సెల్ఫీ దిగి.. ఆత్మహత్యాయత్నం చేసిన మహిళ | Women Try To Commit Suicide Attempt In Krishnalanka, Vijayawada | Sakshi
Sakshi News home page

సెల్ఫీ దిగి.. ఆత్మహత్యాయత్నం చేసిన మహిళ

Published Tue, Aug 6 2019 3:40 PM | Last Updated on Tue, Aug 6 2019 4:19 PM

Women Try To Commit Suicide Attempt In Krishnalanka, Vijayawada  - Sakshi

సాక్షి, విజయవాడ : భర్తతో విభేదాల కారణంగా వివాహిత ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన మంగళవారం కృష్ణలంకలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కృష్ణలంకకు చెందిన మహేశ్వరికి తరచూ ఆమె భర్తతో గొడవలు జరుగుతుండేవి. ఈ నేపథ్యంలో జీవితం పై విరక్తి చెందిన ఆమె ఆత్మహత్య చేసుకునేందుకు రైల్వే వంతెన పైకి చేరుకొంది. ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియోలు దిగి మహేశ్వరి తన స్నేహితులకు పంపించింది. ఆ వీడియోలు చూసిన ఆమె స్నేహితులు కృష్ణలంక పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు ఆమెను రక్షించి భర్త, కుటుంబసభ్యులను పిలిపించి వారి సమక్షంలో కౌన్సెలింగ్‌ నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement