‘గజపతినగరం మండల పరిషత్ ప్రాథమిక పాఠశా ల (రెగ్యులర్)లో విద్యార్థులు 82మంది. ఉపాధ్యాయు డు ఒక్కరు.
ఏక్ నిరంజన్
Published Mon, Dec 9 2013 4:10 AM | Last Updated on Sat, Sep 2 2017 1:24 AM
విజయనగరం అర్బన్, న్యూస్‌లైన్: ‘గజపతినగరం మండల పరిషత్ ప్రాథమిక పాఠశా ల (రెగ్యులర్)లో విద్యార్థులు 82మంది. ఉపాధ్యాయు డు ఒక్కరు. జామి మండలం బలరాంపురం ఎంపీపీ స్కూల్ లో విద్యార్థులు-50మంది. ఒకే ఉపాధ్యాయుడు. జిల్లాలో ఇలా 250కి పైగా ఏకోపాధ్యాయ పాఠశాలలున్నాయి. ‘ప్రాథమిక పాఠశాలల్లో ఒకటి నుంచి ఐదవ తరగతి వరకు ఎంతమంది విద్యార్థులున్నా సంబంధిత తరగతి సబ్జెక్టులన్నీ ఒక్క ఉపాధ్యాయుడే చెప్పాల్సిన పరిస్థితి’. మరోవైపు నూతన విద్యా బోధన విధానం నిరంతర సమగ్ర మూల్యాంకన (సీసీఈ) మేరకు ప్రతి విద్యార్థి ప్రతిభను వ్యక్తిగతంగా పరిశీలించి గ్రేడింగ్ వేయాల్సిన అదనపు పనిభారం కూడా ఆ ఉపాధ్యాయులపై ఉంది’. పని ఒత్తిడి నేపథ్యంలో ఏకోపాధ్యాయ పాఠశాలల్లో ఉపాధ్యాయులు బోధనకు దూరంగా ఉంటున్నారు.
జిల్లాలోని ప్రాథమిక పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత వల్ల ప్రాథమిక విద్య నానాటికీ కుంటుపడుతోంది. ఎప్పటికప్పుడు బోధన, పాఠ్యాంశాలలో వస్తున్న నూతన పోకడలకు అనుగుణంగా ఉపాధ్యాయుల సంఖ్య ప్రాథమి క పాఠశాలల్లో లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణంగా ఉపాధ్యాయ వర్గాలు చెబుతున్నాయి. జిల్లాలో 2,300 ప్రాథమిక పాఠశాలల్లో గత డైస్ నివే దిక ప్రకారం 1.55 లక్షల మంది విద్యార్థులున్నారు. వీరికి ఆరువేల మంది ఎస్జీటీ ఉపాధ్యాయులు బోధన అందిస్తున్నారు. విద్యార్థులకు సరిపడా
ఉపాధ్యాయుల నిష్పత్తి లేదని గత ఏడాది 700 మంది విద్యా వలంటీర్లతో బోధన ప్రక్రియను సాగించారు. అయితే విద్యాహక్కు చట్టం అమ లు నేపథ్యంలో విద్యాశాఖ వలంటీర్ల బోధన విధానానికి ఇటీవల మంగళం పాడింది. ప్రత్యామ్నాయంగా అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్స్ పేరుతో నిరుద్యోగ ఉపాధ్యాయలను వేసుకోవాలనే వెసులుబాటు ఇచ్చారు. అయితే ఈ వెసులుబాటును కేవలం ఉన్నత పాఠశాలల్లోని సబ్జెక్టు టీచర్ పోస్టులకు మాత్రమే వర్తింపజేశారు.
జిల్లాలో తాజాగా చేపట్టిన సబ్జెక్టు టీచర్ల పదోన్నతుల భర్తీ వల్ల ఉన్నత పాఠశాలల్లో టీచర్ల కొరత కొంతమేర తీరింది. కానీ పదోన్నతుల భర్తీ వల్ల ప్రాథమిక పాఠశాలల్లో 250 వరకు ఎస్జీటీ పోస్టులు ఖాళీ అయ్యాయి. వీటితోపాటు ఇప్పటికే ఈ పాఠశాలల్లో రద్దయిన విద్యావలంటీర్ల పోస్టుల ఎస్జీటీ స్థానాలు మరో 700 వరకు ఉన్నాయి. పదోన్నతుల ద్వారా ఎస్జీటీలు వెళ్లిన తరువాత పరిస్థితి చూస్తే సుమారు 250 పాఠశాలలకు ఏకోపాధ్యాయులే దిక్కయ్యారు. అసలు ఉపాధ్యాయులు లేని పాఠశాలలుగా 10 వరకు ఉండగా, 50 నుంచి 70 మం ది విద్యార్థులున్న పాఠశాలు డజను వరకు ఉన్నాయి. వీటి స్థానాల్లో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్లను నియమించాలని ఉపాధ్యాయ సంఘాలు ఇప్పటికే కోరుతున్నాయి. దీనిపై విద్యాశాఖ నుంచి స్పందన లేకపోవడంతో తమ పిల్లల భవిష్యత్తు ఏమిటంటూ విద్యార్థ్ధుల తల్లిదండ్రు లు ఆవేదన చెందుతున్నారు.
Advertisement
Advertisement