krishna lanka
-
వైఎస్ జగన్ కృష్ణ లంక డ్రోన్ విజువల్స్
-
మీరు కట్టిన గోడే మమ్మల్ని కాపాడింది, ధన్యవాదాలు చెప్పిన కృష్ణలంక జనం
-
Vijayawada Floods: వైఎస్ జగన్‌కు కృష్ణలంక వాసుల కృతజ్ఞతలు
సాక్షి, తాడేపల్లి: విజయవాడలో వరద బాధిత ప్రాంతాల్లో వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేడు పర్యటించనున్నారు. సింగ్‌నగర్ సహా బాధిత ప్రాంతాలను మధ్యాహ్నం మూడు గంటలకు పరీశీలించనున్నారు.ఈ మేరకు ఇప్పటికే పులివెందుల పర్యటన ముగించుకుని విజయవాడ చేరుకున్నారు వైఎస్ జగన్. విజయవాడ కృష్ణలంక ఏరియాలో రిటైనింగ్ వాల్ దగ్గర కృష్ణా నది ప్రవాహాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన సీఎంగా ఉన్న సమయంలో కట్టించిన రిటైనింగ్ వాల్ వల్లే తమ ప్రాణాలు నిలిచాయని వైఎస్ జగన్‌కు కృష్ణలంక వాసులు కృతజ్ఞతలు తెలిపారు.రిటైనింగ్ వాల్ లేకపోతే పూర్తిగా తమ జీవితాలు అతలాకుతలమయ్యేవని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన వైఎస్ జగన్.. వైఎస్సార్సీపీ శ్రేణులు సహాయ చర్యల్లో అండగా ఉంటారని బాధితులకు భరోసానిచ్చారు. కృష్ణా నదికి రిటైనింగ్ వాల్.. వరదల నుంచి కోట వంటి రక్షణగతంలో చినుకు పడితే విజయవాడ కృష్ణలంక వాసులు వణికిపోయేవారు. ప్రకాశం బ్యారేజీ గేట్లు ఎత్తితే బెంబేలెత్తిపోయేవారు. కరకట్ట వెంబడి ఇళ్లను నీళ్లు ముంచెత్తడంతో జనం కంటిమీద కునుకు లేకుండా అల్లాడిపోయేవారు. కానీ.. ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. దశాబ్దాలుగా కృష్ణలంక ప్రాంత ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్న వరద ముంపు సమస్య శాశ్వతంగా తప్పింది.గతంలో ప్రకాశం బ్యారేజీ నుంచి కేవలం మూడు లక్షల క్యూసెక్కుల వరదనీరు వదిలితే చాలు... కృష్ణలంక, రాణిగారితోట, రామలింగేశ్వరనగర్, కోటినగర్, పోలీస్‌కాలనీ, రణదివెనగర్, గౌతమినగర్, నెహ్రూనగర్, చలసానినగర్, గీతానగర్, బాలాజీనగర్, ద్వారకానగర్, భ్రమరాంబపురం, తారకరామానగర్ ప్రాంతాలు నీటమునిగేవి. వరద మొదలవగానే ఈ ప్రాంతాల్లోని దాదాపు 80వేల మంది ప్రజలు పునరావాస కేంద్రాలకు వెళ్లాల్సి వచ్చేది.ఈ పరిస్థితులను గమనించిన గత సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి 12 లక్షల క్యూసెక్కులు వరద వచ్చినా చుక్కనీరు ఇళ్లలోకి రాకుండా రూ.474.51 కోట్లతో కృష్ణా నది వెంబడి పద్మావతి ఘాట్ నుంచి యనమలకుదురు వరకు మూడు దశల్లో 5.66 కిలో మీటర్లు పటిష్టంగా రక్షణ గోడ నిర్మించారు. ఈ ప్రాంత ప్రజలకు వరద ముంపు నుంచి రక్షణ కల్పించడమే కాకుండా రూ.12.3 కోట్లతో రివర్ ఫ్రంట్ పార్కును అభివృద్ధి చేశారు. వైఎస్ జగన్ దార్శనికత వల్ల నేడు 8లక్షల క్యూసెక్కులు వరద వచ్చినా.. ఆ విషయమే తెలియకుండా ప్రశాంతంగా తమ ఇళ్లలో ఉంటున్నారు. -
సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపిన కృష్ణలంక వాసులు
-
సీఎం వైఎస్ జగన్ కు కృతజ్ఞతలు తెలిపిన కృష్ణలంక వాసులు
-
కృష్ణలంక పీఎస్ లో పవన్ పై కేసు నమోదు
-
విజయవాడ: పవన్ కల్యాణ్‌పై కేసు నమోదు
సాక్షి, విజయవాడ: వారాహి యాత్రలో వలంటీర్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై కృష్ణలంక పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. అయోధ్య నగర్‌కు చెందిన వలంటీర్ దిగమంటి సురేష్ బాబు ఫిర్యాదుతో 153, 153A, 505(2) ఐపీసీ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, వలంటీర్లపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్రవ్యాప్తంగా నిరసన వ్యక్తమవుతోంది. పవన్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ విజయవాడ లీగల్ సెల్ ప్రతినిధులు, పలువురు వలంటీర్లు ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్‌లో డిప్యూటీ పోలీస్ కమిషనర్ (డీసీపీ–అడ్మిన్ ) మోకా సత్తిబాబుకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. చదవండి: వలంటీర్లపై దౌర్జన్యకాండ కోవిడ్ బాధితులకు కుటుంబ సభ్యులే దూరంగా ఉన్న తరుణంలో ప్రాణాలకు తెగించి వలంటీర్లు సేవలందించారని వారు గుర్తుచేశారు. ప్రకృతి వైపరీత్యాల్లో సైతం సేవ చేస్తున్నారని అన్నారు. సీఎం వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన వలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి పథకం ప్రజల ముంగిటకే చేరుతోందన్నారు. వలంటీర్లు తలచుకుంటే వారాహి యాత్ర ఒక్క అడుగు ముందుకు సాగదని హెచ్చరించారు. వలంటీర్లకు పవన్ బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. -
KrishnaLanka: ఉత్కంఠంగా ‘ఇంట్రో ఆఫ్ కృష్ణలంక’ వీడియో
రంగు’సినిమాతో దర్శకుడిగా తనదైన ముద్ర వేసిన కార్తికేయ డైరెక్షన్లో పరుచూరు రవి, నరేష్ మేడి, ఆదర్శ్, పెద్దిరాజు, ప్రతీక్ష, అనిత భట్ నటీనటులుగా సోహ్లా ప్రొడక్షన్స్, చేతన్ రాజ్ ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘కృష్ణలంక’.తాజాగా ఈ చిత్రం నుంచి ‘ఇంట్రో ఆఫ్ కృష్ణలంక’పేరుతో ఓ వీడియోను విడుదల చేసింది చిత్ర బృందం. ఎలాంటి డైలాగులు లేకుండా కేవలం నేపథ్య సంగీతం, యాక్షన్ సన్నివేశాలతో రూపొందించిన ఈ వీడియో ఆద్యంతం ఆసక్తిగా సాగింది. టీజర్లు, ట్రైలర్లకు భిన్నంగా ఈ వీడియోలో ప్రతి పాత్ర తీరు తెన్నులను పరిచయం చేసాడు దర్శకుడు. ఓ గ్రామంలో కొన్ని బృందాల మధ్య జరిగిన ఘర్షనలు ఇందులో కనిపిస్తున్నాయి. కృష్ణ సురభ్ నేపథ్య సంగీతం అద్భుతంగా ఉంది. ప్రేమకు పగకు మధ్య జరిగే యుద్దమే ఈ సినిమా నేపథ్యం అని వీడియోని చూస్తే అర్థమవుతంది. అసలు ‘కృష్ణలంక’లో ఏం జరిగిందో తెలియాలంటే సినిమా చూడాల్సిందే. దే. ఈ సినిమాని సోహ్లా ప్రొడక్షన్స్, చేతన్ రాజ్ ఫిల్మ్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.సింగిల్ షెడ్యూల్లో కంప్లీట్ అయిన ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రోడక్షన్ పనుల్లో ఉంది. చదవండి: మహేశ్‌ని ఢీ కొట్టబోతున్న యాక్షన్ కింగ్! పోర్న్ మూవీ తీద్దామనుకున్నా: జాక్ స్నైడర్ -
తీరనున్న కృష్ణలంక వాసుల వరద కష్టాలు
సాక్షి, విజయవాడ: కృష్ణలంక వాసుల వరద కష్టాలు తీరనున్నాయి. రూ.125 కోట్లతో రిటైనింగ్ వాల్ నిర్మాణానికి అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. కలెక్టర్ ఇంతియాజ్, సీపీ బత్తిన శ్రీనివాస్, కార్పొరేషన్ కమిషనర్ ప్రసన్న వెంకటేష్, ఇరిగేషన్ అధికారులు స్థలాన్ని పరిశీలించారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ, కృష్ణలంక వాసుల ఇబ్బందులను వైఎస్సార్సీపీ ప్రభుత్వం తీరుస్తుందన్నారు. రిటైనింగ్ వాల్ నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధమయ్యాయని వెల్లడించారు. కరకట్ట వాసులకు ఇబ్బంది లేకుండా శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు. అభివృద్ధిపై సీఎం జగన్ ప్రత్యేక దృష్టి.. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ, గత టీడీపీ చేయలేని పనిని తాము చేసి చూపిస్తామన్నారు. విజయవాడ అభివృద్ధిపై సీఎం జగన్ ప్రత్యేక దృష్టి సారించారని చెప్పారు. దాదాపు రూ.125 కోట్లతో రిటైనింగ్ వాల్ నిర్మాణం చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే విష్ణు తెలిపారు. చదవండి: సుంకరిపేట ప్రమాదంపై సీఎం జగన్ ఆరా బురిడీ మాష్టారు.. బండారం బట్టబయలు -
కృష్ణలంకను దిగ్బంధించిన పోలీసులు
-
కృష్ణలంకలో రెడ్ అలెర్ట్
-
బెజవాడ కృష్ణలంకలో బంద్
సాక్షి, విజయవాడ: కరోనా పాజిటివ్ కేసు నమోదు అయిన కారణంగా విజయవాడ నగరంలోని కృష్ణలంక ప్రాంతంలో సోమవారం బంద్ పాటించాలని జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ పిలుపునిచ్చారు. కృష్ణలంకలో ఉన్న 16, 17, 18, 20, 21, 22 డివిజన్లలో పూర్తిగా బంద్ పాటించాలని, ఇళ్లలో నుంచి జనాలు బయటకు రావద్దని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. ఆ ప్రాంతంలోని ప్రజలందరూ అప్రమత్తతో జాగ్రత్తగా ఉండాలని, ఇళ్ల నుంచి ఎట్టి పరిస్థితుల్లో బయటకు రావద్దన్నారు. అత్యవసరం అయితే మాస్క్‌లు, శానిటైజర్లతో బయటకు రావాలని ఆయన సూచించారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ప్రజలు సహకరించాలని కలెక్టర్ కోరారు. (కరోనా 'లాక్డౌన్'పై సీరియస్‌నెస్ ఏదీ?) రాణిగారితోటలో హైఅలర్ట్ స్థానిక కృష్ణలంక రాణిగారితోటలో శనివారం 65 ఏళ్ల వృద్ధుడికి కరోనా నిర్ధారణ అవ్వటంతో ఆ ప్రాంతాన్ని ప్రభుత్వం హైఅలర్ట్‌గా ప్రకటించింది. ఆయా ప్రాంతాలకు రాకపోకలు నిలిపివేస్తూ అధికారులు ఆదివారం చుట్టుపక్కల రహదారులపై బారికేడ్లు ఏర్పాటు చేసి రాకపోకలను నిషేధించారు. కరోనా నివారణ చర్యల్లో భాగంగా ఆరోగ్య సిబ్బంది కరోనా సోకిన వ్యక్తి కుటుంబ సభ్యులతో పాటు పరిసర ప్రాంతాలవారికి వైద్య పరీక్షలు నిర్వహించి కరోనా నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ఆయా వీధుల్లో హైడ్రోక్లోరైడ్ క్రీమిసంహారక మందులు, బ్లీచింగ్ చల్లించారు. ప్రజలు రోడ్లమీద తిరుగకుండా పోలీసులు పట్టిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. (ఉ.11 గంటల తర్వాత బయటకు రావద్దు) -
కృష్ణలంకలో రిటైనింగ్ వాల్‌కు రూ.126 కోట్లు కేటాయింపు
-
‘సీఎం జగన్ మాట ఇస్తే తప్పరు’
సాక్షి, విజయవాడ : వరదలు వచ్చిన ప్రతిసారి ప్రజలు ఇబ్బంది పడుతున్నారనే కృష్ణలంకలో రిటైనింగ్‌వాల్ నిర్మాణం కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రూ.126 కోట్లు కేటాయించారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. వాల్ నిర్మాణానికి ఇంకా అవసరమైతే మరిన్ని నిధులు కేటాయిస్తామన్నారు. రిటైనింగ్ వాల్ నిర్మాణం కోసం రూ.126 కోట్లు కేటాయించినందుకుగాను కృష్ణలంక ప్రజలతో కలిసి వైఎస్సార్సీపీ నేత దేవినేని అవినాష్ ‘కృతజ్ఞత’ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో మంత్రులు పెద్దిరెడ్డి, బొత్స సత్యనారాయణతో పాటు కృష్ణలంక ప్రజలు పెద్దఎత్తున పాల్గొని సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. విజయవాడ నగరాన్ని సీఎం జగన్ అన్ని విధాల ఆదుకుంటారని హామీ ఇచ్చారు. టీడీపీ నేతల తప్పుడు ప్రచారాన్ని నమ్మోద్దని కోరారు. అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్ ఇస్తున్నామని, రాని వారు ఉంటే మరోసారి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. సీఎం జగన్ చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజలందరూ ఆశీర్వదించాలని కోరారు. ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నారు : బొత్స ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని సీఎం జగన్ నెరవేరుస్తున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశంసించారు. వరదలు వచ్చినప్పుడు ప్రజలు సురక్షితంగా ఉండేందుకే రిటైనింగ్ వాల్ నిర్మిస్తున్నామని చెప్పారు. తమ ప్రభుత్వం విజయవాడ అభివృద్ధికి బారీగా నిధులు కేటాయించిందని తెలిపారు. కృష్ణలంక ప్రజల ఇబ్బందిని గుర్తించిన సీఎం జగన్.. రిటైనింగ్ వాల్ కోసం వెంటనే రూ.126 కోట్లు కేటాయించారన్నారు. అభివృద్దే లక్ష్యంగా పనిచేస్తున్న సీఎం జగన్‌కు ప్రజల అశీస్సులు ఎప్పుడూ ఉంటాయన్నారు. ఇంటింటికి పింఛన్లు పంపిణీ చేస్తున్నామని చెప్పారు. అమ్మఒడి ద్వారా ప్రతి తల్లి ఖాతాలో రూ.15వేలు వేశామన్నారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని సంక్షేమ కార్యక్రమాలు సీఎం జగన్ అమలు చేస్తున్నారని కొనియాడారు. సీఎం జగన్‌కు రుణపడి ఉంటాం దశాబ్ధాలుగా కృష్ణ లంక లోతట్టు ప్రాంతాల ప్రజలు పడుతున్న ఇబ్బందులను గుర్తించి నిధులు కేటాయించినందుకు సీఎం జగన్‌కు వైఎస్సార్సీపీ విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇన్చార్జి దేవినేని అవినాష్ కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నో ఏళ్లుగా కృష్ణలంక రిటైనింగ్ వాల్ నిర్మాణానికి ప్రతిపాదనలు పంపుతున్నా గత ప్రభుత్వాలు పట్టించుకున్న పాపాన పోలేదు. అయితే ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కృష్ణ లంక లోతట్టు ప్రాంత ప్రజలు పడుతున్న ఇబ్బందులను గుర్తించి రూ. 126 కోట్లు కేటాయించారు. ఆయనకు కృష్ణలంక ప్రజలు జీవితాంతం రుణపడి ఉంటారు’ అని దేవినేని అవినాష్ పేర్కొన్నారు. పింఛన్లు తొలగిస్తున్నారంటూ టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. దేశంలో ఏ రాష్ట్రంలో అమలు కాని సంక్షేమ పథకాలు ఏపీలో అమలు అవుతున్నాయని అన్నారు. -
అంతా దెయ్యం పనే!!
సాక్షి, విజయవాడ: ఆమెకు అంతుచిక్కని రోగం. తీవ్రమైన మనోవేదన. అయితే వ్యాధికి తగ్గ చికిత్స అందడం లేదు. పైగా ఇదంతా దెయ్యం పనే అని నమ్ముతోంది. మంత్రగాళ్ళ చుట్టు తిరుగుతోంది. ఇంటర్ నెట్ కాలంలోనూ మూఢనమ్మకాలను గట్టిగా నమ్మతోంది విజయవాడలోని ఓ కుటుంబం. ఈ దంపతుల పేర్లు దాడి లక్ష్మీ, దాడి రమణ. విజయవాడ కృష్ణ లంక రాణిగారి తోటలో నివాసం. కూరగాయల వ్యాపారం చేస్తూ కాలం గడుపుతున్నారు. అయితే ఈ మధ్య లక్ష్మి మనో వేదనతో బాధ పడుతున్నారు. అదేమిటంటే దెయ్యంగాలి వెంటాడుతోందని ఆమె చెబుతున్నారు. ఎవరిని చూసినా ఓ రకంగా భయపడుతున్నారు. దెయ్యాలు భూతాలు లేవని ఆమెకు భర్తాపిల్లలు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. అయినా లక్ష్మిలో మార్పు రాలేదు. దీంతో ఆమె ఆరోగ్యం రోజురోజుకు క్షీణిస్తోంది. ఆమెకు నయం కావాలంటే దేవతార్చన ఒక్కటే మార్గమని చుట్టుపక్కల వారు చెప్పడంతో అందుబాటులో వున్న ఆలయాలన్నింటికీ తిరిగారు. ఈ క్రమంలో కృష్ణా ఘాట్‌లో కాలుజారి పడిపోవడంతో అక్కడే ఉన్న పోలీసు రక్షించారు. తాను ప్రమాదానికి గురికావడం కూడా దెయ్యంపనే అంటున్నారు లక్ష్మి. లక్ష్మి కొన్నాళ్ళుగా భయపడుతున్నారని భర్త రమణ చెప్తున్నాడు. గాలిసోకిందన్న అనుమానం ఆమెను వెంటాడుతోందని వాపోయాడు. ఆ కారణంగా తన భార్య చాలా ఇబ్బందులు పడుతోందని చెప్పాడు. వైద్యంతో పాటు మంత్రగాళ్ళను ఆశ్రయించామని తెలిపాడు. దెయ్యాలంటే భయం లేదంటున్న ఇరుగుపోరుగు వారు, లక్ష్మి ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 21వ శతాబ్ధంలో మూఢనమ్మకాలను విశ్వసిస్తున్న ఈ కుటుంబాల్లో చైతన్యం తీసుకురావలసిన అవసరం ఎంతైనా వుంది. -
ఎస్సై అర్జునరావుపై సీఎం జగన్ ప్రశంసలు
సాక్షి, అమరావతి : విజయవాడ బందరు కాలువలో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మహిళను రక్షించిన రిజర్వు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు అర్జునరావును ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందించారు. ఆయన సాహసాన్ని ప్రశంసించారు. ప్రస్తుతం సీఎం జగన్ కాన్యాయ్ పైలెట్ ఆపీసర్గా విధులు నిర్వహిస్తున్న అర్జున రావు మంగళవారం సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కలిశారు. ఈ సందర్భంగా సీఎం జగన్.. ఆయనపై ప్రశంసల జల్లు కురిపించారు. ప్రభుత్వం నుంచి ప్రధానమంత్రి లైఫ్ సేవింగ్ మెడల్‌కు రికమెండ్ చేయాలని అధికారులను ఆదేశించారు. సోమవారం లక్మీ అనే మహిళ కృష్ణలంక సమీపంలోని బందరు కాల్వలో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. కాల్వలో కొట్టుకుపోతున్న ఆమెను గుర్తించి స్థానికులు కేకలు వేశారు. కాపాడాలని అర్థించారు. అటుగా వెళుతున్న అర్జునరావు దీనిని గుర్తించారు. కాల్వలో కొట్టుకుపోతున్న మహిళను చూసి వెనుకాముందు ఆలోచించకుండా కాల్వలోకి దూకేశారు. ఈదుకుంటూ వెళ్లి మహిళను ఓడ్డుకు తీసుకొచ్చారు. అనంతరం ఆమెకు ప్రాథమిక చికిత్స అందించారు. దీంతో మహిళ ప్రాణాలతో బయటపడింది. మహిళను కాపాడడమే కాకుండా ప్రాధమిక చికిత్స అందించి ప్రాణాలు కాపాడిన ఎస్సై అర్జునరావును పోలీసు ఉన్నతాధికారులు సైతం అభినందిస్తున్నారు. -
ట్రాఫిక్ ఎస్సై ధైర్యసాహసాలు.. ప్రశంసలు!
సాక్షి, విజయవాడ: ఓ ట్రాపిక్ ఎస్సై ధైర్యసాహసాలు ప్రదర్శించి.. చురుగ్గా స్పందించి ఓ మహిళ ప్రాణాలను కాపాడాడు. కృష్ణలంక సమీపంలోని బందరు కాల్వలో ఓ మహిళ అదుపుతప్పి పడిపోయింది. కాల్వలో కొట్టుకుపోతున్న ఆమెను గుర్తించి స్థానికులు కేకలు వేశారు. కాపాడాలని అర్థించారు. అటుగా వెళుతున్న ట్రాఫిక్ ఎస్సై అర్జునరావు దీనిని గుర్తించారు. కాల్వలో కొట్టుకుపోతున్న మహిళను చూసి వెనుకాముందు ఆలోచించకుండా కాల్వలోకి దూకేశారు. ఈదుకుంటూ వెళ్లి మహిళను ఓడ్డుకు తీసుకొచ్చారు. అనంతరం ఆమెకు ప్రాథమిక చికిత్స అందించారు. దీంతో మహిళ ప్రాణాలతో బయటపడింది. సమయానుకూలంగా ధైర్యసాహసాలతో వ్యవహరించి.. కాల్వలో కొట్టుకుపోతున్న మహిళను కాపాడిన ట్రాఫిక్ ఎస్సై అర్జునరావుపై పోలీసు ఉన్నతాధికారులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఆయన సాహసాన్ని డీజీపీ గౌతం సవాంగ్ ప్రత్యేకంగా కొనియాడారు. మహిళను కాపాడడమే కాకుండా ప్రాధమిక చికిత్స అందించి ప్రాణాలు కాపాడిన ఎస్సై అర్జునరావుకు అభినందనలు తెలిపారు. ఆయన పేరును ప్రధానమంత్రి లైఫ్ సేవింగ్ మెడల్‌కు నామినేట్ చేస్తున్నట్టు తెలిపారు. -
పెళ్లికి ముందే అనుమానించి.. ఆపై వేధింపులు!
సాక్షి, విజయవాడ: పెళ్లి చేసుకోమంటూ శ్రీనివాస్ అనే ఆర్మీ ఉద్యోగి తనను వేధిస్తున్నాడని ఓ యువతి పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గుంటూరు జిల్లా కొల్లిపరకు చెందిన ఆర్మీ ఉద్యోగి శ్రీనివాస్‌కు, ఓ యువతికి గతంలో పెళ్లి చేయాలని పెద్దలు నిర్ణయించారు. అయితే పెళ్లికి ముందే తనను అనుమానిస్తున్నాడంటూ సదరు యువతి వివాహానికి నిరాకరించింది. ఈ నేపథ్యంలో శ్రీనివాస్ తనను పెళ్లి చేసుకోవాల్సిందేనంటూ యువతిపై ఒత్తిడి తెచ్చాడు. పెళ్లి పేరుతో మూడేళ్లుగా యువతిని వేధింపులకు గురిచేయసాగాడు. దీంతో సదరు యువతి కృష్ణలంక పోలీసులకు శ్రీనివాస్‌పై ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
కృష్ణలంకలో వైఎస్సార్సీపీ శ్రేణుల పర్యటన
సాక్షి, విజయవాడ: ప్రకాశం బ్యారేజి వద్ద కృష్ణానది ఉగ్రరూపం దాల్చుతోంది. నదీ పరివాహక ప్రాంతాల్లో ప్రజలు భయం గుప్పిట కాలం వెళ్లదీస్తున్నారు. ఈ నేపథ్యంలో కృష్ణ లంక వరద ప్రభావిత ప్రాంతాల్లో వైఎస్సార్సీపీ శ్రేణులు శుక్రవారం విస్తృత పర్యటన చేపట్టారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ నాయకులు బాధితులకు అండగా నిలుస్తున్నారు. ఇందులో భాగంగా బాధితులకు ఆహార పదార్థాలను అందజేయడమేకాక పునరావాస కేంద్రాలపై దృష్టి సారించారు. వైఎస్సార్సీపీ విజయవాడ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త బొప్పన భవకుమార్ వరద బాధిత కుటుంబాలను పరామర్శించారు. ముంపు ప్రాంతాల్లో పర్యటించిన ఆయన వరద బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కృష్ణలంకలో ఒక రైటనియోగ్ వాల్ నిర్మిస్తామన్నారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్ ఇంతియాజ్‌తో సహా, అధికారులు అక్కడిని పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. వరద మరింత పెరిగే అవకాశం ఉందని, అందువల్ల ముంపు ప్రాంత ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. సహాయక చర్యల కోసం విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఐదు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. -
సెల్ఫీ దిగి.. ఆత్మహత్యాయత్నం చేసిన మహిళ
సాక్షి, విజయవాడ : భర్తతో విభేదాల కారణంగా వివాహిత ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన మంగళవారం కృష్ణలంకలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కృష్ణలంకకు చెందిన మహేశ్వరికి తరచూ ఆమె భర్తతో గొడవలు జరుగుతుండేవి. ఈ నేపథ్యంలో జీవితం పై విరక్తి చెందిన ఆమె ఆత్మహత్య చేసుకునేందుకు రైల్వే వంతెన పైకి చేరుకొంది. ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియోలు దిగి మహేశ్వరి తన స్నేహితులకు పంపించింది. ఆ వీడియోలు చూసిన ఆమె స్నేహితులు కృష్ణలంక పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు ఆమెను రక్షించి భర్త, కుటుంబసభ్యులను పిలిపించి వారి సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహించారు. -
భార్యపై పైశాచికత్వం; హత్య!
సాక్షి, కృష్ణా : కట్టుకొన్నవాడే ఆ ఇల్లాలి పాలిట కాలయముడయ్యాడు. అనుమానం పెనుభూతం కావటంతో మృగాడిగా మారాడు .అగ్నిసాక్షిగా తాళి కట్టిన చేతులతోనే భార్యపై పెట్రోలు పోసి సజీవదహనం చేశాడు. గర్భవతి అనే కనికరం కూడా లేకుండా పాశవికంగా హతమార్చాడు. బాధితురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు..కృష్ణా జిల్లా అవనిగడ్డ లింగారెడ్డి పాలెంకు చెందిన శైలజకు.. గుడివాడ జొన్నపాడుకు చెందిన నంబియార్‌తో ఆరు నెలల క్రితం వివాహం జరిగింది. అల్లుడు ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ చదివి, కార్పొరేట్ కాలేజీలో లెక్చరర్‌గా ఉద్యోగం చేస్తుండటంతో శైలజ తల్లిదండ్రులు.. అతడు అడిగినంత కట్నం ఇచ్చి ఘనంగా పెళ్లి జరిపించారు. ఈ క్రమంలో నూతన దంపతులు విజయవాడ కృష్ణలంకలోని అద్దె ఇంట్లో కాపురం పెట్టారు. భర్తకు ఆర్థికంగా చేదోడువాదోడుగా నిలవాలనే ఉద్దేశంతో శైలజ ఉద్యోగం చేసేందుకు సిద్ధపడింది. భర్తను ఒప్పించి ఓ ప్రైవేటు పాఠశాలలో టీచర్‌గా చేరింది. అయితే ఆమె సంతోషం ఎంతో కాలం నిలవలేదు. కొద్ది రోజుల వరకు సజావుగానే వీరి సంసారంలో అనుమాన భూతం ప్రవేశించింది. భర్త నంబియార్ ప్రవర్తనలో మార్పు రావడంతో శైలజను కష్టాలు చుట్టుముట్టాయి. అనుమానానికి తోడు వరకట్న పిశాచి ఆవహించినట్టు నంబియార్.. అదనపు కట్నం కోసం శైలజను తీవ్రంగా వేధించేవాడు. సూటిపోటి మాటలతో కుళ్ళబొడుస్తూ.. చిత్రవధ చేసేవాడు. ఈ క్రమంలో వేధింపులు శృతిమించటంతో శైలజ తల్లిదండ్రులకు చెప్పుకొని బాధపడేది. ఈ నేపథ్యంలోనే శనివారం ఒళ్లు కాలుతూ ఆర్తనాదాలు పెట్టిన శైలజను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. చికిత్సపొందుతూ శైలజ మృత్యు ఒడికి చేరింది. కాగా బావ నంబియారే తన చెల్లిపై పెట్రోల్ పోసి నిప్పంటించి హత్య చేశాడని శైలజ అన్న ప్రసాద్ ఆరోపిస్తున్నాడు. -
బెంజిసర్కిల్‌లో రౌడీయిజం.. వ్యక్తి హత్య
సాక్షి, విజయవాడ : బెంజిసర్కిల్‌లో గల ఓ బార్లో రౌడీషీటర్లు మద్యం మత్తులో చెలరేగిపోయారు. మద్యం సీసాలతో ఓ వ్యక్తిపై దాడి చేసి అతడి ప్రాణాలు బలిగొన్నారు. వివరాలు.. కృష్ణలంకకు చెందిన ఇమ్రాన్, సద్దాం అనే ఇద్దరు రౌడీషీటర్లు మద్యం సేవించేందుకు బెంజ్ సర్కిల్‌కు వచ్చారు. ఈ క్రమంలో ఓ బార్లో మద్యం సేవిస్తుండగా కుర్చీ కోసం పక్క టేబుల్లో కూర్చున్న వ్యక్తులతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో అనిల్ అనే వ్యక్తిపై మద్యం సీసాలతో దాడి చేశారు. అనంతరం అతడిపై పిడిగుద్దులు కురిపించారు. దీంతో తీవ్రగాయాలపాలైన అనిల్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. కాగా ఈ ఘటనలో ఇమ్రాన్, సద్దాంలతో పాటు మరో నలుగురు నిందితులను కృష్ణలంక పోలీసులు అరెస్టు చేశారు. -
కృష్ణలంకలో ఆలయం తొలగింపు.. ఉద్రిక్తత
కృష్ణలంక: విజయవాడ కృష్ణలంకలో ఉద్రికత్త చోటు చేసుకుంది. స్థానికంగా కృష్ణా నదీ కాల్వను ఆనుకుని ఉన్న అభయాంజనేయస్వామి ఆలయాన్ని రెవెన్యూ అధికారులు శనివారం కూల్చివేశారు. స్థానికులు, కమిటీ సభ్యులు అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరంణం ఏర్పడింది. గుడికి ప్రత్యామ్నాయం చూపించాలని ఎప్పటి నుంచే కమిటీ సభ్యులు అడుగుతున్నారు. అయితే, గర్భగుడి మినహా మిగిలిన వాటిని మాత్రమే తొలగిస్తామన్న రెవెన్యూ సిబ్బంది ఈ రోజు ఆలయం మొత్తాన్ని జేసీబీతో తొలగించేశారు. దీన్ని కమిటీ సభ్యులు నిమ్మల జ్యోతి, ప్రభాకర్ స్థానికులతో కలసి అడ్డుకోగా పోలీసులు వారిని స్టేషన్‌కు తరలించారు. -
నగ్నచిత్రాల బాధితురాలి ఆందోళన
నిందితుడి ఇంటిముందు ధర్నా విజయవాడ (కృష్ణలంక): విజయవాడలో అప్పు ఇచ్చిన డబ్బులు అడిగినందుకు నగ్న ఫొటోలు తీసి బెదిరించిన మండవ రవికాంత్ ఇంటిముందు బాధితురాలు శనివారం తన మద్దతుదారులతో ఆందోళన చేపట్టారు. మండవ రవికాంత్ ఓ మహిళ దగ్గర డబ్బులు అప్పుగా తీసుకున్నాడు. వాటిని తిరిగి ఇవ్వమని ఆమె అడిగినందుకు రవికాంత్ తన రెండో భార్య శ్రీదేవితో ఆమె నగ్నఫొటోలు తీయించి బెదిరించిన విషయం విదితమే. దీనిపై పోలీసులు రవికాంత్‌ను విచారిస్తున్నారు. శనివారం బాధితురాలు తన మద్దతుదారులతో కృష్ణలంక సత్యంగారి హొటల్ రోడ్డులోని రవికాంత్ మొదటి భార్య ఇంటిముందు ఆందోళన చేపట్టారు. ‘తనను శ్రీదేవి బెదిరిస్తోందని, నగ్నచిత్రాలు తన వద్దే ఉన్నాయని, తాను తన అక్క (రవికాంత్ మొదటి భార్య) ఇంటి వద్ద ఉన్నానని ఫోన్లో బెదిరిస్తోంది’ అని బాధితురాలు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. మండవ మొదటి భార్య ఇంట్లో శ్రీదేవి లేకపోవడాన్ని గమనించారు. సింగ్‌నగర్ సీఐ బాలమురళి మాట్లాడుతూ రవికాంత్‌కు సంబంధించిన పెన్‌డ్రైవ్ తదితర వస్తువులు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. శ్రీదేవి నుంచి ఎటువంటి అపాయం జరగకుండా ఉండేలా బాధితురాలికి రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చారు. దీంతో బాధితురాలు ఆందోళన విరమించారు. -
అగ్నిప్రమాదంలో ఐదు గుడిసెలు దగ్ధం
విజయవాడ: క్రిష్ణలంకలోని తారక రామానగర్‌లో బుధవారం అగ్ని ప్రమాదం జరిగింది. కరకట్ట మీద ఉన్న ఓ గుడిసె నుంచి మంటలు చెలరేగాయి. పక్కనే ఉన్న మరో 5 గుడిసెలకు మంటలు వ్యాపించాయి. మధ్యాహ్నా సమయం కావడం, అందులోనూ ఎండాకాలం కావడంతో మంటలు త్వరగా వ్యాపించాయని స్థానికులు చెబుతున్నారు. గుడిసెల్లో దాచుకున్న విలువైన వస్తువులు బూడిదపాలయ్యాయి. మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. షార్ట్‌సర్క్యూట్ లేదా వంట చేసే సమయంలో నిప్పు రవ్వలు చెలరేగి ప్రమాదం జరిగి ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. ప్రమాదంలో గుడిసెలు కాలిపోయిన బాధితులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు.