girl molested
-
మాటు వేసి బైక్‌పై తీసుకెళ్లి... బాలికపై అత్యాచారం
సాక్షిప్రతినిధి నల్లగొండ : ఓ కామాంధుడు గిరిజన బాలికపై లైంగికదాడికి పాల్పడ్డాడు. నల్లగొండ జిల్లా పెద్దఅడిశర్లపల్లి మండలంలో ఆలస్యంగా శనివారం వెలుగులోకి వచ్చిన దారుణ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. పీఏపల్లి మండలానికి చెందిన ఓ గిరిజన బాలిక ఈ నెల 3న బైక్‌పై పాఠశాలకు వెళ్తోంది. గ్రామ శివారులోని ఏఎమ్మార్పీ కాలువ బ్రిడ్జి వద్దకు రాగానే మండల కేంద్రానికి చెందిన నారాయణదాసు రవితేజ మాటు వేసి బైక్‌ను అడ్డగించాడు. అనంతరం బాలికను కత్తితో బెదిరించి పెనుగులాడుతుంటే కొట్టడంతో స్పృహతప్పి పడిపోయింది. దీంతో బాధిత బాలికను బైక్‌పై గుర్తుతెలియని ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలికకు స్పృహ వచ్చే సరికి కొండమల్లేపల్లిలో ఉంది. విషయం తల్లిదండ్రులకు చెబితే చంపివేస్తానని నారాయణదాసు బాలికను బెదిరించాడు. పోలీసులకు ఫిర్యాదు చేసినా.. బాధిత బాలిక దాడి నుంచి తేరుకుని ఇంటికి చేరుకుంది. తనపై జరిగిన అఘాయిత్యాన్ని తల్లిదండ్రులకు వివరించి బోరుమంది. దీంతో బాధితురాలి తల్లిదండ్రులు ఈ నెల 5వ తేదీన గుడిపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికీ స్థానిక పోలీసులు పట్టించుకోలేదు. అనంతరం పెద్దమనుషుల సహకారంతో బాధితురాలి తల్లిదండ్రులు శనివారం నల్లగొండ ఎస్పీ అపూర్వరావును ఆశ్రయించి గోడు వెల్లబోసుకోవడంతో విషయం వెలుగులోకి వచ్చింది. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుని న్యాయం చేయాలని బాధితులు ఎస్పీని వేడుకున్నారు. స్థానిక పోలీసులు పట్టించుకోలేదని ఎస్పీకి ఇచ్చిన ఫిర్యాదు పత్రంలో ఆరోపించారు. ఎస్పీ ఆదేశాల మేరకు నిందితుడిపై 323, 341, 506, 366–అ, 376(2)N)సెక్షన్ల కింద కేసు నమో దు చేసి గుడిపల్లి పోలీసులు దర్యాప్తు చేస్తున్నా రు. కాగా, లైంగికదాడి ఘటనపై బాధితురాలు రెండు ఫిర్యాదులు ఇచ్చారని, ఒకే పిటిషన్ ఇవ్వాలని కోరడంతో కొంత ఆలస్యం జరిగిందని గుడిపలి పోలీస్‌స్టేషన్ ఎస్ఐ రంజిత్‌రెడ్డి ‘సాక్షి’కి వివరణ ఇచ్చారు. -
బాలిక అత్యాచారం కేసు.. పోలీసుల అదుపులో వక్ఫ్ బోర్డు ఛైర్మన్ కుమారుడు
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ బాలిక అత్యాచారం కేసులో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. వక్ఫ్ బోర్డు ఛైర్మన్ కుమారుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో ముగ్గురు నిందితులు గోవాలో ఉన్నట్లు గుర్తించారు. వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. బాలిక అత్యాచారం ఘటనపై మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. తక్షణమే చర్యలు తీసుకోవాలని హోంమంత్రి, డీజీపీకి ఆదేశాలిచ్చారు. నిందితులు ఎవరైనా వదిలిపెట్టే ప్రసక్తి లేదని కేటీఆర్ అన్నారు. చదవండి: పబ్‌కు వచ్చిన బాలికపై సామూహిక అత్యాచారం.. అసలేం జరిగింది? కాగా, గత నెల 28న బంజారాహిల్స్ రోడ్ నెం.14లో నివసించే బాలిక (16) ఓ పార్టీకి హాజరయ్యేందుకు తన ఇంటి సమీపంలో ఉండే హాదీతో కలిసి ఆయన బెంజ్ కారులో (టీఎస్ 09 ఎఫ్ఎల్ 6460)లో అమ్నేషియా పబ్‌కు వెళ్లింది. సాయంత్రం 5 గంటల వరకు అక్కడే పార్టీ చేసుకున్నారు. అనంతరం పబ్ నుంచి బాలిక బయటకు వచ్చింది. బాలికను బలవంతంగా బెంజ్ కారులో తీసుకెళ్లి బంజారాహిల్స్ రోడ్ నంబర్ 14లో ఓ బేకరీ దగ్గరకు వెళ్లి ఆహారం కొనుగోలు చేశారు. అనంతరం కారును నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి.. కార్లోనే బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. తరువాత 7.30 నిమిషాల సమయంలో పబ్ వద్ద వదిలేసి వెళ్లారు. అనంతరం బాలిక ఫోన్ చేయడంతో తండ్రి వచ్చి ఆమెను ఇంటికి తీసుకెళ్లినట్లు సమాచారం. -
లైంగిక వేధింపులు: బాలిక ఆత్మహత్యపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన కమల్
లైంగిక వేధింపులతో ఆత్మహత్యకు పాల్పడిన బాలిక ఘటనపై సినీ నటుడు, మక్కల్ నీది మయ్యం నేత కమల్ హాసన్ స్పందించారు. మృతురాలు బాలిక ఆత్మహత్యకు కారకుడైన సదరు పాఠశాల ఉపాధ్యాయుడిని కఠింగా శిక్షించాలని సోషల్ మీడియా వేదికగా ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు కమల్ ట్వీట్ చేస్తూ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చదవండి: ఓటీటీకి ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’, స్ట్రీమింగ్ ఎప్పుడంటే బాలిక మృతికి కారకుడైన టీజర్‌కు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుని, ఇలాంటి ఘటనలు పునరావుతంగా కాకుండా తమిళనాడు ప్రభుత్వం అడ్డుకట్ట వేయాలని కమల్ తన ట్వీట్లో పేర్కొన్నారు. శుక్రవారం జరిగిన ఈ ఘటన తమిళనాడులో సంచలనం రేపింది. దీనిపై పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టి నిందితుడిని శిక్షించాలంటూ డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు సదరు పాఠశాల ఫిజిక్స్ టీజర్ మిథున్ చక్రవర్తిని ఆర్సీపురం పోలీసులు అరెస్టు చేసి పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అలాగే కళాశాల ప్రిన్సిపల్‌పై కూడా పోలీసులు పోక్సో కేసు నమోదు చేసినట్లు సమాచారం. చదవండి: బిగ్‌బాస్ 5: శ్రీరామ్ చంద్రకు సజ్జనార్ మద్దతు, ఏమన్నారంటే.. -
సైదాబాద్ నిందితుడి మృతిపై చిరు ఏమన్నారంటే..
వారం రోజులుగా తెలంగాణలోని సింగరేణి ప్రాంతానికి చెందిన ఆరేళ్ళ చిన్నారి హత్యాచార కేసు కలకలం రేపిన సంగతి తెలిసిందే. నిందితుడు రాజుకు తగిన శిక్ష వేయాలని కొందరు, మరణ శిక్షే సరైనదని మరొకొందరు డిమాండ్ చేస్తున్నారు. ఈ జాబితాలో సామాన్యులు, సెలబ్రిటీలు ఉన్నారు. ఆ కీచకుడి మరణ వార్త అందరిలోనూ కాస్త సంతోషాన్ని నింపిందనే చెప్పాలి. దీంతో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఈ మృతి స్పందిస్తున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి ట్విటర్ ద్వారా తన స్పందించారు. అందులో.. అభం శుభం తెలియని ఆరేళ్ల చిన్నారిపై హత్యాచారానికి పాల్పడిన రాజు అనే కిరాతకుడు తనకు తాను శిక్షను విధించుకోవడం బాధిత కుటుంబంతో పాటు మిగతా అందరికి కొంత ఊరట కలిగిస్తుంది. ఈ సంఘటనపై మీడియా, పౌర సమాజం గొప్పగా స్పందించాయి. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు ప్రభుత్వంతో పాటు పౌర సమాజ చొరవ చూపాలి. అలాంటి కార్యక్రమాలు ఎవరు చేపట్టినా నా సహకారం ఉంటుంది. చిన్నారి కుటుంబాన్ని ప్రభుత్వం తగిన విధంగా ఆదుకోవాలని తన ట్వీట్లో పేర్కొన్నారు. కాగా గురువారం ఘనపూర్ రైల్వే ట్రాక్ఫై రాజు ఆత్మహత్య చేసుకున్నాడు. అతడి చేతిపై ఉన్న మౌనిక అనే పచ్చబొట్టు ఆధారంగా పోలీసులు ఆ మృతదేహం రాజుదేనని నిర్థారించారు. ప్రస్తుతం రాజు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. Let’s not allow such dastardly acts to recur and let’s do whatever it takes towards this goal! #JusticeForChaithra pic.twitter.com/yWX5bwDloN — Chiranjeevi Konidela (@KChiruTweets) September 16, 2021 చదవండి: ‘టాలీవుడ్ డ్రగ్స్’ కేసు: కెల్విన్‌తో ఫోన్‌కాల్స్ మర్మమేమిటి? -
నిందితుడు రాజు ఆత్మహత్య: దేవుడు ఉన్నాడంటూ మంచు మనోజ్ ట్వీట్
సైదాబాద్ బాలిక హత్యాచార నిందితుడు రాజు ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. స్టేషన్‌ఘన్‌పూర్ రైల్వే ట్రాక్‌పై రాజు శవమై కనిపించాడు. ఈ విషయం తెలిసి దీనిపై పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు స్పందిస్తున్నారు. తాజాగా హీరో మంచు మనోజ్ కూడా ఈ ఘటనపై స్పందించాడు. నిందితుడు రాజు ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారని తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేయగా.. ఆయన ట్వీట్‌ను రీట్వీట్ చేస్తూ.. ‘ఈ వార్త చెప్పినందుకు థ్యాంక్యూ సర్.. దేవుడు ఉన్నాడు. ఓం శాంతి చైత్ర’ అంటూ మంచు మనోజ్ స్పందించాడు. చదవండి: సైదాబాద్ చిన్నారి కేసు: నిందితుడు రాజు ఆత్మహత్య Thank you for the news sir.. God is there … #OmShantiChaitra #Chaitra https://t.co/hhe0UxFVNd — Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) September 16, 2021 అలాగే మెగాస్టార్ చిరంజీవి రాజు ఆత్మహత్యపై ట్వీట్ చేస్తూ.. రాజు తనను తాను శిక్షించుకోవడం బాధిత బాలిక కుటుంబ సభ్యులతో పాటు అందరికీ ఊరట కలిగిస్తోందని చెప్పారు. బాలికలపై దారుణ ఘటనలు మరోసారి జరగకూడదని, అందుకు ప్రజలు చొరవచూపాలని ఆయన కోరారు. చదవండి: సైదాబాద్ చిన్నారి కుటుంబాన్ని పరామర్శించిన మంచు మనోజ్ Let’s not allow such dastardly acts to recur and let’s do whatever it takes towards this goal! #JusticeForChaithra pic.twitter.com/yWX5bwDloN — Chiranjeevi Konidela (@KChiruTweets) September 16, 2021 -
సైదాబాద్ ఘటనపై స్పందించిన ఆర్పీ, రూ. 50 వేలు రివార్డు ప్రకటన
సైదాబాద్ చిన్నారి హత్యాచార ఘటనపై సినీ ప్రముఖులు స్పందిస్తున్నారు. నిందితుడు రాజును పట్టించడంలో పోలీసులకు సహకరిద్దాం అంటూ సోషల్ మీడియా వేదికగా పిలుపునిస్తున్నారు. ఇక మంచు మనోజ్ సోమవారం బాధిత బాలిక కటుంబాన్ని పరామర్శించగా.. ఈ ఘటనపై సూపర్ స్టార్ మహేశ్ బాబు విచారం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. హీరో నాని నిందితుడు బయటెక్కడో ఉన్నాడు.. ఉండకూడదంటూ ట్వీట్ చేశారు. తాజాగా ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ సైతం సైదాబాద్ ఘటనపై స్పందిస్తూ.. నిందితుడి ఆచూకీ తెలియజేస్తే రివార్డు ఇస్తానని ప్రకటించారు. నిందితుడిని కఠినంగా శిక్షిస్తేనే చిన్నారి ఆత్మకు శాంతి చేకూరుతుందంటూ ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ షేర్ చేశారు. చదవండి: సైదాబాద్ హత్యాచార ఘటన: బయటెక్కడో ఉన్నాడు.. ఉండకూడదు ఆర్పీ పోస్టు చేస్తూ.. ‘చిట్టితల్లికి న్యాయం జరగాలంటే, ఆమె ఆత్మకు శాంతి చేకూరాలంటే నిందితుడు రాజు దొరకాలి. అతడి ఆచూకీ తెలియజేసిన వారికి రూ.10 లక్షలు రివార్డు ఇస్తామని హైదరాబాద్ పోలీసులు ప్రకటించారు. పట్టించిన వారికి నా వంతుగా రూ.50 వేలు ఇస్తాను. అతడు దొరకాలి. చేతిపై ‘మౌనిక’ అనే పచ్చబొట్టు తప్పకుండా అతడిని పట్టించేలా చేస్తుంది. అతడు మీ దగ్గర్లోనే ఉండొచ్చు. ఒక కన్ను వేసి ఉంచండి. ఆ కిరాతకుడిని పట్టుకునే పనిలో పోలీసు శాఖకు మన వంతు సాయం అందిద్దాం’ అని ఆయన పిలుపునిచ్చారు. View this post on Instagram A post shared by Rp Patnaik (@rp.patnaik) -
సైదాబాద్ హత్యాచార ఘటనపై నాని షాకింగ్ ట్వీట్
సైదాబాద్ చిన్నారి హత్యాచార ఘటన ఎంత మందిని కలిచివేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అభం,శుభం తెలియని ఆరేళ్ల చిన్నారిని రాజు అనే మానవ మృగం అత్యాచారానికి పాల్పడి, దారుణంగా హత్య చేశాడు. ఆ కీచకుడిని ఎన్కౌంటర్ చేయాలని వాదనలు వినిపిస్తున్నాయి. సెలబ్రిటీలు సైతం రాజుకి కఠిన శిక్షలు వేయలని కోరుతున్నారు. ఇప్పటికే టాలీవుడ్ హీరోలు మహేశ్ బాబు, మంచు మనోజ్ సోషల్ మీడియా ద్వారా రాజు అనే నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. తాజాగా నాని కూడా ఈ ఘటనపై స్పందించాడు. తెలంగాణ పోలీస్ ట్వీట్‌ని షేర్ చేస్తూ.. బయటెక్కడో ఉన్నాడు, ఉండకూడదు అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. సామాన్యులు సైతం రాజును కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. (చదవండి: సైదాబాద్ చిన్నారి హత్యాచారంపై స్పందించిన మహేశ్) అయితే ఘటన అనంతరం నిందితుడు పరారీలో ఉన్నాడు. నిందితుడి ఆచూకీ తెలిపిన వారికి రూ. 10 లక్షల రివార్డ్ అందిస్తామని సీపీ అంజనీకుమార్ వెల్లడించారు. నిందితుడి ఆచూకీ తెలిపిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. బయటెక్కడో ఉన్నాడు వుండకుడదు https://t.co/yyiuvM6HP1 — Nani (@NameisNani) September 15, 2021 -
థానేలో బాలికపై అత్యాచారం..!
