విద్యార్థినిని వేధించి... విషం తాగించారు | GIRL 16-year-old molested, dies in hospital | Sakshi
Sakshi News home page

విద్యార్థినిని వేధించి... విషం తాగించారు

Published Sat, Apr 5 2014 2:23 PM | Last Updated on Sat, Sep 2 2017 5:37 AM

విద్యార్థినిని వేధించి... విషం తాగించారు

విద్యార్థినిని వేధించి... విషం తాగించారు

తొమ్మిదో తరగతి విద్యార్థిని శారీరకంగా హింసించమే కాకుండా విషం తాగించి ఆమె మృతికి కారణమైయ్యారు నలుగురు యువకులు. ఆ ఘటన ఉత్తరప్రదేశ్ వారణాసిలో చోటు చేసుకుంది. రోహనియా పోలీసు స్టేషన్ పోలీసుల కథనం ప్రకారం... తొమ్మిదేళ్ల బాలికపై ఆమె ప్రియుడు,అతడి ముగ్గురు స్నేహితులు శారీరకంగా హింసించారు. అనంతరం విషం తాగించారు. దాంతో బాలిక ఆపస్మారక స్థితికి చేరుకుంది. బాలికను నడిరోడ్డుపై పడేసి నిందితులు పరారైయ్యారు. స్థానికులు వెంటనే స్పందించి ఆమె తల్లితండ్రులకు సమాచారం అందించారు. బాలిక తల్లితండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

 

పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలించగా... ఆమె ఆరోగ్యం విషమంగా ఉందని, మెరుగైన వైద్య చికిత్స కోసం పెద్ద ఆసుపత్రికి తరలించాలని వైద్యులు సూచించారు. దాంతో ఆమెను పెద్ద ఆసుపత్రికి తరలించారు. ఆమె వాంగ్మూలాన్ని శుక్రవారం మేజిస్ట్రేట్ తీసుకున్నారు. బాలిక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం మరణించింది.  ఈ కేసులో ఆమె ప్రియుడు శైలేందర్ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. మిగిలిన నిందితుల కోసం గాలింపు చర్యలు తీవ్ర తరం చేసినట్లు చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement