
నోయిడా : ఒకవైపు ప్రపంచమంతా కరోనా కల్లోలంతో భయకంపితులవుతున్న వేళ ఉత్తరప్రదేశ్‌లో మరో దారుణం చోటు చేసుకుంది. 8 ఏళ్ల బాలికపై 19 ఏళ్ల యువకుడు అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బీహార్‌కు చెందిన జీతూ(19) అనే యువకుడు తల్లిదండ్రులతో కలిసి నోయిడాలోని సాలాపూర్‌లో నివాసం ఉంటున్నారు. అతని మేనమామ కూడా సాలాపూర్‌లోనే నివాసం ఉంటున్నారు. మేనమామ కూతురిపై కన్నేసిన జీతూ.. శనివారం బాలికకు మాయమాటలు చెప్పి నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం ఆమెను తీవ్రంగా కొట్టి అక్కడ నుంచి పరారయ్యాడు. తీవ్ర గాయాలతో పడి ఉన్న బాలికను గమనించిన స్థానికులు హుటా హుటిన ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం బాలిక మృతి చెందింది. యువకుడిపై అత్యాచార, హత్య కేసు నమోదు చేసి అరెస్ట్ చేశామని పోలీసులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment