ఇద్దరు అమ్మాయిలు లైంగికంగా వేధించారు | 7-Year-Old Student Allegedly Molested By Senior Girls For Months In Delhi School | Sakshi
Sakshi News home page

ఇద్దరు అమ్మాయిలు లైంగికంగా వేధించారు

Published Mon, Feb 27 2017 9:11 AM | Last Updated on Tue, Sep 5 2017 4:46 AM

ఇద్దరు అమ్మాయిలు లైంగికంగా వేధించారు

ఇద్దరు అమ్మాయిలు లైంగికంగా వేధించారు

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో అఘాయిత్యాలు నిత్యకృత్యమయ్యాయి. పశ్చిమ ఢిల్లీలోని మోతీనగర్‌లో ఓ స్కూల్లో ఇద్దరు అమ్మాయిలు కలసి జూనియర్ విద్యార్థిని కొన్ని నెలల పాటు లైంగికంగా వేధించారు. చివరకు బాధితురాలు (7) ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పగా, అమ్మాయి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇద్దరు నిందితుల్లో ఒక మైనర్ అమ్మాయి ఉంది. ఈ అమ్మాయి ఆచూకీ తెలియరాలేదు. పోలీసులు మరో నిందితురాలిని అరెస్ట్ చేశారు.

స్కూల్లో భోజన విరామ సమయంలో సీనియర్ అమ్మాయిలు.. బాధితురాలిని ఖాళీ గదిలోకి తీసుకెళ్లి అసభ్యకరంగా ప్రవర్తించేవారు. బాధితురాలు అడ్డుచెబితే వారు భయపెట్టేవారు. దుస్తులు విప్పేసి అసహజ కార్యకలాపాలకు పాల్పడేవారు. బాధితురాలిని తండ్రి ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయించిన అనంతరం కౌన్సిలింగ్ ఇప్పించారు. బాధితురాలితో పాటు కుటుంబ సభ్యులకు, స్కూల్ విద్యార్థులకు నిపుణులు కౌన్సిలింగ్ ఇవ్వనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement