సంఘటనా స్థలంలో చెల్లాచెదురుగా పడిఉన్న దుస్తులు, ఆస్పత్రి బోర్డ్
సాక్షి, కృష్ణా : పదమూడేళ్ల బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడో ఆర్‌ఎంపీ వైద్యుడు. ఈ సంఘటన సోమవారం ఉదయం కృష్ణాజిల్లా ఉయ్యూరులో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ప్రకాశం జిల్లా కందుకూరుకు చెందిన షేక్ మొహిద్దీన్ కృష్ణాజిల్లా ఉయ్యూరు తోట్లవల్లూరు రోడ్డులో ఆర్‌ఎంపీ వైద్యునిగా సేవలందిస్తున్నాడు. సోమవారం ఉదయం 8.30గంటల ప్రాంతంలో 8వ తరగతి చదివే ఓ బాలిక యకమురు స్కూల్‌కు వెళుతుండగా మొహిద్దీన్ తన ఆస్పత్రి గదిలోకి బలవంతంగా లాక్కువెళ్లాడు. ఎంతసేపటికి బాలిక బయటకు రాకపోవటంతో స్థానికులకు అనుమానం వచ్చింది.
ఆర్‌ఎంపీ వైద్యుని గదిలోకి వెళ్లి చూడగా.. అతడు దుస్తులు లేకుండా ఉన్నాడు. స్థానికులు అతన్ని నిలదీయటంతో పొంతనలేని సమాధానాలు చెప్పాడు. దీంతో ఆగ్రహించిన స్థానికలు అతనికి దేహశుద్ది చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని అతన్ని ఉయ్యూరు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment