
లక్నో : ఉత్తరప్రదేశ్‌లో దారుణం చోటు చేసుకుంది. అభంశుభం తెలియని ఓ 8 ఏళ్ల చిన్నారిపై బంధువుల డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన బారబంకి జిల్లాలో శనివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బారబంకి జిల్లాకు చెందిన ఓ 8 ఏళ్ల చిన్నారి ఇంటికి శనివారం సాయంత్రం బంధువులు వచ్చారు. వారి వెంట కారు డ్రైవర్ కూడా ఉన్నాడు. బంధువులు అంతా ఇంట్లో మాట్లాడుతుండగా.. చిన్నారి ఇంటి బయట ఆడుకుంటోంది. అక్కడే ఉన్న డ్రైవర్(26) చిన్నారి దగ్గరకి వెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు.
చిన్నారి గట్టిగా అరవడంతో బంధువులు, తల్లిదండ్రులు బయటకు వచ్చి చూడగా.. చిన్నారి అపస్మారక స్థితిలో పడిఉంది. అక్కడే ఉన్న డ్రైవర్‌పై అనుమానం వచ్చి నిలదీయగా..అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించాడు. వారు అతన్ని పట్టుకొని పోలీసులకు అప్పజెప్పారు. నిందితుడిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment