
లైంగిక వేధింపులతో ఆత్మహత్యకు పాల్పడిన బాలిక ఘటనపై సినీ నటుడు, మక్కల్ నీది మయ్యం నేత కమల్ హాసన్ స్పందించారు. మృతురాలు బాలిక ఆత్మహత్యకు కారకుడైన సదరు పాఠశాల ఉపాధ్యాయుడిని కఠింగా శిక్షించాలని సోషల్ మీడియా వేదికగా ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు కమల్ ట్వీట్ చేస్తూ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
చదవండి: ఓటీటీకి ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’, స్ట్రీమింగ్ ఎప్పుడంటే
బాలిక మృతికి కారకుడైన టీజర్‌కు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుని, ఇలాంటి ఘటనలు పునరావుతంగా కాకుండా తమిళనాడు ప్రభుత్వం అడ్డుకట్ట వేయాలని కమల్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. శుక్రవారం జరిగిన ఈ ఘటన తమిళనాడులో సంచలనం రేపింది. దీనిపై పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టి నిందితుడిని శిక్షించాలంటూ డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు సదరు పాఠశాల ఫిజిక్స్ టీజర్ మిథున్ చక్రవర్తిని ఆర్‌సీపురం పోలీసులు అరెస్టు చేసి పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అలాగే కళాశాల ప్రిన్సిపల్‌పై కూడా పోలీసులు పోక్సో కేసు నమోదు చేసినట్లు సమాచారం.
చదవండి: బిగ్‌బాస్ 5: శ్రీరామ్ చంద్రకు సజ్జనార్ మద్దతు, ఏమన్నారంటే..
Comments
Please login to add a commentAdd a comment