నర్సాపూర్ రూరల్: ఒకే ఉపాధ్యాయుడితో 7 తరగతులు నిర్వహించడంతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని మండలంలోని హైమద్‌నగర్ గ్రామస్తులు శుక్రవారం ఎంఈఓ జెమినికుమారికి మొరపెట్టుకున్నారు. గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో 1 నుంచి 7వ తరగతి వరకు 70 మంది విద్యార్థులు చదువుకుంటున్నారని చెప్పారు.
ఏడు తరగతులకు ఒకే ఉపాధ్యాయుడు బోధించడం ఇబ్బందికరంగా మారిందన్నారు. ఇక్కడ ముగ్గురు ఉపాధ్యాయులుండగా ఒకరు మూడు సంవత్సరాల పాటు దీర్ఘకాలిక సెలవుపై వెళ్లారని, మరో ఉపాధ్యాయురాలు మెటర్నిటీ సెలవులో ఉన్నట్లు ఎంఈఓ జెమినికుమారి తెలిపారు. త్వరలో డిప్యూటేషన్‌పై మరో ఉపాధ్యాయుడిని నియమించి సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు.