The Intro Of Krishna Lanka Movie Released - Sakshi
Sakshi News home page

KrishnaLanka: ఉత్కంఠంగా ‘ఇంట్రో ఆఫ్ కృష్ణ‌లంక’ వీడియో

Published Tue, Jun 1 2021 4:21 PM | Last Updated on Tue, Jun 1 2021 4:38 PM

The Intro Of Krishna Lanka Movie Released	 - Sakshi

రంగు’సినిమాతో ద‌ర్శ‌కుడిగా త‌న‌దైన ముద్ర‌ వేసిన కార్తికేయ డైరెక్షన్‌లో పరుచూరు రవి, నరేష్ మేడి, ఆదర్శ్, పెద్దిరాజు, ప్రతీక్ష, అనిత భట్ నటీనటులుగా సోహ్లా ప్రొడక్షన్స్, చేతన్ రాజ్ ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘కృష్ణలంక’.తాజాగా ఈ చిత్రం నుంచి ‘ఇంట్రో ఆఫ్ కృష్ణలంక’పేరుతో ఓ వీడియోను విడుద‌ల చేసింది చిత్ర బృందం. ఎలాంటి డైలాగులు లేకుండా ​కేవలం నేపథ్య సంగీతం, యాక్ష‌న్ స‌న్నివేశాల‌తో రూపొందించిన ఈ వీడియో ఆద్యంతం ఆస‌క్తిగా సాగింది.

టీజర్‌లు, ట్రైలర్లకు భిన్నంగా ఈ వీడియోలో ప్రతి పాత్ర తీరు తెన్నుల‌ను ప‌రిచ‌యం చేసాడు ద‌ర్శ‌కుడు. ఓ గ్రామంలో కొన్ని బృందాల మధ్య జరిగిన ఘర్షనలు ఇందులో కనిపిస్తున్నాయి. కృష్ణ సుర‌భ్ నేపథ్య సంగీతం అద్భుతంగా ఉంది.  ప్రేమ‌కు ప‌గ‌కు మ‌ధ్య జ‌రిగే యుద్దమే ఈ సినిమా నేపథ్యం అని వీడియోని చూస్తే అర్థమవుతంది. అసలు  ‘కృష్ణలంక’లో ఏం జరిగిందో తెలియాలంటే సినిమా చూడాల్సిందే. దే. ఈ సినిమాని సోహ్లా ప్రొడ‌క్ష‌న్స్, చేత‌న్ రాజ్ ఫిల్మ్స్ సంస్థ‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.సింగిల్ షెడ్యూల్‌లో కంప్లీట్ అయిన ఈ మూవీ ప్ర‌స్తుతం పోస్ట్ ప్రోడ‌క్ష‌న్ ప‌నుల్లో ఉంది.

చదవండి:
 మహేశ్‌ని ఢీ కొట్టబోతున్న యాక్షన్ కింగ్!
పోర్న్ మూవీ​ తీద్దామనుకున్నా: జాక్ స్నైడర్

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement