కట్నం కోసం భార్యకు నిప్పంటించిన ‘ఖాకీ’ | husband killed wife for dowry | Sakshi
Sakshi News home page

కట్నం కోసం భార్యకు నిప్పంటించిన ‘ఖాకీ’

Published Tue, Sep 1 2015 4:55 AM | Last Updated on Tue, Mar 19 2019 5:52 PM

కట్నం కోసం భార్యకు నిప్పంటించిన ‘ఖాకీ’ - Sakshi

కట్నం కోసం భార్యకు నిప్పంటించిన ‘ఖాకీ’

మద్దూరు: కట్నం కోసం రక్షకబటుడు కర్కోటకుడిగా మారి భార్యపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు.  వరంగల్ జిల్లా మద్దూరు మండలం వంగపల్లికి చెందిన చెందిన అనిల్‌కుమార్ హైదరాబాద్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. ఇతనికి  నల్లగొండ జిల్లా రాజాపేట మండలం పాముకుంటకు చెందిన జంగ మల్లయ్య కుమార్తె సంపూర్ణతో ఐదు నెలల క్రితం వివాహమైంది. ఆమె ప్రస్తుతం  గర్భవతి.  పెళ్లి అయిన నాటి నుంచి అత్తింటివారు అదనపు కట్నం కోసం వేధిస్తున్నారు. అనిల్ తన తల్లిదండ్రులు, సోదరి అనితతో కలసి ఆదివారం భార్యపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement