uyyuru
-
పోలీసుల ఓవర్ యాక్షన్.. వ్యభిచార గృహంలో పేక ముక్కలు ఆడిస్తూ
సాక్షి, కృష్ణాజిల్లా : ఉయ్యూరు పోలీసుల ఓవర్ యాక్షన్ చూపించారు. ఆకునూరులో వ్యభిచారం నడుపుతున్నట్టు సమాచారం రావడంతో ఉయ్యూరు రూరల్ పోలీసులు పోలీసులు తనిఖీలు చేపట్టారు. పోలీసుల దాడిలో వ్యభిచారం నిర్వహిస్తున్న మహిళతో పాటు ఒక విటుడిని, ముగ్గురు యువతుల్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో వ్యభిచార గృహంలో దర్జాగా కూర్చోని చేత్తో పేక ముక్కలు ఆడిస్తూ యువతులను పోలీసులు బెదిరించారు. దుస్తులు మార్చుకొని వస్తారా, లేక ఇలానే కొట్టుకుంటూ తీసుకెళ్లలా అంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఉయ్యూరు పోలీసులు వ్యవహరించిన తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే బెదిరింపులకు పాల్పడటంపై మండిపడుతున్నారు. నిందితులు, నేరస్థుల విషయంలోనూ బాధ్యతగా మెలగాల్సిన పోలీసులు ఇలా ప్రవర్తించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. చదవండి: ఏపీఏటీ సిబ్బందిని మరోచోటుకు పంపడమేంటి? -
పోషకాహారం అందజేతలో ఏపీ అగ్రగామి
ఉయ్యూరు: ప్రజలకు పోషకాహారం అందించడంలో దేశంలోనే ఏపీ అగ్రగామిగా నిలుస్తుందని ఏపీ ఫుడ్ కమిషన్ చైర్మన్ సీహెచ్ విజయ ప్రతాప్‌రెడ్డి అన్నారు. ఫుడ్ కమిషన్ రాష్ట్ర బృందం గురువారం కృష్ణా జిల్లా ఉయ్యూరులో పర్యటించింది. కమిషన్ చైర్మన్ విజయ ప్రతాప్‌రెడ్డి ఆధ్వర్యంలో ఉయ్యూరు జెడ్పీ పాఠశాలలో జగనన్న గోరుముద్ద కార్యక్రమం అమలు తీరును పరిశీలించారు. విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం తిని పదార్థాల నాణ్యతను తెలుసుకున్నారు. నాడు–నేడు కింద పాఠశాలలో చేపట్టిన ప్రగతిని పరిశీలించి పనుల నాణ్యతను తనిఖీ చేశారు. మార్కెట్ యార్డు ప్రాంగణంలోని పౌరసరఫరాల గోదామును సందర్శించి సరుకుల నాణ్యత పరిశీలించి రికార్డులను తనిఖీ చేశారు. కడవకొల్లు–కాటూరు మధ్య అంగన్వాడీ కేంద్రాలకు కోడిగుడ్లు సరఫరా చేసే కోళ్లఫారంను సందర్శించారు. విజయ ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తోన్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. అధికారులు అవినీతికి ఆస్కారం లేకుండా లబ్ధిదారులకు పథకాలను అందించాలన్నారు. -
వ్యాక్సిన్ పేరుతో నగదు బదిలీ మోసం
ఉయ్యూరు: వ్యాక్సిన్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న ఇద్దరిని ఉయ్యూరు పోలీసులు అరెస్ట్ చేశారు. స్థానిక సర్కిల్ కార్యాలయంలో నిందితులను సీఐ ముక్తేశ్వరరావు మీడియా ముందు హాజరుపరిచి కేసు వివరాలను శనివారం వెల్లడించారు. కృష్ణా జిల్లా తోట్లవల్లూరు మండలం దేవరపల్లికి చెందిన దేవరపల్లి అశోక్, కంకిపాడు మండలం కోలవెన్నుకి చెందిన కొడాలి విజయసాగర్‌లు తోట్లవల్లూరుకి చెందిన ఓ మహిళ వ్యాపారికి రుణం వస్తుందని మాయమాటలు చెప్పి ఆమెతో ఓ బ్యాంక్ అకౌంట్‌ను తెరిపించారు. దానికి సంబంధించిన పాస్‌బుక్, ఏటీఎం కార్డుని వీరి దగ్గరే ఉంచుకుని ఆమె బ్యాంక్ అకౌంట్ నంబర్‌ను ‘ర్యాపీ పే’ యాప్‌కు లింక్ చేశారు. రెండు డోసుల కోవిడ్ టీకా తీసుకున్న వారికి ప్రభుత్వం నెలకు రూ.900ను బ్యాంక్ ఖాతాలో జమ చేస్తుందని నమ్మబలికి తోట్లవల్లూరు, పమిడిముక్కల, నూజివీడు, ఉయ్యూరు మండలాల్లోని నిరక్షరాస్యులు, వృద్ధుల నుంచి ఆధార్ కార్డు నంబర్లు తీసుకున్నారు. అలాగే వారి వేలిముద్రలను సేకరించి వాటిని భద్రపరిచారు. వీరు తీసుకున్న ఆధార్ నంబర్లను ‘ర్యాపీ పే’ యాప్‌లో నమోదు చేయగా వాటికి అనుసంధానమైన బ్యాంకు అకౌంట్లు వీరికి కనిపించాయి. వెంటనే భద్రపరిచిన ఆయా వ్యక్తుల వేలిముద్రల ఆధారంగా వారి అకౌంట్ నుంచి సొమ్ముని మహిళ అకౌంట్‌కు బదిలీ చేసుకున్నారు. ఇలా ఇప్పటివరకు రూ.73 వేలను మహిళ అకౌంట్‌కు బదలాయించారు. ఇలా మోసం చేస్తున్న క్రమంలో తన అకౌంట్ నుంచి డబ్బులు కట్ అయినట్లు ఓ మహిళకు మొబైల్ మెసేజ్ వచ్చింది. తన ప్రమేయం లేకుండానే తన అకౌంట్ నుంచి సొమ్ము వేరే అకౌంట్‌కు ట్రాన్స్ఫర్ అయ్యిందని తన బంధువుల సాయంతో ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇలా రెండు కేసులు నమోదవడంతో సీఐ ముక్తేశ్వరరావు పర్యవేక్షణలో ఎస్ఐ శ్రీనివాస్ కేసు దర్యాప్తు చేపట్టారు. దేవరపల్లి, కలవపాములలో ఇద్దరు చొప్పున, నూజివీడులో ఒకరు, పమిడిముక్కలలో నలుగురు మోసపోయినట్లు విచారణలో గుర్తించారు. సాంకేతిక అంశాల ఆధారంగా నిందితులను గుర్తించారు. వీరిని పమిడిముక్కలలో శనివారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితులు ఇద్దరూ గతంలో ఇదే తరహా నగదు మోసాలకు పాల్పడ్డారని సీఐ తెలిపారు. -
టీడీపీ నేత పాల వ్యాన్‌లో అక్రమ మద్యం
సాక్షి, ఉయ్యూరు(పెనమలూరు): టీడీపీ నేతకు చెందిన విజయ పాల వ్యాన్‌లో అక్రమ మద్యం పట్టుబడింది. పోలీసుల తనిఖీల్లో మద్యం సీసాలు దొరకడంతో పాల వ్యాపారం మాటున అక్రమ మద్యం అమ్మకాలు సాగిస్తున్నారన్న అనుమానాలు నెలకొన్నాయి. పట్టుబడిన వ్యాన్ మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ సన్నిహితుడైన కంకిపాడు మండలం తెన్నేరు గ్రామ టీడీపీ అధ్యక్షుడు యార్లగడ్డ రాజాది కావడం, ఆయన విజయ పాల సరఫరాకు కాంట్రాక్ట్ పద్ధతిపై వ్యాన్ తిప్పుతుండంతో అక్రమ మద్యం వ్యాపారం టీడీపీ నేతల కనుసన్నల్లోనే జరుగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. టీడపీ నేత పాలవ్యాన్‌లో లిక్కర్ బాటిళ్లు తరలిస్తున్నారు మద్యం సీజ్.. ముగ్గురు అరెస్ట్ విజయ పాల డెయిరీలో అక్రమ మద్యం