థానే: 15 ఏళ్ల బాలికపై సుత్తితో దాడి చేసి, అత్యాచారంచేసిన ఘటన మహారాష్ట్రలోని థానేలో చోటు చేసుకుంది. శుక్రవారం రాత్రి ఘటన జరిగిందని, ప్రస్తుతం నిందితుడు తమ అదుపులో ఉన్నాడని పోలీసులు ఆదివారం వెల్లడించారు. శుక్రవారం రాత్రి షిర్డీ నుంచి తన మిత్రులు ఇద్దరితో కలసి బాధిత బాలిక ఇంటికి బయలుదేరింది. మార్గ మధ్యంలో ఉల్హాస్నగర్ రైల్వే స్టేషన్ వద్ద నిందితుడు శ్రీకాంత్ గైక్వాడ్ (30) వారిని అడ్డగించాడు. బాలికపై సుత్తితో దాడి చేశాడు. తోడుగా ఉన్న మిత్రులను కూడా బెదిరించాడు. అనంతరం బాలికను రైల్వే స్టేషన్ పక్కకు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక తప్పించుకోవాలని చూడగా మళ్లీ సుత్తితో దాడి చేశాడు. అయితే శనివారం ఉదయం అక్కడి నుంచి తప్పించుకున్న బాలిక ఇంటికి వెళ్లి విషయం చెప్పింది. తల్లిదండ్రులు వెంటనే కల్యాణ్ రైల్వే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోక్సో చట్టం సహా పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితున్ని శనివారం రాత్రి అరెస్టు చేశారు. బాలిక ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. -
దారుణం : సోదరిపై కొన్ని నెలలుగా అత్యాచారం!
నర్సాపూర్ రూరల్ (మెదక్ జిల్లా): బాలికపై అత్యాచారం చేసిన సంఘటన నర్సాపూర్ పట్టణంలో శనివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నర్సాపూర్ ఐసీడీఎస్ సీడీపీఓ హేమ భార్గవి తెలిపిన వివరాల ప్రకారం.. నర్సాపూర్ పట్టణంలోని పోస్టాఫీస్ వీధిలో తొమ్మిదో తరగతి చదువుతున్న బాలిక(14)పై ఇదే వీధిలో నివసించే వరుసకు అన్న అయిన యువకుడు (22) కొన్ని నెలలుగా అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక గర్భం దాల్చడంతో విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు శనివారం బాలికతో కలిసి ఐసీడీఎస్ కార్యాలయానికి వచ్చి ఫిర్యాదు చేశారు. బాలికను ప్రస్తుతం చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సెక్టార్ (బాలికల సంరక్షణ కేంద్రం)కు అప్పగించనున్నట్లు సీడీపీఓ తెలిపారు. ఎస్ఐ గంగారాజ్‌ను వివరణ కోరగా ఫిర్యాదు అందలేదన్నారు. (నిజామాబాద్‌లో ప్రేమ జంట ఆత్మహత్య) -
తిరుపతిలో దారుణం.. ఎనిమిదేళ్ల చిన్నారిపై..
-
తిరుపతిలో దారుణం.. ఎనిమిదేళ్ల చిన్నారిపై..
సాక్షి, చిత్తూరు : తిరుపతి నగర శివారు పద్మానగర్‌లో దారుణం చోటు చేసుకుంది. ఇంటి ముందు ఆడుకుంటున్న ఎనిమిదేళ్ల బాలికపై ఓ ఆటో డ్రైవర్ అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. దారుణాన్ని గమనించిన స్థానికులు కామాంధుడిని స్తంభానికి కట్టేసి చితకబాదారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తిని పద్మానగర్‌కు చెందిన ఆటో డ్రైవర్ జాన్‌గా గుర్తించారు. (చదవండి : పాపం.. తప్పు చేశాడని కాళ్లు విరగ్గొట్టారు) మద్యం మత్తులో ఉన్న జాన్.. ఇంటి ముందు ఆడుకుంటున్న ఎనిమిదేళ్ల బాలికతో కాసేపు మాట్లాడి ఆ తర్వాత పక్కనే ఉన్న పొదల్లోకి తీసుకెళ్లి అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. బాలిక గట్టిగా అరవడంతో స్థానికులు అటువైపుగా వెళ్లారు. వారిని గమనించిన జాన్.. అక్కడిని నుంచి పరారయ్యేందుకు ప్రయత్నించగా.. స్థానికులు చాకచక్యంతో పట్టుకొని దేహశుద్ధి చేశారు. ముఖ్యంగా మహిళలు అతడిని చావబాదారు. అనంతరం స్థానిక పోలీసులకు అప్పగించారు. -
హాస్టల్లో మైనర్ బాలికపై అత్యాచారం
ఝాన్సీ: ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ జిల్లాకు చెందిన ఓ పాలిటెక్నిక్ కాలేజీ హాస్టల్లో ఓ మైనర్ బాలికపై కాలేజీ విద్యార్థి ఆదివారం అత్యాచారానికి పాల్పడ్డాడు. అతడు అత్యాచారం చేస్తుండగా, అతడి మిత్రులు 8 మంది హాస్టల్ బయట కాపలా కాయడం గమనార్హం. వీరందరిపై ప్రభుత్వం ఇప్పటికే పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకుంది. వీరిపై జాతీయ భద్రతా చట్టాన్ని ప్రయోగించాలని జిల్లా కలెక్టర్ ప్రభుత్వాన్ని కోరారు. నిందితులను కాలేజీ నుంచి సస్పెండ్ చేసినట్లు కాలేజీ ప్రిన్సిపాల్ చెప్పారు. బాలిక హాస్టల్ పక్కన తన స్నేహితున్ని కలవడానికి వెళ్లగా. వారిని గమనించిన నిందితులు అతన్ని చితకబాది అనంతరం బాలికను హాస్టల్‌కు తీసుకొని వచ్చి అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు వెల్లడించారు. -
లాక్డౌన్ వేళ జమ్మూ కశ్మీర్లో దారుణం
శ్రీనగర్: ఒకవైపు ప్రపంచమంతా కరోనా కల్లోలంతో భయకంపితులవుతున్న వేళ జమ్మూ కశ్మీర్లో దారుణం చోటు చేసుకుంది. మూడేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు పొరుగింటి వ్యక్తి. ఈ దారుణ ఘటన రాంబన్ జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..రాంబన్ జిల్లాకు చెందిన మూడేళ్ల చిన్నారి బుధవారం ఇంటి ముందుకు అడుకుంటుండగా.. పవన్ సింగ్(18) అనే పొరుగింటి యువకుడు ఆమెను ఇంట్లోకి తీసుకెళ్లాడు. అనంతరం ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. చిన్నారి ఏడుపులు వినపడడంతో ఆమె తల్లి ఇంట్లోకి వెళ్లి చూడగా.. చిన్నారి అపస్మారక స్థితిలో పడిఉంది. ఆమెను వెంటనే అస్పత్రికి తరలించారు. చిన్నారి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పవన్ సింగ్‌ని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. చిన్నారిని వైద్యపరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించామని, రిపోర్ట్ ఆధారంగా తదుపరి విచారణ చేపడుతామని పేర్కొన్నారు. -
దారుణం: 8 ఏళ్ల బాలికపై బంధువు అత్యాచారం
నోయిడా : ఒకవైపు ప్రపంచమంతా కరోనా కల్లోలంతో భయకంపితులవుతున్న వేళ ఉత్తరప్రదేశ్‌లో మరో దారుణం చోటు చేసుకుంది. 8 ఏళ్ల బాలికపై 19 ఏళ్ల యువకుడు అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బీహార్‌కు చెందిన జీతూ(19) అనే యువకుడు తల్లిదండ్రులతో కలిసి నోయిడాలోని సాలాపూర్‌లో నివాసం ఉంటున్నారు. అతని మేనమామ కూడా సాలాపూర్‌లోనే నివాసం ఉంటున్నారు. మేనమామ కూతురిపై కన్నేసిన జీతూ.. శనివారం బాలికకు మాయమాటలు చెప్పి నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం ఆమెను తీవ్రంగా కొట్టి అక్కడ నుంచి పరారయ్యాడు. తీవ్ర గాయాలతో పడి ఉన్న బాలికను గమనించిన స్థానికులు హుటా హుటిన ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం బాలిక మృతి చెందింది. యువకుడిపై అత్యాచార, హత్య కేసు నమోదు చేసి అరెస్ట్ చేశామని పోలీసులు పేర్కొన్నారు. -
బాలికను సైకిల్‌పై తీసుకువెళ్లి..
-
అర్థరాత్రి బాలికపై అత్యాచారం
సాక్షి, కృష్ణా : జిల్లాలోని నూజివీడులో దారుణం చోటు చేసుకుంది. తండ్రి రాకకోసం ఎదురు చూస్తున్న ఓ మైనర్ బాలికపై అర్థరాత్రి వేళ అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ కామాంధుడు. నాన్న ఎక్కడ ఉన్నాడో చూపుతానని మాయమాటలు చెప్పి అభంశుభం తెలియని చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కృష్ణా జిల్లా పరిధిలోని నూజివీడు పట్టణం గాంధీనగర్ ప్రాంతానికి చెందిన తాపీ మేస్త్రి సరిపల్లి శేషుబాబు బుధవారం రాత్రి 9:30 ప్రాంతం వరకు ఇంటికి చేరుకోలేదు. ఆ సమయంలో శేషు బాబు కుమార్తె, మూడవ తరగతి చదువుతున్న బాలిక, తండ్రి కోసం రోడ్డుపైకి చేరుకుంది. శేషు బాబు తనకు తెలుసునని ఎక్కడ ఉన్నాడో చూపుతానని మాయమాటలు చెప్పిన ఓ అగంతకుడు బాలికను సైకిల్‌పై తీసుకువెళ్లి త్రిబుల్ ఐటీ సమీపంలో అత్యాచారం చేశాడు. అనంతరం సంఘటన స్థలంలోనే బాలికను వదిలేసి పరారయ్యాడు. భరించలేని నొప్పితో బాధపడుతున్న బాలిక కేకలు వేడయం ప్రారంభించింది. రాత్రిపూట పెట్రోలింగ్‌లో ఉన్న నూజివీడు సీఐ పి. రామచంద్రారావుకు కేకలు వినిపించడంతో సంఘటన స్థలానికి వెళ్లి బాలికను స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాలిక ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమచారం. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. -
బాలికపై 6 నెలలలుగా పది మంది అత్యాచారం
సోలాపూర్: మహారాష్ట్రలోని షోలాపూర్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ 16 ఏళ్ల దళిత బాలికపై పది మంది కామాంధులు ఆరు నెలలుగా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాలికను బెదిరించి వేరు వేరు ప్రదేశాలకు తరలిస్తూ ఈ దారుణానికి పాల్పడ్డారు. గత మంగళవారం షోలాపూర్‌లోని ఓ గుడి వద్ద ఏడుస్తున్న బాలికను స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. షోలాపూర్‌కు చెందిన బాలిక(16) తల్లితో కలిసి నగరంలో నివాసం ఉంటుంది. తండ్రి కొద్ది రోజుల క్రితమే మృతి చెందారు. ఆమె జీవనోపాధి కోసం చిన్న చిన్న పనులు చేసుకుంటూ తల్లికి సహాయం చేసేది. ఈ క్రమంలో ఆమెకు ఐదుగురు యువకులతో స్నేహం ఏర్పడింది. కాగా, ఆరు నెలల క్రితం బాలిక స్నేహితులు ఐదుగురు ఆమె ఇంటికి వచ్చి మాయమాటలు చెప్పి నగరంలోని ఓ రహస్య ప్రదేశానికి తీసుకెళ్లారు. అనంతరం అక్కడికి మరో ఐదుగురు యువకులు వచ్చారు. మొత్తం పదిమంది కలిసి బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయం ఇంట్లో చెబితే చంపేస్తామని బెదిరించి వెళ్లిపోయారు. ఇలా గత ఆరు నెలలుగా అనేకసార్లు బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. గత మంగళవారం కూడా బాలికపై అత్యాచారానికి పాల్పడిన దుండగులు.. అనంతరం ఆమెను ఓ గుడి వద్ద వదిలి వెళ్లారు. ఒంటరిగా ఏడుస్తున్న బాలికను గమనించిన స్థానికులు ఆమె దగ్గరకు వెళ్లి ఆరా తీయగా అసలు విషయం చెప్పింది. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. గుడి వద్దకు చేరుకున్న పోలీసులు నీరసంతో ఉన్న బాలికకు ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అనంతరం బాలిక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు. పదిమంది నిందితుల్లో ఐదుగురు బాలిక స్నేహితులేనని, వారిని అరెస్ట్ చేశామని పోలీసులు పేర్కొన్నారు. మిగతా ఐదుగురి కోసం గాలింపు చర్యలు చేపట్టామన్నారు. నిందితుల్లో కొంతమంది ఆటో డ్రైవర్లు ఉన్నారని పోలీసులు పేర్కొన్నారు. -
మూడేళ్ల చిన్నారిపై పొరుగింటి వ్యక్తి..
లక్నో : ఉత్తరప్రదేశ్‌లో దారుణం చోటు చేసుకుంది. మూడేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడి, అనంతరం దారుణంగా హత్య చేశాడో పొరుగింటి కామాంధుడు. ఈ దారుణ ఘటన సీతాపూర్‌లోని మహోలీ ప్రాంతంలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..మహోలీ ప్రాంతానికి చెందిన మూడేళ్ల చిన్నారి సోమవారం సాయంత్రం ఇంటి ముందు ఆడుకుంటుంది. చిన్నారి తల్లిదండ్రులు పనిపై సితాపూర్‌కు వెళ్లారు. ఇదే అదునుగా భావించిన పొరుగింటి వ్యక్తి రాజు చిన్నారికి బిస్కెట్ల ఆశ చూపి ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం చిన్నారి గొంతునులిమి చంపేశాడు. మృతదేహాన్ని ఓ సంచిలో మూటకట్టి బకెట్ కింద దాచాడు. సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చిన చిన్నారి తల్లిదండ్రులు తమ బిడ్డ కనిపించకపోవడంతో ఆందోళనకు గురయ్యారు. చుట్టుపక్కల వారిని ఆరా తీయగా ఎవరూ తమకు కనబడలేదని చెప్పారు. దీంతో చిన్నారి కోసం ఊరంతా వెతకడం ప్రారంభించారు. ఈ క్రమంలో రాజు ఇంటివెనక ఉన్న పెరట్లో చిన్నారి చెప్పులు కనిపించాయి. రాజుని నిలదీయగా.. దాటవేసే ప్రయత్నం చేశాడు. రాజు ప్రవర్తన పట్ల అనుమానం వచ్చి.. ఇంట్లోకి వెళ్లి వెతుకగా.. బకెట్ కింద సంచిలో చిన్నారి మృతదేహం లభించింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని రాజును అదుపులోకి తీసుకున్నారు. చిన్నారిపై అత్యాచారానికి పాల్పడి అనంతరం హత్య చేసినట్లుగా తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. నిందితుడికి తక్షణమె కఠిన శిక్ష విధించాలంటూ ధర్నాకు దిగారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూస్తామని పోలీసు ఉన్నతాధికారులు హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. ఈ కేసుపై సంబంధించి విచారణ చర్యలు చేపడుతున్నామని పోలీసు ఉన్నతాధికారి ఎంపీ సింగ్ తెలిపారు. -
నిశ్చితార్థ వేడుకలో ఘోరం.. 10 ఏళ్ల బాలికపై..
జైపూర్ : రాజస్తాన్‌లో ఘోరం జరిగింది. బంధువులు నిశ్చితార్థ వేడుకకు వెళ్లిన 10 ఏళ్ల బాలిక అత్యాచారానికి గురైంది. అక్కడ క్యాటరింగ్ చేసే వ్యక్తే ఈ దారుణానికి పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జైపూర్‌కు చెందిన ఓ జంట గత ఆదివారం తమ 10 ఏళ్ల చిన్నారితో కలిసి బంధువుల నిశ్చితార్థ వేడుకకు వెళ్లారు. అక్కడ భోజననాలు వడ్డించేందుకు వచ్చిన రాజు(36) చిన్నారిని బాత్రూంలోకి తిసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం చిన్నారిని బాత్రూంలోనే ఉంచి డోర్ లాక్ చేసి వచ్చాడు. కాసేపటి తర్వాత బాలిక కనబడకపోవడంతో తల్లిదండ్రులు వెతకడం ప్రారంభించారు. అనుమానం వచ్చి బాత్రూంలోకి వెళ్లి చూడగా.. అక్కడ చిన్నారి అపస్మారక స్థితిలో పడి ఉంది. ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు. కాగా, ఈ ఘటనపై అక్కడి వారిని ప్రశ్నించగా.. రాజు ప్రవర్తన తేడాగా కనిపించింది. గట్టిగా నిలదీయడంతో నిజం ఒప్పుకున్నాడు. బంధువుల ఫిర్యాదు మేరకు రాజుపై కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు -
8 ఏళ్ల చిన్నారిపై బంధువుల డ్రైవర్..
లక్నో : ఉత్తరప్రదేశ్‌లో దారుణం చోటు చేసుకుంది. అభంశుభం తెలియని ఓ 8 ఏళ్ల చిన్నారిపై బంధువుల డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన బారబంకి జిల్లాలో శనివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బారబంకి జిల్లాకు చెందిన ఓ 8 ఏళ్ల చిన్నారి ఇంటికి శనివారం సాయంత్రం బంధువులు వచ్చారు. వారి వెంట కారు డ్రైవర్ కూడా ఉన్నాడు. బంధువులు అంతా ఇంట్లో మాట్లాడుతుండగా.. చిన్నారి ఇంటి బయట ఆడుకుంటోంది. అక్కడే ఉన్న డ్రైవర్(26) చిన్నారి దగ్గరకి వెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. చిన్నారి గట్టిగా అరవడంతో బంధువులు, తల్లిదండ్రులు బయటకు వచ్చి చూడగా.. చిన్నారి అపస్మారక స్థితిలో పడిఉంది. అక్కడే ఉన్న డ్రైవర్‌పై అనుమానం వచ్చి నిలదీయగా..అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించాడు. వారు అతన్ని పట్టుకొని పోలీసులకు అప్పజెప్పారు. నిందితుడిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. -
మరో ‘దిశ’ ఘటన.. బాలికపై దారుణం
సాక్షి, సంగారెడ్డి : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘దిశ’ ఘటన మరవక ముందే మరో అత్యాచార ఘటన చేటు చేసుకుంది. సంగారెడ్డి జిల్లాలోని అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని వాణినగర్‌లో 16 ఏళ్ల మైనర్ బాలికపై ముగ్గురు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాలికను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లిన ఆగంతకులు అత్యంత దారుణంగా అత్యాచారానికి ఒడిగట్టారు. ఈ మేరకు బాధితురాలు గురువారం స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గత కొంత కాలంగా సదరు బాలిక తల్లిందుడ్రులు అమీన్‌పూర్‌లోని ఓ అపార్టుమెంట్లో సెక్యూరిటీ సిబ్బందిగా పని చేస్తున్నారు. అయితే గురువారం మధ్యాహ్న సమయంలో ఇంటి నుంచి షాప్‌కి వెళ్లిన బాలికను ముగ్గురు ఆగంతకులు కారులో వచ్చి సమీపంలోని వాటర్ ట్యాంక్ వద్ద అడ్డగించారు. అనంతరం నోరు మూసి కారులో బలవంతంగా లాక్కెళ్లి.. దారుణానికి ఒడిగట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటినా ఘటనాస్థలికి చేరుకున్నారు. బాలికకు సంబంధించిన కొన్ని వస్తువులను సంఘటన స్థలంలో స్వాధీనం చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటన స్థలంలో మద్యం బాటిల్స్ కూడా స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసినట్టు సమాచారం. -
ఏకాంతం కోసం ప్రియుడితో.. భయపెట్టి గ్యాంగ్ రేప్
భోపాల్: సభ్య సమాజం తలదించుకునేలా భోపాల్‌లో మరో ఉదంతం వెలుగు చూసింది. మధ్యప్రదేశ్‌లో ఓ యువతి దారుణంగా లైంగికి దాడికి గురైంది. ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థినిపై బీహెచ్ఈఎల్లో పనిచేసే సెక్యూరిటీ గార్డుతో పాటు, మరో వ్యక్తి లైంగిక దాడికి పాల్పడడం స్థానికంగా సంచలనం రేపింది. పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం.. 12వ తరగతి చదువుతున్న యువతి, తన బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి ఏకాంత ప్రదేశంలో మాట్లాడుకుంటూ ఉండగా.. ఇద్దరు వ్యక్తులు వారిపై కర్రలతో దాడి చేశారు. అనంతరం ఇరువురిని వివస్త్రలుగా చేసి వీడియోలు చిత్రీకరించారు. చదవండి: 'గత 15 ఏళ్లలో నలుగురికి మాత్రమే ఆ శిక్ష' తమకు వెంటనే రూ. 5వేలు ఇస్తే వీటిని తొలగిస్తామని లేకపోతే సామాజిక మాద్యమాల్లో పెడతామంటూ బయపెట్టారు. దీంతో ఏం చేయాలో తోచని ఆ యువకుడు తన ప్రియురాలిని అక్కడే వదిలి రూ. 5 వేలు తెచ్చేందుకు స్కూటర్‌పై సంఘటనా స్థలం నుంచి వెళ్లి తిరిగి రాగా, యువతి భోరున విలపిస్తూ కనిపించింది. యువతిని విషయం అడగగా ఆ ఇద్దరు తనపై అఘాయిత్యానికి ఒడిగట్టినట్లు తెలిపింది. దీంతో షాక్ తిన్న ప్రియుడు వెంటనే, తన మిత్రుడి సాయంతో వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి కస్టడీకి తరలించారు. నిందితులలో ఒకరు బీహెచ్ఈఎల్లో సెక్యూరిటీగా పనిచేసే సూర్యవంశీ (35) కాగా.. మరో వ్యక్తి స్థానికంగా నివాసం ఉండే రాజ్‌పుత్‌గా గుర్తించారు. వీరిపై అత్యాచారం, దోపిడీ కేసులను నమోదు చేసినట్లు భోపాల్ ఐజీ మీడియాకు తెలిపారు. -
17 రోజుల్లోనే జీవిత ఖైదు
జైపూర్: చిన్నారి బాలికపై అత్యాచారం చేసిన వ్యక్తికి 17 రోజుల్లోనే తీర్పు ప్రకటించి రాజస్తాన్‌లోని ఒక పోక్సో (ప్రివెన్షన్ ఆఫ్ చిల్డ్రెన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్) ప్రత్యేక కోర్టు చరిత్ర సృష్టించింది. చురు జిల్లాలో నవంబర్ 30వ తేదీన 21 ఏళ్ల దయారాం మేఘ్వాల్ నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ మర్నాడే అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఐపీసీతో పాటు పోక్సో చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. డిసెంబర్ 7వ తేదీన చార్జిïషీటు దాఖలు చేశారు. డిసెంబర్ 17న దయారాంకు జీవిత ఖైదు విధిస్తూ ప్రత్యేక కోర్టు తీర్పు వెలువరించింది. అంటే, 17 రోజుల్లోనే పోలీసు దర్యాప్తు, కోర్టు విచారణ, తీర్పు.. అన్నీ ముగిశాయి. ‘పోలీసులు చురుగ్గా పనిచేశారు. సకాలంలో శాస్త్రీయ ఆధారాలను సేకరించారు. బాధిత బాలిక వాంగ్మూలం కీలక పాత్ర పోషించింది. కోర్టు రోజువారీ విచారణ జరిపింది. దాంతో త్వరితగతిన తీర్పు సాధ్యమైంది’ అని చురు జిల్లా ఎస్పీ తేజస్విని గౌతమ్ వివరించారు. దోషి దయారాం తండ్రికి కూడా గతంలో ఒక రేప్ కేసులో జైలు శిక్ష విధించారు. -
మాయమాటలు చెప్పి.. బాలికపై లైంగిక దాడి
సంత బొమ్మాళి: మండలంలోని ఎం.సున్నాపల్లి గ్రామానికి చెందిన బాలికపై అదే గ్రామానికి చెందిన వివాహితుడు వేధింపులకు పాల్పడ్డాడు. ఈ మేరకు నౌపడ పోలీసులకు బాలిక తల్లి సోమ వారం ఫిర్యాదు చేసింది. బాలిక స్వగ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో చదువుతోంది. తండ్రి విదేశాల్లో పనిచేస్తున్నాడు. పిల్లల బాధ్యతను తల్లి చూసుకుంటుంది. గ్రామానికి చెందిన వివాహితుడు ఉప్పాడ సంతోష్ ఆ ఇంటికి తరుచూ వెళ్లడం, ఇంటి పేరు ఒకటే కావడంతో వారిలో ఒకడిగా కలిసిపోయాడు. ఇంటికి అవసరమయ్యే నిత్యావసర వస్తువులను అప్పుడప్పుడు తెచ్చి ఇచ్చేవాడు. ఈ క్రమంలో ఆ కుటుంబానికి మరింత దగ్గరై వరుసకు చెల్లి అయ్యే 13 ఏళ్ల బాలికకు మాయమాటలు చెప్పాడు. బాలిక స్నానం చేస్తుండగా సెల్ఫోన్లో అసభ్యకర చిత్రాలను తీశాడు. పసుపు తాడు కూడా కట్టాడు. పెళ్లి చేసుకున్న ఆ దృశ్యాలను తండ్రి వాట్సాప్‌కు పంపాడు. బాలికకు, తల్లికి వెంటనే తండ్రి ఫోన్ చేసి ఈ విషయాన్ని చెప్పాడు. దీనిపై గ్రామంలో రెండు రోజులుగా పంచాయితీ నడిచింది. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడు. కాగా లైంగిక దాడికి పాల్పడినట్లు బాధిత కుంటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇన్చార్జి ఎస్ఐ బి.గణేష్ ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. -
చిన్నారిపై అత్యాచారం..ఆపై బాత్రూమ్లో..
కోల్‌కతా : మహిళలపై జరుగుతున్న ఆకృత్యాలపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నప్పటికీ వారిపై దాడులు మాత్రం ఆగడంలేదు. తాజాగా పశ్చిమ బెంగాల్ మరో ఘోరం జరిగింది. అభంశుభం తెలియని ఆరేళ్ల చిన్నారిపై పక్కింటి యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. కోల్‌కతాలోని గార్డెన్ రీచ్ ఏరియాకు చెందిన ఓ 19 ఏళ్ల యువకుడు అదే ప్రాంతానికి చెందిన ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం చేశాడు. అనంతరం చిన్నారిని బాత్రూమ్లో వేసి తాళం పెట్టి వెళ్లాడు. అయితే చిన్నారి కనిపించకపోవడంతో ఆందోళన చెందిన తల్లి.. చుట్టపక్కల మొత్తం వెతికారు. చివరకు అనుమానం వచ్చి బాత్రూమ్ తలుపులు తెరవగా తీవ్ర గాయాలతో చిన్నారి ఏడుస్తూ కనిపించింది. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు పక్కింటి కుర్రాడిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నామని పోలీసులు పేర్కొన్నారు. వైద్య పరీక్షల నిమిత్తం చిన్నారిని ఆస్పత్రికి తరలించామని, రిపోర్ట్ అనంతరం తదుపరి విచారణ చేపడతామని చెప్పారు. -
ఐదేళ్ల తర్వాత కీచక తండ్రికి శిక్ష
ముంబై: గుండెల మీద ఎత్తుకుని ముద్దాడాల్సిన తండ్రి దుర్మార్గంగా ప్రవర్తించాడు. రక్షించాల్సిన తండ్రే రాబంధులా కూతురిపై అత్యాచారానికి ఒడిగట్టాడు. తాగిన మత్తులో కన్నకూతురిపై అత్యాచారానికి పాల్పడ్డ తండ్రికి మంగళవారం ముంబై కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. ముంబైలోని వాశీ ప్రాంతానికి చెందిన ఓ బాలిక ఎనిమిదో తరగతి చదువుతోంది. 2014 నవంబర్‌లో ఓ రోజు తన తండ్రి తాగి ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో బాలిక తల్లి ఇంట్లో లేదు. మిగతా పిల్లలు ఇంటి బయట ఆడుకుంటున్నారు. ఈ సమయంలో తండ్రి రక్తసంబంధాన్ని మరిచి కూతురిపై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేయగా విచారణలోనూ బాలికపై అత్యాచారం జరిగినట్టుగా నిర్ధారణ అయింది. ఇక పలు వాదనలు విన్న ధర్మాసనం నిందితుడికి ఐదు సంవత్సరాల జైలు శిక్ష ఖరారు చేస్తూ తీర్పు వెల్లడించింది. కాగా ఘటన జరిగిన ఐదేళ్ల తర్వాత తీర్పు వెలువడటం గమనార్హం. -
దారుణం.. కజిన్ కాళ్లు, చేతులు మంచానికి కట్టేసి..
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలోని గురుగ్రామ్‌లో దారుణం జరిగింది. 16ఏళ్ల ఓ బాలుడు తనకు మరదలు వరుసయ్యే 15ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో బాలికను మంచానికి చేతులు, కాళ్లు కట్టేసి అత్యాచారానికి పాల్పడ్డాడు. గురుగ్రామ్‌లోని సెక్టార్ 51 ఏరియాలో గురువారం ఈ ఘటన జరగ్గా, ఆసల్యంగా శనివారం వెలుగులోకి వచ్చింది. ఆ బాలిక స్కూల్లో స్పృహ తప్పి పడిపోవడంతో టీచర్ ఆమెను విచారించింది. దీంతో జరిగిన ఘటనను ఆమెకు వెల్లడించింది. సదరు టీచర్ బాలిక తల్లికి అసలు విషయం చెప్పడంతో..వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇటీవల తమ ఆడపడుచుకు ఆరోగ్యం బాగా లేకపోవడంతో.. ఇంట్లో పనులు చేసేందుకు కుమార్తెను పంపించానని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆమె వైద్యం కోసం ఆస్పత్రికి వెళ్లిన సమయంలో.. ఆమె కొడుకు తన కుమార్తెపై అత్యాచారానికి పాల్పడ్డారని తెలిపారు. ఆమె కాళ్లు,చేతులను బెడ్‌కి కట్టేసి అత్యాచారానికి పాల్పడినట్టు చెప్పారు. బాధిత బాలిక తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలుడిని అరెస్ట్ చేసి దర్యాప్తు ప్రారంభించారు. -
బస్టాండ్‌లో నాలుగేళ్ల చిన్నారిపై..
చెన్నై : అభంశుభం తెలియని నాలున్నరేళ్ల చిన్నారిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డా ఓ కామాంధుడు. బస్టాండ్‌లో కూర్చున చిన్నారి దగ్గరికెళ్లి బుగ్గలపై ముద్దులు పెడుతూ.. అసభ్యకరంగా ప్రవర్తించాడు. చిన్నారి తల్లి అప్రమత్తమై అరవడంతో.. స్థానికులు నిందితుడిని పట్టుకొని పోలీసుకు అప్పగించారు. ఈ ఘటన తమిళనాడులోని మధురైలో గత మంగళవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మధురైకి చెందిన ఓ మహిళ తన నాలున్నరేళ్ల చిన్నారితో కలిసి బంధువుల ఇంటికి వెళ్లేందుకై అరపాలయం బస్ టెర్మినల్‌లో నిలుచున్నారు. కొద్దిసేపటి తర్వాత ఆమెకు దాహం వేయడంతో చిన్నారిని అక్కడే కూర్చోబెట్టి పక్కనే ఉన్న కుళాయి దగ్గరు వెళ్లారు. ఈక్రమంలో అక్కడే ఉన్న ఎస్ సెంథిల్ అనే లేబర్.. చిన్నారి దగ్గరికెళ్లి బిత్తిరి చర్యలకు పాల్పడ్డాడు. చిన్నారి బుగ్గలపై ముద్దులు పెడుతూ..అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో చిన్నారి బిగ్గరగా ఏడ్చింది. అప్రమత్తమైన తల్లి పరుగున వచ్చి చిన్నారిని ఒడిలోకి తీసుకుంది. అయినప్పటికీ సెంథిల్ అక్కడి నుంచి వెళ్లకుండా ఆమెతో కూడా అసభ్యకరంగా ప్రర్తించాడు. అసభ్యపదజాలంతో దూషిస్తూ.. ఆమెపై చేయిచేసుకునేందుకు యత్నించాడు. దీంతో స్థానికులు అతన్ని పట్టుకొని దేహాశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. చిన్నారి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని సెంథిల్‌ను అదుపులోకి తీసుకున్నామని మధురై పోలీసులు పేర్కొన్నారు. -
అమ్మా.. సారీ!
మళప్పురం: 12 ఏళ్ల బాలికపై రెండేళ్లుగా దాదాపు 30 మంది అత్యాచారానికి పాల్పడిన దారుణ ఘటన కేరళలోని కొజిక్కోడ్ జిల్లాలో చోటు చేసుకుంది. పాఠశాలలో జరిగిన ఒక కౌన్సెలింగ్ ద్వారా ఈ దారుణం వెలుగులోకి వచి్చంది. దీనిపై ఆ బాలిక తండ్రి, మరో ఇద్దరిని ఆదివారం పోలీసులు అరెస్ట్ చేసి, కేసు నమోదు చేశారు. ఆ బాలికను దగ్గర్లోని షెల్టర్ హోంలో చేరి్పంచారు. జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న బాలిక..సూ్కల్లో ముభావంగా ఉండటంతో కౌన్సెలర్ ఆ బాలిక ఇంటి పరిస్థితులపై ప్రశి్నంచారు. దాంతో కన్నీటిపర్యంతమైన బాలిక ఆ దారుణాన్ని వెల్లడించింది. రెండేళ్ల క్రితం (అప్పుడు ఆ బాలికకు పదేళ్లు) తన తండ్రి ఓ స్నేహితుడి వద్ద కొంత డబ్బు అప్పు తీసుకున్నాడని, అది తీర్చలేని పరిస్థితుల్లో ఆ స్నేహితుడికి తనను అప్పగించాడని తెలిపింది. ఆ తరువాత ఆ స్నేహితుడు మరి కొందరిని తీసుకువచ్చాడని, అలా రెండేళ్లుగా ఈ దారుణం కొనసాగుతోందని వెల్లడించింది. ఇంటి అద్దె కట్టలేని పరిస్థితి, నానమ్మ అనారోగ్యం.. తదితర ఆరి్థక ఇబ్బందుల్లో ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో తన తండ్రిని అరెస్ట్ చేస్తే పరిస్థితి మరింత దిగజారుతుందని ఆ బాలిక వేడుకోవడం, ‘అమ్మా సారీ’అంటూ వారున్న ఇంటి తలుపుపై ఆ చిన్నారి రాయడం అక్కడివారికి కన్నీళ్లు తెప్పించింది. ఆ పాపకు పాఠశాలలో స్నేహితులెవరూ లేరని, ఎవరితో అంత కలుపుగోలుగా ఉండకపోయేదని, ఎప్పుడు ముభావంగా, నీరసంగా ఉండేదని క్లాస్మేట్స్ తెలిపారు. అయినా, ఆ బాలికను ఆమె తల్లే పాఠశాలకు తీసుకువచి్చ, తీసుకువెళ్లేదని, ఎవరితో మాట్లాడనిచ్చేది కాదని వివరించారు. దాదాపు ప్రతీరోజు రాత్రంతా ఆ బాలిక అరుపులు, ఏడుపులు వినిపించేవని, అయితే, అది వారి ఇంటి విషయమని, అందులో కలగజేసుకోకూడదనే ఉద్దేశంతో తాము పట్టించుకోలేదని ఆ బాలిక ఇంటి దగ్గర్లోని వారు చెప్పారు. మొదట్లో చురుగ్గా, ఆరోగ్యంగా ఉండే పాప.. నిస్తేజంగా, స్తబ్దుగా మారిపోవడంతో వారి ఇంటి దగ్గర్లోని వారే పాఠశాలలో సమాచారమివ్వడంతో ఆ బాలికకు కౌన్సెలింగ్ నిర్వహించినట్లు సమాచారం. ఆ బాలిక తల్లి మాత్రం ఇదంతా అబద్ధమని, కుట్ర అని చెబుతోంది. -
12 ఏళ్ల పాపపై రెండేళ్లుగా 30 మంది....
సాక్షి, న్యూఢిల్లీ : ‘అమ్మా! నన్ను క్షమించు’ ఓ 12 ఏళ్ల బాలిక తన ఇంటి తలుపుపై రాసిన సందేశం. ఈ మూడు పదాల వెనక అంతులేని విషాధం దాగుంది. ఆమెది కేరళ. అక్కడ తన తల్లి, తండ్రి, నానమ్మతో కలిసి ఓ పాత అపార్ట్మెంట్లోని ఓ చిన్న పోర్షన్లో ఉంటోంది. సమీపంలోని ఓ ప్రభుత్వ స్కూల్లో చదువుకుంటోంది. గత రెండేళ్లుగా ఆమె తన ఇంట్లోనే నరకం అనుభవిస్తూ వచ్చింది. ఇప్పటి వరకు ఆమెను కనీసం 30 మంది వరుసగా రేప్ చేస్తూ వచ్చారు. అందుకు ఆస్కారం ఇచ్చింది ముందుగా ఆమె తండ్రే. ఉద్యోగం పోయి కష్టాల్లో ఉన్న కుటుంబ సభ్యులకు కనీసం తిండి పెట్టలేక పోతున్న ఆ తండ్రి ఓ స్నేహితుడి వద్ద డబ్బులు తీసుకొని, అతన్ని ఓ రోజు తన కూతురు వద్దకు పంపించారు. ఆ రోజున ఆ ఆగంతకుడి అఘాయిత్యం నుంచి తప్పించుకునేందుకు ఆ పాప ఏడ్చి పెడ బొబ్బలు పెట్టినా ఇరుగు పొరుగు వారు కూడా పట్టించుకోలేదు. కొంతకాలం వరకు ఆమె ఆక్రందనలు అలాగే కొనసాగాయి. ఆ పాప తల్లికి పరిస్థితి అర్థమయ్యే ఉంటోంది. ఆమె కూతురు గదిలోకి రావడంగానీ, పలకరించడంగానీ చేయకుండా కూతురుకు దూరదూరంగా ఉంటూ వచ్చింది. మొదట్లో ఆరు నెలల పాటు ఈ అఘాత్యాలను పట్టి బిగువున భరిస్తూ స్కూలుకు వెళ్లిన ఆ అమ్మాయి, ‘ఎందుకు ఎలాగో ఉంటున్నావంటూ’ తోటి వారి ప్రశ్నలకు ఎలాంటి సమాధానం ఇవ్వలేక ఆ తర్వాత స్కూలుకు వెళ్లడమే మానేసింది. ఇంటి నుంచి చాలాసార్లు పారిపోదామనుకుని ప్రయత్నించి, అమాయకంగా బిక్క మొహం వేసుకునే అమ్మ, మందులు లేకుండా ఒక్క రాత్రి కూడా నిద్రపోలేని నానమ్మ, ఉద్యోగం దొరక్క దేశ దిమ్మరిగా తిరుగుతున్న తండ్రి గుర్తొచ్చి, మళ్లీ ఇంటికి తిరిగి వచ్చేది. స్కూల్ మానేశాక ఆ పాపపై లైంగిక దాడులు మరీ పెరిగాయి. మొదట అత్యాచారం చేసిన తండ్రి స్నేహితుడే బ్రోకర్‌గా మారారు. ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు కూడా ఆ పాపను ఏడాది కాలంగా అనుమతించడం లేదు. ఈ మధ్య ఆ పాప అరుపులు ఎక్కువవడంతో ఇరుగు పొరుగు వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చాలాకాలంగా ఆ పాప అరుపులు వినిపిస్తున్నాయని, గతంలో హుషారుగా కనిపించే ఆ పాప బాగా నీరసించి ముభావంగా మారిపోయిందని, మనకెందుకొచ్చిన గొడవంటూ ఇన్నాళ్లు వదిలేశామని, మరీ భరించలేని పరిస్థితుల్లో పోలీసులకు ఫిర్యాదు చేయాల్సి వచ్చిందని పేరు బహిర్గతం చేయడానికి ఇష్టపడని పక్క ఫ్లాట్‌లో ఉంటున్న ఓ ఉద్యోగి తెలిపారు. గత ఆదివారం (సెప్టెంబర్ 22న) రాత్రి పోలీసులు ఆ పాప ఇంటిపై దాడిచేసి తండ్రితోపాటు ఒకరిద్దరు విటులను అరెస్ట్ చేశారు. ఆ పాపను అదుపులోకి తీసుకొని విచారించగా, రెండేళ్ల నుంచి తనపై సాగుతున్న అత్యాచార పర్వం గురించి ఆమె నిర్భయంగా చెప్పింది. వైద్య పరీక్షల అనంతరం ఆ పాపను ప్రభుత్వ ఆడపిల్లల సంరక్షణ కేంద్రానికి పోలీసులు తరలించారు. పోలీసులు ఆ పాపను ఇంటి నుంచి తీసుకెళుతున్నప్పుడు ఆ పాప తన ఇంటి తలుపుపై ‘అమ్మా! సారీ’ అని రాసింది. ‘మీకు పట్టెడన్నం పెట్టడం కోసం ఈ పాడు వృత్తిని కొనసాగించలేక పోతున్నానన్న బాధనా లేదా ఈ రకంగా నీకు దూరం అవుతున్నానన్న ఆవేదననా ఆ సారీకి అర్థం!? -
ఆడుకుంటున్న నాలుగేళ్ల చిన్నారిపై ఆఘాయిత్యం
ముంబై : మహారాష్ట్రలో దారుణం జరిగింది. ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారిపై ఓ 24 ఏళ్ల యువకుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అభం శుభం తెలియని చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన నావి ముంబై నగరంలో గత ఆదివారం చోటు చేసుకోగా, ఆలస్యంగా నేడు వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నావి ముంబైలోని తలోజా ఏరియాకు చెందిన నాలుగేళ్ల చిన్నారి గత ఆదివారం ఆడుకోవడానికై బయటకు వెళ్లింది. అక్కడే ఉన్న అశోక్ కుమార్ యాదవ్(24) అనే దినసరి కూలి ఆ చిన్నారిపై కన్నేశాడు. మాయ మాటలు చెప్పి ఆమెను ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లాడు. అనంతరం ఆమెపై అత్యాచారానికి పాల్పడాడ్డడు. చిన్నారి ప్రైవేట్ భాగాలలో గాయలను చూసిన తల్లిదండ్రులు బాలికను ప్రశ్నించగా అసలు విషయం చెప్పింది. దీంతో బాలిక తండ్రి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అనంతరం చిన్నారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. బాలిక ఫిర్యాదు మేరకు అశోక్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. -
అత్యాచారం.. ఆపై ఆమెకే శిక్ష
గయా : బీహార్‌లోని గయా జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. అత్యాచార బాధితురాలికే శిక్ష విధించారు గ్రామ పెద్దలు. నిందితులను వదిలిపెట్టి, బాధితురాలికి శిక్షగా గుండు చేయించి ఊరేగించారు. ఈ దారుణ ఘటన ఈ నెల 14 న జరగ్గా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 14వ తేదీ సాయంత్రం కొంతమంది వ్యక్తులు కలిసి ఓ మైనర్ బాలికను కిడ్నాప్ చేసి వాహనంలో తీసుకువెళ్లారు. స్థానిక పంచాయతీ భవనంపైకి తీసుకెళ్లి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. స్పృహా కోల్పోయిన బాలికను అక్కడే వదిలేసి పారిపోయారు. మరుసటి రోజు ఓ గ్రామస్తుడు చూసి బాలిక తల్లిదండ్రులు తెలపడంతో వారు వచ్చి ఇంటికి తీసుకువెళ్లారు. మరుసటి రోజు బాలిక తల్లిదండ్రులు గ్రామ పంచాయతీకి ఫిర్యాదు చేశారు. నిందితుల కుటుంబ సభ్యులు, బంధువులు గ్రామంలో పేరు, బలగం ఉన్నవారు కావడంతో బాధితురాలికి న్యాయం చేయాల్సిన పంచాయతీ తిరిగి సదరు మహిళనే దోషిగా తేల్చి శిక్ష విధించింది. బాలికకు గుండు చేయించి ఊరిలో ఊరేగించారు. దీంతో తమకు న్యాయం దక్కలేదని పోలీసులను ఆశ్రయించారు. అక్కడ కూడా ఫలితం లేకుండా పోయింది. దీంతో బాధిత కుటుంబం జిల్లా పోలీసు ఉన్నతాధికారులను కలిసి వేడుకోవడంతో ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. గ్రామ సభ నిర్వహించి బాలికకు శిక్షను ఖరారు చేసిన ఐదురుగు పంచాయతీ పెద్దలపై సైతం కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఈ ఘటనను సుమోటోగా తీసుకున్న బిహార్ మహిళా కమిషన్ చైర్పర్సన్ గయా సీనియర్ ఎస్పీకు లేఖ రాశారు. సెప్టెంబర్ 2వ తేదీన పంచాయతీ సభ్యులను తమ ఎదుట హాజరు పరచాలని ఆదేశించారు. -
అశ్లీల చిత్రాలు చూపిస్తూ తండ్రి కొడుకు..
భోపాల్ : మధ్యప్రదేశ్‌లో దారుణం చోటు చేసుకుంది. ఓ 16 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు ఆరుగురు దుండగులు. బాలికకు అశ్లీల చిత్రాలను చూపిస్తూ 16 నెలలుగా అత్యాచారానికి పాల్పడ్డారు. వారి వేధింపులకు భరించలేక అసలు విషయాన్ని తండ్రికి చెప్పి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారిలో తండ్రికొడుకులు, ఓ మైనర్ బాలుడు ఉండడం గమనార్హం. వివరాలు.. ఇండోర్ చెందిన ఓ 16 ఏళ్ల బాలిక తల్లి చనిపోవడంతో తొమ్మిదో తరగతిలోనే చదువు మానేసి తండ్రి, చెల్లితో కలిసి ఉంటుంది. బాలిక తండ్రి వాచ్‌మెన్‌గా పని చేస్తూ ఇద్దరు కూతుళ్లను పోషించుకుంటున్నారు. వారి ఇంటిపక్కనే ఉండే ఓ వ్యక్తి క్యాటరింగ్ కాంట్రాక్టర్‌గా పని చేస్తున్నాడు. తాము క్యాటరింగ్ పనిలో బిజీగా ఉంటున్నామని, తమ పిల్లలను చూసుకునేందుకు బాలికను పంపించమని తండ్రిని కోరారు. రోజూ ఇంత డబ్బు ఇస్తానని ఒప్పందం చేసుకున్నాడు. తండ్రి డ్యూటీకి వెళ్లగానే బాలికి ఆ కాంట్రాక్టర్ ఇంటికి వెళ్లి పిల్లలను చూసుకునేంది. ఆ బాలికపై కన్నేసిన సదరు కాంట్రాక్టర్.. ఆమెకు తరచూ ఫోన్లో అశ్లీల చిత్రాలను చూపిస్తూ అత్యాచారానికి పాల్పడ్డాడు. అతను లేని సమయంలో ఆయన కుమారుడు(23) కూడా బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయం ఇంట్లో చెబితే చంపేస్తామని బెదిరించారు. కొన్నాళ్లకు సదరు యువతి తన స్కూల్ ఫ్రెండ్ అయిన అబ్బాయికి విషయం చెప్పి సాయం కోరింది. నిందితుడికి మేనల్లుడైన సదరు యువకుడు సైతం సాయం చేయకపోగా విషయం ఆమె తండ్రికి చెబుతానని బెదిరించి అమ్మాయిపై అఘాయిత్యం చేశాడు. ఆ విషయం తెలుసుకున్న అతని సోదరుడు సైతం యువతిని లైంగికంగా వేధించడం మొదలుపెట్టాడు. కొన్నాళ్లకు సదరు యువతి ఇంటి పక్కనే ఉండే ఇద్దరు యువకులకు విషయం తెలియడంతో వారు సైతం ఆ అమ్మాయిని బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డారు. వీరి వేధింపులకు భరించలేక బాలిక విషయాన్ని తండ్రికి చెప్పింది. బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. యువతి తండ్రి ఫిర్యాదు ఆధారంగా క్యాటరింగ్ కాంట్రాక్టర్, అతని కొడుకు, వారి బంధువులైన 16, 18 ఏళ్ల యువకులతో పాటు మరో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. -
40 మంది పురుషులపై అత్యాచారం
జైపూర్ : అభం శుభం తెలియని 35 మంది చిన్నారులతో సహా 40 మంది పురుషులు, ట్రాన్స్జెండర్లపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ కామాంధుడు. ఏడేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడిన కేసులో అరెస్ట్ చేసి విచారించిన పోలీసులు ఈ విస్తు గొలిపే విషయాన్ని బయటపెట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జైపూర్‌లోని శాస్త్రీనగర్ చెందిన ఏడేళ్ల చిన్నారిని గుర్తు తెలియని వ్యక్తి అపహరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. చిన్నారి తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. నిందితుడు(35) ముసుగు ధరించడంతో సీసీ కెమెరా పుటేజీ ద్వారా కూడా పోలీసులు అతన్ని గుర్తించలేకపోయారు. అయితే అతని బైక్‌ను గుర్తించిన పోలీసులు దాని ఆధారంగా విచారణ చేపట్టారు. గతంలో జరిగిన అత్యాచార ఘటనల్లో కూడా అదే బైక్ కనిపించడంతో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. మూడు రోజుల క్రితం అదే బైక్‌పై వెళ్తున్న వ్యక్తిని గమనించిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని విచారించారు. తమ విచారణలో భయంకరమైన విషయాలు వెలువడ్డాయని సీనియర్ పోలీసు అధికారి శ్రీవాత్సవ పేర్కొన్నారు. ‘ బైక్ ఆధారంగా నిందితున్ని గుర్తించాం. గతంలో జరిగిన అత్యాచార ఘటనల్లో కూడా ఇలాంటి వాహనాన్నే మేం గుర్తించాం. దీంతో ఆ కోణంలో నిందితుడిని విచారించాం. గతంలో ఈ కామాంధుడు 35 మంది చిన్నారులు, 40 మంది పురుషులు, ట్రాన్స్జెండర్లపై అత్యాచారానికి పాల్పడ్డాడు. చిన్న పిల్లలను అపహరించి అమ్ముకుంటూ వచ్చే డబ్బుతో జల్సాలు చేసే వాడు. మద్యం, సెక్స్‌కు బానిసైన ఈ వ్యక్తి పురుషులు, ట్రాన్స్జెండర్లు అనే తేడా లేకుండా అత్యాచారానికి పాల్పడ్డాడు. గతంలో కూడా ఇతని పై పలు కేసులు నమోదయ్యాయి. నిందితున్ని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించాం’ అని పోలీసులు అధికారి శ్రీవాత్సవ మీడియాకు తెలిపారు. -
హైదరాబాద్ శివార్లో మరో కామాంధుడు
సాక్షి, మేడ్చల్ : చిన్నారులు, బాలికలే టార్గెట్‌గా కామాంధులు రెచ్చిపోతున్నారు. వరంగల్, రామాంతపూర్‌లో చిన్నారులపై జరిగి అత్యాచార ఘటనలు మరువక ముందే హైదరాబాద్‌లో మరో దారుణం చోటు చేసుకుంది. మేడ్చల్ జిల్లా జవహార్‌నగర్ పీఎస్ పరిధిలోని బాలీజీ నగర్ చెందిన 7 ఏళ్ల చిన్నారిపై ఓ వృద్ధ మానవ మృగం అత్యాచారానికి యత్నించాడు. ఇంటి పక్కనే ఉండే వెంకటయ్య (60) అనే వృద్ధ కామాంధుడు ఇంటి బయట ఆడుకుంటున్న ఏడేళ్ల చిన్నారిని భవనంపైకి తీసుకెళ్లి అత్యాచారానికి ఒడిగట్టే ప్రయత్నం చేశాడు. పక్క భవనంలోని వ్యక్తి గమనించి అరవడంతో చిన్నారిని వదిలి పారిపోయేందుకు ప్రయత్నించాడు. కాలనీవాసులు వెంకటయ్యను పట్టుకొని స్తంభానికి కట్టేసి దేహశుద్ది చేశారు.అనంతరం పోలీసులకు అప్పజెప్పారు. చదవండి : హైదరాబాద్‌లో పైశాచిక ఘటన హన్మకొండలో ఘోరం : 9 నెలల పసికందుపై.. -
పదేళ్ల బాలికపై యువకుడి అత్యాచారం
వజ్రకరూరు : గొర్రెలు మేపడానికి పొలానికెళ్లిన అవ్వకు భోజనం ఇచ్చేందుకు వెళ్లిన ఓ బాలిక (10)పై అదే గ్రామానికి చెందిన యువకుడు అత్యాచారం చేశాడు. ఈ ఘటన శనివారం అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం వెంకటాంపల్లి పెద్దతండాలో చోటుచేసుకోగా.. ఆదివారం వెలుగులోకి వచ్చింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, వెంకటాంపల్లి పెద్దతండాకు చెందిన పదేళ్ల బాలిక శనివారం ఉదయం పొలంలో గొర్రెలు మేపేందుకు వెళ్లిన అవ్వకు భోజనం ఇచ్చేందుకు ఇంటి నుంచి బయలుదేరి వెళ్లింది. మార్గమధ్యలోనే అదే గ్రామానికి చెందిన డాక్యానాయక్ అనే యువకుడు బాలికను అడ్డగించి పక్కనే ఉన్న ముళ్ల పొదల్లోకి తీసుకువెళ్లి అత్యాచారం చేశాడు. బాలిక కేకలు వేయకుండా నోట్లో గుడ్డలు కుక్కాడు. బాలిక అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయింది. అనంతరం డాక్యానాయక్ అక్కడి నుంచి పారిపోయాడు. అటువైపు వెళుతున్న కొందరు గొర్రెలకాపరులు బాలికను గమనించి వెంటనే గ్రామస్తులకు, కుటుంబీకులకు సమాచారం ఇచ్చారు. బాలికను ఉరవకొండ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న గుంతకల్లు డీఎస్పీ ఖాసీంసాబ్, వజ్రకరూరు ఎస్ఐ ఇబ్రహీం, మహిళా ఏఎస్ఐ మంజుల తదితరులు ఆదివారం ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం గ్రామంలో పర్యటించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
బాలికపై లైంగికదాడి.. కరెంట్ షాక్ పెట్టి హత్య
సాక్షి ప్రతినిధి, చెన్నై: విద్యార్థి దశలోనే అతని వికృత చేష్టలు ఓ బాలిక జీవితాన్ని చిదిమేశాయి. మైనర్‌పై లైంగికదాడికి పాల్పడి ఆపై విద్యుత్‌షాక్‌కు గురిచేసి కిరాతకంగా కడతేర్చిన దారుణ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. దిండుగల్లు జిల్లా ఉత్తర మదురై సమీపం జీ కురుంపట్టికి చెందిన ఏడో తరగతి విద్యార్థిని కొన్ని రోజుల క్రితం ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. నోటితో కరెంటు వైరుపట్టుకుని, ఒళ్లంతా రక్తగాయలై విగతజీవిగా పడి ఉండగా ఆమె తల్లిదండ్రులు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలికపై లైంగికదాడి చేసి విద్యుత్‌షాక్‌తో హతమార్చినట్లు పోస్టుమార్టంలో తేలింది. బాలిక ఇంటికి సమీపంలోని విద్యార్థులే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు అనుమానించిన మృతురాలి బంధువులు వారిపై చర్య తీసుకోవాలని ఆందోళన చేపట్టారు. ఈ కోణంలో విచారణ చేపట్టిన పోలీసులు అదే ప్రాంతానికి చెందిన ప్లస్‌టూ విద్యార్థే నిందితుడుగా గుర్తించి శనివారం అరెస్ట్ చేశారు. ఈనెల 16న బాలిక ఇంట్లో ఒంటరిగా ఉండగా చొరబడి లైంగిక దాడికి దిగానని, ఆమె ప్రతిఘటించి కేకలు వేయడంతో తీవ్రంగా కొట్టి లొంగదీసుకున్నానని అంగీకరించాడు. తనను పోలీసులకు పట్టిస్తుందన్న భయంతో ఇంట్లో ఉన్న విద్యుత్ వైరును బాలిక నోటిలో ఉంచి కరెంటు షాక్‌కు గురిచేసి హతమార్చానని ఒప్పుకున్నాడు. -
పదోతరగతి విద్యార్థినిపై ఆటో డ్రైవర్ అమానుషం
సాక్షి, నెల్లూరు : జిల్లాలోని పొదలకూరులో దారుణం చోటు చేసుకుంది. పదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థినిపై ఆటో డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. విద్యార్థిని గర్భం దాల్చడంతో ఆలస్యంగా ఆటో డ్రైవర్ దురాగతం బయటపడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పొదలకూరులోని ఒక పాఠశాలలో పదో తరగతి చదువుతున్న బాలికకు బంధువైన ఆటోడ్రైవర్ పవన్ మాయమాటలు చెప్పి లొంగదీసుకున్నాడు. కొంతకాలం లైంగికదాడి చేయడంతో ఆమె గర్భం దాల్చింది. విద్యార్థిని తండ్రి బయటి ప్రాంతానికి వెళ్లి కూలీ పనులు చేసుకుంటుండగా తల్లి పట్టణంలోనే పనిచేసుకుని జీవిస్తోంది. బాలిక గర్భం దాల్చి ఏడో నెల వచ్చే వరకు ఇంట్లో తల్లి కూడా తెలుసుకోలేకపోయింది. బాలిక జరిగిన విషయం తల్లికి చెప్పడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడు అవివాహితుకావడం, ఒకరికొకరు బంధువులు అయినందున వివాహం జరిపించేందుకు పెద్దలు మధ్యస్తం చేసేందుకు ప్రయత్నించారు. మధ్యస్తం కుదరకపోవడంతో పోలీసులు కేసు నమోదు చేసి విద్యార్థినిని వైద్యపరీక్షల నిమిత్తం నెల్లూరు జీజీహెచ్‌కు తరలించారు. హెడ్‌కానిస్టేబుల్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
దారుణం : ఐసీయూలో మైనర్ బాలికపై అత్యాచారం
లక్నో : ఉత్తరప్రదేశ్‌లో దారుణం జరిగింది. ఐసీయూలో చికిత్స పొందుతున్న మైనర్ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. పోలీసుల కథనం ప్రకారం.. యూపీలోని బరేల్లీలోని ప్రాంతానికి చెందిన ఓ ఎనిమిదేళ్ల బాలిక పాము కాటుకు గురైంది. దీంతో ఆమెను స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స కోసం ఐసీయూలోకి బాలికను తరలించారు. అదే రోజు రాత్రి ఆస్పత్రిలో పనిచేసే ఓ వ్యక్తి, మరో నలుగురు గుర్తుతెలియని వ్యక్తులు ఐసీయూలోకి చొరబడి బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయాన్ని ఎవరికి చెప్పొద్దని బాలికను బెదిరించి వెళ్లిపోయారు. మరుసటి రోజు ఆ బాలికను జనరల్ వార్డుకి తరలించారు. అనంతరం బాలికి ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆస్పత్రికి చేరుకొని బాలికను విచారించి కేసు నమోదు చేసుకున్నారు. ఆస్పత్రికి చెందిన సిబ్బంది ఒకరు, మరో నలుగురిపై కేసు నమోదు చేశామని, దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు. -
15 ఏళ్ల బాలికని అంబులెన్స్‌లో..
లాహోర్ : పాకిస్తాన్లో దారుణం చోటు చేసుకుంది. మానస్థితి సరిగా లేని ఓ 15ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు అంబులెన్స్ ఉద్యోగులు. పోలీసుల కథనం ప్రకారం.. గురుద్వారా నగరానికి చెందిన మానసిక స్థితి సరిగా లేని బాలిక(15) గత శనివారం అదృశ్యమయింది. దీంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులతో పాటు బాలిక బంధువులు వెతకడం ప్రారంభించారు. కాగా బాలిక ఇంటికి రెండు కిలోమీటర్ల దూరంలో రోడ్డుపై ఉన్న ఒక అంబులెన్స్ నుంచి బాలిక ఏడుపులు వినిపించడంతో అక్కడి వెళ్లి చూశారు. వీరి రాకను గమనించిన దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. అపస్మారక స్థితిలో పడిఉన్న బాలికను వెంటనే ఆస్పత్రికి తరలించారు. తన కూతురిపై ఇద్దరు అంబులెన్స్ ఉద్యోగులు అత్యాచారానికి పాల్పడ్డారని బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన కూతురిని కిడ్నాప్ చేసి అత్యాచారానికి ఒడిగట్టారని ఫిర్యాదులో తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితులను అరెస్ట్ చేశారు. నిందితులు ప్రభుత్వ అంబులెన్స్ ఉద్యోగులైన అహ్సాన్ అలీ, సమీన్ హైదర్‌గా గుర్తించామని పోలీసులు తెలిపారు. -
ఉరిశిక్ష నేరానికా, నేరస్తుడికా?
రెండు రోజుల క్రితం లోక్‌సభ ఆమోదంతో చిన్నపిల్లలపై అత్యాచారాలు మరణదండన పరిధిలోకి వచ్చాయి. పసిమొగ్గలపై అత్యాచారాలు మన గుండెల్ని రగిల్చివేస్తున్నాయి. కానీ ఈ ఉరిశిక్షలతో ఈ ఘోరాలన్నింటికీ చరమగీతం పాడగలమా? అనేది మనమంతా వేసుకోవాల్సిన ప్రశ్న. శిక్షలు నేరాలను నివారించాలేగాని నేరస్తుడిని నిర్మూలించకూడదు. ఉరిశిక్ష విధిస్తారన్న భయం ఉంటే నేరం చేయరనే అభిప్రాయం చాలా మందిలో ఉంది. కానీ మనుషులను చంపితే ఉరిశిక్ష వేస్తారన్న భయం కారణంగా హత్యలు ఆగిపోవడం లేదు. పైగా ఒక వ్యక్తి జీవించే హక్కుని హరించే అధికారం ప్రభుత్వానికి అసలు ఉండకూడదు. భారతదేశంలో మరణ శిక్షలను బీఆర్ అంబేడ్కర్ నిర్ద్వంద్వంగా వ్యతిరేకిం చారు. స్వాతంత్య్రానికి పూర్వం నుంచీ ఇంకా చెప్పా లంటే భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌కు ఉరిశిక్షలు విధించినప్పటి నుంచి మరణశిక్షపై మన చట్టసభల్లో అనేక చర్చలు జరిగాయి. అనేక వాదనలూ వచ్చాయి. 7 దశాబ్దాల కాలంలో మన పాలకుల్లో పెద్దగా మార్పు రానప్పటికీ ఇతర సమాజాల్లో ఉరి శిక్షలపై ఎంతో విలువైన పరిణతి కనిపిస్తోంది. ప్రపం చవ్యాప్తంగా 136 దేశాల్లో ఉరిశిక్ష రద్దుచేశారు. దుర దృష్టవశాత్తూ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా విరా జిల్లుతోన్న మన దేశంలో మాత్రం ఉరిశిక్షలు విధించే నేరాల జాబితాలో సరికొత్తవి జోడిస్తూ పోతున్నారు. దాని పర్యవసానమే మొన్న చిన్నారులపై అత్యాచా రాలకు మరణశిక్ష విధించడానికి వీలు కల్పించే బిల్లుకు లోక్‌సభతో ఆమోదముద్ర వేయించుకో వడం. ఈ వ్యాసం మొత్తం ఉరిశిక్షలను గురించే చర్చి స్తుంది తప్ప నేరాన్ని గురించి కాదు. ఎందుకంటే కుల, మత, ప్రాంత, లింగ, వర్గ వివక్షలతో నిండిన మన దేశంలో నేరం వేరు. శిక్ష వేరు. ఉరిశిక్షపై మళ్లీ చర్చ జమ్మూ కశ్మీర్‌లోని కఠువాలో ఎనిమిదేళ్ల పసి మొగ్గని చిదిమేసిన సామూహిక అత్యాచార, హత్యా ఘటన మన దేశాన్నే కాదు యావత్ ప్రపంచాన్నే ఉలిక్కి పడేలా చేసింది. ‘కుడిచేయి ఏదో ఎడమచేయి ఏదో తేడాయే తెలియని నా కూతురికి హిందువెవరో, ముస్లింలెవ్వరో ఎలా తెలుస్తుంది? వాళ్లు ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటే ఇంకెవరినైనా ఎంచుకోవా ల్సింది’ అని కఠువా ఘటనలో బలైన ఎనిమిదేళ్ల బాలిక తండ్రి అన్న మాటలివి. ‘మీ కూతురుకు హిందూ, ముస్లింలంటే ఎవరో తెలుసా?’ అని అడి గిన ప్రశ్నకి ఆ చిన్నారి తండ్రి ఇచ్చిన సమాధానమిది. ఉత్తర ప్రదేశ్‌లోని ఉన్నావ్ జిల్లాలో బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్సింగ్ సెంగార్ పదిహేడేళ్ల అమ్మా యిపై చేసిన అఘాయిత్యం ఆలస్యంగా వెలుగులోకి వచ్చినా రాజకీయాల్లోకి కుప్పలుతెప్పలుగా వచ్చిప డుతోన్న నేరస్తులనూ, నిరాఘాటంగా విరాజిల్లు తోన్న నేరప్రవృత్తినీ చెప్పకనే చెప్పింది. ఫిర్యాదు చేసిన మరునాడే బా«ధితురాలి తండ్రి లాకప్ డెత్ ఈ దేశంలో పేద, అణగారిన వర్గాలకు దొరుకుతున్న న్యాయం ఎలాంటిదో నిరూపించింది. ఈ రెండు ఘటనలూ దేశంలో మరోసారి ఉరిశిక్షల అంశాన్ని తెరపైకి తెచ్చాయి. ప్రధానంగా అత్యంత కిరాతకంగా పసిమొగ్గను ఛిద్రం చేసిన కఠువా ఘటన మైనర్ల అత్యాచార కేసుల్లో మరణ దండన విధించాలన్న డిమాండ్‌ని ముందుకు తెచ్చింది. రెండు రోజుల క్రితం లోక్‌సభ ఆమోదంతో చిన్నపిల్లలపై అత్యాచా రాలు మరణదండన పరిధిలోకి వచ్చాయి. పసిమొగ్గ లపై అత్యాచారాలు మన గుండెల్ని రగిల్చివేస్తు న్నాయి. సామాజిక సంక్షోభానికివి అద్దం పడుతు న్నాయి. కానీ ఈ ఉరిశిక్షలతో ఈ ఘోరాలన్నింటికీ చరమగీతం పాడగలమా? అనేది ప్రశ్న. ఉరిశిక్షలపై చర్చించిన సందర్భాలు... 1947 నుంచి 1949 వరకు జరిగిన రాజ్యాంగ సభలో చర్చ సందర్భంగా తెరపైకి వచ్చిన ఉరిశిక్షలపై రాజ్యాంగ రచనా కమిటీ ఛైర్మన్ బి.ఆర్. అంబేడ్కర్, ‘ఉరిశిక్షల రద్దుకే నా ఓటు’ అని స్పష్టంగా పేర్కొ న్నారు. అహింసను బోధించి ఆచరించే ఈ దేశ సంస్కృతికి మరణశిక్షల రద్దు సరిగ్గా సరిపోతుందని ఆయన వ్యాఖ్యానించారు. ఒక వేళ కింది కోర్టులు ఉరిశిక్షలు విధిస్తే పై కోర్టుకు వెళ్లే వీలు ఉంటుంది కదా అన్న వాదనను సైతం తిరస్కరిస్తూ అంబేడ్కర్ పైవిధంగా స్పందించారు. అంతకు ముందు అంటే 1931లో భగత్‌సింగ్, రాజ్గురుల ఉరితీత సంద ర్భంగా ఉరిశిక్షల రద్దు మన దేశంలో తొలిసారిగా చర్చనీయాంశం అయింది. సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో బిహార్ నుంచి ఎంపికైన బాబూ గయా ప్రసాద్ ఇండియన్ పీనల్ కోడ్(ఐపీసీ)ను సవరించి ఉరిశిక్ష రద్దు చేయాలని ప్రయత్నించి విఫలమ య్యారు. తీర్మానం వీగిపోగా 1931 మార్చి 23న భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌ను ఉరితీశారు. ఏడాది తర్వాత కరాచీలో మరణశిక్షకు వ్యతిరేకంగా కాంగ్రెస్ తీర్మానం చేసింది. రాజ్యంగ రచన సంద ర్భంగా జరిగిన చర్చలో అంబేడ్కర్ మరణశిక్షపై తన అభిప్రాయాన్ని స్పష్టం చేశారు. 1952–54 మధ్య కాలంలో లోక్‌సభలో మరణశిక్ష రద్దు ప్రస్తావనకు వచ్చింది. సెక్షన్ 302 ఐపీసీ సవరణకు కాంగ్రెస్ సభ్యులు ఎంఏ కాజ్మీ బిల్లు ప్రతిపాదించిన సంద ర్భంగా ఇది చర్చనీయాంశం అయింది. 1956లో లోక్‌సభలో కాంగ్రెస్ సభ్యుడు ముకుంద్‌లాల్ అగ ర్వాల్ మరణశిక్ష రద్దుకు బిల్లు ప్రవేశపెట్టారు. దీనిపై చర్చ జరిగాక అది వీగిపోయింది. 1958లో పృథ్వీ రాజ్ కపూర్ రాజ్యసభలో మరణ శిక్ష రద్దు కోరుతూ బిల్లు ప్రవేశపెట్టారు. చర్చ జరిగాక బిల్లును ఉపసం హరించారు. 1961లో ఇదే తరహా బిల్లును రాజ్యస భలో సావిత్రీ దేవి నికమ్ ప్రవేశపెట్టగా, చర్చ జరి గాక దాన్ని సభ తిరస్కరించింది. 1962లో లోక్ సభలో రఘునాథ్ సింగ్ ప్రవేశపెట్టిన మరణశిక్ష రద్దు బిల్లు తీవ్ర కలకలం సృష్టించింది. ఈ బిల్లుపై జరిగిన చర్చ వివరాలను లా కమిషన్ పరిశీలనకు పంపిస్తా మని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చాకే బిల్లును ఉప సంహరించారు. ‘హత్య ఎవరు చేసినా హత్యే. అది వ్యక్తులు చేసినా, రాజ్యం చేసినా. ఇంకా చెప్పాలంటే చట్టబద్ధంగా మనిషిని చంపితే అది హత్య కాకుండా పోదు’ అనేదే ఈ బిల్లులపై జరిగిన చర్చల్లో మరణ శిక్షను వ్యతిరేకించిన సభ్యుల అభిప్రాయం. పరిస్థితుల ప్రభావంతోనే నేరాలు వ్యక్తి చేసే నేరం చుట్టూ ఉన్న పరిస్థితులపై ఆధా రపడి ఉంటుంది. ఆయా సామాజిక పరిస్థితులపైనా, విలువలపైనా ఆధారపడి ఉంటుంది. అది సామా జికమైన వ్యక్తిగత అంశం. కానీ రాజ్యం తన ప్రజల రక్షణకు కొన్ని నియమాలను రూపొందించుకున్న రాజ్యాంగబద్ధ వ్యవస్థ. ఇక్కడ వ్యక్తిగత అభిప్రాయా లకూ, భావావేశాలకూ తావుండకూడదు. ప్రతీకారా నికి చోటుండకూడదు. కానీ ఉరిశిక్షలో న్యాయం ప్రతీ కారంలా కనిపిస్తుంది. ఒక వర్గంపై, మన దేశంలో నైతే ఒక మతంపై, ఒక కులంపై లేదా ఒక జెండర్‌పై ఇంకా చెప్పాలంటే అసమానతలకు తావున్న చోటల్లా ఈ ప్రతీకారం బుసలు కొడుతుంది. నిజానికి అదే ప్రతీకారేచ్ఛ అత్యాచారాలకూ కారణమౌతోంది. అదే ప్రతీకారం ఉరిశిక్షలకూ కారణమవుతోంది. ఇది అత్యంత సంక్లిష్టంగా తోస్తోంది. రాజ్యం చేయాల్సిన పని తన ప్రజలను కాపాడుకోవడం. కానీ తన ప్రజ లను తానే చంపుకోవడం న్యాయంగా మారకూడదు. పంటికి పన్ను, కంటికి కన్ను అన్నట్టు మనిషిని చంపి నట్టు రుజువైతే మిమ్మల్ని కూడా చంపే హక్కు రాజ్యానికుంది అని చెప్పడమంటేనే రాజ్యం కక్షసా ధింపునకు దిగడం అని అర్థం. మానవ మనుగడకు ప్రతిబంధకంగా తయారయ్యే ఉరిశిక్ష మధ్యయుగాల నాటి ఆటవిక లక్షణం తప్ప మరొకటి కాదన్నది ఇప్ప టికే అనేకమంది తేల్చి చెప్పారు. ఫలితంగా, అనేక ప్రజాస్వామ్య దేశాల్లో మరణ శిక్షను రద్దు చేశారు. నేరాలు ఎవరు చేస్తున్నారు? ఎందుకు నేరాలు జరు గుతున్నాయి? అనే విషయాలు చర్చించుకున్నాం. నేరం చేసే వ్యక్తిపై సమాజం ప్రభావం ఎప్పుడూ ఉంటుంది. అయితే శిక్షలు ఎవరికి అన్నదే ప్రశ్న. మరణశిక్షలు అమలైన వారిపై అధ్యయనం చేయగా, వారిలో 76 శాతం దళితులు, ఆదివాసీలే ఉన్నారని తేలింది. 2015లో లా కమిషన్ సారథ్యంలో హైదరా బాద్‌కు చెందిన నల్సార్ యూనివర్సిటీ విద్యార్థులు ఉరిశిక్షలు పడిన 373 కేసులను పరిశీలించారు. వారిలో మూడొంతుల మంది దళితులేనని స్పష్ట మయింది. మరణ దండన పడుతున్నవారిలో 93.5 శాతం మంది అత్యంత పేదలూ, దళితులూ, ఆది వాసీలూ, మైనారిటీలేనని ఈ సర్వే తేల్చి చెప్పింది. భారత లా కమిషన్ మాజీ ఛైర్మన్ జస్టిస్ ఎ.పి. షా మరణశిక్ష రద్దుచేయాలనే ప్రతిపాదనను సుప్రీంకోర్టు ఎదుట ఉంచే ప్రయత్నంలో భాగంగా ఈ సర్వే జరి గింది. మన దేశంలో రాష్ట్రపతి ఒక్కరే ఉరిశిక్షలు పడిన వారికి క్షమాభిక్ష పెట్టగలరు. తమకు అందిన క్షమాభిక్ష దరఖాస్తులు అన్నింటినీ తిరస్కరించిన రాష్ట్రపతులు శంకర్‌దయాళ్ శర్మ, ఆర్.వెంకట్రా మన్, ప్రణబ్. తనకొచ్చిన అన్ని క్షమాభిక్ష దరఖాస్తు లకూ మానవతా దృక్పథంతో సానుకూలంగా స్పందించినవారు కె.ఆర్.నారాయణన్, ప్రతిభాపా టిల్. ఏపీజే అబ్దుల్ కలామ్ ఏకంగా, మరణ దండ నను రద్దు చేయాలని భావించారు. 2012 జూలై 25 నుంచి ప్రణబ్ రాష్ట్రపతిగా ఉన్న 27 నెలల కాలంలో మొత్తం 23 క్షమాభిక్ష కోరుతూ అభ్యర్థనలు వస్తే అందులో 22 దరఖాస్తులను తిరస్కరించినట్టు తెలు స్తోంది. అలాగే శంకర్ దయాళ్ శర్మ సైతం మొత్తం 14 క్షమాభిక్ష పిటిషన్లు తిరస్కరించారు. ఆర్. వెంక ట్రామన్ 33 అభ్యర్థనలను జైల్‌సింగ్ 20 క్షమాభిక్షల పిటిషన్లు తిరస్కరించారు. ఎందుకు మరణశిక్షను వ్యతిరేకించాలి? సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా గొప్ప తీర్పులిచ్చిన వీఆర్ కృష్ణయ్యర్ మరణ శిక్షలను మొదటి నుంచీ వ్యతిరేకించారు. 1957–59 మధ్య కేరళ ఈఎంఎస్ నంబూద్రిపాద్ ప్రభుత్వంలో ఆయన న్యాయశాఖ మంత్రిగా పనిచేశారు. జస్టిస్ అయ్యర్ జడ్జి అయ్యాక తన ఆలోచనలను ఆచరణలో చేసి చూపించారు. సుప్రీంకోర్టు బెంచ్‌ల సభ్యుడిగా ఉండగా తన పరి శీలనకు వచ్చిన మూడు కేసులను విచారించి, దోషు లకు కింది కోర్టులు విధించిన మరణ శిక్షలను జీవిత ఖైదు శిక్షలుగా మార్చారు. శిక్షలు నేరాలను నివారిం చాలేగాని నేరస్తుడిని నిర్మూలించకూడదు. ఉరిశిక్ష విధిస్తారన్న భయం ఉంటే నేరం చేయరనే అభి ప్రాయం చాలా మందిలో ఉంది. కానీ మనుషులను చంపితే ఉరిశిక్ష వేస్తారన్న భయం కారణంగా హత్యలు ఆగిపోవడం లేదు. హత్య చేసినందుకు దోషిని ఉరి తీస్తే పోయేది మరో ప్రాణమే. మనిషిని వ్యక్తి చంపినా, రాజ్యం చంపినా అది మానవ హక్కుల ఉల్లంఘనే అవుతుంది. ఒక వ్యక్తి జీవించే హక్కుని హరించే అధికారం ప్రభుత్వానికి ఉండ కూడదు. మల్లెపల్లి లక్ష్మయ్య , వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు మొబైల్ : 97055 66213 -
బాలికను గదిలోకి లాక్కెళ్లి.. ఆర్ఎంపీ అకృత్యం
సాక్షి, కృష్ణా : పదమూడేళ్ల బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడో ఆర్ఎంపీ వైద్యుడు. ఈ సంఘటన సోమవారం ఉదయం కృష్ణాజిల్లా ఉయ్యూరులో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ప్రకాశం జిల్లా కందుకూరుకు చెందిన షేక్ మొహిద్దీన్ కృష్ణాజిల్లా ఉయ్యూరు తోట్లవల్లూరు రోడ్డులో ఆర్ఎంపీ వైద్యునిగా సేవలందిస్తున్నాడు. సోమవారం ఉదయం 8.30గంటల ప్రాంతంలో 8వ తరగతి చదివే ఓ బాలిక యకమురు స్కూల్‌కు వెళుతుండగా మొహిద్దీన్ తన ఆస్పత్రి గదిలోకి బలవంతంగా లాక్కువెళ్లాడు. ఎంతసేపటికి బాలిక బయటకు రాకపోవటంతో స్థానికులకు అనుమానం వచ్చింది. ఆర్ఎంపీ వైద్యుని గదిలోకి వెళ్లి చూడగా.. అతడు దుస్తులు లేకుండా ఉన్నాడు. స్థానికులు అతన్ని నిలదీయటంతో పొంతనలేని సమాధానాలు చెప్పాడు. దీంతో ఆగ్రహించిన స్థానికలు అతనికి దేహశుద్ది చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని అతన్ని ఉయ్యూరు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
బాలికల పాఠశాలలో చొరబడి..
సాక్షి, విజయవాడ : విజయవాడలోని ఓ బాలికల పాఠశాలలో దారుణం చోటుచేసుకుంది. గుర్తుతెలియని వ్యక్తి తరగతి గదిలోకి దూరి విద్యార్థిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారు. బాలికకు న్యాయం చేయాలని బంధువుల ఆందోళన చేయడంతో ఆలస్యంగా విషయం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. నగరంలోని బిషప్ అజరయ్య బాలికల పాఠశాలలోకి బుధవారం ఓ ఆగంతకుడు పదో తరగతి గదిలోకి అకస్మాత్తుగా దూరాడు. అనంతరం క్లాస్‌రూంలో ఉన్న ఓ విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో భయానికి గురైన ఆ బాలిక పాఠశాల మొదటి అంతస్తు నుంచి దూకింది. ఈ విషయాన్ని గమనించిన పాఠశాల యాజమాన్యం బాలికను వెంటనే దగ్గరలోని ఓ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాలిక పరిస్థితి నిలకడగా ఉన్నట్లు డాక్టర్లు పేర్కొన్నారు. -
క్రీడాకారిణిపై కోచ్ అఘాయిత్యం
చండీగఢ్ : తనపై కోచ్ రెండున్నరేళ్ల నుంచి అత్యాచారం చేస్తున్నాడంటూ ఓ వాలీబాల్ క్రీడాకారిణి ఫిర్యాదు చేయడం హరియాణాలో కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హరియాణాలోని రివారీ గ్రామానికి చెందిన ఓ మైనర్ బాలిక వాలీబాల్ జట్టు తరపున ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఆమెపై కన్నేసిన కోచ్ గౌరవ్ దేశ్వాల్ గత రెండున్నరేళ్లుగా అనేక సార్లు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని బయట ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించడంతో ఆమె మౌనంగా ఉన్నారు. తన భవిష్యత్తు దృష్ట్యాలో ఉంచుకొని ఆ బాలిక ఇన్ని రోజులు వేధింపులను భరించారు.. అయితే ఇటీవలే కోచ్ నుంచి వేధింపులు ఎక్కువ కావడంతో క్రీడాకారిణీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. గుర్గావ్, రోహతక్‌తో పాటు పలు ప్రాంతాలకు తనను తీసుకెళ్లి అత్యాచారం చేశాడని ఫిర్యాదులో పేర్కొంది. గౌరవ్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు.. అతనిని ఇంత వరకు అరెస్ట్ చేయలేదు. దీనిపై వివరణ కోరగా.. విచారణ పూర్తయిన తర్వాత కోచ్‌ను అరెస్ట్ చేస్తామని తెలిపారు. -
పోర్న్ వీడియో చూసి ఐదుగురు బాలురు..
డెహ్రడూన్ : ఉత్తరాఖండ్‌లో దారుణం చోటు చేసుకుంది. పోర్న్ వీడియోలు చూసి 9 నుంచి 14 ఏళ్ల మధ్య వయసున్న ఐదుగురు బాలురు 8 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. మొబైల్ ఫోన్లో రెండు రోజులపాటు పోర్న్ వీడియో చూసిన బాలురు ఆ తర్వాత చిన్నారిని ఓ ఇంట్లోకి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. డెహ్రాడూన్‌లోని సాహస్‌పూర్‌లో గురువారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సాహస్పూర్ చెందిన ఐదుగురు బాలురు, అక్కడే ఉన్న బాలికను ఆడుకుందామని నమ్మించి ఓ స్నేహితుడి ఇంట్లోకి తీసుకెళ్లి ఈ దుర్మార్గానికి పాల్పడ్డారని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనకు రెండు రోజుల ముందు ఫోన్లో పోర్న్ వీడియోలు చూసినట్లు నిందితుల్లో ఒకడైన బాలుడు తెలిపారన్నారు. అనంతరం బాలికపై అత్యాచారానికి ఒడిగట్టినట్లు విచారణలో తేలిందన్నారు. నిందితులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి బాల్య గృహంకు తరలించినట్లు పోలీసులు పేర్కొన్నారు. -
13 ఏళ్ల బాలికపై 17మంది కామాంధులు..
-
చెన్నైలో మృగాళ్లు
చెన్నై: వినికిడి లోపం ఉన్న 11 ఏళ్ల బాలికకు మత్తుమందులు ఇచ్చి 7 నెలలపాటు అనేక మంది పలుమార్లు అత్యాచారం చేసిన దారుణ సంఘటన చెన్నైలో జరిగింది. ఈ కేసులో 17 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వారిని మంగళవారం కోర్టుకు తీసుకురాగా న్యాయవాదులే మూకుమ్మడిగా నిందితులపై దాడి చేశారు. నిందితుల తరఫున ఏ లాయరూ వాదించరని న్యాయవాదుల సంఘం తేల్చి చెప్పింది. కోర్టు నిందితులకు జూలై 31 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. చెన్నైలోని అయణవరం ప్రాంతంలో ఉన్న ఓ అపార్టుమెంటులో బాలిక నివసిస్తోంది. అదే అపార్టుమెంటులో పనిచేస్తున్న లిఫ్ట్ ఆపరేటర్, సెక్యూరిటీ గార్డు, ప్లంబర్, ఎలక్ట్రీషియన్ సహా పలువురు నిర్వహణ సిబ్బంది బాలికపై అఘాయిత్యానికి ఒడిగట్టారని పోలీసులు తెలిపారు. 7వ తరగతి చదువుతున్న ఈ బాలికపై అత్యాచారం చేసే ముందు నిందితులు ఆమెకు మత్తు ఇంజెక్షన్లు ఇవ్వడం, మత్తు పదార్థాలు కలిపిన శీతల పానీయాలను తాగించడం, పొడి రూపంలో ఉన్న మాదక ద్రవ్యాలను ముక్కుతో పీల్చేలా చేసేవారని వెల్లడించారు. బాలికపై దారుణానికి పాల్పడుతూ వీడియోలు కూడా తీశారన్నారు. తొలుత లిఫ్ట్ ఆపరేటర్ బాలికపై అత్యాచారానికి పాల్పడగా, ఆ తర్వాత పలువురు అతనికి జత కలిసి 7 నెలల పాటు ఆమెను హింసించారని పోలీసులు చెప్పారు. ఈ విషయాన్ని బాలిక తన అక్కకు చెప్పడంతో ఆమె తల్లిదండ్రులకు తెలియజేసింది. దీంతో బాలిక తండ్రి ఈ నెల 15న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ‘11 మంది తనపై అత్యాచారం చేశారని అమ్మాయి చెప్పింది. వారికి సహకరించిన మరో ఆరుగురిని కూడా కలిపి మొత్తం 17 మందిని అరెస్టు చేశాం’ అని పోలీసులు చెప్పారు. దీన్ని ప్రత్యేకమైన కేసుగా పరిగణించి విచారణ చేస్తున్నామన్నారు. నిందితులపై లాయర్ల దాడి నిందితులందరినీ మంగళవారం పోలీసులు మహిళా కోర్టులో ప్రవేశపెట్టినప్పుడు అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పోలీసులు నిందితులను కోర్టు నుంచి బయటకు తీసుకొస్తుండగా అక్కడ ఉన్న దాదాపు 50 మంది న్యాయవాదులు వారిపై మూకుమ్మడిగా దాడి చేశారు. దీంతో నిందితులను రెండు గదుల్లో ఉంచి పోలీసులు రక్షణ కల్పించారు. లాయర్లకు భయపడి దాదాపు 5 గంటలు వారంతా ఆ గదుల్లోనే ఉన్నారు. రాత్రి ఏడున్నర గంటల ప్రాంతంలో లాయర్లు శాంతించడంతో నిందితులను కస్టడీకి తరలించారు. -
హర్యానాలో దారుణం
సాక్షి,చండీఘర్ : మైనర్ బాలికలపై లైంగిక దాడులు, హత్యాకాండలకు బ్రేక్ పడటం లేదు. తాజాగా హర్యానాలోని మెవాత్‌లో ఓ 17 ఏళ్ల బాలికను అపహరించి 8 మంది లైంగిక దాడికి పాల్పడ్డారనే ఆరోపణల నేపథ్యంలో బాలిక ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వెలుగుచూసింది. నౌ జిల్లాలోని మారుమూల ప్రాంతంలో అపస్మాకరస్థితిలో పడిఉన్న బాలికను పోలీసులు గుర్తించారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సోమవారం బాలిక ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో రెండు మోటార్ బైక్‌లు, కారులో వచ్చిన నిందితులు ఆమెను అపహరించారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాధితురాలి తండ్రి పేర్కొన్నారు. బాలికపై సామూహిక లైంగిక దాడికి పాల్పడిన అనంతరం స్పృహకోల్పోయిన స్థితిలో ఆమెను వదిలివేసిన నిందితులు ఘటనాస్థలం నుంచి పరారయ్యారు. అపస్మారకస్థితిలో బాలికను గుర్తించి ఇంటికి తీసుకువచ్చిన పోలీసులు ఆమెను తల్లితండ్రులకు అప్పగించారు. అయితే తీవ్ర మనస్థాపానికి గురైన బాలిక ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. నిందితులను బాలిక గుర్తించిందని, వారు గతంలోనూ తమ కుమార్తె వెంటపడ్డారని బాధితురాలి తండ్రి ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారని మెవాట్ ఎస్పీ నంజీన్ భాసిన్ చెప్పారు. -
ఇద్దరు అమ్మాయిలు లైంగికంగా వేధించారు
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో అఘాయిత్యాలు నిత్యకృత్యమయ్యాయి. పశ్చిమ ఢిల్లీలోని మోతీనగర్‌లో ఓ స్కూల్లో ఇద్దరు అమ్మాయిలు కలసి జూనియర్ విద్యార్థిని కొన్ని నెలల పాటు లైంగికంగా వేధించారు. చివరకు బాధితురాలు (7) ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పగా, అమ్మాయి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇద్దరు నిందితుల్లో ఒక మైనర్ అమ్మాయి ఉంది. ఈ అమ్మాయి ఆచూకీ తెలియరాలేదు. పోలీసులు మరో నిందితురాలిని అరెస్ట్ చేశారు. స్కూల్లో భోజన విరామ సమయంలో సీనియర్ అమ్మాయిలు.. బాధితురాలిని ఖాళీ గదిలోకి తీసుకెళ్లి అసభ్యకరంగా ప్రవర్తించేవారు. బాధితురాలు అడ్డుచెబితే వారు భయపెట్టేవారు. దుస్తులు విప్పేసి అసహజ కార్యకలాపాలకు పాల్పడేవారు. బాధితురాలిని తండ్రి ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయించిన అనంతరం కౌన్సిలింగ్ ఇప్పించారు. బాధితురాలితో పాటు కుటుంబ సభ్యులకు, స్కూల్ విద్యార్థులకు నిపుణులు కౌన్సిలింగ్ ఇవ్వనున్నారు. -
సెకండ్ షో అని చెప్పి.. అఘాయిత్యం
రాజవమ్మంగి: సెకండ్ షో సినిమాకని నమ్మించి తీసుకెళ్లి మైనర్ బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన సంఘటన తూర్పుగోదావరి జిల్లాలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. జిల్లాలోని రాజవమ్మంగి శివారు కన్నయ్యమ్మపేటకు చెందిన లోవరాజు(21) ఇంటి సమీపంలోని ఓ బాలికను(12) శుక్రవారం సెకండ్ షో సినిమాకు తీసుకెళ్లాడు. సినిమా మధ్యలోనే పని ఉంది త్వరగా ఇంటికెళ్లాలని బాలికతో చెప్పాడు. దీనికి సరెనన్న బాలికను ఇంటికి తిరిగి తీసుకొస్తూ.. ఆమె పై లైంగిక దాడికి పాల్పడ్డాడు. భయాందోళనకు గురైన బాలిక ఏడ్చుకుంటూ ఇంటికి వచ్చింది. తల్లిదండ్రులు ఏం జరిగిందని ప్రశ్నించడంతో అసలు విషయం బయటపడింది. ఈ విషయం పై అర్ధరాత్రి బాధితురాలి తల్లిదండ్రులు రాజవమ్మంగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు బాలికను చికిత్స నిమిత్తం సమీపంలోని పీహెచ్‌సీకి తరలించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడికి ఇదివరకే పెళ్లి అయినట్లు సమాచారం. -
విద్యార్థినిని వేధించి... విషం తాగించారు
తొమ్మిదో తరగతి విద్యార్థిని శారీరకంగా హింసించమే కాకుండా విషం తాగించి ఆమె మృతికి కారణమైయ్యారు నలుగురు యువకులు. ఆ ఘటన ఉత్తరప్రదేశ్ వారణాసిలో చోటు చేసుకుంది. రోహనియా పోలీసు స్టేషన్ పోలీసుల కథనం ప్రకారం... తొమ్మిదేళ్ల బాలికపై ఆమె ప్రియుడు,అతడి ముగ్గురు స్నేహితులు శారీరకంగా హింసించారు. అనంతరం విషం తాగించారు. దాంతో బాలిక ఆపస్మారక స్థితికి చేరుకుంది. బాలికను నడిరోడ్డుపై పడేసి నిందితులు పరారైయ్యారు. స్థానికులు వెంటనే స్పందించి ఆమె తల్లితండ్రులకు సమాచారం అందించారు. బాలిక తల్లితండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలించగా... ఆమె ఆరోగ్యం విషమంగా ఉందని, మెరుగైన వైద్య చికిత్స కోసం పెద్ద ఆసుపత్రికి తరలించాలని వైద్యులు సూచించారు. దాంతో ఆమెను పెద్ద ఆసుపత్రికి తరలించారు. ఆమె వాంగ్మూలాన్ని శుక్రవారం మేజిస్ట్రేట్ తీసుకున్నారు. బాలిక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం మరణించింది. ఈ కేసులో ఆమె ప్రియుడు శైలేందర్‌ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. మిగిలిన నిందితుల కోసం గాలింపు చర్యలు తీవ్ర తరం చేసినట్లు చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.