
నిందితుడు వెంకటయ్య
సాక్షి, మేడ్చల్ : చిన్నారులు, బాలికలే టార్గెట్‌గా కామాంధులు రెచ్చిపోతున్నారు. వరంగల్, రామాంతపూర్‌లో చిన్నారులపై జరిగి అత్యాచార ఘటనలు మరువక ముందే హైదరాబాద్‌లో మరో దారుణం చోటు చేసుకుంది. మేడ్చల్ జిల్లా జవహార్‌నగర్ పీఎస్ పరిధిలోని బాలీజీ నగర్ చెందిన 7 ఏళ్ల చిన్నారిపై ఓ వృద్ధ మానవ మృగం అత్యాచారానికి యత్నించాడు. ఇంటి పక్కనే ఉండే వెంకటయ్య (60) అనే వృద్ధ కామాంధుడు ఇంటి బయట ఆడుకుంటున్న ఏడేళ్ల చిన్నారిని భవనంపైకి తీసుకెళ్లి అత్యాచారానికి ఒడిగట్టే ప్రయత్నం చేశాడు. పక్క భవనంలోని వ్యక్తి గమనించి అరవడంతో చిన్నారిని వదిలి పారిపోయేందుకు ప్రయత్నించాడు. కాలనీవాసులు వెంకటయ్యను పట్టుకొని స్తంభానికి కట్టేసి దేహశుద్ది చేశారు.అనంతరం పోలీసులకు అప్పజెప్పారు.
చదవండి :