narsapur rural
-
దారుణం : సోదరిపై కొన్ని నెలలుగా అత్యాచారం!
నర్సాపూర్ రూరల్ (మెదక్ జిల్లా): బాలికపై అత్యాచారం చేసిన సంఘటన నర్సాపూర్ పట్టణంలో శనివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నర్సాపూర్ ఐసీడీఎస్ సీడీపీఓ హేమ భార్గవి తెలిపిన వివరాల ప్రకారం.. నర్సాపూర్ పట్టణంలోని పోస్టాఫీస్ వీధిలో తొమ్మిదో తరగతి చదువుతున్న బాలిక(14)పై ఇదే వీధిలో నివసించే వరుసకు అన్న అయిన యువకుడు (22) కొన్ని నెలలుగా అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక గర్భం దాల్చడంతో విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు శనివారం బాలికతో కలిసి ఐసీడీఎస్ కార్యాలయానికి వచ్చి ఫిర్యాదు చేశారు. బాలికను ప్రస్తుతం చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సెక్టార్ (బాలికల సంరక్షణ కేంద్రం)కు అప్పగించనున్నట్లు సీడీపీఓ తెలిపారు. ఎస్ఐ గంగారాజ్‌ను వివరణ కోరగా ఫిర్యాదు అందలేదన్నారు. (నిజామాబాద్‌లో ప్రేమ జంట ఆత్మహత్య) -
ఉద్యమంలో కిషన్‌రెడ్డిది కీలకపాత్ర
సాక్షి, నర్సాపూర్: తండ్రిని ఎదిరించి టీఆర్ఎస్ జెండా పట్టి తెలంగాణ ఉద్యమంలో ముందున్న చిలుముల కిషన్‌రెడ్డి కుటుంబానికి అన్నివిధాల అండగా ఉంటామని మాజీ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. బుధవారం కౌడిపల్లిలో దివంగత టీఆర్ఎస్ నాయకుడు, కేంద్ర కార్మికశాఖ కనీస వేతనాల కమిటీ మాజీ చైర్మన్ చిలుముల కిషన్‌రెడ్డి ప్రథమ వర్ధంతిని భార్య సుహాసినిరెడ్డి, కొడుకు శేషసాయిరెడ్డి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీ ప్రభాకర్‌రెడ్డి, నర్సాపూర్, మెదక్ ఎమ్మెల్యేలు మదన్‌రెడ్డి, పద్మాదేవెందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ శేరిసుభాష్‌రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ హేమలత శేఖర్‌గౌడ్, మాజీ మంత్రి సునీతారెడ్డి, మాజీ ఎంపీ వివేక్, బీజేపీ నాయకులు రఘునందన్‌రావ్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి సమాధివద్ద పూలమాలవేసి నివాళులు అర్పించారు. సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ అతనిలేని లోటు తీరనిదని ఆత్మకు శాంతి కలగాలన్నారు. అతని కుటుంబానికి అన్నివిధాలా అండగా ఉంటామన్నారు. అనంతరం ఎంపీ కొత్తప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ కిషన్‌రెడ్డి మృతి నియోజకవర్గానికి టీఆర్ఎస్కి తీరనిలోటన్నారు. ఎమ్మెల్యే మదన్‌రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో తన గెలుపుకోసం తమ్ముడు కిషన్‌రెడ్డి ఎంతగానో కృషిచేశాడని తెలిపారు. మాజీ ఎంపీ వివేక్ మాట్లాడుతూ కిషన్‌రెడ్డి తన క్లాస్‌మెట్ అని అందరితో కలివిడిగా ఉండి ప్రజాసేవకు పాటుపడ్డ వ్యక్తి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మాజీ జిల్లా అధ్యక్షుడు మురళీధర్ యాదవ్, నాయకులు నరేంద్రనాథ్, బీజేపీ నియోజకవర్గ ఇన్చార్జి గోపి, స్థానిక ఎంపీపీ రాజు, జెడ్పీటీసీ కవిత అమర్‌సింగ్, ఏఎంసీ చైర్మన్ హంసీబాయ్, మండల సర్పంచ్‌లఫోరం అధ్యక్షుడు వెంకటేశ్వర్‌రెడ్డి, నాయకులు లక్ష్మీరవీందర్రెడ్డి, కృష్ణగౌడ్, దుర్గాగౌడ్, శెట్టయ్య, వివిధ మండలాల ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు నాయకులు పాల్గొన్నారు. స్వగృహంలో.. నర్సాపూర్: చిలుముల కిషన్‌రెడ్డి స్వగృహంలో ఏర్పాటు చేసిన ఆయన చిత్రపటానికి మాజీ మంత్రులు హరీశ్‌రావు, సునీతారెడ్డి, మెదక్ ఎంపీ కొత్త ప్ర భాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు చిలుములమదన్‌రెడ్డి, పద్మ, టీఆర్ఎస్ నాయకులు దేవేందర్‌రెడ్డి, మురళీధర్‌యాదవ్ తదితరులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కిషన్‌రెడ్డి భార్య సుహాసినిరెడ్డి, తనయుడు చిలిపిచెడ్ జెడ్పీటీసీ సభ్యుడు చిలుముల శేషసాయిరెడ్డిలను పరామర్శించారు. కాగా పలువురు స్థానిక నాయకులు ఆయనకు నివాళులు అర్పించారు. నివాళులు అర్పిస్తున్న మాజీ మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు ఇతర నాయకులు -
ప్రాణం తీసిన భూ వివాదం
సాక్షి, నర్సాపూర్‌రూరల్: భూవివాదంలో దాయదుల మధ్య ఘర్షనలో ఒకరు మృతి చెందిన సంఘటన నర్సాపూర్ మండలం రెడ్డిపల్లిలో బుధవారం రాత్రి జరిగింది. నర్సాపూర్ సిఐ సైదులు, ఎస్సై సందీప్‌రెడ్డిలు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రెడ్టిపల్లి గ్రామానికి చెందిన శివ్వన్నగారి శ్రీనివాస్‌గౌడ్ (43)పై భూవివాదంపై దాయదులు వీరగౌడ్, చంద్రకళ, నిఖిల్‌గౌడ్, మధుగౌడ్‌లు కలిసి దాడికి పాల్పడ్డారు. దీంతో శ్రీనివాస్‌గౌడ్ స్పృహాకోల్పోవడంతో అతన్ని స్థానికులు నర్సాపూర్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృత్యువాత పడ్డాడు. మృతుని తండ్రి సత్యగౌడ్ పిర్యాదు మేరకు బుధవారం కేసునమోదు చేసుకొన్నారు. గురువారం గ్రామంలో సంఘటన జరిగిన ప్రదేశంలో సీఐ సైదులు, ఎస్సై సందీప్‌రెడ్డిలు అన్ని కోణాలో విచారణ చేపట్టిన అనంతరం దాయదులు వీరగౌడ్, చంద్రకళ, నిఖిల్‌గౌడ్, మధుగౌడ్‌లు కలిసి శ్రీనివాస్‌గౌడ్‌ను కిందిపడేసి పిడిగుద్దులు గుద్దడంతోనే ప్రాణాలు వీడిచినట్లు తెలిపారు. శ్రీనివాస్‌గౌడ్ మృతదేహన్ని పరిక్షించిన వైద్యులు సైతం చాతి తదితతర బాగలో గుద్దులు తగలడంతోనే మృతిచెందినట్లు నిర్థారించినట్లు చెప్పారు. ఈమేరకు పై నలుగురిపై హత్య కేసు నమోదు చేసి శవానికి పోస్టుమార్టు నిర్వహించిన అనంతరం మృతదేహన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. సాయంత్రం నాలుగు గంటలకు మృతుడు శ్రీనివాస్‌గౌడ్ అంత్యక్రియలు నిర్వహించారు. భార్య గర్భిణి మృతుడు శ్రీనివాస్‌గౌడ్ ఎప్పుడు ఎవ్వరి జోలికి వెల్లకుండ ప్రశాంతంగా ఉండాడంతోపాటు అందరితో కలుపుగొలుగా ఉండేవాడు, గత రెండేళ్ళ క్రితం శ్రీనివాస్‌గౌడ్ భర్య పురిటినొప్పుల సమయంలో మృత్యువాత పడింది, దీంతో ఏడాది క్రితం నర్సాపూర్ మండల విద్యాధికారి కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్‌గా విధులు నిర్వహిస్తున్న రూపను వివాహం చేసుకున్నాడు. ప్రస్తుతం రూప గర్భవతి, మందు భార్యకు ఇద్దురు కుమారులు ఉన్నారు. శ్రీనివాస్‌గౌడ్‌కు విదిచేసిన అన్యాయన్ని చూసి స్థానికులు కంటతడి పెట్టారు. బుధవారం రాత్రి నుంచి గురువారం అంత్యక్రియలు పూర్తి అయ్యేవరకు గ్రామంలో విషాధచాయలు అలుముకొన్నాయి. -
నర్సాపూర్‌లో ఉద్రిక్తత
నర్సాపూర్, నర్సాపూర్ రూరల్: స్వాతంత్య్ర దినోత్సవం రోజున నర్సాపూర్‌లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. శివ్వంపేట మాజీ జెడ్పీటీసీ సభ్యుడు, దివంగత లక్ష్మారెడ్డి వర్ధంతిని పురస్కరించుకుని లయన్స్‌క్లబ్ ఆవరణలో ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేయకుండా పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తలను అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో ఈ పరిస్థితి తలెత్తింది. పోలీసుల తీరుకు నిరసనగా మాజీ మంత్రి సునీతాలక్ష్మారెడ్డి అంబేడ్కర్ చౌరస్తాలో ఆందోళనకు దిగారు. ఆమెతో పాటు వందలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు రాస్తారోకో చేయడంతో సుమారు రెండు గంటల పాటు ఉద్రిక్తత నెలకొంది. ఆగస్టు 15వ తేదీన లక్ష్మారెడ్డి వర్ధంతిని పుర స్కరించుకుని ఆయనకు నివాళులర్పించిన అనం తరం యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో లయన్స్‌క్లబ్‌లో రక్తదాన శిబిరాన్ని చాలా ఏళ్లుగా నిర్వహిస్తున్నారు. అయితే ఈసారి లయన్స్ క్లబ్ ఆవరణం లో 13వ తేదీ నుంచి 144 సెక్షన్ విధించారు. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా రక్తదాన శిబిరానికి ఏర్పాట్లు చేసుకోగా కార్యకర్తలు అక్కడికి వెళ్లకుండా అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. దీంతో తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. సునీతారెడ్డి బుధవారం ఉదయం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జాతీయ జెండాను ఎగుర వేసి విలేకరులతో మాట్లాడుతుండగానే తూప్రాన్ డీఎస్పీ రాంగోపాల్‌రావు ఆధ్వర్యంలో పోలీసులు ఆమెను అరెస్టు చేసేందుకు ప్రయత్నించారు. దాంతో ఆమె అంబేడ్కర్ విగ్రహం వద్ద ధర్నాకు దిగారు. లక్ష్మారెడ్డి విగ్రహం వద్దకు వెళ్లేందుకు కుటుంబ సభ్యులకైనా అనుమతివ్వాలని కోరినా పోలీసులు ససేమిరా అనడంతో వారి తీరును ఖండిస్తూ ఆమె అంబేడ్కర్ విగ్రహం వద్దే రక్తదానం చేశారు. తన భర్త విగ్రహం వద్ద నివాళులర్పించేందుకు అనుమతి ఇవ్వకపోవడం పట్ల సునీతారెడ్డి ధర్నా స్థలంలో కంటతడి పెట్టుకున్నారు. రాస్తారోకో చేస్తున్న పలువురు నాయకులను పోలీసులు శివ్వంపేట, వెల్దుర్తి పోలీస్స్టేషన్లకు తరలించారు. అనంతరం సునీతారెడ్డి, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ సమయంలో కార్యకర్తల నుంచి తీవ్ర ప్రతిఘటన వచ్చింది. మధ్యాహ్నం తర్వాత పోలీసులు అందరినీ విడుదల చేశారు. ఆ సమయంలో కుటుంబ సభ్యులకు లక్ష్మారెడ్డి విగ్రహానికి నివాళులర్పించేందుకు అనుమతిలిచ్చారు. -
ఒకే టీచర్.. ఏడు తరగతులు
నర్సాపూర్ రూరల్: ఒకే ఉపాధ్యాయుడితో 7 తరగతులు నిర్వహించడంతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని మండలంలోని హైమద్‌నగర్ గ్రామస్తులు శుక్రవారం ఎంఈఓ జెమినికుమారికి మొరపెట్టుకున్నారు. గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో 1 నుంచి 7వ తరగతి వరకు 70 మంది విద్యార్థులు చదువుకుంటున్నారని చెప్పారు. ఏడు తరగతులకు ఒకే ఉపాధ్యాయుడు బోధించడం ఇబ్బందికరంగా మారిందన్నారు. ఇక్కడ ముగ్గురు ఉపాధ్యాయులుండగా ఒకరు మూడు సంవత్సరాల పాటు దీర్ఘకాలిక సెలవుపై వెళ్లారని, మరో ఉపాధ్యాయురాలు మెటర్నిటీ సెలవులో ఉన్నట్లు ఎంఈఓ జెమినికుమారి తెలిపారు. త్వరలో డిప్యూటేషన్‌పై మరో ఉపాధ్యాయుడిని నియమించి సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు.