దారుణం : ఐసీయూలో మైనర్‌ బాలికపై అత్యాచారం | Minor Girl Gang Raped Inside ICU In Uttar Pradesh | Sakshi
Sakshi News home page

దారుణం : ఐసీయూలో అత్యాచారం

Published Sun, Nov 4 2018 8:52 AM | Last Updated on Sun, Nov 4 2018 8:53 AM

Minor Girl Gang Raped Inside ICU In Uttar Pradesh - Sakshi

లక్నో : ఉత్తరప్రదేశ్‌లో దారుణం జరిగింది. ఐసీయూలో చికిత్స పొందుతున్న మైనర్‌ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. పోలీసుల కథనం ప్రకారం.. యూపీలోని బరేల్లీలోని ప్రాంతానికి చెందిన ఓ ఎనిమిదేళ్ల బాలిక పాము కాటుకు గురైంది. దీంతో ఆమెను స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స కోసం ఐసీయూలోకి బాలికను తరలించారు.

అదే రోజు రాత్రి ఆస్పత్రిలో పనిచేసే ఓ వ్యక్తి, మరో నలుగురు గుర్తుతెలియని వ్యక్తులు ఐసీయూలోకి చొరబడి బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయాన్ని ఎవరికి చెప్పొద్దని బాలికను బెదిరించి వెళ్లిపోయారు. మరుసటి రోజు ఆ బాలికను జనరల్‌ వార్డుకి తరలించారు. అనంతరం బాలికి ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆస్పత్రికి చేరుకొని బాలికను విచారించి కేసు నమోదు చేసుకున్నారు. ఆస్పత్రికి చెందిన సిబ్బంది ఒకరు, మరో నలుగురిపై  కేసు నమోదు చేశామని, దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement