
సాక్షి, కృష్ణా : ఉయ్యురు మండలలో విషాదం చోటుచేసుకుంది. బొల్లాపాడులో గ్రామానికి చెందిన బొల్లా శ్రీరామిరెడ్డి(41) ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇంట్లో నుంచి దుర్వాసన రావడాన్ని గమనించిన స్థానికులు తలుపులు తెరిచి చూడగా రామిరెడ్డి ఇంటిలో ఉరి వేసుకుని ఉండటంతో పోలీసులకు సమాచారం అందించారు. అయితే భార్య తనను వదిలి వెళ్లిపోవడంతో మనస్తాపం చెందిన రామిరెడ్డి ఆత్మహత్యకు పాల్పడినట్లు స్థానికులు అనుమానిస్తున్నారు.అనంతరం సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉయ్యురు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment