లిఫ్ట్ ఇచ్చి.. అత్యాచారం చేసి పారిపోయారు | Engineering Student Raped Inside Moving Car In Uttar Pradesh | Sakshi
Sakshi News home page

లిఫ్ట్ అడిగితే.. ఇంజినీరింగ్‌ విద్యార్థినిపై అత్యాచారం చేసి పారిపోయారు

Published Mon, Oct 10 2022 8:55 AM | Last Updated on Mon, Oct 10 2022 12:43 PM

Engineering Student Raped Inside Moving Car In Uttar Pradesh - Sakshi

కదులుతున్న కారులో ఇంజినీరింగ్‌ విద్యార్థినిపై అఘాయిత్యానికి పాల్పడ్డారు దుండగులు. ఉత్తర ప్రదేశ్‌ జైసింగ్‌పూర్ ఏరియా సుల్తానాపూర్‌లో వెలుగు చూసిన ఈ ఘటనలో నిందితుల కోసం పోలీసులు తీవ్ర గాలింపు చేపట్టారు.

స్థానికంగా ఓ ప్రైవేట్‌ ఇంజినీరింగ్‌ కాలేజీలో చదువుతున్న 23 ఏళ్ల యువతి.. శుక్రవారం సాయంత్రం ఇంటికి వెళ్లేందుకు రోడ్డు మీద నిల్చుంది. అయితే సెలవుల సీజన్‌ కావడంతో ఎంతకీ బస్సులు రాలేదు. దీంతో అటుగా వస్తున్న ఓ ప్రైవేట్‌వాహనాన్ని ఆపి లిఫ్ట్‌ అడిగింది. ఈ క్రమంలో ఆమెను ఎక్కించుకున్నాక.. డ్రైవర్‌ సీట్‌లో ఉన్న వ్యక్తి వెనకాలకు వచ్చాడు. ముందు సీటులో ఉన్న మరో వ్యక్తి కారును నడుపుతుండగా.. యువతిపై కారులోనే అఘాయిత్యానికి పాల్పడ్డాడు దుండగుడు. 

అనంతరం ఆమెను దగ్గర్లో ఉన్న కాలువ వద్ద పడేసి.. ఆ ఇద్దరూ పారిపోయారు. గాయాలతో కంటపడ్డ ఆమెను.. ఆస్పత్రిలో చేర్చించి చికిత్స అందించారు పోలీసులు. వైద్య నివేదిక ప్రకారం. అత్యాచారం జరిగిందని నిర్దారించుకున్న పోలీసులు.. ఆమె తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలింపు చేపట్టారు.

ఇదీ చదవండి: పాపం.. వృద్ధురాలి కాలిని నరికేసి ఘోరం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement