
సాక్షి, కృష్ణా : విజయవాడలో ఈ నెల ఒకటో తేదిన ఓ కానిస్టేబుల్, తన భార్యను చిత్రహింసలకు గురిచేస్తుండటంతో ఆమె ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి తీవ్రగాయాలతో విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రసన్న ఈ రోజు ఉదయం( శనివారం) మృతిచెందింది.
నగరంలోని అజిత్ సింగ్ నగర్ పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్ పనిచేస్తున్న మురళి, లక్ష్మీ ప్రసన్న భార్యాభర్తలు. నిత్యం భర్త మురళీ వేధింపులకు గురిచేయడంతో విసుగెత్తిన భార్య జులై 1న కిరోషిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నాం చేసింది. 90 శాతం కాలిన గాయాలతో లక్ష్మీ ప్రసన్న మృత్యువుతో పోరాటం చేసి మరణించింది. లక్ష్మీ ప్రసన్న గతంలో పశ్చిమగోదావరి జిల్లాలో హోంగార్డుగా పని చేసి మానేసింది. తన కూతురిపై అల్లుడు మురళీ కృష్ణనే కిరోషిన్ పోసి నిప్పు పెట్టాడని ప్రసన్న కుటుంబ సభ్యలు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.