
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, కృష్ణా : తల్లి మందలించిందని ఓ యువతి బ్లేడుతో మెడ కోసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటన శనివారం నూజివీడు మండలంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నూజివీడు మండలం వెంకటాపురంతండా గ్రామానికి చెందిన సౌజన్య గత నాలుగు రోజులుగా కాలేజీకి వెళ్లడం లేదు. ఈ క్రమంలో తల్లి మందలించడంతో మనస్తాపానికి గురైన సౌజన్య బ్లేడుతో మెడ కొసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. ఇది గమనించిన కుటుంబసభ్యులు ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం సౌజన్య నూజీవీడు జీఎమ్‌ఎచ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.
Comments
Please login to add a commentAdd a comment