సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ బాలిక అత్యాచారం కేసులో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. వక్ఫ్ బోర్డు ఛైర్మన్ కుమారుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో ముగ్గురు నిందితులు గోవాలో ఉన్నట్లు గుర్తించారు. వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. బాలిక అత్యాచారం ఘటనపై మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. తక్షణమే చర్యలు తీసుకోవాలని హోంమంత్రి, డీజీపీకి ఆదేశాలిచ్చారు. నిందితులు ఎవరైనా వదిలిపెట్టే ప్రసక్తి లేదని కేటీఆర్ అన్నారు.
చదవండి: పబ్‌కు వచ్చిన బాలికపై సామూహిక అత్యాచారం.. అసలేం జరిగింది?
కాగా, గత నెల 28న బంజారాహిల్స్ రోడ్ నెం.14లో నివసించే బాలిక (16) ఓ పార్టీకి హాజరయ్యేందుకు తన ఇంటి సమీపంలో ఉండే హాదీతో కలిసి ఆయన బెంజ్ కారులో (టీఎస్ 09 ఎఫ్‌ఎల్ 6460)లో అమ్నేషియా పబ్‌కు వెళ్లింది. సాయంత్రం 5 గంటల వరకు అక్కడే పార్టీ చేసుకున్నారు. అనంతరం పబ్ నుంచి బాలిక బయటకు వచ్చింది. బాలికను బలవంతంగా బెంజ్ కారులో తీసుకెళ్లి బంజారాహిల్స్ రోడ్ నంబర్ 14లో ఓ బేకరీ దగ్గరకు వెళ్లి ఆహారం కొనుగోలు చేశారు. అనంతరం కారును నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి.. కార్లోనే బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. తరువాత 7.30 నిమిషాల సమయంలో పబ్ వద్ద వదిలేసి వెళ్లారు. అనంతరం బాలిక ఫోన్ చేయడంతో తండ్రి వచ్చి ఆమెను ఇంటికి తీసుకెళ్లినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment