
విజయవాడరూరల్: అప్పుల బాధతో దంపతులు ఆత్మహత్యాయత్నం చేయగా భార్య మృతి చెందింది. భర్త పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటన మంగళవారం నున్న పోలీసు స్టేషన్ పరిధి శాంతినగర్లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నగరంలోని పాయకాపురం శాంతినగర్‌కు చెందిన అంబటి ప్రతాప్‌కుమార్ ఫ్లవర్ డెకరేషన్ వ్యాపారం చేస్తుంటాడు.
అతని భార్య అంబటి సాయికన్య(32) చీటీల వ్యాపారం చేస్తుంటుంది. వీరికి ఇద్దరు సంతానం. వ్యాపారంలో నష్టం వచ్చి అప్పులు పెరిగిపోవడంతో, అవి తీర్చే మార్గం లేక మంగళవారం పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడి బెడ్‌రూమ్‌లో పడిపోయారు. వారి పిల్లలు చూసి పక్కింటివారికి చెప్పగా వారు వచ్చి దంపతులిద్దరినీ చికిత్స నిమిత్తం విజయవాడలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. డాక్టర్లు వారిని పరిశీలించి సాయికన్య చనిపోయిందని నిర్ధారించారు. మృత్యువుతో పోరాడుతున్న ప్రతాప్‌కుమార్‌కు చికిత్స అందిస్తున్నారు. ప్రతాప్‌కుమార్ అన్న ప్రదీప్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment