one teacher
-
ఒక్కరే టీచర్.. ఇద్దరు విద్యార్థులు
మహబూబాబాద్ అర్బన్: మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఉర్దూ మీడియం ప్రాథమిక పాఠశాలలో సోమవారం ఇద్దరు విద్యార్థులు మాత్రమే హాజరుకాగా.. వారికి బోధిస్తూ టీచర్ కనిపించారు. జిల్లా కేంద్రంలోని ఈద్గా బజారులో ఊర్దూ మీడియం ప్రాథమిక పాఠశా లలో ఐదో తరగతి వరకు మొత్తం 15 మంది విద్యార్థులు నమోదై ఉన్నారు. వారికి ఇద్దరు ఉపాధ్యాయులు బోధిస్తున్నారు. ఈమేరకు సోమవారం ఇద్దరు విద్యార్థులు మాత్రమే హాజరుకాగా.. వారికి హెచ్ఎం పాఠాలు బోధించారు. మరో టీచర్ సెలవులో ఉన్నారని తెలిపారు. కాగా టీచర్లు వంతులవారీగా పాఠశాలలకు వస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నాయకులు తెలిపారు. అధికారులు, ప్రజాప్రతినిధులు తనిఖీ చేసేటప్పుడు.. ఒకరు సెలవులో ఉన్నారని చెప్పడం పరిపాటిగా మారిందని వారు ఆరోపించారు. -
ఆయనొక్కడే.. వారు ముగ్గురు
సిద్దిపేట : చిన్నకోడూరు మండలంలోని అనంతసాగర్ గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విచిత్ర పరిస్థితి నెలకొంది. 6వ తరగతిలో విద్యార్థులు ముగ్గురే ఉన్నారు. ఈ ఊళ్లోని పిల్లలంతా ప్రైవేటు స్కూలు బాట పట్టడంతో ఈ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల హాజరు పలచబడింది. -
ఒకే ఒక్కడు.!
140 మంది విద్యార్థులకు ఒక్క ఉపాధ్యాయుడు పెనుకొండ రూరల్ : పెనుకొండ మండలంలోని రాంపురం జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఆరు నుంచి పదో తరగతి వరకూ 140 మంది విద్యార్థులకు కలిపి ఒక్కడే ఉపాధ్యాయుడు ఉన్నారు. దీంతో విద్యార్థుల భవితవ్యం ప్రశ్నార్థకమవుతోంది. గతంలో డిప్యూటేషన్లపై వచిచన ఎనిమిది ఉపాధ్యాయులు తిరిగి వారి యథాస్థానాలకు వెళ్లిపోయారు. ఈ పాఠశాలకు రాంపురం, కొండంపల్లి, హనుమప్పల్లి తదితర గ్రామాల నుంచి విద్యార్థులు వస్తుంటారు. పాఠశాలలో ఉపాధ్యాయులు లేకపోవడంతో ఈ ఏడాది విద్యార్థులను చేర్చేందుకు తల్లిదండ్రులు వెనుకంజ వేస్తున్నారు. పదో తరగతి ఉత్తీర్ణులైన వారికి ధ్రువీకరణ పత్రాలు అందజేయడంలోను, పాఠ్య పుస్తకాల పంపిణీలో, ఆరో తరగతిలో నూతన విద్యార్థులను చేర్చుకోవడంలో ఉన్న ఒక్క ఉపాధ్యాయుడు తలమునకలుగా ఉన్నారు. దీంతో పాఠ్యాంశాలు బోధించేవారు లేక విద్యార్థులు ఆటపాటలతో కాలం వెల్లదీస్తున్నారు. మూత పడే ప్రమాదం ఉంది ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. అయితే ఈ పని చేయకుండా ఉపాధ్యాయుల కొరత చూపి పాఠశాలను మూత వేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇది చాలా బాధాకరం. ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలి. - గోపాల్, విద్యా కమిటీ చైర్మన్, రాంపురం ఆధికారులు స్పందించాలి రోజూ పాఠశాలకు వచ్చి పోతున్నాం. పాఠాలు బోధించేందుకు టీచర్లు లేరు. ప్రైవేట్ పాఠశాలలో చదివించేందుకు మా తల్లిదండ్రుల వద్ద డబ్బు లేదు. మా పరిస్థితిని అధికారులు అర్థం చేసుకోవాలి. ఉపాధ్యాయులను నియమిస్తే మాకు చదువుకునేందుకు వీలవుతుంది. లేకపోతే ఇంటి వద్ద పనులు చేయాల్సి వస్తుంది. - సంధ్య, 9వ తరగతి, రాంపురం పిల్లలను చేర్చేందుకు భయపడుతున్నారు ఉపాధ్యాయులు లేకపోవడంతో పాఠశాలలో పిల్లలను చేర్చేందుకు తల్లిదండ్రులు భయపడుతున్నారు. ఉపాధ్యాయ బదిలీలు జరిగేంత వరకూ గతంలో డిప్యూటేషన్‌పై పనిచేసిన వారిని అలాగే కొనసాగించి ఉంటే బాగుండు. లేకపోతే పాఠ్యాంశాలలో విద్యార్థులు రెండు నెలలు వెనుకబడే ప్రమాదముంది. - మహీధర్, ప్రధానోపాధ్యాయుడు, జెడ్పీ ఉన్నత పాఠశాల, రాంపురం -
ఏపీలో 8,662 ఏకోపాధ్యాయ పాఠశాలలు
న్యూఢిల్లీ: ఒకే ఉపాధ్యాయుడు ఉన్న పాఠశాలలు(ఏకోపాధ్యాయ పాఠశాలలు) ప్రాథమిక స్థాయిలో దేశంలో 97,923 ఉన్నాయని, మాధ్యమిక స్థాయిలో 11.05 లక్షల పాఠశాలలు ఉన్నాయని కేంద్రం స్పష్టం చేసింది. గురువారం రాజ్యసభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు సంబంధిత మానవ వనరుల శాఖ(ఎంహెచ్ఆర్డీ) లిఖిత పూర్వక సమాధానం ఇచ్చింది. అలాగే, ఈ పాఠశాలల్లో శాతంవారిగా చూస్తే ఏపీకి చెందినవి 8.84శాతం ఉన్నాయని, సంఖ్యవారీగా 8662 పాఠశాలలు ఒకే ఉపాధ్యాయుడితో నడుస్తున్నాయని కూడా ఎంహెచ్ఆర్డీ తెలిపింది. అయితే ఇలాంటి పాఠశాలల్లో మరింతమంది విద్యార్థులను పెంపొందించేందుకు ఆర్థిక సహాయాన్ని సర్వశిక్ష అభియాన్, రాష్ట్రీయ మాధ్యమిక్ శిక్ష అభియాన్ (ఆర్‌ఎంఎస్‌ఏ) కింద అందిస్తామని తెలిపారు. ఈ సంస్థల సహాయంతో విద్యార్థులు టీచర్ల నిష్పత్తి సమానంగా ఉండేలా చూస్తామని అందులో పేర్కొన్నారు. మరోపక్క, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సర్కారీ బడులను కార్పొరేట్ సంస్థలకు, కార్పొరేట్ స్కూళ్లకు, ప్రైవేట్ సంస్థలకు కేటాయించే అనుమతులు కోరిందా అన్న ప్రశ్నకు అలాంటిదేం లేదని, తమ వద్దకు ఇంకా ఆ విషయం రాలేదని మానవ వనరుల శాఖ తెలిపింది. మరోపక్క, ఏపీలోని నెల్లూరు జిల్లా కావలిలో అణువిద్యుత్ ప్లాంట్ ఏర్పాటుచేయనున్నారా అన్న ప్రశ్నకు అదేం లేదని కూడా కేంద్రం విజయసాయిరెడ్డికి ఇచ్చిన లిఖితపూర్వక వివరణలో బదులిచ్చింది. -
ఒకే టీచర్.. ఏడు తరగతులు
నర్సాపూర్ రూరల్: ఒకే ఉపాధ్యాయుడితో 7 తరగతులు నిర్వహించడంతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని మండలంలోని హైమద్‌నగర్ గ్రామస్తులు శుక్రవారం ఎంఈఓ జెమినికుమారికి మొరపెట్టుకున్నారు. గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో 1 నుంచి 7వ తరగతి వరకు 70 మంది విద్యార్థులు చదువుకుంటున్నారని చెప్పారు. ఏడు తరగతులకు ఒకే ఉపాధ్యాయుడు బోధించడం ఇబ్బందికరంగా మారిందన్నారు. ఇక్కడ ముగ్గురు ఉపాధ్యాయులుండగా ఒకరు మూడు సంవత్సరాల పాటు దీర్ఘకాలిక సెలవుపై వెళ్లారని, మరో ఉపాధ్యాయురాలు మెటర్నిటీ సెలవులో ఉన్నట్లు ఎంఈఓ జెమినికుమారి తెలిపారు. త్వరలో డిప్యూటేషన్‌పై మరో ఉపాధ్యాయుడిని నియమించి సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు. -
ఆ స్కూల్ లో ముగ్గురే విద్యార్థులు!
చండూరు (రంగారెడ్డి జిల్లా) : రంగారెడ్డి జిల్లా చండూరు మండలంలో అనేక పాఠశాలల్లో టీచర్లు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతుంటే...ఇదే మండలం చండూరు గ్రామ పంచాయతీ పరిధిలోని లకినేనిగూడెం గ్రామ ప్రాథమిక పాఠశాలలో ముగ్గురే విద్యార్ధులకు ఒక టీచర్ విధులు నిర్వహిస్తున్నాడు. విద్యా సంవత్సరం ఆరంభంలో 20 మంది విద్యార్ధులు ఉండగా రాను రాను విద్యార్ధుల సంఖ్య తగ్గుతూ వచ్చింది. ఈ క్రమంలో ముగ్గురు విద్యార్ధులు మిగలగా నాలుగు నెలలుగా పాఠశాల వారితోనూ నడుస్తుంటే అధికారులు మాత్రం పట్టించుకోలేదు. ఒక్కో రోజు ఆ ముగ్గురు విద్యార్ధులు కూడా ఉండరు. టీచర్ వచ్చి పోవాల్సిందే. కాగా పాఠశాల నడపాలంటే కనీసం 25 మంది విద్యార్ధులు ఉండాల్సి ఉంది. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పాఠశాల నడుస్తున్నా మండల శాఖ అధికారులు పట్టించుకోవడంలో విఫలమయ్యారు. విద్యార్ధులు లేని పాఠశాల నుండి ఉపాధ్యాయులను ఇతర ఉపాధ్యాయుల కొరత ఉన్న పాఠశాలకు డిప్యూటేషన్ వేయాల్సి ఉంది. కానీ అధికారులలో చలనం లేదు. ఇప్పటికే మండలంలో.... మండలంలో ఇప్పటికే ఆరు బడులు విద్యార్ధులు లేక మూత పడుతూ వస్తున్నాయి. తాస్కానిగూడెం, తిమ్మారెడ్డిగూడెం, చొప్పరివారిగూడెం, కుమ్మందానిగూడెం,ధర్మతండ, తేరట్పల్లి(ఎస్సీ కాలనీ) లోని బడులకు అధికారులు తాళం వేశారు. చివరగా లకినేనిగూడెం ప్రాథమిక పాఠశాల సైతం మూత బడుల ఖాతాలో చేరనుంది. -
ఆ స్కూల్లో ఒకే ఒక్క విద్యార్థి...ఒకే ఒక్క టీచర్
-
ఏక్ నిరంజన్
విజయనగరం అర్బన్, న్యూస్‌లైన్: ‘గజపతినగరం మండల పరిషత్ ప్రాథమిక పాఠశా ల (రెగ్యులర్)లో విద్యార్థులు 82మంది. ఉపాధ్యాయు డు ఒక్కరు. జామి మండలం బలరాంపురం ఎంపీపీ స్కూల్ లో విద్యార్థులు-50మంది. ఒకే ఉపాధ్యాయుడు. జిల్లాలో ఇలా 250కి పైగా ఏకోపాధ్యాయ పాఠశాలలున్నాయి. ‘ప్రాథమిక పాఠశాలల్లో ఒకటి నుంచి ఐదవ తరగతి వరకు ఎంతమంది విద్యార్థులున్నా సంబంధిత తరగతి సబ్జెక్టులన్నీ ఒక్క ఉపాధ్యాయుడే చెప్పాల్సిన పరిస్థితి’. మరోవైపు నూతన విద్యా బోధన విధానం నిరంతర సమగ్ర మూల్యాంకన (సీసీఈ) మేరకు ప్రతి విద్యార్థి ప్రతిభను వ్యక్తిగతంగా పరిశీలించి గ్రేడింగ్ వేయాల్సిన అదనపు పనిభారం కూడా ఆ ఉపాధ్యాయులపై ఉంది’. పని ఒత్తిడి నేపథ్యంలో ఏకోపాధ్యాయ పాఠశాలల్లో ఉపాధ్యాయులు బోధనకు దూరంగా ఉంటున్నారు. జిల్లాలోని ప్రాథమిక పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత వల్ల ప్రాథమిక విద్య నానాటికీ కుంటుపడుతోంది. ఎప్పటికప్పుడు బోధన, పాఠ్యాంశాలలో వస్తున్న నూతన పోకడలకు అనుగుణంగా ఉపాధ్యాయుల సంఖ్య ప్రాథమి క పాఠశాలల్లో లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణంగా ఉపాధ్యాయ వర్గాలు చెబుతున్నాయి. జిల్లాలో 2,300 ప్రాథమిక పాఠశాలల్లో గత డైస్ నివే దిక ప్రకారం 1.55 లక్షల మంది విద్యార్థులున్నారు. వీరికి ఆరువేల మంది ఎస్జీటీ ఉపాధ్యాయులు బోధన అందిస్తున్నారు. విద్యార్థులకు సరిపడా ఉపాధ్యాయుల నిష్పత్తి లేదని గత ఏడాది 700 మంది విద్యా వలంటీర్లతో బోధన ప్రక్రియను సాగించారు. అయితే విద్యాహక్కు చట్టం అమ లు నేపథ్యంలో విద్యాశాఖ వలంటీర్ల బోధన విధానానికి ఇటీవల మంగళం పాడింది. ప్రత్యామ్నాయంగా అకడమిక్ ఇన్స్ట్రక్టర్స్ పేరుతో నిరుద్యోగ ఉపాధ్యాయలను వేసుకోవాలనే వెసులుబాటు ఇచ్చారు. అయితే ఈ వెసులుబాటును కేవలం ఉన్నత పాఠశాలల్లోని సబ్జెక్టు టీచర్ పోస్టులకు మాత్రమే వర్తింపజేశారు. జిల్లాలో తాజాగా చేపట్టిన సబ్జెక్టు టీచర్ల పదోన్నతుల భర్తీ వల్ల ఉన్నత పాఠశాలల్లో టీచర్ల కొరత కొంతమేర తీరింది. కానీ పదోన్నతుల భర్తీ వల్ల ప్రాథమిక పాఠశాలల్లో 250 వరకు ఎస్జీటీ పోస్టులు ఖాళీ అయ్యాయి. వీటితోపాటు ఇప్పటికే ఈ పాఠశాలల్లో రద్దయిన విద్యావలంటీర్ల పోస్టుల ఎస్జీటీ స్థానాలు మరో 700 వరకు ఉన్నాయి. పదోన్నతుల ద్వారా ఎస్జీటీలు వెళ్లిన తరువాత పరిస్థితి చూస్తే సుమారు 250 పాఠశాలలకు ఏకోపాధ్యాయులే దిక్కయ్యారు. అసలు ఉపాధ్యాయులు లేని పాఠశాలలుగా 10 వరకు ఉండగా, 50 నుంచి 70 మం ది విద్యార్థులున్న పాఠశాలు డజను వరకు ఉన్నాయి. వీటి స్థానాల్లో అకడమిక్ ఇన్స్ట్రక్టర్లను నియమించాలని ఉపాధ్యాయ సంఘాలు ఇప్పటికే కోరుతున్నాయి. దీనిపై విద్యాశాఖ నుంచి స్పందన లేకపోవడంతో తమ పిల్లల భవిష్యత్తు ఏమిటంటూ విద్యార్థ్ధుల తల్లిదండ్రు లు ఆవేదన చెందుతున్నారు.