సీసాలు పట్టుబడిన వైనం సంచలనమైంది. అవనిగడ్డ నుంచి వస్తున్న పాల వ్యాన్‌లో 50 క్వార్టర్ మద్యం బాటిళ్లు, 5 ఫుల్ బాటిళ్లు సంచిలో మూటగట్టి ఉన్నాయి. ఆదివారం ఉయ్యూరులో పోలీసులు వాహనాలను తనిఖీ చేసే క్రమంలో పాల వ్యాన్‌లో మద్యం ఇవి బయటపడ్డాయి. సీఐ నాగప్రసాద్, ఎస్ఐ గురుప్రకాష్ ఆధ్వర్యంలో సిబ్బంది మద్యం బాటిళ్లను స్వా«దీనం చేసుకుని పాల వ్యాన్‌ను సీజ్ చేసి క్యాషియర్ పాలేపు గుప్తా, సిబ్బంది పట్టాభిరావు, వికాస్‌లను అదుపులోకి తీసుకున్నారు. పాల వ్యాన్ కంకిపాడు మండలం తెన్నేరు గ్రామానికి చెందిన టీడీపీ అధ్యక్షుడు యార్లగడ్డ రాజాదిగా గుర్తించారు. రాజా టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌కు అత్యంత సన్నిహితుడు కావడంతో పోలీసులు లోతైన దర్యాప్తు చేపట్టారు. చట్ట ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు. చదవండి: తెలుగు తమ్ముళ్లకు రైతుల ముసుగు కాంట్రాక్ట్ రద్దుచేసిన విజయ డెయిరీ చిట్టినగర్(విజయవాడ పశ్చిమ): విజయ పాల వ్యాన్‌లో మద్యం తరలిస్తున్న కాంట్రాక్టర్‌పై సదరు సంస్థ చర్యలు తీసుకుంది. ఉయ్యూరులో విజయ పాల వ్యాన్‌లో మద్యం రవాణా చేస్తున్న ఘటనపై విజయ డెయిరీ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ ఈశ్వర్‌బాబు స్పందించారు. పాల వ్యాన్‌ను నడుపుతున్న వై. రాజా కాంట్రాక్టును రద్దు చేస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా పాల వ్యాన్లను ప్రత్యేకంగా తనిఖీలు నిర్వహించనున్నట్లు జేఎండీ పేర్కొన్నారు. -
టీడీపీ ఎమ్మెల్సీపై కేసు నమోదు..
సాక్షి, కృష్ణా జిల్లా: టీడీపీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్‌పై లాక్డౌన్ ఉల్లంఘన కింద కేసు నమోదయ్యింది. లాక్డౌన్ నిబంధనలకు విరుద్ధంగా గుంపులుగా కార్యకర్తలతో కలిసి కూరగాయలు, నిత్యావసర సరుకులు పంపిణీ చేయడంతో రాజేంద్రప్రసాద్‌తో పాటు తొమ్మిది మంది అనుచరులపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. లాక్డౌన్ సమయంలో భౌతిక దూరం పాటించకుండా నిబంధనలు ఉల్లంఘించడంతో కేసు నమోదు చేసినట్లు ఉయ్యూరు పోలీసులు తెలిపారు. -
సీఐ Vs ఎస్ఐలు
సాక్షి, అమరావతిబ్యూరో: ఉయ్యూరు సర్కిల్లో నాలుగు పోలీస్ స్టేషన్లున్నాయి. ఉయ్యూరు పట్టణం, రూరల్, పమిడిముక్కల, తోట్లవల్లూరు పోలీస్ స్టేషన్లు ఈ సర్కిల్ పరిధిలోకి వస్తాయి. సీఐ నాగప్రసాద్ ఇక్కడికి కొత్తగా వచ్చారు. ఉయ్యూరు, పమిడిముక్కల స్టేషన్లలో పాత ఎస్ఐలే కొనసాగుతున్నారు. అయితే ఇక్కడి ఎస్ఐలకు సీఐకి మధ్య సఖ్యత లేదనే వాదన వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో వారం క్రితం ఉయ్యూరు టౌన్ ఎస్ఐ గురుప్రకాష్, పమిడిముక్కల ఎస్ఐ శ్రీనివాస్‌లు విజయవాడ శాంతిభద్రతలడీసీపీ–1ని కలిసి సీఐపై ఫిర్యాదు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. చోరీల రికవరీ కేసుల విషయంలో సీఐ, ఎస్ఐలకు మధ్య మాటలు యుద్ధం ముదిరి వివాదం చెలరేగిందని తెలుస్తోంది. సర్కిల్ అధికారిని ఓవర్‌లుక్ చేసి ఎస్ఐలు వ్యవహరిస్తున్నారనేది చర్చనీయాంశమైంది. ఈ క్రమంలో సర్కిల్ పరిధిలోని స్టేషన్లలో గందరగోళం నెలకొంటోంది. అధికారి దగ్గర నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు ఎవరికి వారే వర్గాలుగా వీడి ఆధిపత్యాన్ని చలాయించే పనిపైనే శ్రద్ధ చూపుతున్నారన్న ఆరోపణలున్నాయి. కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం.. అధికారుల మధ్య ఆధిపత్య పోరులో సిబ్బంది ‘ఆబోతుల కుమ్ములాటలో లేగదూడల’ మాదిరిగా నలిగిపోతున్నారు. క్రైం విభాగంలో రికవరీ కోసం పనిచేసే కానిస్టేబుళ్లు ఈ సమస్యను ఎక్కువగా ఎదుర్కొంటున్నారు. పమిడిముక్కల పోలీస్ స్టేషన్ల పరిధిలో ఇటీవల 50 సెల్ఫోన్లను రికవరీ చేశారు. ఈ రికవరీ క్రమంలో సెల్ ఫోన్లతో పాటు సెల్ఫోన్లు తీసుకున్న వ్యక్తుల దగ్గర నుంచి ఆఫ్ ది రికార్డ్ వసూళ్లు చేసినట్లు సమాచారం. ఉయ్యూరు పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోను గతంలో జరిగిన రికవరీల్లోనూ ఇదే పరిస్థితి. జాతీయ రహదారిపై రెండు నెలల క్రితం కారు ఢీకొని ముగ్గురు మృతిచెందిన ఘటనలోనూ లక్షల్లో వసూళ్లకు పాల్పడినట్లు వినికిడి. ఈ అంశాల్లో సర్కిల్ అధికారికి, ఎస్ఐలకు మధ్య వివాదం తలెత్తడంతో ఎవరికి వారే సేఫ్ సైడ్ ఉండేందుకు సిబ్బందిని బలిపశువులను చేస్తున్నారన్న విమర్శలున్నాయి. రికవరీలకు సంబంధించి గట్టిగా ప్రశ్నించిన క్రమంలో ఓ కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు సమాచారం. ఆ కానిస్టేబుల్ మంటాడలోని ఓ ఆర్ఎంపీ వద్ద చికిత్స చేయించుకున్న విషయాన్ని గోప్యంగా ఉంచారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో కొందరు కానిస్టేబుళ్లు స్థానచలనాన్ని కోరుతున్నట్లు తెలుస్తోంది. పట్టించుకోని ఉన్నతాధికారులు.. స్టేషన్లపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడింది. ఈస్ట్ ఏసీపీ పరిధిలో ఉన్న ఈ సర్కిల్ కార్యాలయ పరిధిలో స్టేషన్ల తనిఖీకి నాలుగు నెలలుగా ఏ అధికారి రాని పరిస్థితి. ఈస్ట్ ఏసీపీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ అధికారి ఉయ్యూరు వైపు కన్నెత్తి చూడకపోవడంతో ఇక్కడ ఎవరి ఇష్టం వారిదే అన్నట్లు ఉంది. ఇప్పటికైనా ‘ఉయ్యూరు’ను నగర పోలీస్ కమిషనర్ ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని పోలీసు వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. -
ఉరేసుకొని ఆత్మహత్య; దుర్వాసన రావడంతో..
సాక్షి, కృష్ణా : ఉయ్యురు మండలలో విషాదం చోటుచేసుకుంది. బొల్లాపాడులో గ్రామానికి చెందిన బొల్లా శ్రీరామిరెడ్డి(41) ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇంట్లో నుంచి దుర్వాసన రావడాన్ని గమనించిన స్థానికులు తలుపులు తెరిచి చూడగా రామిరెడ్డి ఇంటిలో ఉరి వేసుకుని ఉండటంతో పోలీసులకు సమాచారం అందించారు. అయితే భార్య తనను వదిలి వెళ్లిపోవడంతో మనస్తాపం చెందిన రామిరెడ్డి ఆత్మహత్యకు పాల్పడినట్లు స్థానికులు అనుమానిస్తున్నారు.అనంతరం సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉయ్యురు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
కృష్ణా: ఉయ్యూరు జన్మభూమి రసాభాస
-
బాలికను గదిలోకి లాక్కెళ్లి.. ఆర్ఎంపీ అకృత్యం
సాక్షి, కృష్ణా : పదమూడేళ్ల బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడో ఆర్ఎంపీ వైద్యుడు. ఈ సంఘటన సోమవారం ఉదయం కృష్ణాజిల్లా ఉయ్యూరులో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ప్రకాశం జిల్లా కందుకూరుకు చెందిన షేక్ మొహిద్దీన్ కృష్ణాజిల్లా ఉయ్యూరు తోట్లవల్లూరు రోడ్డులో ఆర్ఎంపీ వైద్యునిగా సేవలందిస్తున్నాడు. సోమవారం ఉదయం 8.30గంటల ప్రాంతంలో 8వ తరగతి చదివే ఓ బాలిక యకమురు స్కూల్‌కు వెళుతుండగా మొహిద్దీన్ తన ఆస్పత్రి గదిలోకి బలవంతంగా లాక్కువెళ్లాడు. ఎంతసేపటికి బాలిక బయటకు రాకపోవటంతో స్థానికులకు అనుమానం వచ్చింది. ఆర్ఎంపీ వైద్యుని గదిలోకి వెళ్లి చూడగా.. అతడు దుస్తులు లేకుండా ఉన్నాడు. స్థానికులు అతన్ని నిలదీయటంతో పొంతనలేని సమాధానాలు చెప్పాడు. దీంతో ఆగ్రహించిన స్థానికలు అతనికి దేహశుద్ది చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని అతన్ని ఉయ్యూరు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
'9999' నంబర్ కావాలంటే..
రూ.7,39,999 చెల్లించాల్సిందే! ఉయ్యూరు (కృష్ణా జిల్లా): వాహన ప్రియులకు ఫ్యాన్సీ నంబర్లపై మోజు ఏ స్థాయిలో ఉంటుందో మరోసారి నిరూపితమైంది. కృష్ణా జిల్లా ఉయ్యూరు ప్రాంతీయ రవాణా కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన వేలంలో 9999 నంబర్‌కు రికార్డు స్థాయిలో ధర పలికింది. ఉయ్యూరు మండలం రాజుపేటకు చెందిన సీహెచ్.వెంకటేశ్వర్లు రాజు, డి.సునీత రూ.50 వేల చొప్పున రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి 9999 నంబరు కోసం పోటీ పడ్డారు. దీంతో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శివకామేశ్వరరావు వేలం నిర్వహించారు. సునీత రూ.6,63,000కు డీడీ ఇవ్వగా, వెంకటేశ్వర్లు రాజు రూ.7,39,999కు డీడీ ఇచ్చారు. దీంతో అత్యధికంగా డీడీ చెల్లించిన వెంకటేశ్వర్లు రాజుకు 9999 నంబర్ కేటాయించినట్లు ఎంవీఐ ప్రకటించారు. రాజు తన ఫార్చ్యూనర్ కారుకు ఈ నంబర్ కోసం ప్రయత్నించారని అధికారులు తెలిపారు. -
జన నీరాజనం
సాక్షి, ఉయ్యూరు/ పెడన : గుంటూరు జిల్లాలోని తాడేపల్లిలో మునిసిపల్ ఎన్నికల ప్రచారాన్ని ముగించుకుని షర్మిల జిల్లాకు వచ్చారు. విజయవాడలో ఆమెకు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. అనంతరం పెనమలూరు, కంకిపాడు మీదుగా ఉయ్యూరు సెంటరుకు చేరుకున్నారు. షర్మిల రాకను తెలుసుకుని పెద్ద ఎత్తున జనం తరలిరావటంతో ఉయ్యూరు మెయిన్ సెంటరులో జనం పోటెత్తారు. సభలో ఏకధాటిగా షర్మిల చేసిన ప్రసంగం ప్రజలను ఆకట్టుకుంది. పామర్రులో నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త ఉప్పులేటి కల్పన ఆధ్వర్యంలో షర్మిలను సాదరంగా ఆహ్వానించారు. జనసంద్రంగా పెడన... షర్మిల రాకకు ముందుగానే పెడన బస్టాండ్ ప్రాంతం జనసంద్రమైంది. ఉప్పొంగే ప్రజల ఉత్సాహం మధ్య ఆమె చేసిన ప్రసంగం అందరినీ ఆలోచింపజేసింది. ప్రసంగం ముగింపులో మునిసిపల్ అభ్యర్థిని సభికుల హర్షధ్వానాల నడుమ ప్రకటించారు. పెడనలో బహిరంగ సభ అనంతరం హనుమాన్‌జంక్షన్ వరకు షర్మిల బస్సు యాత్ర సాగింది. దారి పొడవునా స్వచ్ఛందంగా తరలివచ్చిన ప్రజలు షర్మిలకు ఆత్మీయ స్వాగతం పలికారు. జిల్లాకు చెందిన ముఖ్య నేతలు పేర్ని నాని, కొడాలి నాని, కేవీఆర్ విద్యాసాగర్, తాతినేని పద్మావతి, పడమట సురేష్‌బాబు, ఉప్పాల రాంప్రసాద్, మావులేటి వెంకటరాజు, గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త ఆళ్ల రామకృష్ణారెడ్డి షర్మిల వెంట ఉన్నారు. పేలిన మాటల తూటాలు... షర్మిల తన ప్రసంగంలో మాటల తూటాలను పేల్చారు. మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర, సమైక్యాంధ్ర బస్సు యాత్ర రెండు సందర్భాల్లో జిల్లాకు వచ్చిన షర్మిల ఆయా సందర్భాలను ప్రజలకు వివరించగలిగారు. మూడో పర్యాయం మునిసిపల్ ఎన్నికల కోసం ప్రచారానికి వచ్చిన ఆమె చేసిన ఉపన్యాసశైలి ప్రజలను మరింత ఆకట్టుకుంది. వైఎస్సార్ చేపట్టిన పథకాలు, చంద్రబాబు వైఫల్యాలు, కిరణ్‌కుమార్‌రెడ్డి నిర్లక్ష్యం వంటి అంశాలను సూటిగా ప్రస్తావించిన ఆమె అందుకు ఉదాహరణలను కూడా చెప్పి ప్రజలను ఆలోచింపజేశారు. వైఎస్ చేపట్టిన ప్రతి పథకం కొనసాగాలంటే జగనన్నను ఆదరించి సీఎంను చేయాలనే విషయాన్ని ఆమె వివరించిన తీరును ప్రజలు ప్రశంసించటం విశేషం. నక్క వాతలు పెట్టుకుంటే పులి కాదు... షర్మిల ఎన్నికల ప్రచారంలో వైఎస్‌కు, చంద్రబాబుకు ఉన్న పోలికపై పులి, నక్క ప్రస్తావన చేయటంతో ప్రజలు హర్షధ్వానాలు చేశారు. ఒక్క పన్ను వేయకుండా, చార్జీలు పెంచకుండా, ప్రజాసంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అద్భుతంగా చేసిన రికార్డు ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిదే అని ప్రస్తావించారు. చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలనలో వ్యవసాయం దండగని, ఉచిత విద్యుత్ ఇస్తే బట్టలు ఆరవేసుకోవాలని, రుణమాఫీ కుదరదని తెగేసి చెప్పారని విమర్శించారు. అంతేకాక విద్యుత్ చార్జీలపై ఉద్యమించినవారిని పోలీసులతో కాల్పించి, అంగన్వాడీ వర్కర్లను గుర్రాలతో తొక్కించిన చరిత్రహీనుడు బాబు అని విమర్శించారు. అటువంటి చంద్రబాబు ఇప్పుడు గతంలో వైఎస్ చేసిన పథకాలను అమలు చేస్తానంటూ ఉచిత హామీలు ఇస్తూ ఆల్ ఫ్రీ బాబుగా గుర్తింపు పొందారని ఎద్దేవా చేశారు. వైఎస్ పులి అని ఆయనను చూసి నక్క లాంటి చంద్రబాబు వాతలు పెట్టుకున్నా పులి పులే.. నక్క నక్కేనని షర్మిల వ్యాఖ్యానించటంతో పెడనలో ప్రజలు కరతాళ ధ్వనులు చేశారు. పెడన కలంకారీ పరిశ్రమకు ఊతమిద్దాం... పెడన మునిసిపాల్టీలో చేనేత, కలంకారీ కార్మికుల జీవనాన్ని మెరుగుపరిచేందుకు దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ఎంతో కృషి చేశారని షర్మిల గుర్తుచేశారు. ఇక్కడి కలంకారీ పరిశ్రమకు దేశ, విదేశాల్లో మంచి పేరు ఉందని, ఆ గొప్పతనాన్ని నిలబెట్టుకునేలా మనమంతా కలిసి కృషిచేద్దామని చెప్పారు. మోసపూరిత హామీలిచ్చే చంద్రబాబును, సీల్డు కవరులో సీఎంగా దిగబడ్డ కిరణ్‌కుమార్‌రెడ్డిని నమ్మవద్దని, వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగన్‌కు మద్దతుగా నిలిచి మన రాష్ట్రాన్ని మనమే అభివృద్ధి పునాదులపై పటిష్టంగా నిర్మించుకుందామన్నారు. కొత్త ఉత్సాహమిచ్చిన షర్మిల... మునిసిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న వైఎస్సార్ సీపీ అభ్యర్థులను ప్రకటించిన షర్మిల వారిలో కొత్త ఉత్సాహం నింపారు. ఉయ్యూరు సభలో జెడ్పీ చైర్పర్సన్ అభ్యర్థిగా తాతినేని పద్మావతిని, మునిసిపల్ చైర్మన్‌గా అబ్దుల్ రహీమ్‌ను దీవించాలని షర్మిల ప్రకటించారు. పెడన సభలో మునిసిపల్ చైర్మన్‌గా బండారు ఆనందప్రసాద్, మిగిలిన 22 మంది వైఎస్సార్ సీపీ కౌన్సిల్ అభ్యర్థులను దీవించి గెలిపించాలని షర్మిల పిలుపునిచ్చారు. మునిసిపల్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి గెలిపించాలంటూ షర్మిల విజ్ఞప్తి చేశారు. మీ సంక్షేమం, మీ చిరునవ్వు జగనన్నకు ముఖ్యమని, మీరు ఆదరించి సీఎంను చేస్తే తన జీవితాన్ని సైతం మీ కోసం త్యాగం చేస్తారని షర్మిల భరోసా ఇచ్చారు. -
మోసపూరిత ప్రకటనలను నమ్మొద్దు:చలసాని