సైదాబాద్‌ ఘటనపై స్పందించిన ఆర్పీ, రూ. 50 వేలు రివార్డు ప్రకటన | RP Patnaik Reacts On Saidabad Incident And Announce Rs 50 Thousand Reward | Sakshi
Sakshi News home page

RP Patnaik: నిందితుడిన పట్టించిన వారికి రూ. 50 వేలు రివార్డు

Published Wed, Sep 15 2021 2:16 PM | Last Updated on Wed, Sep 15 2021 4:15 PM

RP Patnaik Reacts On Saidabad Incident And Announce Rs 50 Thousand Reward - Sakshi

సైదాబాద్‌ చిన్నారి హత్యాచార ఘటనపై సినీ ప్రముఖులు స్పందిస్తున్నారు. నిందితుడు రాజును పట్టించడంలో పోలీసులకు సహకరిద్దాం అంటూ సోషల్‌ మీడియా వేదికగా పిలుపునిస్తున్నారు. ఇక మంచు మనోజ్‌ సోమవారం బాధిత బాలిక కటుంబాన్ని పరామర్శించగా.. ఈ ఘటనపై సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు విచారం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. హీరో నాని నిందితుడు బయటెక్కడో ఉన్నాడు.. ఉండకూడదంటూ ట్వీట్‌ చేశారు. తాజాగా ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్‌ సైతం సైదాబాద్‌ ఘటనపై స్పందిస్తూ.. నిందితుడి ఆచూకీ తెలియజేస్తే రివార్డు ఇస్తానని ప్రకటించారు. నిందితుడిని కఠినంగా శిక్షిస్తేనే చిన్నారి ఆత్మకు శాంతి చేకూరుతుందంటూ ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ షేర్‌ చేశారు. 

చదవండి: సైదాబాద్‌ హత్యాచార ఘటన: బయటెక్కడో ఉన్నాడు.. ఉండకూడదు

ఆర్పీ పోస్టు చేస్తూ.. ‘చిట్టితల్లికి న్యాయం జరగాలంటే, ఆమె ఆత్మకు శాంతి చేకూరాలంటే నిందితుడు రాజు దొరకాలి. అతడి ఆచూకీ తెలియజేసిన వారికి రూ.10 లక్షలు రివార్డు ఇస్తామని హైదరాబాద్‌ పోలీసులు ప్రకటించారు. పట్టించిన వారికి నా వంతుగా రూ.50 వేలు ఇస్తాను. అతడు దొరకాలి. చేతిపై ‘మౌనిక’ అనే పచ్చబొట్టు తప్పకుండా అతడిని పట్టించేలా చేస్తుంది. అతడు మీ దగ్గర్లోనే ఉండొచ్చు. ఒక కన్ను వేసి ఉంచండి. ఆ కిరాతకుడిని పట్టుకునే పనిలో పోలీసు శాఖకు మన వంతు సాయం అందిద్దాం’ అని ఆయన పిలుపునిచ్చారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement