
ప్రతీకాత్మక చిత్రం
నర్సాపూర్ రూరల్ (మెదక్ జిల్లా): బాలికపై అత్యాచారం చేసిన సంఘటన నర్సాపూర్ పట్టణంలో శనివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నర్సాపూర్ ఐసీడీఎస్ సీడీపీఓ హేమ భార్గవి తెలిపిన వివరాల ప్రకారం.. నర్సాపూర్ పట్టణంలోని పోస్టాఫీస్ వీధిలో తొమ్మిదో తరగతి చదువుతున్న బాలిక(14)పై ఇదే వీధిలో నివసించే వరుసకు అన్న అయిన యువకుడు (22) కొన్ని నెలలుగా అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక గర్భం దాల్చడంతో విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు శనివారం బాలికతో కలిసి ఐసీడీఎస్ కార్యాలయానికి వచ్చి ఫిర్యాదు చేశారు. బాలికను ప్రస్తుతం చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సెక్టార్ (బాలికల సంరక్షణ కేంద్రం)కు అప్పగించనున్నట్లు సీడీపీఓ తెలిపారు. ఎస్‌ఐ గంగారాజ్‌ను వివరణ కోరగా ఫిర్యాదు అందలేదన్నారు. (నిజామాబాద్‌లో ప్రేమ జంట ఆత్మహత్య)
Comments
Please login to add a commentAdd a comment