కృష్ణా జిల్లా : విజయవాడలో ఓ కానిస్టేబుల్, తన భార్యను చిత్రహింసలకు గురిచేస్తుండటంతో ఆమె ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ సంఘటన ఈ నెల ఒకటో తేదీని జరిగింది. నగరంలోని అజిత్ సింగ్ నగర్ పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్ పనిచేస్తున్న మురళి, లక్ష్మీ ప్రసన్న భార్యాభర్తలు. నిత్యం భర్త మురళీ వేధింపులకు గురిచేయడంతో విసుగెత్తిన భార్య ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టడంతో ఆమెను స్థానికులు ఆసుపత్రికి తరలించారు.
90 శాతం కాలిన గాయాలతో ప్రస్తుతం లక్ష్మీ ప్రసన్న మృత్యువుతో పోరాడుతోంది. లక్ష్మీ ప్రసన్న గతంలో పశ్చిమగోదావరి జిల్లాలో హోంగార్డుగా పని చేసి మానేసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
బెజవాడలో శాడిస్ట్ కానిస్టేబుల్
Published Wed, Jul 4 2018 3:06 PM | Last Updated on Tue, Mar 19 2019 5:52 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment