో 2.5 లక్షల యూనిట్లు ఎక్కువ.. జిల్లాలో ఉన్న కుటుంబాల కన్నా రేషన్‌కార్డులు ఎక్కువగా ఉన్నాయనే ఆరోపణలున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా అధికారంలోనికి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా తెల్లకార్డుల విషయంపై ప్రత్యేక దృష్టి పెట్టి బోగస్కార్డులుంటే తీసేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఆధార్ కార్డుల ద్వారా కార్డుదారుల వివరాలను జిల్లా యంత్రాంగం సరిపోల్చింది. జిల్లాలో 97 శాతం మందికి ఆధార్ నంబర్లు వచ్చినా ఇందులో 74 శాతం మంది వివరాలను మాత్రమే రేషన్‌కార్డులతో పోల్చి చూశారు. అలా చూస్తే దాదాపు జిల్లాలో 2.5 లక్షల బోగస్ యూనిట్లు (రేషన్‌కార్డులో పేరున్న వ్యక్తులు) ఉన్నట్టు తేలింది. అంటే... ఇకే వ్యక్తి పేర్లు రెండు, మూడు కార్డుల్లో ఉండడం, కొందరు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిపోవడం, కుటుంబ యజమానుల పేర్లు కుటుంబ సభ్యుల పేరిట జారీ అయిన కార్డుల్లో ఉండడం వంటి అవకతవకలు ఉన్నాయని తేలింది. ఈ విధంగా తెలంగాణలోనే అత్యధికంగా జిల్లాలో 2.5 లక్షల యూనిట్లు వెలుగులోనికి వచ్చాయి. అంటే ఒక్కో యూనిట్‌కు నాలుగు కిలోల బియ్యం ఇప్పటివరకు అదనంగా ఇస్తున్నారు. వీరందరికీ ఆ నాలుగు కిలోల బియ్యాన్ని నిలిపివేయనున్నారు. కుటుంబ సభ్యులు ఎంత మంది ఉన్నా నెలకు 20 కిలోల బియ్యం మాత్రమే ఇస్తారు. ఇలాంటి కార్డుల్లో ఐదుగురి కన్నా ఎక్కువ మంది ఉన్న కార్డుల్లో నుంచి కొందరిని తీసివేసినా ఆ కార్డుపై కోటా మాత్రం తగ్గదు. అంటే కొన్ని యూనిట్లు తగ్గినా కోటా తగ్గదు. ఈ నేపథ్యంలో జిల్లాలో వచ్చే నెల బియ్యం కోటాలో 4.8 లక్షల కిలోల బియ్యం (408 టన్నులు) తగ్గనుంది. తద్వారా ప్రభుత్వానికి నెలకు రూ.65 లక్షలకు పైగా ఆదా కానుంది. వాస్తవానికి రేషన్ ద్వారా ఇచ్చే బియ్యాన్ని ప్రభుత్వం కిలోకు రూ.25 చొప్పున కొనుగోలు చేస్తోంది. ఇందులో రూ.8 కేంద్రం భరిస్తుండగా, మరో రూపాయి కార్డుదారుడి నుంచి వసూలు చేస్తున్నారు. అంటే కిలో బియ్యంపై రాష్ట్ర ప్రభుత్వం రూ.16 చెల్లించాల్సి వస్తోంది. వచ్చే నెల నుంచి 4.8 లక్షల కిలోల బియ్యం తగ్గితే ప్రభుత్వానికి కిలోకు రూ.16 చొప్పున రూ.65 లక్షల మేరకు ఆదా కానుంది. గ్యాస్ ఉంటే కిరోసిన్ లేదు.. తెల్లకార్డుల ద్వారా ఒక్కో కుటుంబానికి నె లకు రెండు లీటర్ల కిరోసిన్ ఇస్తున్నారు. అయితే, నిబంధనల ప్రకారం గ్యాస్ కనెక్షన్ ఉన్న కుటుంబానికి కేవలం ఒక లీటర్ కిరోసిన్ మాత్రమే ఇవ్వాల్సి ఉంటుందని అధికారులు చెపుతున్నారు. ఈ కారణంతో ఇప్పటికే గ్యాస్ ఏజెన్సీల నుంచి మండలాల వారీగా క నెక్షన్ల వివరాలను జేసీ తెప్పించుకున్నారు. ఈ వివరాలను మండల స్థాయిలో తహశీల్దార్లకు పంపి పరిశీలన జరిపిన అనంతరం ఏ కార్డుదారునికి లీటర్ కిరోసిన్ ఇవ్వాలో నిర్ణయించనున్నారు. ఈ మేరకు జిల్లా అధికారులకు క్షేత్రస్థాయి నుంచి అందిన వివరాల విషయంలో ఎక్కడా తప్పులు జరగకుండా ఉండేందుకు గాను తహశీల్దార్ల నుంచి వ్యక్తిగత పూచీకత్తు కూడా తీసుకున్నారు. ఈ విధంగా గ్యాస్‌కు, కిరోసిన్‌కు లింకు పెట్టడం ద్వారా వచ్చే నెల 75 వేల లీటర్ల కిరోసిన్ కోత పడనుంది. లీటర్‌కు ప్రభుత్వంపై పడే భారం రూ.15 చొప్పున మరో రూ.11.25 లక్షలు కిరోసిన్ కోత ద్వారా ప్రభుత్వానికి ఆదా కానుంది. -
‘గ్యాస్, కిరోసిన్ ధరలు పెంచం’
పాట్నా: వంట గ్యాస్, కిరోసిన్ ధరలను పెంచకూడదని తమ ప్రభుత్వం నిర్ణయించినట్టు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. ధరల పెంపు వల్ల ప్రజలపై పడే భారాన్ని పరిగణనలోకి తీసుకున్న అనంతరం ఈ నిర్ణయానికి వచ్చినట్టు చెప్పారు. దీనివల్ల మధ్య తరగతి ప్రజలతో పాటు వంట కోసం కిరోసిన్ వినియోగించే పేదలకు లబ్ధి చేకూరుతుందన్నారు. పెట్రోల్ ధరలు మాత్రం మార్కెట్‌కు అనుగుణంగా మారుతుంటాయని చెప్పారు. రూపాయి స్థిరంగా ఉన్నందున భవిష్యత్తులో పెట్రో ధరల పెంపు ఉండకపోవచ్చన్నారు. ఆదివారం ఆయన బీహార్ రాజధాని పాట్నాలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న అనంతరం విలేకరులతో మాట్లాడారు. -
గ్యాస్, కిరోసిన్, డీజిల్ ధరలు పెంచం: పెట్రోలియం శాఖ
న్యూఢిల్లీ: సబ్సిడీ గ్యాస్ సిలెండర్లు, కిరోసిన్, డిజీల్ ధరలను పెంచే ఉద్దేశం లేదని పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పష్టం చేశారు. ప్రభుత్వం ముందు అలాంటి ప్రతిపాదనలేమి లేవని ప్రధాన్ తెలిపారు. కిరోసిన్, డీజిల్, ఎల్ పీజీ గ్యాస్ సిలెండర్ల ధరల పెంచేందుకు ప్రభుత్వ ప్రతిపాదన ఉందని వస్తున్న వార్తలను ఖండించారు. ఎల్ పీజీ గ్యాస్ సిలెండర్ ధర 250 రూపాయలు, కిరోసిన్ 5 రూపాయలు పెంచాలని కిరిటీ పరేఖ్ ప్యానల్ సిఫారసు చేసినప్పటికి ఇప్పట్లో ధరల పెంపు ఉండదన్నారు. బుధవారం నాన్ సబ్సిడీ ఎల్ పీజీ ధరను 16.50 రూపాయలు పెంచిన సంగతి తెలిసిందే. -
గ్యాస్ సిలిండర్ ధర రూ. 250 చొప్పున పెంపు?
ఇంట్లో కట్టెల పొయ్యి ఉందా? అయితే.. మళ్లీ కట్టెలు కొనుక్కుని దాన్ని వెలిగించడం మొదలుపెట్టండి. ఎందుకంటే.. గ్యాస్ సిలిండర్ ధరను సిలిండర్‌కు రూ. 250 చొప్పున పెంచాలని కేంద్ర చమురు మంత్రిత్వశాఖ భావిస్తోంది. ఈ విషయాన్ని రాజకీయ వ్యవహారాల కేబినెట్ కమిటీ దృష్టికి చమురు మంత్రిత్వశాఖ తీసుకెళ్లనుంది. కిరోసిన్, గ్యాస్ సిలిండర్ల ధరలను నిపుణుల కమిటీ సూచించిన మేరకు పెంచాలని ఈ శాఖ భావిస్తోంది. గతంలో కిరీట్ పారిఖ్ కమిటీ చేసిన ప్రతిపాదనల మేరకు కిరోసిన్‌ను లీటరుకు రూ. 4-5 చొప్పున, గ్యాస్ సిలిండర్లను సిలిండర్‌కు రూ. 250 చొప్పున పెంచాలని చమురు మంత్రిత్వ శాఖ ప్రతిపాదిస్తోంది. ఈ విషయాన్నే కేబినెట్ కమిటీకి నివేదిస్తోంది. ఇక నెలకు డీజిల్ ధరలను 40-50 పైసల వంతున పెంచాలన్న నిర్ణయాన్ని కొనసాగించాలని కూడా ఈ శాఖ భావిస్తోంది. కేబినెట్ ఆమోదం తెలిపితే చాలు.. ఇక సిలిండర్ల మీద భారీ వడ్డన తప్పకపోవచ్చు. ఇప్పటికే నిత్యావసరాలు, కూరగాయల ధరల మంటతో అల్లాడుతున్న సామాన్యుడికి ఇది పెనుభారంగానే పరిణమిస్తుంది. -
పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య
తూప్రాన్ : మండలం వెంకటాయిపల్లిలో గురువారం తెల్లవారుజామున ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఓ టెన్త్ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. వివరాలు.. వెంకటాయిపల్లికి చెందిన సయ్యద్ అలీకి రెండో కుమార్తె సయ్యద్ హసీనా (15) స్థానిక ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. బుధవారం అర్ధరాత్రి ఒంటి గంటకు ఇంట్లో సెల్‌ఫోన్ మోగింది. తల్లిదండ్రులు నిద్రిస్తుండడంతో.. హసీనా ఫోన్ తీసి ఇంటి బయటకెళ్లి మాట్లాడింది. కొద్దిసేపటి తర్వాత సయ్యద్ అలీకి మెలకువ రాగా, కుమార్తె కనిపించకపోవడంతో ఆయన బయటకొచ్చాడు. హసీనా ఏడ్చుకుంటూ వస్తుండడంతో ఏమైందంటూ తండ్రి ఆరా తీశాడు. ఆమె ఏమీ చెప్పకుండా.. తాను గురువారం ఉపవాస దీక్ష ఉంటానని మాత్రమే చెప్పి పడుకుంది. కాగా, గురువారం తెల్లవారుజాములోపే స్నానం చేసి ఓ గదిలోకి వెళ్లిన హసీనా గడియ పెట్టుకుంది. అనంతరం ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. కేకలు విన్న తండ్రి ఇరుగు పొరుగువారి సాయంతో తలుపులు పగులగొట్టి లోనికి వెళ్లేలోపే హసీనా మృతి చెందింది. ఈ సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గజ్వేల్ ప్రభుత్వాస్పత్రికి తరలించి కేసును దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నిరంజన్‌రెడ్డి తెలిపారు. ఇదిలా ఉండగా.. అర్ధరాత్రి సెల్‌ఫోన్‌కు వచ్చిన కాల్ గ్రామానికి చెందిన వ్యక్తిదని, అతను పరారీలో ఉన్నట్లు గ్రామస్తులు పేర్కొన్నారు. -
అన్నదాతపై నకిలీల వల
- రైతులకు నకిలీ విత్తనాలు, ఎరువుల బెడద - దుకాణాలపై కొరవడిన నిఘా - నట్టేట మునుగుతున్న రైతులు - పట్టించుకోని ప్రభుత్వం, అధికార యంత్రాంగం ఒంగోలు టూటౌన్: జిల్లాలో ఎరువులు, విత్తనాల దుకాణాలపై అధికారుల నిఘా కొరవడింది. కొందరు వ్యాపారులు నకిలీ విత్తనాలు, ఎరువులతో అన్నదాతను నిలువునా ముంచుతున్నారు. అక్షర జ్ఞానం లేని రైతులను ఏదోఒక విధంగా నాణ్యత పేరుతో దోపిడీ చేయడం పరిపాటిగా మారింది. నకిలీల బెడద నుంచిరైతులను కాపాడటంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది. - జిల్లాలో 12 వ్యవసాయ డివిజన్లున్నాయి. సుమారుగా 500 వరకు విత్తన దుకాణాలు, 670 ఎరువుల దుకాణాలు ఉన్నాయి. లెసైన్స్ లేని దుకాణాలు సైతం లేకపోలేదు. ఏయే దుకాణంలో ఎంతెంత నిల్వలున్నాయో కూడా అధికారులకు తెలియని పరిస్థితి. - కొంతమంది వ్యాపారులు ఎరువులకు అనుమతులు కూడా లేకుండా బ్లాక్ మార్కెట్‌గా అమ్ముతూ పట్టుపడుతున్నారు. ఏటా ఖరీఫ్ సీజన్‌కు ముందు విజిలెన్స్ అధికారులు నామమాత్ర దాడులతో సరిపెట్టుకుంటూ మమ అని పిస్తున్నారు. ఆ తరువాత విత్తనాలు, ఎరువుల దుకాణాలపై నిఘా లేకపోవడంతో వ్యాపారులు ఆడిందే ఆట.. పాడిందే పాటగా తయారైంది. - ప్రభుత్వం కూడా సీజన్లో రైతులకు సరిపడా ఎరువులు, విత్తనాలు సరఫరా చేయడంలో నిర్లక్ష్యం వహిస్తుండటం అన్నదాతకు శాపంగా మారింది. దీంతో ప్రైవేట్ వ్యాపారుల హవా కొనసాగుతోంది. - ఇటీవల ఎరువులు, విత్తనాల దుకాణాలపై విజిలెన్స్ అధికారులు నామమాత్రంగా దాడులు చేస్తేనే అనేక అక్రమాలు వెలుగు చూశాయి. గిద్దలూరు, కంభంలలో రెండు దుకాణాలపై దాడులు చేసి 28 టన్నుల ఎరువులను సీజ్ చేశారు. అనుమతులు లేని కారణంగా 87 టన్నుల ఎరువులను నిలుపుదల చేశారు. - యర్రగొండపాలెం, త్రిపురాంతకం మండలాల్లో వ్యవసాయ అధికారుల బృందాలు దాడులు చేశాయి. 24 లక్షల 67 వేల విలువైన విత్తనాల అమ్మకాలను నిలుపుదల చేసినట్లు వ్యవసాయశాఖ జేడీ జె మురళీకృష్ణ తెలిపారు. నకిలీవని అనుమానం వచ్చిన విత్తనాలను లేబొరేటరీకి పంపిస్తున్నట్లు పేర్కొన్నారు. - ఏటా ఖరీఫ్, రబీ సీజన్లలో కోట్ల రూపాయలను ఎరువులు, పురుగుమందుల, విత్తనాల కొనుగోలుకు రైతులు కుమ్మరిస్తున్నారు. రైతుల్లో ఎక్కువగా నిరక్షరాస్యులు కావడంతో విత్తనాలు, ఎరువుల దుకాణ దారుల చేతిలో నిత్యం మోసపోతూనే ఉన్నారు. ఏది నకిలీదో.. ఏది మంచిదో తెలియక అయోమయానికి గురవుతున్నారు. - పురుగు మందులు, ఎరువులు, విత్తనాలపై చైతన్య పర్చాల్సిన అధికారులు మిన్నకుంటున్నారు. పైగా ఎరువుల వ్యాపారులతో అధికారులు కుమ్మక్కై దాడులకు వెనకాడుతున్నారన్న విమర్శలూ ఉన్నాయి. ఇప్పటికైనా అధికారులు విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల దుకాణాలపై నిఘా ఉంచి రైతులు మోసపోకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
నల్లబజారుకు.. నీలి కిరోసిన్
- చౌకధరల దుకాణాల్లో రెండు నెలలకోసారి సరఫరా చేస్తున్న కిరోసిన్ - నిత్యవసర సరుకుల పరిస్థితీ అంతంతే - మామూళ్ల మత్తులో రెవెన్యూ అధికారులు గిద్దలూరు: చౌకధరల దుకాణాల ద్వారా పేదలకందించే నిత్యవసర వస్తువులు పక్కదారి పడుతున్నాయి. అరకొర వస్తువులు సరఫరా చేస్తున్నా.. అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారు. డీలర్లు రెండు నెలలకు ఒకసారి ఒకనెల కిరోసిన్ పంపిణీ చేస్తూ..అందులోనూ సగం పక్కదారి పట్టిస్తున్నారు. ఇదంతా రెవెన్యూ అధికారులకు తెలిసినా మామూళ్ల మత్తులో మునిగి తేలుతూ పట్టించుకోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కార్డుదారులు దీనిపై అధికారులను నిలదీసినా పట్టించుకున్న పాపాన పోలేదు. నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో 194 రేషన్‌షాపులుండగా అందులో 65,500 రేషన్ కార్డులున్నాయి. ప్రతి నెలా లక్షా 31 వేల లీటర్ల కిరోసిన్ సరఫరా అవుతుంది. గిద్దలూరు మండలంలో ఉన్న 25 వేల రేషన్‌కార్డులకు 50 వేల లీటర్ల కిరోసిన్ ప్రతినెలా కేటాయిస్తారు. ఇందులో 50 శాతం కార్డుదారులకు కూడా కిరోసిన్ సక్రమంగా అందడం లేదు. దీనికి తోడు ప్రభుత్వం కిరోసిన్ పంపిణీపై నెలకొక విధానాన్ని అమలు చేయడ మూ డీలర్లకు కాసుల వర్షం కురిపిస్తోంది. - మొదట దీపం గ్యాస్దారులకు కిరోసిన్ నిలిపేశారు. తిరిగి గ్యాసు కార్డుదారులకు రెండు లీటర్లు, గ్రామీణ ప్రాంతాల్లోలీటరు, గ్యాస్ లేని వారికి రెండు లీటర్ల కిరోసిన్ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. అయినా ఆ కార్డుదారులకు కిరోసిన్ సక్రమంగా వచ్చిన దాఖలాల్లేవు. - మొదట మండల కేంద్రాల్లో నాలుగు లీటర్లు పోయాలన్నారు. తరువాత నాలుగు నుంచి రెండు లీటర్లకు కుదించారు. ప్రస్తుతం అది కూడా అమలు కావడం లేదు. - ఇక గ్రామీణ ప్రాంతాల్లో పంపిణీ మరింత అధ్వానంగా తయారైంది. దీనిపై కార్డుదారులు అధికారులకు ఫిర్యాదు చేస్తున్నా ఫలితం ఉండటం లేదు. ఎవరికైనా ఫిర్యాదు చేస్తే వారిపై దాడులు చేయడం, రేషన్ కార్డులు రద్దు చేయించడం జరుగుతోంది. సదరు డీలర్లకు రాజకీయ నాయకుల ఆశీస్సులు పుష్కలంగా ఉండటంతో వారు ఆడిందే ఆట పాడిందే పాటగా వ్యవహరిస్తున్నారు. 29వ తేదీన కిరోసిన్ సరఫరా: కిరోసిన్ హోల్‌సేల్ డీలర్లు చౌకధరల దుకాణాలకు ప్రతి నెలా సరఫరా చేయాల్సి ఉన్నా రెండు నెలలకొకసారి నెలాఖరులో కిరోసిన్‌ను సరఫరా చేస్తున్నారు. దీంతో ఒక నెల కిరోసిన్‌ను పక్కదారి పట్టించి హోల్‌సేల్ డీలర్ టోకుగా అమ్మేసి స్థానిక అధికారులకు, డీలర్లకు కొంత ముట్టచెబుతూ తన జేబులు నింపుకుంటున్నాడు. ఈనెలలో కిరోసిన్ ఎందుకు రాలేదని కార్డుదారులు డీలరును ప్రశ్నిస్తే తహశీల్దారును అడగమని, తహశీల్దారును అడిగితే స్టాకు రాలేదంటూ కాలం వెళ్లబుచ్చుతున్నారు. ఇందుకు కారణం మార్కెట్లో నీలి కిరోసిన్ ధర లీటర్ రూ.40 నుంచి రూ.45 వరకు పలకడమే. డీలర్‌కు లీటరు కిరోసిన్‌ను రూ.14.75కు హోల్‌సేల్ డీలర్లు సరఫరా చేస్తున్నారు. దానిని రూ.15 కు కార్డుదారులకు విక్రయించాలి. లీటరు కిరోసిన్ కార్డుదారులకు విక్రయిస్తే డీలర్‌కు వచ్చేది 25 పైసలు మాత్రమే. అదే కిరోసిన్‌ను పక్కదారి పట్టిస్తే లీటరుకు రూ.25 నుంచి రూ.30 వస్తాయి. దీంతో డీలర్లు అక్రమంగా విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. అవినీతి జరుగుతోందిలా... - కిరోసిన్‌ను డీలరుకు పోసే సమయంలో విధిగా రూట్ అధికారి ఉండాలి. కానీ, ఇది ఎక్కడా అమలు కావడం లేదు. రూట్ అధికారికి అందేది అందుతుండటంతో వారు నోరు మెదపడం లేదు. - గిద్దలూరు ప్రాంతంలో ప్రతినెలా సరఫరా చేయాల్సిన కిరోసిన్‌ను రెండు నెలలకు ఒకసారి ఒక నెల కిరోసిన్‌ను అదీ నెలాఖరులో సరఫరా చేస్తున్నారు. - ట్యాంకరు నుంచి డీలరు తనకు కేటాయించిన కిరోసిన్‌లో సగమే తీసుకుని మిగిలిన కిరోసిన్‌ను అందులోనే ఉంచేసి హోల్‌సేల్ డీలరుకు అమ్మేసుకుంటాడు. ఇలా మిగిలిన కిరోసిన్ బ్లాక్ మార్కెట్‌కు తరలుతోంది. - ట్యాంకర్ ద్వారా రాత్రిపూట కిరోసిన్ చౌకదుకాణాలకు సరఫరా అవుతోంది. కిరోసిన్ సరఫరా జరిగిన మరుసటి రోజు తనిఖీ చేస్తే డీలర్ల అవినీతి బయటపడుతుంది. - తహశీల్దార్ కార్యాలయంలో ఏ కార్యక్రమం జరిగినా ఆ ఖర్చంతా తామే భరించాల్సి ఉంటుందని, ఇది కాక నెల వారీ చెల్లింపులు ఉంటాయని, ఇదేమీ రహస్యం కాదని డీలర్లు చెబుతుండటం గమనార్హం. ఇలాంటి లొసుగుల వలన అధికారులు వారి పట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. దీంతో డీలర్ల అవినీతి పెచ్చుమీరుతోంది. - డీలర్లు అక్రమంగా తరలించే సరుకులను పోలీసులు పట్టుకుంటే తప్ప రెవెన్యూ, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు స్వయానా పట్టుకున్న పాపానపోలేదు. ఇలా డీలర్లు, రెవెన్యూ అధికారులు కార్డుదారులను మోసం చేస్తూ కోట్లకు పడగలెత్తుతున్నారు. ఏఎస్ఓ వివరణ: ఈ విషయమై జిల్లా ఏఎస్ఓ ఖాదర్మస్తాన్ను వివరణ కోరగా ట్యాంకర్ వెంట కచ్చితంగా రూటు ఆఫీసర్‌గా ఆర్ఐ వెళ్లాల్సి ఉందని, కిరోసిన్ లోడ్ కావడం ఆలస్యమైందన్నారు. ప్రతినెలా నెలాఖరులోగా కార్డుదారులకు కిరోసిన్ పంపిణీ చేయాలన్నారు. ఈవిషయం తన దృష్టికి రాలేదని.. విచారించి చర్యలు తీసుకుంటామని చెప్పారు. -
‘ధర’ణి మండుతోంది
సాక్షి, ఏలూరు:కూరగాయలు, సన్న బియ్యం, పాలు, సిమెంట్ ధరలు ఆకాశంలో విహరిస్తున్నాయి. కొత్తగా అధికారంలోకి వచ్చిన ఎన్డీయే ప్రభుత్వం పెం చిన రైల్వే చార్జీలు బుధవారం నుంచి అమలులోకి వచ్చాయి. గ్యాస్ సిలిం డర్, కిరోసిన్ ధరలను ప్రతినెలా పెంచుతామని కేంద్రం ప్రకటిం చింది. ఇలా అన్ని రకాలుగా ప్రజల నెత్తిన మోయలేని ఆర్థిక భారం పడుతుంటే పాలకులు మాత్రం చోద్యం చూస్తున్నారు. కూర ‘గాయాలే’ ఎండల కారణంగా కూరగాయ పంటలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి. ఫలితంగా ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. రిటైల్ మార్కెట్లో కిలో ఉల్లి రూ.30, వంకాయ రూ.60, బీరకాయ రూ.50, బెండ రూ.40, దొండ రూ.24, క్యారట్ రూ.60, బీట్రూట్ రూ.40, బీన్స్ రూ.120, క్యాప్సికం రూ.60 పలుకుతున్నాయి. ఇవే కూరగాయలు నెల రోజుల క్రితం ఇప్పుడున్న ధరల్లో సగం ధరకే వచ్చేవి. సన్న బియ్యం.. ధర ఘనం సన్నబియ్యం (సోనా, బీపీటీ, పీఎల్) ధరలు సామాన్యుడు కొనేలా లేవు. ఈ ఏడాది ప్రారంభంలో కిలో రూ.30 నుంచి రూ.35కే దొరికే సోనా రకం బియ్యం ధర రకాన్ని బట్టి రూ.40-రూ.50 మధ్య పలుకుతోంది. బియ్యం వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నా అధికారులు వారివైపు కన్నెత్తి చూడటం లేదు. సాధారణ రకం బియ్యం ధరలు కూడా క్వింటాల్‌కు రూ.200 నుంచి రూ.300 వరకూ పెరిగాయి. సిమెంటు, ఇసుక ధరలకు రెక్కలు గుట్టలుగా నిల్వ చేసిన ఇసుకను వ్యాపారులు అధిక ధరకు విక్రయిస్తున్నారు. ఐదు యూనిట్ల లారీ ఇసుక రూ.20వేలు పలుకుతోంది. ర్యాంపుల్లో ఇసుక తవ్వకాలు ఉన్నప్పుడు యూనిట్ ధర కేవలం రూ.1,500 నుంచి రూ.2,000 ఉండేది. గతంలో బస్తా సిమెంటు రూ.200 ఉంటే ప్రస్తుతం రూ.300కు చేరింది. భవన నిర్మాణాలకు అనువైన కాలం కావడంతో డిమాం డ్‌ను దృష్టిలో ఉంచుకుని వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. ముందుగానే సరుకు కొని నిల్వచేసి ఇప్పుడు ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారు. పాల ధరలూ పెరిగాయ్ వర్షాలు కురవకపోవడంతో పశుగ్రాసం కొరత ఏర్పడింది. పాల ఉత్పత్తి తగ్గిపోయింది. కొరత కారణంగా పాల ధరలు పెరిగాయి. మొన్నటి వరకూ లీటరు పాలు రూ.42 ఉంటే ప్రస్తుతం రూ.46కు పెరిగింది. దీంతో పెరుగు, వెన్న ధరలు కూడా పెరుగుతున్నాయి. ధరాభారాన్ని భరించలేక పేద, మధ్య తరగతి ప్రజలు పాలు, వాటి ఉప ఉత్పత్తుల వినియోగాన్ని తగ్గించుకుంటున్నారు. సిలిం‘ఢర్’ గ్యాస్ సిలిండర్, కిరోసిన్ ధరలను ప్రభుత్వం పెంచేసింది. ఇకపై ప్రతినెలా సిలిండర్‌పై రూ.5, కిరోసిన్‌పై రూ.1 చొప్పున పెంచుతామని ప్రకటించింది. విద్యుత్ కోతలతో రాత్రివేళ చీకట్లోనే కాలం వెళ్లదీస్తున్న పేద ప్రజలకు కిరోసిన్ దీపమే ఆధారం. ఇకపై వారికి ఈ కాస్త వెలుగు దూరం కానుంది. గ్యాస్ సిలిండర్లు ఇప్పటికే బ్లాక్ మార్కెట్ బాటపట్టి అందనంత దూరంలో ఉంటున్నాయి. వీటి ధరల పెంపు విషయంలో ప్రభుత్వ నిర్ణయంపై ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవడంతో కేంద్రం వెనక్కు తగ్గింది. మూడు నెలల వరకూ ఈ నిర్ణయాన్ని అమలు చేయబోమని బుధవారం స్పష్టం చేసింది. ఆ తరువాత అరుునా ధరల మోత తప్పేట్టు లేదు. -
రిక్తహస్తం
ఆదిలాబాద్ టౌన్ : అమ్మహస్తం పథకం నిలిచింది. వినియోగదారులకు పంపిణీ చేయాల్సిన తొమ్మిది రకాల సరుకుల జాడ లేదు. రూ.185 ధరకే నిత్యావసర సరుకులు పంపిణీ చేసేందుకు తలపెట్టిన అమ్మహస్తం పథకానికి ప్రభుత్వం మంగళం పాడింది. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అందించే సాధారణ సరుకులైన బియ్యం, కిరోసిన్, చక్కెరతోపాటు అదనంగా కారం, పసుపు, చింతపండు, పామాయిల్, గోధుమపిండి, గోధుమలు, ఉప్పు తదితర సరుకులు రూ.185కే అందిస్తున్నారు. గత ప్రభుత్వంలో అప్పటి సీఎం కిరణ్ హంగు ఆర్భాటాలతో ప్రవేశపెట్టిన పథకం ప్రస్తుతం కథ ముగిసింది. దీంతో అదనపు సరుకుల పంపిణీ పూర్తిగా నిలిచిపోవడంతో సాధారణ సరుకులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అటకెక్కినట్టేనా! జిల్లాలో 7.05 లక్షల మంది రేషన్‌కార్డుల దారులు ఉన్నారు వీరందరికి నెలవారీగా సరకులు పంపిణీ చేస్తున్నారు. అమ్మహస్తం పథకంలో భాగంగా ఈ కార్డుదారులకు ప్రతినెల తొమ్మిది రకాల సరుకు అందజేయాలి. కాగా అమ్మహస్తం సరుకుల్లో నాణ్యత కొరవడంతో కార్డుదారులు కొనుగోలుకు ఆసక్తి చూపడం లేదు. నాణ్యమైన సరుకులు అందిస్తామంటూ అప్పటి ప్రభుత్వం, నేతలు ప్రగల్భాలు పలికినప్పటికీ క్షేత్రస్థాయిలో సరుకులపై తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. ఫలితంగా రేషన్ డీలర్లు క్రమంగా ఈ సరుకులను పక్కన పెట్టారు. కేవలం బియ్యం, చక్కెర, పామాయిల్ సరుకులకు మాత్రమే డీడీలు కట్టి స్టాకు తెప్పించుకోవడంతో మిగతా సరుకుల ప్రాధాన్యం క్రమంగా పడిపోయింది. కేవలం బియ్యం, చక్కెర, పామాయిల్ మాత్రమే అందజేస్తూ వచ్చారు. బహిరంగ మార్కెట్లో ఈ వస్తువుల ధరలు రెట్టింపు ఉండడంతో పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిల్వలు ముక్కిపోయి అమ్మహస్తం పథకం కింద జిల్లాకు కేటాయించిన సరుకులు చింతపండు, కారం, ఉప్పు, గోధుమలు, గోధుమపిండి తదితర సరుకులకు డిమాండ్ లేకుండపోయింది. రేషన్ డీలర్లు సరుకులు తీసుకపోవడంతో వాటిని పౌరసరఫరాల శాఖ అధికారులు గోదాంల్లోనే నిల్వ ఉంచారు. దీంతో కొన్ని సరకులు ముక్కిపోవడంతో ప్రభుత్వానికి నష్టం సంభవించినట్లు తెలుస్తోంది. అయితే ఈ నెలకు సంబంధించి జిల్లాకు వచ్చిన స్టాకులో చింతపండు ఈనెల 14,848 ప్యాకెట్లు, పసుపు నిల్వ 130, కారం 1,92,764, ఉప్పు 64 వేలు, చక్కెర 90 వేలు, గోధుమలు 44 వేలు, గోధుమపిండి 50 వేల ప్యాకెట్లు అందుబాటులో ఉన్నాయని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే ఈ సరుకులన్నీ కార్డుదారులందరికీ సరిపోవు. కేవలం బియ్యం, చక్కెర మాత్రమే పంపిణీ చేసి చేతులు దులుపుకుంటున్నారు. వినియోగదారులు సరుకుల కోసం అడిగితే స్టాక్ లేదంటూ తప్పించుకుంటున్నారు. మూడు నెలల నుంచి పామాయిల్ బంద్ రేషన్ కార్డుదారులకు కిలో చొప్పున అందించే పామాయిల్ కొరత జిల్లాలో తీవ్రంగా ఉంది. మూడు నెలల నుంచి కార్డుదారులకు అందడంలేదు. జిల్లాకు 7.05 లక్షల కార్డుదారులకు పామాయిల్ ప్యాకెట్లు అవసరం. ఏప్రిల్ నెల నుంచి రేషన్ కార్డు దారులకు పామాయిల్ పంపిణీ కావడం లేదు. తాజాగా ఈ నెలలో కూడా పామాయిల్ సరాఫరా నిలిచింది. కొత్త ప్రభుత్వం కొలువుదీరిన నేపథ్యంలో ఈ ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. అమ్మహస్తం సరుకులు తీసుకోవడం లేదు.. - జిల్లా పౌరసరఫరాల మేనేజర్ అమ్మహస్తం సరుకులను కార్డుదారులు తీసుకెళ్లడం లేదు. దీంతో డీలర్లు ఆ వస్తువులకు సంబంధించి డీడీలు కట్టడంలేదు. గోదాముల్లో ఉన్న సరుకులను డీడీలు కట్టిన వారికి పంపిణీ చేస్తున్నాం. మూడు నెలల నుంచి పామాయిల్ రావడం లేదు. పామాయిల్ వచ్చిన వెంటనే వినియోగదారులకు అందజేస్తాం. -
రిక్తహస్తం
ఒంగోలు టూటౌన్, న్యూస్‌లైన్: అమ్మహస్తం పథకం నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. రెండు నెలలుగా పేదలకు తొమ్మిది రకాల వస్తువులు అందటం లేదు. కేవలం బియ్యం, కిరోసిన్, చక్కెర మాత్రమే సరఫరా అవుతోంది. మార్కెట్లో నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటడంతో గత ప్రభుత్వం 2013 ఏప్రిల్‌లో అమ్మహస్తం పథకం ప్రవేశపెట్టింది. రూ.185కే తొమ్మిది రకాల సరుకులను చౌకడిపోల ద్వారా తెల్లకార్డు దారులకు ఇచ్చేందుకు ముందుకొచ్చింది. తొమ్మిది రకాలలో అరకిలో పంచదార, పామాయిల్ ప్యాకెట్, కిలో కందిపప్పు, కిలో గోధుమలు, గోధుమపిండి, 250 గ్రాముల కారంపొడి, అరకిలో చింతపండు, 100 గ్రాముల పసుపు, కిలో ఉప్పు ప్యాకెట్ ఉంటాయి. నిత్యవసర వస్తువులను ప్రభుత్వ సరఫరా చేయక, ఇటు బయట ధరలు తగ్గక పేదలు అల్లాడిపోతున్నారు. ఈ పథకం ప్రారంభం నుంచే అభాసుపాలవుతోంది. నాణ్యత లేని చింతపండు, కందిపప్పు, పురుగులు పట్టిన గోధుమపిండి సరఫరా చేశారు. గతంలో కూడా రెండు నెలల వరకు సరుకులు సక్రమంగా ఇవ్వకపోవడంతో విమర్శలు వెల్లువెత్తాయి. సరుకులకు అలాట్మెంట్ మాత్రం అధికారులు ఇస్తున్నారు. రెండు నెలలుగా గోదాముల్లో ఒకటి, రెండు సరుకులుంటున్నాయి తప్పితే పూర్తి స్థాయిలో ఉండటం లేదు. గతనెలలో కొన్ని మండలాలకు అసలు సరుకులే అందని పరిస్థితి ఉంది. మరికొంతమంది డీలర్లకు నెల చివరి వరకు సరుకులు అందడం లేదు. కేవలం పంచదార, కిరోసిన్, బియ్యం మాత్రమే ఉన్నాయన్న సమాధానం డీలర్ల నుంచి వినపడుతోంది. జిల్లాలో 2,085 పైగా చౌరధరల దుకాణాలున్నాయి. ఒంగోలు డివిజన్లో 924, కందుకూరు డివిజన్లో 750, మార్కాపురం డివిజన్లో 432 చౌకధరల దుకాణాలున్నాయి. 8,90,507 మంది కార్డుదారులుండగా వాటిలో 6,73,999 తెల్లకార్డుదారులున్నారు. వీరిలో రెండొంతులకు పైగా రెక్కాడితేగానీ డొక్కాడని కుటుంబాలున్నాయి. వీరంతా ప్రభుత్వం రాయితీపై అందిస్తున్న నిత్యవసర వస్తువులపై ఆధార పడి జీవిస్తున్నారు. అయితే రెండు నెలలుగా పథకం సక్రమంగా అమలు కావడం లేదు. అసలు సరుకులు వచ్చేదీ లేనిది అధికారుల నుంచి స్పష్టత లేదని డీలర్ల సంఘం నాయకులు ఆరోపిస్తున్నారు. డీలర్లు కేవలం బియ్యానికి మాత్రమే డీడీలు తీసినట్లు డీలర్ల అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కూరపాటి సుబ్బారావు ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. ప్రస్తుతం బియ్యం మాత్రం ట్రాన్స్‌పోర్టు అవుతున్నాయన్నారు. అమ్మహస్తం సరుకులపై పౌరసరఫరాల సంస్థ డీఎం పీవీ కొండయ్య దృష్టికి తీసుకురాగా..గోధుమపిండి, కందిపప్పు, సాల్ట్ అందుబాటులో ఉన్నాయని తెలిపారు. పామాయిల్ రెండు నెలలుగా రావడంలేదన్నారు. పసుపు, కారం, చింతపండు అనుకున్న మేర డిమాండ్ లేని కారణంగా అందుబాటులో ఉంచలేకపోయామని తెలిపారు. -
వంటింటి సంక్షోభం
కర్నూలు, న్యూస్‌లైన్ : చౌకడిపోల ద్వారా పేదలకు అందించే పామోలిన్ సరఫరా నిలిచిపోయింది. సామాన్య, మధ్య తరగతి కుటుంబాల్లో వంటింటి ఘుమఘుమలకు గడ్డుకాలం తలెత్తింది. గత ప్రభుత్వం మూడు నెలలకు సంబంధించి డబ్బు బకాయి పడటంతో పామాయిల్ పారిశ్రామికవేత్తలు సరఫరా చేయలేమంటూ చేతులెత్తేయడమే ఇందుకు కారణమైంది. రెండు నెలల క్రితమే సరఫరా నిలిచిపోయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టకపోవడం గమనార్హం. జూన్ నెలలోనూ పామాయిల్ సరఫరా లేదనే చేదు వార్త పౌరసరఫరాల శాఖ నుంచి జిల్లా యంత్రాంగానికి చేరింది. ఈ మేరకు జాయింట్ కలెక్టర్ కన్నబాబు ద్వారా ఆర్డీఓలు, అక్కడి నుంచి తహశీల్దార్లకు సమాచారం అందింది. తెల్లకార్డుదారులకు రాయితీ ధరపై పంపిణీ చేస్తున్న పామోలిన్ ఆయిల్ జూన్ తర్వాతనైనా వచ్చే అవకాశాలపై జిల్లా అధికారులు స్పష్టత ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. మే నెలలోనూ సరఫరా చేపట్టలేదు. అంతకుముందు నెలకు సంబంధించి క్లోజింగ్ బ్యాలెన్స్ కింద గోదాముల్లోని మిగులును మాత్రం కొన్ని గ్రామీణ ప్రాంతాల చౌకడిపోలకు చేరవేశారు. బహిరంగ మార్కెట్లో వేరుశనగ నూనె ధర రూ.85 కాగా.. సామాన్య, మధ్య తరగతి ప్రజలు వినియోగించే పామోలిన్ ధర రూ.65 పలుకుతోంది. నిత్యావసర సరుకుల దుకాణాల్లో రేషన్‌కార్డులకు లీటర్ పామోలిన్ వంటింటి సంక్షోభం రూ.40లకు లభ్యమవుతోంది. మలేషియా నుంచి నిలిచిన దిగుమతి పామోలిన్ ఆయిల్ మలేషియా నుంచి దిగుమతి అవుతుంది. అక్కడి నుంచి కాకినాడ సీపోర్టుకు చేరుతుంది. అక్కడే ప్యాకింగ్ చేసి అన్ని జిల్లాలకు సరఫరా చేస్తారు. దిగుమతి చేసుకునే సమయంలో సబ్సిడీ ధరను రాష్ట్ర ప్రభుత్వం జమ చేయాల్సి ఉంటుంది. ఈ రకంగా మూడు నెలల నుంచి జమ చేయడం లేదని అధికారులు చెబుతున్నారు. దీంతో పామోలిన్ దిగుమతి నిలిచిపోయింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన అమల్లోకి వచ్చింది. ఆ తర్వాత వరుస ఎన్నికలు జరిగాయి. దీంతో పామోలిన్ సబ్సిడీ ధర చెల్లింపుపై సందిగ్ధం నెలకొంది. ఈ కారణంగా పామోలిన్ సరఫరా నిలిచిపోయింది. కార్డుదారులపై అదనపు భారం పేదలు అధికంగా వినియోగించే వంట నూనె పామోలిన్ సరఫరాపై ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా కార్డుదారులపై అదనపు భారం పడుతోంది. జిల్లాలో 11.40 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. కార్డుకు లీటరు చొప్పున(ప్యాకెట్) 2,374 చౌక డిపోల ద్వారా పేదలందరికీ ప్రతి నెలా 11.40 లక్షల లీటర్ల పామోలిన్ సరఫరా చేసేవారు. అది నిలిచిపోవడంతో బహిరంగ మార్కెట్లో వంట నూనెను అధిక ధరకు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. ఈ లెక్కన ప్రతి నెలా కార్డు వినియోగదారులపై రూ.2.85 కోట్ల అదనపు భారం పడుతోంది. జూన్ నెలలో పామోలిన్ ఇవ్వాలనుకుంటే 8వ తేదీన వచ్చే కొత్త ప్రభుత్వం ఈ విషయంపై కీలక నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అమ్మహస్తం.. అస్తవ్యస్తం అమ్మహస్తం కింద తొమ్మిది రకాల సరుకులతో కార్డుదారులకు పంపిణీ చేసే సరుకుల సంచి నెమ్మదిగా చిక్కిపోతుంది. తొమ్మిది సరుకుల స్థానంలో ప్రస్తుతం బియ్యం, పంచదారా, కందిపప్పు, గోధుమ పిండితో సరిపెడుతున్నారు. పసుపు, కారంపొడి నాసిరకం కావడం.. గోధుమ పిండి పురుగు పట్టి మగ్గిన వాసన వస్తుండటంతో కొనుగోలుదారులు సుముఖత చూపడం లేదు. దీంతో ఈ సరుకుల పంపిణీ అంతంత మాత్రంగానే కొనసాగుతుంది. తాజాగా పామోలిన్ సరఫరా కూడా నిలిపివేశారు. ప్రస్తుతం రాయితీ ధరపై కేవలం నాలుగు రకాల సరుకులు మాత్రమే కార్డుదారులకు అందుతున్నాయి. కిరోసిన్ సరఫరాపైనా రాష్ట్ర విభజన ప్రభావం రాష్ట్ర విభజన ప్రభావం కిరోసిన్ సరఫరాపైనా చూపుతోంది. కేంద్ర ప్రభుత్వం సబ్సిడీపై సరఫరా చేస్తున్న కిరోసిన్ దిగుమతి ఈ నెల 24వ తేదీ నుంచి నిలిచిపోయింది. 24వ తేదీ వరకు మాత్రమే హోల్‌సేల్ డీలర్లకు కిరోసిన్ సరఫరా చేశారు. కర్నూలు కార్పొరేషన్‌లోని కార్డుదారులకు నెలకు 4 లీటర్లు.. మునిసిపాలిటీలు, మండలాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న కార్డుదారులకు ప్రతి నెలా 2 లీటర్ల చొప్పున కిరోసిన్ సరఫరా చేయాల్సి ఉంది. ఈ లెక్కన ప్రతి నెలా 20.76 లక్షల లీటర్లు కిరోసిన్ అవసరం కాగా, ఇప్పటి వరకు 1.50 లక్షల లీటర్లు కూడా హోల్‌సేల్ డీలర్ల వద్దకు చేరకపోవడం గమనార్హం. జిల్లా యంత్రాంగం ప్రతి నెలా 22, 23 తేదీల్లో సబ్సిడీ సరుకులు.. 2, 3 తేదీల్లో కిరోసిన్ కేటాయింపులు చేపట్టేది. కేంద్రం, రాష్ట్రంలో ప్రభుత్వాలు మారడం.. రాష్ట్ర విభజన తదితర ఘటనలతో రెండు రాష్ట్రాలకు సమాన కోటా కేటాయింపుల విషయంపై సందిగ్ధం నెలకొనడంతో జిల్లాకు కేటాయించిన కిరోసిన్ కోటా కూడా నిలిచిపోయింది. -
ప్రియురాలిపై కిరోసిన్ పోసి నిప్పటించిన ప్రియుడు
తనను ప్రేమించి మరోకరితో పెళ్లికి సిద్ధమైందన్న విషయం తెలుసుకుని ఓ ప్రియుడు ప్రియురాలిపై ఆగ్రహాంతో ఉగిపోయాడు. అక్కడే ఉన్న కిరోసిన్ క్యాన్ తీసి ఆమెపై పోసి నిప్పంటించాడు. అనంతరం అతడు పరారైయ్యాడు. ఆ ఘటన వరంగల్ జిల్లా మర్రిపెడ మండలం గిరిపురంలో చోటు చేసుకుంది. అయితే ఆ ఘటనలో సదరు యువతికి తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబసభ్యులు బాధితురాలిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందింది. యువతి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. -
భార్య పైనే భర్త హత్యయత్నం
-
నీలికిరోసీన్ మారుతోంది
పాతగుంటూరు, న్యూస్‌లైన్: అసలే వేసవికాలం. విద్యుత్ సరఫరా ఉండటమే లేదు. అంతా కిరోసిన్ దీపాలపైనే ఆధారపడుతున్నారు. చిన్నపాటి పనికి కూడా లాంతర్ల అవసరం కలుగుతోంది. కొందరు వంటకోసం కూడా కిరోసిన్ వినియోగిస్తున్నారు. మార్కెట్లో పెరుగుతున్న డిమాండ్‌ను రేషన్ డీలర్లకు వరంగా మారింది. లబ్ధిదారులకు అందించాల్సిన కిరోసిన్ ఎంచక్కా అక్రమ వ్యాపారులకు అప్పగించేసి అధిక లాభాలు ఆర్జిస్తున్నారు. కిరోసిన్ లోడ్ వస్తోందని తెలియగానే అక్రమవ్యాపారులు అక్కడ వాలిపోతారు. మొత్తం కిరోసిన్ వారికి అప్పగించేసి కొద్దిపాటి సరకును లబ్ధిదారులకు అందజేస్తున్నారు. పైగా రెండు నెలలకోసారి మాత్రమే కిరోసిన్ ఇస్తామంటూ బహిరంగంగానే లబ్ధిదారులకు చెబుతున్నారు. స్టాకు రాలేదనీ, ఎన్నాళ్లవరకు మీకోసం ఎదురు చూడాలని ఇలా రకరకాలుగా లబ్ధిదారులకు ఎదురు ప్రశ్నలు వేసి చేతులు దులుపుకుంటున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో లబ్ధిదారులు అధికమొత్తాలు చెల్లించి బయటి మార్కెట్లో కొనుగోలు చేయాల్సిన పరిస్థితులు దాపురించాయి. జిల్లాలోని బొల్లాపల్లి, మాచవరం, బెల్లంకొండ, క్రోసూరు, రాజుపాలెం, నకరికల్లు, దుర్గి మండలాల్లో అధికంగా అక్రమ రవాణా సాగుతోందని తెలుస్తోంది. ఇటీవల కాలంలోనే డీలర్లు, కిరోసిన్ హాకర్లు వ్యాపారులతో ముందుగానే కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం గుంటూరు నుంచి సరఫరా కేంద్రానికి వెళ్లే మార్గంలోనే కిరోసిన్ ఇచ్చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 2704 రేషన్ షాపులు, 780 కిరోసిన్ హాకర్లు ఉన్నాయి. జిల్లాలో 14500 మంది కార్డుదారులకు ప్రతీనెలా 22 వేల కిలోలీటర్లు కిరోసిన్ సరఫరా కావాల్సి ఉంది. కానీ అందులో పావువాటా కూడా కార్డుహోల్డర్లకు అందడంలేదనే ఫిర్యాదులు వస్తున్నాయి. అక్రమ వ్యాపారులు ముందుగానే డీలర్లకు నగదు చెల్లిస్తారు. ఆ మొత్తాలను డీడీల రూపంలో చెల్లించి సరకు తెచ్చుకుంటున్నారు. దానికి తగ్గట్టుగా రెండు, మూడు నెలలపాటు కిరోసిన్ వారికి అప్పగించేసి, ఇతర సరకులు అమ్ముకోవడం ద్వారా సంపాదించింది సొంతానికి వాడుకుంటున్నారని తెలుస్తోంది. కొరవడిన పర్యవేక్షణ.. పౌరసరఫరాల శాఖాధికారులు రేషన్ సరకు డీర్లకు చేర్చేందుకు రూట్ ఆఫీసర్లను ఏర్పాటు చేశారు. అయితే కిరోసిన్ రాత్రివేళ తరలిస్తుండటంతో రూట్ ఆఫీసర్లు వాటిని పర్యవేక్షించడంలేదని, ముందుగానే వారితో కుదుర్చుకున్న ఒప్పందంతో వారు కనీసం వాటిని పరిశీలించడం లేదని తెలుస్తోంది. రేషన్ డీలర్లు లబ్ధిదారులకు బియ్యం సరఫరా చేసినపుడే కిరోసిన్ కూడా అందుకున్నట్టు సంతకాలు చేయించేసి, ఎటువంటి కేసులు తమవరకు రాకుండా జాగ్రత్త పడుతున్నారని తెలుస్తోంది. ఇప్పటికైనా అధికారులు వీటిపై దృష్టిసారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం: డీఎస్ఓ రవితేజనాయక్ కిరోసిన్ అక్రమ తరలింపుపై జిల్లా పౌరసరఫరాల అధికారి రవితేజనాయక్వద్ద న్యూస్‌లైన్ ప్రస్తావించగా కిరోసిన్ సరఫరాపై ఇప్పటివరకూ తమకెలాంటి ఫిర్యాదులు రాలేదని, వచ్చిన తరువాత రుజువైతే చర్యలు తీసుకుంటామని చెప్పారు. అంతేంగాకుండా ప్రత్యేక నిఘా కూడా ఏర్పాటు చేస్తామని, అక్రమంగా కిరోసిన్‌ను తరలించే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. అవసరమైతే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. -
అక్రమాలకు అడ్డుకట్ట ఏదీ..?
కూసుమంచి, న్యూస్‌లైన్: పాలేరు.. అక్రమాలకు అడ్డాగా మారింది. ఇక్కడ జరగని వ్యాపారాలంటూ లేవు. కల్తీ కిరోసిన్, డీజిల్, పెట్రోల్, క్రూడాయిల్‌తో పాటు చివరకు ప్రాణాలను హరించే మిథేల్ వరకు అన్నీ అక్రమ వ్యాపారాలే. వీటి మాటున అక్రమార్కులు లక్షలు గడిస్తున్నారు. పాలేరుకే పరిమితం కాకుండా నల్గొండ జిల్లాకు కూడా విస్తరిస్తున్నారు. పాలేరులో గతంలో పలువురి ఇళ్లలో అక్రమంగా ఉంచిన డ్రమ్ముల కొద్దీ వైట్ పెట్రోల్, నీలి కిరోసిన్ లభ్యమైన సంగతి తెలిసిందే. ఈ కేసుల్లో జైలుకు వెళ్లినా తిరిగి అదే వ్యాపారాలను ఎంచుకోవ టం చూస్తే ఎంత అక్రమార్జన ఉంటుందో అర్థమవుతుంది. పాలేరులో రాష్ట్రీయ రహదారి పక్కన హోటళ్లు ఉండడంతో అక్రమార్కులకు ఈ ప్రాంతం అడ్డాగా మారింది. వైజాగ్, కాకినాడ నుంచి హైదారాబాద్ వరకు నిత్యం ఈ రహదారి గుండా వివిధ నూనెలు, రసాయనాలతో ట్యాంకర్లు వెళుతుంటాయి. వారు ఇక్కడ ట్యాంకర్లను ఆపి భోజనాలు చేస్తుంటారు. దీంతో అక్రమార్కులు ట్యాంకర్ల డ్రైవర్లను మచ్చిక చేసుకుని క్రూడాయిల్, కిరోసిన్, ముడి పెట్రోల్, డీజిల్, రెక్టిఫైడ్ స్పిరిట్, మిథేల్ వంటి వాటిని తక్కువ ధరకు కొనుగోలు చేస్తారు. వాటిని గోడౌన్లలో రహస్యంగా నిల్వ ఉంచి రాత్రి వేళల్లో ఇతర ప్రదేశాలకు తరలించి అధిక ధరలకు విక్రయిస్తుంటారు. మరికొందరు పలు కెమికల్స్ ద్వారా కల్తీ డీజిల్, పెట్రోల్ కూడా తయారు చేసి అక్రమ వ్యాపారం నడుపుతున్నారు. క్రూడాయిల్‌ను వంట నూనెలులగా తయారు చేసి విక్రయిస్తుంటారు. కొందరు హోటళ్ల యజమానులు ఈ వ్యాపారాల్లో ఆరితేరారు. మరి కొందరు ఈ వ్యాపారం కోసమే హోటళ్లను తెరవడం గమనార్హం. స్పిరిట్‌తో మద్యం, సారా కల్తీ... కొందరు అక్రమార్కులు ట్యాంకర్ల ద్వారా స్పిరిట్ (ఆర్ఎస్ను) గత కొంత కాాలంగా సేకరిస్తూ దాన్ని సారా, మద్యం సీసాలలో కలిపి క ల్తీ చేసి అమ్ముతున్నట్లు సమాచారం. ఇలా తక్కువ ఖర్చుతో మత్తు ఎక్కే మద్యం తయారు చేసి మార్కెట్ ధరకే రహస్యంగా అమ్ముతున్నట్లు తెలుస్తోంది. ఈ తతంగం అంతా పాలేరులో కాకుండా సమీపంలోని తోటల్లో, గుట్టల్లో జరుపుతున్నట్లు సమాచారం. ఇటీవల పోచారం- బీరోలు గ్రామాల మధ్య ఓ మామిడి తోటలో డ్రమ్ముల కొద్దీ స్పిరిట్‌ను నిలువ ఉంచగా పోలీసులు పట్టుకుని వదిలేసినట్లు తెలిసింది. కొంప ముంచిన మిథేల్.... గతంలో అక్రమార్కులు స్పిరిట్‌తో మద్యం, సారాను కల్తీ చేసి అమ్ముతున్నా అది పెద్దగా ప్రమాదకరంగా మారలేదు. కాగా ఇటీవల పాలేరుకు చెందిన మృతుడు కుసులూరి రాజయ్య, అతని కుమారుడు స్పిరిట్, పలు రకాల ఆయిళ్లను ట్యాంకర్ల ద్వారా తీసుకుంటూ వాటిని విక్రయిస్తున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో ఎన్నికల నేపథ్యంలో మద్యం, సారా కట్టడి కావటంతో మిథేల్ ఆల్కహాల్‌ను సారాగా అమ్మవచ్చని ట్యాంకర్ డ్రైవర్ చెప్పటంతో అతను అర లీటరు మిథేల్ తీసుకుని సారాగా తయారు చేసి ప్రయోగం చేశాడు. అది వికటించి ఆ వ్యాపారితో పాటు దాన్ని తాగిన మరో నలుగురు మృత్యువాత పడాల్సి వచ్చింది. మరో 27 మంది ఆసుపత్రుల్లో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు అక్రమ వ్యాపారాలను అదపు చేయలేక పోతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇకనైనా స్పందించి ఈ అక్రమ వ్యాపారాలను అడ్డుకుని ప్రజల ప్రాణాలను కాపాడాలని పలువురు కోరుతున్నారు. -
పోరాడి ఓడిన ప్రేమ..
*చికిత్సపొందుతూ బాధితురాలు షీలా మృతి * ప్రేమికుల దినోత్సవం వేళ విషాదం * ప్రియుడు, అతని తల్లిదండ్రులు, ఇద్దరు సోదరిలపై హత్య కేసు నమోదు * ఐదుగురూ రిమాండ్‌కు తరలింపు ముషీరాబాద్, న్యూస్‌లైన్: ప్రేమ చివరకు ఓడిపోయింది... వంచనకు తలవంచింది.... ప్రియుడు, అతని తల్లిదండ్రులు అకృత్యానికి బలైపోయింది.... కాలినగాయాలతో మృత్యువుతో ఐదు రోజులపాటు పోరాడిన బాధితురాలు షీలా చికిత్సపొందుతూ గురువారం ఉదయం కన్నుమూసింది. ప్రపంచ ప్రేమికుల దినోత్సవానికి ఒకరు రోజు ముందే ఆ అభాగ్యురాలు కన్నుమూయడం అందరి హృదయాలను కలచివేసింది. పోలీసుల కథనం ప్రకారం... చిక్కడపల్లి ఎస్బీహెచ్ కాలనీకి చెందిన జంగా షీలా (21), రాంనగర్ డివిజన్ జెమినీకాలనీకి చెందిన సాయి(20) ఇంటర్ కలిసి చదువుకున్నారు. అప్పటి నుంచీ ఇద్దరూ ప్రేమించుకుంటున్నారు. తండ్రి ధర్మపురి మృతి చెందగా... తల్లితో కలిసి షీలా నివాసముంటోంది. ప్రస్తుతం షీలా చిక్కడపల్లిలోని పెండే కంటి లా కాలేజీలో రెండో సంవత్సరం చదువుతుండగా.. సాయి సీఏ చేస్తున్నాడు. ఇతని తండ్రి చంద్రశేఖర్ వ్యాపారి. తనను పెళ్లి చేసుకోవాలని నెల రోజులుగా షీలా ప్రియుడు సాయిపై ఒత్తిడి తెస్తోంది. ఈ క్రమంలోనే సోమవారం రాత్రి అతని ఇంటికి వెళ్లింది. ఆ సమయంలో అతను ఇంట్లో లేడు. జిమ్‌కు వెళ్లిన సాయి పది నిమిషాల తర్వాత వచ్చాడు. షీలా నేరుగా ఇంటికి రావడంతో తల్లిదండ్రులు అతడిని తిట్టడంతో బయటకు వెళ్లిపోయాడు. అక్కడే ఉన్న షీలాను కూడా వారు దుర్భాషలాడటంతో మనస్తాపానికి గురైన ఆమె ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టు తెలిసింది. షీలా తనకు తానే ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుందా? లేక ప్రియుడి తల్లిదండ్రులే ఆమెపై కిరోసిన్ పోసి నిప్పంటించారా? అనే దానిపై మొదట్లో పలు అనుమానాలు రేకెత్తాయి. కాగా, చిక్కడపల్లి ఏసీపీ అమర్‌కాంత్‌రెడ్డి, ముషీరాబాద్ ఇన్స్పెక్టర్ శ్యాంసుందర్‌లు గాంధీ ఆస్పత్రిలో 86 శాతం కాలిన గాయాలతో చికిత్స పొందుతున్న బాధితురాలిని విచారించారు. తనపై ప్రియుడి తల్లిదండ్రులే కిరోసిన్ పోసినిప్పంటించారని ఆమె పోలీసులకు వాంగ్మూలం ఇచ్చింది. దీంతో పోలీసులు ప్రియుడు సాయి, అతని తండ్రి చంద్రశేఖర్, తల్లి సునీతతో పాటు ఇద్దరు చెల్లెళ్లపై హత్యాయత్నం (ఐపీసీ 307) కేసు నమోదు చేశారు. బాధితురాలు చికిత్సపొందుతూ గురువారం మృతి చెందడంతో ఈ కేసును హత్య (ఐపీసీ 302)గా మార్చారు. అలాగే, మృతురాలు ఎస్సీ కావడంతో అట్రాసిటీ కేసు కూడా నమోదు చేశారు. నిందితులందరినీ గురువారం అరెస్టు చేసి చంచల్‌గూడ జైలుకు తరలించారు. -
రాలిన ‘పద్మ’ం
ఇచ్చోడ మండలం బోరిగామలో దారుణం అదనపు కట్నం కోసం హత్య ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు యత్నం వరకట్నం కోరలకు ‘పద్మ’ం రాలిపోయింది. వేలుపట్టుకుని ఏడడుగులు నడిచి కలకాలం తోడుంటానని బాస చేసిన భర్తే ఆమె పాలిట కాలయముడయ్యాడు. అదనపు కట్నం కోసం భార్యను కిరాతకంగా హత్య చేయడమే కాకుండా ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నిం చాడు. గొడ్డును బాదినట్లుగా బాది చనిపోయిందని నిర్ధారించుకున్నాక.. కిరోసిన్ పోసి తగలబెట్టాడు. ఇచ్చోడ మండలం బోరిగామలో ఈ దారుణం చోటుచేసుకుంది. ఇచ్చోడ, న్యూస్‌లైన్ : అదనపు వరకట్నం కోరలకు ‘పద్మ’ం రాలిపో యింది. భర్త కట్న దాహానికి నిలువెల్లా కాలి అగ్ని ఆహుతైంది. భార్య ఒంటిపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. అనంతరం ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు యత్నించాడు. ఈ సంఘటన మండలంలోని బోరిగామ గ్రామంలో శనివారం సాయంత్రం చోటు చేసుకుంది. బోథ్ సీఐ మోహన్, మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. బజార్హత్నూర్ మండల కేంద్రానికి చెందిన లస్మన్న కూతురు పద్మ(26)కు మండలంలోని బోరిగామ గ్రామానికి చెందిన నరేశ్‌తో నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది. రూ.40వేలు, రెండు తులాల బంగారం కట్నంగా ఇచ్చారు. ఏడాది వరకు వీరి కాపురం సజావుగానే సాగింది. కూలీ పనులు చేసే నరేశ్ కొన్ని రోజులుగా చెడు అలవాట్లకు బానిసయ్యాడు. అదనపు కట్నం కోసం తరచూ పద్మను వేధిస్తున్నాడు. తన తల్లిదండ్రులు అదనపు కట్నం ఇచ్చే స్థితిలో లేరని పద్మ విన్నవించినా పట్టించుకునేవాడు కాదు. భర్త వేధింపులు తాళలేక పద్మ ఐదు నెలలు తల్లిగారింట్లోనే ఉంది. అదనపు కట్నం కోసం ఇక వేధించనంటూ ఇటీవల భార్యను కాపురానికి తీసుకెళ్లాడు. శనివారం ఉదయం కట్నం విషయంలో భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. పుట్టింటికి వెళ్లిపోతానంటూ పద్మ తన ఆరు నెలల కూతురిని తీసుకుని ఆటో స్టాండ్‌కు వెళ్లింది. అక్కడికి వెళ్లిన నరేశ్ ఆమెను కొట్టుకుంటూ ఇంటికి తీసుకెళ్లాడు. ఇంట్లో కూడా చితకబాదడంతో పద్మ చనిపోయిందని సీఐ తెలిపారు. నరేశ్ వెంటనే పద్మ మృతదేహాన్ని ఇంటి పక్కనే ఉన్న బాత్రూం వద్ద పడుకోబెట్టి కిరోసిన్ పోసి నిప్పంటించాడు. చుట్టుపక్కల వారు, గ్రామస్తులు చూసేసరికి పద్మ కాలిబూడిదైంది. స్థానికుల సమాచారం మేరకు ఎస్సై బి.సంజీవ్ సంఘటన స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. మృతురాలి తండ్రి లస్మన్న ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వివరించారు. -
యువతిపై మరో దారుణం
రాష్ట్ర రాజధానిలో కీచకపర్వం లైంగికదాడికి యత్నించిన నలుగురు యువకులు ప్రతిఘటించినందుకు కిరోసిన్ పోసి హత్యాయత్నం సాక్షి, హైదరాబాద్: రాజధానిలో మరో దారుణం.. పట్టపగలు ఓ యువతిపై సామూహిక లైంగికదాడి యత్నం.. ప్రతిఘటించడంతో కిరోసిన్ పోసి నిప్పంటించిన అమానుషత్వం. దేశవ్యాప్తంగా మహిళలపై కొనసాగుతున్న అకృత్యాలకు మరో నిలువెత్తు నిదర్శనం బుధవారం హైదరాబాద్ నడిబొడ్డున వెలుగుచూసింది. వివరాలు: హైదరాబాద్‌లోని చిలకలగూడ ప్రాంతానికి చెందిన అబ్దుల్ సలాం, సాజిదా బేగంలు భార్యాభర్తలు. భర్త నుంచి 20 ఏళ్ల క్రితం విడాకులు తీసుకున్న సాజిదా.. కుమార్తె అర్షియా ఫాతిమా అలియాస్ సమ్రీన్ (22), కుమారుడు అజీజ్‌తో కలసి అదేప్రాంతంలో నివసిస్తోంది. బుధవారం మధ్యాహ్నం వారాసిగూడ కౌసర్ మసీదు ప్రాంతానికి చెందిన ఇసాక్ నుంచి ఫోన్ రావడంతో సమ్రీన్ ఇంటి నుంచి బయటకు వెళ్లింది. కొద్దిసేపటి తర్వాత చిలకలగూడ రైల్వేక్వార్టర్స్ సమీపంలో మంటల్లో కాలిపోతూ ఆర్తనాదాలు చేస్తూ పరిగెత్తుకుంటూ రోడ్డు పైకి వచ్చి పడిపోయింది. దీన్ని గమనించిన స్థానికులు రగ్గుల సాయంతో మంటల్ని ఆర్పి, పోలీసులు, అంబులెన్స్‌కు సమాచారమిచ్చారు. బాధితురాలిని హుటాహుటిన గాంధీ ఆస్పత్రికి తరలించారు. గట్టిగా కేకలు వినిపించడంతో బయటకు వచ్చామని, అప్పటికే మంటలు అంటుకున్న ఆమె రోడ్డుపై పడిపోయిందని ప్రత్యక్ష సాక్షులు రమేష్, విజయ్‌కుమార్ తెలిపారు. తాము మంటల్ని ఆర్పిన తరవాత ఓ బెడ్‌షీట్ అందించగా లేచి నిలబడి దాన్ని కట్టుకుందని తెలిపారు. పోలీసులు గాంధీ ఆస్పత్రికి వెళ్లి బాధితురాలి నుంచి వాంగ్మూలం నమోదు చేశారు. బాధితురాలు తెలిపిన వివరాలు.. ‘ఇసాక్ నాకు ఫోన్ చేసి బయటకు రమ్మన్నాడు. ఇసాక్‌తో పాటు షకీల్, ఇస్మాయిల్, షాకత్లు కూడా ఉన్నారు. ఆ నలుగురు నన్ను బలవంతంగా పాడు బడిన రైల్వేక్వార్టర్స్ వద్దకు తీసుకెళ్లారు. అక్కడ నాపై లైంగికదాడికి ప్రయత్నించారు. నేను ప్రతిఘటించడంతో వారు నాపై కిరోసిన్‌ను పోసి నిప్పంటించారు’. బాధితురాలి వాంగ్మూలం ఆధారంగా ముగ్గురు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. ఘటనాస్థలితో పాటు గాంధీ ఆసుపత్రిని సందర్శించిన ఉత్తర మండలం డీసీపీ జయలక్ష్మి ఈ కేసును పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఇసాక్, సమ్రీన్లకు పాత పరిచయం ఉన్నట్లు తెలియడం, బాధితురాలికి మంగళవారమే పెళ్లి చూపులు జరగడంతో.. దానికి, ఈ ఉదంతానికి ఏమైనా సంబంధం ఉందా? అనే కోణంలోనూ పోలీసులు ఆరా తీస్తున్నారు. బాధితురాలి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఎంపీ అంజన్‌కుమార్‌యాదవ్, ఎమ్మెల్యే జయసుధ బాధితురాలిని పరామర్శించారు. -
కిరోసిన్ లేక ప‘రేషన్’
మోర్తాడ్, న్యూస్‌లైన్ : మూడో విడత రబ్చబండలో జారీ చేసిన కొత్త రేషన్‌కార్డుదారులకు కిరోసిన్‌ను సరఫరా చేయడం లేదు. రేషన్‌కార్డుల తయారీలో జాప్యం కారణంగా కార్డుల స్థానంలో కూపన్లను జారీ చేశారు. కిరోసిన్‌కు ప్రత్యేకంగా కూపన్ ఉన్నప్పటికీ సరఫరా చేయడం లేదు. కొత్త రేషన్ వినియోగదారులకు బియ్యం, అమ్మహస్తం సరుకులను సరఫరా చేసి చేతులు దులుపుకుంటున్నారు. కిరోసిన్ కోటాను పెంచే బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉండటంతో ఇప్పట్లో సరఫరా అయ్యే అవకాశం లేదని పౌరసరఫరాల శాఖ అధికారులు చెబుతున్నారు. గతేడాది నవంబర్ నెలలో నిర్వహించిన మూడో విడత రచ్చబండ కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా 80 వేల కొత్త రేషన్‌కార్డులను జారీ చేశారు. ఇప్పటికే జిల్లాలో 6,51,310 తెల్ల రంగు కార్డులు ఉన్నాయి. ఇందులో ఎల్పీజీ కనెక్షన్ ఉన్న వినియోగదారులకు నెలకు ఒక లీటర్ కిరోసిన్‌ను పౌర సరఫరాల శాఖ సరఫరా చేస్తోంది. కనెక్షన్లేని వారికి రెండు లీటర్ల కిరోసిన్‌ను సరఫరా చేస్తున్నారు. ఇప్పటివరకు ఉన్న తెల్ల రంగు రేషన్‌కార్డు వినియోగదారుల్లో 70 శాతం మం దికి ఎల్పీజీ కనెక్షన్లు ఉన్నాయి. కేవలం 30 శాతం మందికి కనెక్షన్లు లేవు. జిల్లా వ్యాప్తంగా నెలకు ఎనిమిది లక్షల లీటర్ల కిరోసిన్ సరఫరా అవుతుంది. మార్కెట్లో కిరోసిన్ ధర రూ 45 ఉండగా రేషన్ దుకాణాల్లో మాత్రం లీటరుకు రూ15 చెల్లిస్తే లభిస్తుంది. రేషన్ దుకాణాల్లో లభించే కిరోసిన్‌కు డిమాండ్ భారీ గానే ఉంది. కోటా పెంపు కేంద్రం పరిధిలో.. రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్‌కార్డులను జారీ చేసినా సబ్సిడీ కిరోసిన్ కోటాను పెంచడం కేంద్రం పరిధిలో ఉంది. రేషన్‌కార్డుల సంఖ్యను పెంచిన రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయాన్ని కేంద్ర పెట్రోలియం, సహజవనరుల మంత్రిత్వ శాఖకు పంపక పోవడంతో సబ్సిడీ కిరోసిన్ కోటా పెరగలేదు. రేషన్ వినియోగదారుల సంఖ్య పెరిగినప్పుడు అందుకు అనుగుణంగా సబ్సిడీ సరుకుల పరిమాణాన్ని పౌర సరఫరాల శాఖ పెంచా ల్సి ఉంది. బియ్యం, అమ్మహస్తం సరుకుల సంఖ్యను పెంచినా కిరోసిన్ పరిమితి పెరగక పోవడంతో వినియోగదారులు అవస్థలు పడుతున్నారు. బియ్యం, అమ్మహస్తం సరుకులను పొందడానికి రేషన్‌దుకాణాలకు వస్తున్న వినియోగదారులు కిరోసిన్ విషయమై డీలర్లను ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం కోటాను పెంచంది తాము ఏమీ చేయలేమని డీలర్లు సమాధానమిస్తున్నారు. దీంతో వినియోగదారులు సంతృప్తి చెందడం లేదు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి పెరిగిన రేషన్‌కార్డుల సంఖ్యకు అనుగుణంగా కిరోసిన్ కోటాను పెంచాలని పలువురు కోరుతున్నారు. -
భర్త వేధింపులకు భార్య బలి
తలకొండపల్లి, న్యూ స్లైన్: భర్త వేధింపులకు తాళలేక ఓ భార్య ఒంటిపై కిరోసిన్ పోసుకుని ని ప్పంటించుకుని ఆ త్మహత్యకు పాల్పడింది. ఈ సంఘట న మండలంలోని రాంపూర్ గ్రామంలో ఆది వారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన చెట్ల శ్రీను, పద్మలు భార్యాభర్తలు కాగా, వారికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. పదేళ్లపాటు అన్యోన్యంగా సాగినవారి సంసారంలో సారా చిచ్చుపెట్టింది. ఆమె భర్త శ్రీను మద్యం తాగుడుకు బానిసయ్యాడు. పనులకు వెళ్లకుండా జులాయిగా తిరుగుతుండటంతో పాటు డబ్బు కోసం భార్య పద్మను నిత్యం వేధించేవాడు. ఈ క్రమంలో ఆదివారం డబ్బులు ఇవ్వమని భార్యతో గొడవపడ్డాడు. తీవ్రమనస్తాపం చెందిన పద్మ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. ఇంట్లో నుంచి పొగలు రావడం గమనించిన స్థానికులు తలుపులు తెరచి చూడగా ఆ అభ్యాగురాలు అప్పటికే సగం కాలిపోయింది. పోలీసులు సంఘటనస్థలాన్ని పరిశీలించారు. -
పెళ్లి చేసుకోమంటే నిప్పు పెట్టాడు!
ప్రేమికుడే కాలయముడయ్యాడు. అన్నీ తనే అనుకున్న విద్యార్థిని పట్ల కర్కశత్వం ప్రదర్శించాడు. మనసిచ్చిన పాపానికి ఆమెపై కిరోసిన్ పోసి నిప్పు పెట్టి దారుణానికి ఒడిగట్టాడు. నిలువెల్లా కాలిన గాయాలతో ఆ యువతి తల్లడిల్లుతోంది. చావు బతుకుల మధ్య నరకం అనుభవిస్తోంది. మంగళవారం నల్లగొండలో జరిగిన ఈ ఘటన అందరి హృదయాలనూ కలచివేసింది. నల్లగొండ: తలారి అరుణది కనగల్ మండలం కురంపల్లి. జిల్లా కేంద్రం సమీపంలోని నిట్స్ కళాశాలలో బీటెక్ ఫైనలియర్ చదువుతోంది. తన రెండో అక్కది అదే మండలంలోని దర్వేశిపురం. తరచూ అక్క వద్దకు వచ్చి వెళ్లే క్రమంలో అదే గ్రామానికి చెందిన సైదులుతో ఆమెకు పరిచయం ఏర్పడింది. వారు రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ప్రకాశం బజార్‌లోని మాస్ కాంప్లెక్స్‌లో రెండు షట్టర్లు అద్దెకు తీసుకుని సైదులు సొంతంగా ఫైనాన్స్ నడిపిస్తున్నాడు. కొంతకాలంగా తనను పెళ్లి చేసుకోవాలని అరుణ సైదులును అడుగుతూ వస్తోంది. ఏదో ఓ కారణం చెప్పి పెళ్లి విషయాన్ని దాటవేస్తూ వచ్చాడు. మంగళవారం మధ్యాహ్నం ఫైనాన్స్ కార్యాలయంలోకి అరుణ వెళ్లి పెళ్లి చేసుకోవాలని అతడిని నిలదీసింది. దీంతో అతను కిరోసిన్ పోసి నిప్పంటించాడు. ఈ విషయాన్ని క్షతగాత్రురాలి బావకు ఫోన్ చేసి తెలిపాడు. అనంతరం తన స్నేహితుల సహకారంతో ఆమెను జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి ఆటోలో తరలించి అక్కడి నుంచి పరారయ్యాడు. ప్రస్తుతం అరుణ శరీరం 95శాతం కాలింది. ఆమెకు నల్లగొండ జిల్లా కేంద్రాస్పత్రిలో ప్రాథమిక చికిత్స నిర్వహించారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు. దాడికి నిరసనగా బుధవారం విద్యాసంస్థల బంద్‌కు విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. సైదులుకు గతంలోనే వివాహం సైదులు గతంలో దర్వేశిపురం మాజీ ఉప సర్పంచ్‌గా పనిచేశాడు. అతనికి అప్పటికే వివాహం జరిగింది. అతనికి కుమారుడు, కూతురు కూడా ఉన్నారు. తన కుటుంబంతో కలిసి జిల్లాకేంద్రం నుంచి సాగర్‌రోడ్‌లో నివసిస్తున్నాడు. తన తల్లిదండ్రులు స్వగ్రామంలోనే ఉంటున్నారు. తనకు గతంలోనే పెళ్లి అయినందుకు తిరిగి అరుణను పెళ్లి చేసుకోవడానికి నిరాకరించి ఉండవచ్చని భావిస్తున్నారు. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు వనటౌన్ ఇన్స్పెక్టర్ లక్ష్మణ్ నిందితుడు సైదులుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, మోసం, హత్యాయత్నం కింద కేసు నమోదు చేశారు. వాంగ్మూలం తీసుకున్న ఏఎస్పీ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రురాలిని ఏఎస్పీ రమా రాజేశ్వరి, డీఎస్పీ రామ్మోహన్ పరామర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సైదులే కిరోసిన్ పోసి నిప్పు పెట్టాడని క్షతగాత్రురాలు వారికి వాంగ్మూలం ఇచ్చింది. అనంతరం సంఘటనా స్థలాన్ని సందర్శించారు. నిందితుడు ఎక్కడ ఉన్నాడో కొంత సమాచారం అందిందని మీడియాకు ఏఎస్పీ చెప్పారు. క స్టడీలోకి తీసుకోవడానికి పోలీసు బృందాన్ని రంగంలోకి దింపామని వెల్లడించారు. వీలైనంత త్వరలో అతడిని అదుపులోకి తీసుకుని సంబంధిత సెక్షన్ల కేసులు నమోదు చేస్తామని చెప్పారు. ముందస్తు వ్యూహం? రెండు నెలల క్రితమే సైదులు షట్టర్లు అద్దెకు తీసుకుని ఫైనాన్స్ వ్యాపారం ప్రారంభించాడు. మంగళవారం ఉదయం షట్టర్లు ఖాళీ చేస్తానని యజమానికి ఫోన్లో తెలిపాడు. సైదులే స్వయంగా బైక్‌పై ఆమెను ఫైనాన్స్ కార్యాల యానికి తీసుకొచ్చాడని సమాచారం. సాయంత్రంలోగా ఘటన చేసుకోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముందస్తు వ్యూహంలో భాగంగానే దాడికి ఒడిగట్టారని పోలీసులు భావిస్తున్నారు. ఇందులో మరికొం దరి పాత్ర ఉండవచ్చని అనుమానిస్తున్నారు. నిరుపేద కుటుంబం.. అరుణది నిరుపేద కుటుంబం. తల్లిదండ్రులు ఈశ్వరయ్య, పిచ్చమ్మ కూలి చేసుకుంటూ కాలం వెళ్లదీస్తున్నారు. వీరికి నలుగురు సంతానం. వారిలో ఒక్కడే కుమారుడు. అతను కూడా గతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించాడు. మిగిలిన ముగ్గురు కూతుళ్లలో అరుణ చిన్నది. మిగతా ఇద్దరు కుమార్తెలు పెద్దగా చదువుకోలేదు. అష్టకష్టాలకోర్చి చిన్న కూతురిని ఇంజినీరింగ్ చదివిస్తున్నారు. ఈమెకైనా ఉన్నత చదువులు చెప్పించి జీవితంలో నిలదొక్కుకునేలా చేద్దామని తల్లిదండ్రులు ఆశతో ఉన్నారు. జిల్లా కేంద్రంలో గది అద్దెకు తీసుకుని చదివే స్థోమత లేకపోవడంతో నిత్యం ఇంటి నుంచే కళాశాలకు వెళ్లి వచ్చేది. ఇంతలో ఘోరం జరిగిపోవడంతో అమ్మానాన్నలు గుండెలవిసేలా విలపిస్తున్నారు. -
పెళ్లి చేసుకోమంటే నిప్పు పెట్టాడు!
బాధితురాలు బీటెక్ విద్యార్థిని, పరిస్థితి విషమం సాక్షి, నల్లగొండ: పెళ్లి చేసుకోమని అడిగిన ప్రేమికురాలిపై కిరోసిన్‌పోసి నిప్పంటిం చాడో ఘనుడు. ఈ ఘటన మంగళవారం నల్లగొండలో జరిగింది. కనగల్ మండలం కురంపల్లికి చెందిన అరుణ నిట్స్ కళాశాలలో బీటెక్ ఫైనలియర్ చదువుతోంది. ఇదే మండల పరిధిలోని దర్వేశిపురానికి చెందిన మాజీ ఉప సర్పంచ్ నకిరేకంటి సైదులు, అరుణ నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇతను జిల్లా కేంద్రంలోని ప్రకాశంబజార్‌లో ఫైనాన్స్ నడిపిస్తున్నాడు. అప్పటికే వివాహం జరిగిన సైదులుకు భార్యతో పాటు ఇద్దరు పిల్లలున్నారు. అయితే తనను పెళ్లి చేసుకోవాలని అరుణ కొంతకాలంగా అడుగుతూ వస్తోంది. ఈ క్రమంలో సైదులు తన కార్యాలయంలోకి మధ్యాహ్నం సమయంలో ఆమెను పిలిచాడు. ఒక్కసారిగా కిరోసిన్ పోసి నిప్పంటించాడు. అరుణకు 95 శాతానికిపైగా గాలిన గాయాలయ్యాయని వైద్యులు తెలిపారు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
ఆస్తి కోసం ఘాతుకం
నెల్లూరు(క్రైమ్), న్యూస్‌లైన్: ఆస్తి కోసం తోడబుట్టిన చెల్లి కుటుంబాన్నే కడతేర్చేందుకు ప్రయత్నించిన ఓ అక్క ఉదంతమింది. చెల్లెలు కుటుంబ సభ్యులు నిద్రిస్తున్న ఇంట్లో కిరోసిన్ పోసి నిప్పంటించడంతో ముగ్గురు తీవ్రంగా గాయపడగా మరొకరికి స్వల్పగాయాలయ్యాయి. ఈ సంఘటన మంగళవారం తెల్లవారుజామున నెల్లూరులోని ఎన్టీఆర్నగర్లో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు..గూడూరులోని గాంధీనగర్‌కు చెందిన బుజ్జమ్మ, పోలయ్య దంపతులకు పద్మమ్మ, రమణమ్మ, ఆదిలక్ష్మమ్మ, మురళి, వరలక్ష్మి పిల్లలు. వీరిలో వరలక్ష్మి మృతి చెందింది. ఎన్టీఆర్ నగర్లో ఉన్న బుజ్జమ్మ నివాసంలో కొన్నేళ్లుగా చిన్నకుమార్తె ఆదిలక్ష్మమ్మ తన భర్త అమృతనారాయణ, పిల్లలు సాయిరామ్, సుప్రజతో కలిసి ఉంటోంది. నారాయణ పెయిం టర్గా, ఆదిలక్ష్మమ్మ విజయమహల్ గేటు సమీపంలోని ఓ బార్ వద్ద అరటికాయలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఏసీనగర్‌లోని మున్సిపల్ పాఠశాలలో సాయిరామ్ తొమ్మిదో తరగతి, సుప్రజ ఏడో తరగతి చదువుతున్నారు. ఆదిలక్ష్మమ్మ అక్క రమణమ్మ ఏడేళ్ల కిందట భర్త నుంచి విడిపోయి తల్లిదండ్రులు, బంధువుల వద్ద ఉంటూ వస్తోంది. ఈ క్రమంలో రెండు నెలల కిందట ఆదిలక్ష్మమ్మ ఇంటికి వచ్చింది. అప్పటి నుంచి ఇక్కడే ఉంటూ తల్లికి చెందిన ఇల్లు ఖాళీ చేయమంటూ చెల్లెలుపై ఒత్తిడి తెచ్చింది. రమణమ్మకు తల్లి బుజ్జమ్మ నచ్చజెప్పినా ఫలితం కరువైంది. ఇంటి వెనకవైపున్న స్థలంలో ఇల్లు కట్టుకున్న అనంతరం ఖాళీ చేస్తానని ఆదిలక్ష్మమ్మ చెప్పినా రమణమ్మ ఒప్పుకోలేదు. ఈవిషయమై అక్కాచెల్లెలు మధ్య సోమవారం వివాదం చోటుచేసుకుంది. కోపోద్రిక్తురాలైన రమణమ్మ చెల్లెలు ఆదిలక్ష్మమ్మ కుటుంబాన్ని కడతేర్చి ఆస్తి సొంతం చేసుకోవాలని భావించింది. అందులో భాగంగా ఐదు లీటర్ల కిరోసిన్‌ను సిద్ధం చేసుకుంది. ఎప్పటిలాగే సోమవారం రాత్రి అందరూ కలిసి ఇంట్లో నిద్రించగా, మంగళవారం తెల్లవారుజామున రమణమ్మ కిరోసిన్‌ను ఇంట్లో పోసి నిప్పంటించింది. ఒక్కసారిగా మంటలు ఎగిసిపడిన వెంటనే రమణమ్మ తలుపునకు బయట గడియ పెట్టుకుని వెళ్లిపోయింది. మంటల తీవ్రతకు ఇంట్లోని ఆదిలక్ష్మమ్మ కుటుంబసభ్యులు కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి తలుపులు పగలగొట్టి 108లో నారాయణ ఆస్పత్రికి తరలించారు. ఆదిలక్ష్మమ్మ, సుప్రజ, సాయిరామ్‌కు తీవ్రగాయాలు కాగా నారాయణకు స్వల్పంగా గాయాలయ్యాయి. ఆదిలక్ష్మమ్మ, సాయిరామ్‌ల పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందుకున్న బాలాజీనగర్ సీఐ మంగారావు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల నుంచి ఫిర్యాదు స్వీకరించారు. రమణమ్మపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. -
'వంటగ్యాస్, డీజిల్, కిరోసిన్ ధరలు పెంచాలని సిఫారసు'
వంట గ్యాస్, డీజిల్, కిరోసిన్ ధరలు పెంచాలని కిరీట్ పారిఖ్ కమిటీ ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ప్రభుత్వంపై సబ్సిడీ భారం ఎక్కువగా పడుతోందని, దీంతో ధరలు పెంచకతప్పదని సూచించింది. కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖకు బుధవారం ఈ మేరకు నివేదిక సమర్పించింది. వంటగ్యాస్‌పై 250 రూపాయలు, డీజల్‌పై ఐదు, కిరోసిన్‌పై నాలుగు రూపాయల చొప్పున పెంచాలని పారిఖ్ కమిటీ సూచించింది. పెట్రోలియం వనరుల సబ్సిడీ భారం 80 వేల కోట్ల నుంచి 1.30 లక్షల కోట్లకు పెరిగిందని ప్రభుత్వానికి తెలియజేసింది. అంతర్జాతీయ మార్కెట్లో ఇంధన ధరలు పెరగడం, డాలర్‌తో రుపాయి మారకం విలువ తగ్గిన నేపథ్యంలో ధరలు పెంచక తప్పదని కమిటీ పేర్కొంది. -
పిల్లలపై పోసి, తానూ కిరోసిన్ పోసుకుని..
జోగిపేట, న్యూస్‌లైన్: కుటుంబ కలహాలతో ఓ వివాహిత ఒంటిపై కిరోసిన్ పోసుకుని, తన పిల్లలపై కూడా పోసి ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటనలో వివాహిత తీవ్రంగా గాయపడగా, ఆమె బిడ్డలిద్దరూ స్వల్పంగా గాయపడ్డారు. ఈ సంఘటన ఆదివారం జోగిపేటలో జరిగింది. ఎస్ఐ ముఖీద్పాష, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... సదాశివ పేటకు చెందిన పద్మావతి(26), స్థానిక స్థానిక గౌని ఏరియాలో నివాసం ఉంటున్న సంతోష్‌ను 7 సంవత్సరాల క్రితం ప్రేమ వివాహం చేసుకుంది. వీరికి మణికంఠ (6), కారుణ్య (4)లు సంతానం. కొన్నాళ్ల పాటు సజావుగా సాగిన వీరి సంసారంలో ఇటీవల కలతలు తలెత్తాయి. ఈ కారణంగానే దంపతులు తరచూ గొడవపడేవారు. ఈ క్రమంలోనే కుటుంబ కలహాలతో మనస్థాపం చెందిన పద్మావతి ఆదివారం సాయంత్రం తన ఒంటిపై కిరోసిన్ పోసుకుని తన చిన్నారులపై కూడా పోసింది. అనంతరం ఆమె నిప్పుపెట్టుకుంది. అయితే చిన్నారులిద్దరూ దూరంగా వెళ్లడంతో వారిపై నిప్పుపడలేదు. తల్లి మంటల్లో కాలిపోతుండడం చూసిన చిన్నారులు ఆమెను పట్టుకునేందుకు ప్రయత్నించగా పద్మావతి వారిని పక్కకు తోసివేసింది. అయినప్పటికీ చిన్నారులిద్దరికీ స్వల్ప గాయాలయ్యాయి. ఇది గమనించిన ఇరుగుపొరుగు వారు వెంటనే మంటలను ఆర్పివేసినప్పటికీ పద్మావతి తీవ్రంగా గాయపడింది. దీంతో వారు ఆమెను ఆటోలో స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స చేసిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం సికింద్రాబాద్‌లోని గాంధీకి తరలించారు. అంతకుముందు స్థానిక ఆస్పత్రిలో స్థానిక మున్సిఫ్ మెజిస్ట్రేట్ రమాకాంత్ తీవ్రంగా గాయపడ్డ పద్మావతి వాగ్మూలాన్ని రికార్డు చేశారు. కాగా, తమ బిడ్డ ఆత్మహత్యాయత్నానికి ఆమె భర్త వేధింపులే కారణమని పద్మావతి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. -
మహిళ సజీవ దహనం
= బట్టలు ఆరవేసే తాడు అడ్డంగా కట్టారంటూ గొడవ... = బెంగళూరు జనతా కాలనీలో దుర్ఘటన = గురువారం సాయంత్రం వివాదం తీవ్ర రూపం = రాత్రి వరకూ ఇరు కుటుంబ సభ్యుల కొట్లాట = కర్రలతో దాడి.. మహిళపై కిరోసిన్ పోసి నిప్పు బెంగళూరు, న్యూస్‌లైన్ : ఇంటి ముందు బట్టలు ఆర వేసే విషయంలో రెండు కుటుంబాల మధ్య జరిగిన గొడవ ఓ మహిళ సజీవ దహనానికి కారణమైంది. ఇక్కడి సోలదేవనహళ్లి పోలీసు స్టేషన్ పరిధిలోని దొడ్డ బెలెకెరె జనతా కాలనీలో కారు డ్రైవర్ నరసింహమూర్తి, రవి కళ (26) దంపతులు ఇద్దరు పిల్లలతో కలసి నివాసం ఉంటున్నారు. ఇదే వీధిలో రవి కళ అన్న రవికుమార్ నివాసం ఉంటున్నాడు. నరసింహమూర్తి నాలుగు నెలల కిందటే ఈ ప్రాంతంలో అద్దె ఇల్లు తీసుకున్నాడు. రవి కళ ఎంఎస్ రామయ్య ఆసుపత్రిలో హౌస్ కీపింగ్ పని చేస్తున్నది. ఆమె ఇంటి వెనుక మునితాయమ్మ, ఆమె పిల్లలు మంజు, మురళి, రూప నివాసముంటున్నారు. రవి కళ ఇంటి ముందు బట్టలు ఆరవేసుకోవడానికి తాడు కట్టింది. దీని వల్ల వచ్చి పోవడానికి తమకు ఇబ్బంది కలుగుతోందని మునితాయమ్మ పలు సార్లు గొడవ పడింది. రవి కళ మరో తాడు కూడా కట్టి బట్టలు ఆరవేయడంతో గురువారం సాయంత్రం మునితాయమ్మ గొడవకు దిగింది. రాత్రి 8.30 గంటల వరకు గొడవ జరుగుతూనే ఉంది. రవి కుమార్ విషయం తెలుసుకుని అక్కడికి వెళ్లి సర్ది చెబుతుండగానే.. మంజు, మురళి పెద్ద కర్రతో అతని తల మీద చితకబాదారు. తరువాత ఇంటిలోకి వెళ్లి కిరోసిన్ డబ్బా తీసుకు వచ్చారు. రవి కళ పారిపోకుండా ఇద్దరు పట్టుకున్నారు. ఒకరు ఆమె మీద కిరోసిన్ పోసి నిప్పంటించారు. ఒక్క సారిగా అగ్ని కీలలు శరీరమంతా వ్యాపించడంతో రవి కుమార్‌తో పాటు చుట్టు పక్కల వారు ఆమెను రక్షించే సాహసం చేయలేక పోయారు. అక్కడే ఆమె సజీవ దహనమైంది. ఈ సంఘటన జరిగిన వెంటనే మునితాయమ్మ, మంజు, మురళి, రూప పారిపోయారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని సప్తగిరి ఆస్పత్రికి తరలించారు. రవి కుమార్ చికిత్స పొందుతున్నాడని పోలీసులు శుక్రవారం తెలిపారు. -
సమైక్యవాది ఆత్మహత్యాయత్నం
మదనపల్లె అర్బన్, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజనను నిరసిస్తూ మదనపల్లె ఇందిరానగర్‌కు చెందిన బండి చిన్నప్ప కుమారుడు మల్లికార్జున్(41) మంగళవారం రాత్రి ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. కిరోసిన్ పోసుకుని సమైక్య నినాదాలు చేస్తుండడంతో స్థానికులు అడ్డుకుని కిరోసిన్ డబ్బాను లాక్కొన్నారు. మల్లికార్జున మాట్లాడుతూ చిన్న రాష్ట్రాల ద్వారానే అభివృద్ధి సాధ్యమవుతుందని కేంద్ర మంత్రు లు ప్రకటన చేయడం బాధ కలిగించిందన్నారు. రాష్ట్రం ముక్కలు కాకుండా కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ ఉద్యమించాలని కోరారు. మల్లికార్జున్ ఈనెల 6వ తేదీన రాత్రి సమైక్యాంధ్ర కోసం హైదరాబాద్‌లో జరిగిన సేవ్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమం అడ్డుకునేందుకే తెలంగాణవాదులు ప్రయత్నించడంతో మనస్తాపం చెంది సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. టుటౌన్ పోలీసులు నచ్చజెప్పి కిందకు దింపారు. -
‘చమురు’ వదిలిస్తున్న డీజిల్
న్యూఢిల్లీ: రూపాయి విలువ పతనంతో డీజిల్, వంటగ్యాస్, కిరోసిన్‌ల అమ్మకాలపై ప్రభుత్వ రంగ చమురు సంస్థలకు భారీగానే చేతి చమురు వదులుతోంది. ప్రతి లీటరు డీజిల్ అమ్మకంపై నష్టం ఇటీవల ఏకంగా రూ.14.50లకు పెరిగింది. డీజిల్ అమ్మకాల వల్ల మూడు చమురు కంపెనీలు రోజుకు రూ.486 కోట్లు నష్టపోతున్నాయి. దీంతో, వేగంగా పెరుగుతున్న నష్టాన్ని భారీగా తగ్గించుకునే మార్గాలను ప్రభుత్వం అన్వేషిస్తున్నట్లు సమాచారం. లీటరు డీజిల్‌పై నెలకు 50 పైసల చొప్పున ధర పెంచుకోవడానికి గత జనవరిలో కేంద్రం చమురు సంస్థలకు అనుమతి ఇచ్చింది. అయితే, రూపాయి విలువ తరిగిపోవడం వల్ల వస్తున్న నష్టాన్ని పూడ్చుకోవడానికి ఈ పెంపు చాలదని ఈ సంస్థలు గగ్గోలు పెడుతున్నాయి. లీటరు డీజిల్‌పై నెల నెలా రూపాయి పెంచడం గానీ లేదా ఒకేసారి రూ.3 నుంచి రూ.5 వరకూ గానీ పెంచితే తప్ప ఈ నష్టాల నుంచి బయటపడడం సాధ్యం కాదని చమురు శాఖ ఇటీవల కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. గత నెల రెండో పక్షంలో లీటరు డీజిల్‌పై నష్టం రూ.12.12 ఉండగా, ఇప్పుడు అది రూ.14.50 చేరింది. చౌకదుకాణాల్లో సబ్సిడీపై అమ్ముతున్న ప్రతి లీటరు కిరోసిన్‌పై రూ.36.83, వంట గ్యాస్ సిలిండర్‌పై రూ.470.38లను చమురు సంస్థలు నష్టపోతున్నాయి. నష్టం ఇప్పటి మాదిరిగానే పెరుగుతూ ఉంటే.. ఈ ఆర్థిక సంవత్సరం అంతానికి మూడు ప్రభుత్వ రంగ చమురు సంస్థలు రూ.1,56,000 కోట్ల ఆదాయాన్ని కోల్పోవలసి వస్తుందని అంచనా. గత నెల 30 చమురు శాఖ మంత్రి వీరప్ప మొయిలీ ప్రధానికి లేఖ రాస్తూ, డీజిల్, వంట గ్యాస్ ధరలు పెంచకపోతే ఈ రెంటిపై ప్రభుత్వం అత్యధికంగా రూ.97,500 కోట్ల భారాన్ని భరించాల్సి వస్తుందని పేర్కొన్నారు. 2012-13లో ఈ సంస్థలు కోల్పోయిన ఆదాయం రూ. 1,61,029 కోట్లు. ఇందులో సగానికి పైగా మొత్తాన్ని కేంద్రం నగదు సబ్సిడీ రూపంలో ఈ సంస్థలకు చెల్లించింది. లీటరు డీజిల్ ధర రూపాయి పెంచితే నష్టం రూ. 4,522 కోట్లు తగ్గుతుందని, రూ.3 పెంచితే నష్టం రూ. 13,565 కోట్లు తగ్గుతుందని పేర్కొన్నారు. ఒకేసారి రూ.5 పెంచితే నష్టం రూ.29,390 కోట్ల మేరకు తగ్గుతుందన్నారు. వంట గ్యాసు సిలిండర్‌పై రూ.50 పెంచితే వంట గ్యాసుపై నష్టం రూ.2,604 కోట్లు తగ్గుతుంది. అదేవిధంగా, లీటరు కిరోసిన్‌పై రూ.2 పెంచితే నష్టం రూ.1,014 కోట్లు తగ్గుతుందని పేర్కొన్నారు. డీజిల్, వంటగ్యాస్, కిరోసిన్ ధరలను ఎప్పట్నుంచి డీజిల్ ధర పెంచాలనే విషయమై కేంద్రం ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. -
నల్ల బజారుకు రేషన్ సరుకులు
కొడిమ్యాల, న్యూస్‌లైన్: పేదల కు అందాల్సిన రేషన్ సరుకులు నల్ల బజారుకు తరలుతున్నాయనేందుకు మరో నిదర్శనమిది. అక్రమాలకు అలవాటుపడిన రేషన్ డీలర్ కిరోసిన్‌ను బ్లాక్‌లో విక్రయిస్తుండగా పలువురు యువకులు పట్టుకున్నారు. శనివారం మండలంలోని తిప్పయ్యపల్లెలో రేషన్ డీలర్ వేముల పద్మజ నల్లగొండ గ్రామానికి చెందిన ఓ యువకుడికి ఐదు లీటర్ల కిరోసిన్‌ను అక్రమంగా విక్రయించింది. గమనించిన స్థానిక యూత్‌క్లబ్ సభ్యులు కిరోసిన్‌ను పట్టుకొని జగిత్యాల ఆర్డీవోకు సమాచారమందించారు. దీంతో ఆయన వెంటనే స్థానిక తహశీల్దార్ చిలుక గంగారాంను గ్రామానికి వెళ్లి విచారణ జరపాలని ఆదేశించారు. తహశీల్దార్ వచ్చి విచారణ జరపగా అక్రమం బయటపడింది. డీలర్ పది లీటర్ల కిరోసిన్‌లో ఐదు లీటర్ల కిరోసిన్‌ను నల్లగొండకు చెందిన గంగరాజు అనే యువకుడికి అక్రమంగా విక్రయించినట్లు తేలిందని చెప్పారు. కాగా సరుకులను అక్రమంగా అమ్ముకుంటున్న రేషన్ డీలర్‌పై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. -
వికలాంగ మహిళపై హత్యాయత్నం
గుడివాడ టౌన్, న్యూస్‌లైన్ : వికలాంగురాలైన ఓ మహిళను సజీవ దహనం చేసేందుకు ఆమెతో సహజీవనం చేస్తున్న వ్యక్తి భార్య యత్నించింది. పట్టణంలో బుధవారం జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. వివరాలిలా ఉన్నాయి. స్థానిక బంటుమిల్లి రోడ్డు ప్రాంతానికి చెందిన వికలాంగురాలు యార్లగడ్డ వెంకటేశ్వరమ్మ(30) స్థానిక ముబారక్ సెంటర్లో చిన్న హోటల్ నిర్వహిస్తోంది. వీరంకి మురళి అనే వ్యక్తితో ఆమె సహజీవనం చేస్తోంది. వీరికి ఏడాదిన్నర వయస్సుగల కుమారుడు ఉన్నాడు. వెంకటేశ్వరమ్మకు, మురళి భార్య దేవికి గతంలో చిన్న చిన్న తగాదాలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం వెంకటేశ్వరమ్మ హోటల్లో ఉండగా దేవి అక్కడకు వచ్చింది. వెంటనే వెంకటేశ్వరమ్మ కళ్లలో కారం చల్లింది. ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే కిరోసిన్ పోసి నిప్పంటించింది. ఈ ఘటనలో వెంకటేశ్వరమ్మ పొట్ట, చేతులకు గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి మంటలు ఆర్పివేసి, ఆమెను ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె అక్కడ చికిత్స పొందుతోంది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అమాయకంగా చూస్తున్న కుమారుడు.. వెంకటేశ్వరమ్మ చిన్ననాటి నుంచి పోలియోతో బాధపడుతోంది. కుడి చెయ్యి సరిగా సహకరించదు. మురళి ద్వారా బిడ్డను కని, బంధువులకు దూరంగా ఉంటోంది. హోటల్ నిర్వహిస్తూ జీవనం సాగిస్తోంది. హత్యాయత్నం తరువాత ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వెంకటేశ్వరమ్మ వద్దనే కుమారుడిని కూడా ఉంచారు. తల్లికి ఏం జరిగిందో అర్ధం కాక, తండ్రి అం దుబాటులో లేక ఆ బాలుడు వచ్చిపోయే వారి వంక అమాయకంగా, బిత్తర చూపులు చూస్తుండటం అక్కడివారిని కలచివేసింది.