విజయవాడ: క్రిష్ణలంకలోని తారక రామానగర్‌లో బుధవారం అగ్ని ప్రమాదం జరిగింది. కరకట్ట మీద ఉన్న ఓ గుడిసె నుంచి మంటలు చెలరేగాయి. పక్కనే ఉన్న మరో 5 గుడిసెలకు మంటలు వ్యాపించాయి. మధ్యాహ్నా సమయం కావడం, అందులోనూ ఎండాకాలం కావడంతో మంటలు త్వరగా వ్యాపించాయని స్థానికులు చెబుతున్నారు.
గుడిసెల్లో దాచుకున్న విలువైన వస్తువులు బూడిదపాలయ్యాయి. మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. షార్ట్‌సర్క్యూట్ లేదా వంట చేసే సమయంలో నిప్పు రవ్వలు చెలరేగి ప్రమాదం జరిగి ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. ప్రమాదంలో గుడిసెలు కాలిపోయిన బాధితులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు.
అగ్నిప్రమాదంలో ఐదు గుడిసెలు దగ్ధం
Published Wed, Mar 23 2016 4:18 PM | Last Updated on Thu, Sep 13 2018 5:04 PM
Advertisement
Advertisement