సాక్షి, విజయవాడ: వారాహి యాత్రలో వలంటీర్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై కృష్ణలంక పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. అయోధ్య నగర్‌కు చెందిన వలంటీర్ దిగమంటి సురేష్ బాబు ఫిర్యాదుతో 153, 153A, 505(2) ఐపీసీ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
కాగా, వలంటీర్లపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్రవ్యాప్తంగా నిరసన వ్యక్తమవుతోంది. పవన్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ విజయవాడ లీగల్ సెల్ ప్రతినిధులు, పలువురు వలంటీర్లు ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్‌లో డిప్యూటీ పోలీస్ కమిషనర్ (డీసీపీ–అడ్మిన్ ) మోకా సత్తిబాబుకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.
చదవండి: వలంటీర్లపై దౌర్జన్యకాండ
కోవిడ్ బాధితులకు కుటుంబ సభ్యులే దూరంగా ఉన్న తరుణంలో ప్రాణాలకు తెగించి వలంటీర్లు సేవలందించారని వారు గుర్తుచేశారు. ప్రకృతి వైపరీత్యాల్లో సైతం సేవ చేస్తున్నారని అన్నారు. సీఎం వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన వలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి పథకం ప్రజల ముంగిటకే చేరుతోందన్నారు. వలంటీర్లు తలచుకుంటే వారాహి యాత్ర ఒక్క అడుగు ముందుకు సాగదని హెచ్చరించారు. వలంటీర్లకు పవన్ బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment