పెళ్లికి ముందే అనుమానించి.. ఆపై వేధింపులు! | Army Employee Forced To Marriage Woman In Vijayawada | Sakshi
Sakshi News home page

యువతిని వేధిస్తున్న ఆర్మీ ఉద్యోగి

Published Sun, Nov 10 2019 11:23 AM | Last Updated on Sun, Nov 10 2019 12:27 PM

Army Employee Forced To Marriage Woman In Vijayawada - Sakshi

సాక్షి, విజయవాడ: పెళ్లి చేసుకోమంటూ శ్రీనివాస్‌ అనే ఆర్మీ ఉద్యోగి తనను వేధిస్తున్నాడని ఓ యువతి పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గుంటూరు జిల్లా కొల్లిపరకు చెందిన ఆర్మీ ఉద్యోగి శ్రీనివాస్‌కు, ఓ యువతికి గతంలో పెళ్లి చేయాలని పెద్దలు నిర్ణయించారు. అయితే పెళ్లికి ముందే తనను అనుమానిస్తున్నాడంటూ సదరు యువతి వివాహానికి నిరాకరించింది. ఈ నేపథ్యంలో శ్రీనివాస్‌ తనను పెళ్లి చేసుకోవాల్సిందేనంటూ యువతిపై ఒత్తిడి తెచ్చాడు. పెళ్లి పేరుతో మూడేళ్లుగా యువతిని వేధింపులకు గురిచేయసాగాడు. దీంతో సదరు యువతి కృష్ణలంక పోలీసులకు శ్రీనివాస్‌పై ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement