delhi school
-
ఢిల్లీలో 23 స్కూళ్లకు బాంబు బెదిరింపు
-
స్కూల్ టాయిలెట్లోకి లాక్కెళ్లి విద్యార్థినిపై గ్యాంగ్ రేప్
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మరో అమానుష ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. కేంద్రీయ విద్యాలయంలో జూనియర్‌పై ఇద్దరు సీనియర్లు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. పాఠశాల వాష్ రూమ్‌లోకి 11 ఏళ్ల బాలికను తీసుకెళ్లి గ్యాంగ్ రేప్‌కు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని వెల్లడించారు. మరోవైపు.. ఈ విషయంపై దర్యాప్తు చేపట్టాలని కేంద్రీయ విద్యాలయ సంఘటన్ ప్రాంతీయ కార్యాలయం సైతం అధికారులను ఆదేశించింది. ఈ ఏడాది జులైలోనే చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడ్డారు ఇద్దరు సీనియర్లు. సీనియర్ల దుశ్చర్య ఢిల్లీ మహిళా కమిషన్ ద్వారా వెలుగులోకి వచ్చింది. మహిళా కమిషన్ ప్రోత్సాహంతో బాధిత కుటుంబం గత మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన మహిళా కమిషన్ పోలీసులు, పాఠశాల ప్రిన్సిపాల్‌కి నోటీసులు జారీ చేసింది. ఈ విషయాన్ని పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదని స్కూల్ యాజమాన్యాన్ని ప్రశ్నించింది. ‘ఢిల్లీ స్కూల్లో 11 ఏళ్ల విద్యార్థినిపై గ్యాంగ్ రేప్ చాలా తీవ్రమైన కేసు గురించి తెలిసింది. ఈ విషయాన్ని స్కూల్ టీచర్ దాచి పెట్టే ప్రయత్నం చేసినట్లు బాధితురాలు తెలిపింది. దేశ రాజధానిలో పిల్లలకు స్కూల్స్ కూడా సురక్షితం కాకపోవటం దురదృష్టకరం. నిందితులను కఠినంగా శిక్షించాలి. బాధితురాలు క్లాస్ రూమ్‌లోకి వెళ్లే క్రమంలో ఇద్దరు ఇంటర్ విద్యార్థులు అడ్డుకున్నారు. టాయిలెట్లోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయాన్ని టీచర్‌కు తెలపగా.. దాచిపెట్టే ప్రయత్నం చేశారు. ’ అని మహిళా కమిషన్ ఛైర్పర్సన్ వెల్లడించారు. ఇదీ చదవండి: మెక్సికోలో కాల్పుల మోత.. మేయర్ సహా 18 మంది మృతి -
సర్వోదయ బడి ఫస్ట్‌లేడీ సందడి
సంతోషం సగం బలం అంటారు. కానీ సంతోషమే సంపూర్ణ బలం. అవును ఇది నిజం. పువ్వుల్లా నవ్వే చిన్నారుల్ని చూసినా.. వారి పక్కనే కూర్చొని సంతోషంపై పాఠాలు నేర్చుకున్నా.. ధ్యానముద్రలో ఉంటూ అలౌకిక ఆనందాన్ని పొందినా.. సంతోషం ఎలా రెట్టింపవుతుందో అదే సంపూర్ణ బలంగా ఎలా మారుతుందో తెలుస్తుంది. అమెరికా ఫస్ట్ లేడీ మెలానియా ట్రంప్‌కి ఢిల్లీ పాఠశాల జీవితకాలానికి సరిపడా అద్భుతమైన అనుభూతినిచ్చింది. అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ మంగళవారం ఢిల్లీలోని మోతీబాగ్‌లో సర్వోదయ బాలబాలికల ప్రాథమికోన్నత పాఠశాలను సందర్శించారు. విద్యార్థుల్లో విద్యార్థిగా కలిసిపోయారు. తరగతి గదిలో కూర్చొని హ్యాపీనెస్ క్లాసుల్ని శ్రద్ధగా విన్నారు. చిన్నారులతో ముచ్చట్లాడారు. హ్యాపీనెస్ పాఠ్యాంశాలు తనలో ఎంతో స్ఫూర్తిని నింపాయని, ఇవి విద్యార్థుల్లో ఆరోగ్యకరమైన ఆలోచనల్ని, సానుకూల దృక్ఫథం అలవడడానికి దోహదపడతాయని కూడా అన్నారు. బొట్టుపెట్టి.. హారతిచ్చి డొనాల్డ్ ట్రంప్, నరేంద్ర మోదీతో చర్చలు నిర్వహిస్తున్న సమయంలో మెలానియా ఈ పాఠశాలకు వెళ్లి విద్యార్థులతో ఉల్లాసంగా గడిపారు. ఆమెకు స్వాగతం చెప్పడానికి పువ్వులు, కళాకృతులతో పాఠశాలని కంటికింపుగా అలంకరించారు నిర్వాహకులు. చాలా చోట్ల రంగు రంగుల ముగ్గులు వేశారు. చీరలు ఘాగ్రాచోళీలు ధరించి అందంగా ముస్తాబైన కొందరు విద్యార్థినులు ఆడుతూ, పాడుతూ మెలానియాకు స్వాగతం పలికారు. ఆమెకి పుష్ప గుచ్ఛాన్ని ఇచ్చి నుదుటన కుంకుమ బొట్టు పెట్టి, హారతి ఇచ్చి లోపలికి ఆహ్వానించారు. ‘హ్యాపీనెస్’ స్ఫూర్తి మెలానియా పాఠశాల అంతా కలియ తిరిగారు. రీడింగ్ రూమ్‌కి వెళ్లారు. ఎల్కేజీ, యూకేజీ చిన్నారులకి ఆటపాటల్ని నేర్పే యాక్టివిటీ రూమ్‌కి వెళ్లారు. వారితో పాటు అక్కడే కూర్చొని చాలాసేపు గడిపారు. యోగా క్లాసుకి వెళ్లి విద్యార్థులతో మాట్లాడారు. వారితో కలిసి కాసేపు ధ్యానముద్రలో గడిపారు. ఆ ధ్యానం తనకు ఎంతో ప్రశాంతతనిచ్చిందని అన్నారు. ఆ తర్వాత పాఠశాల విద్యార్థులనుద్దేశించి మాట్లాడారు. భారత్‌కు రావడం ఇదే తొలిసారని, ఇక్కడి ప్రజలు ఎంతో దయామయులని కితాబునిచ్చారు. విద్యార్థుల మానసిక ప్రశాంతత కోసం మెడిటేషన్‌తో తరగతుల్ని ప్రారంభించడం, ప్రకృతితో మమేకం కావడం ఎంతో స్ఫూర్తిని కలిగిస్తాయని చెప్పారు. విద్యార్థులతో మంచి సమయాన్ని గడిపిన మెలానియా తిరిగి వెళ్లే ముందు విద్యార్థులు భారత్, అమెరికా జెండాలు పట్టుకొని బారులు తీరి నిల్చొని ఉల్లాసంతో, ఉత్సాహంతో ఛీర్స్ చెబుతూ ఆమెకు వీడ్కోలు చెప్పారు. ఫస్ట్ లేడీకి ప్రశ్నలు అమెరికా ఎంత పెద్దది ? ఇక్కడ నుంచి బాగా దూరమా? ఫస్ట్ లేడీ అంటే ఏం చేస్తారు? ఇలా సర్వోదయ పాఠశాలలో ఔత్సాహిక విద్యార్థులు మెలానియా ట్రంప్‌పై ప్రశ్నల వర్షం కురిపించారు. దాదాపు గంటకు పైగా ఆమె స్కూలులో గడిపారు. ఈ సందర్భంగా అక్కడి టీచర్లు మెలానియాను ఏమైనా అడగాలని అనుకుంటే అడగమని విద్యార్థుల్ని ప్రోత్సహించారు. దీంతో అమెరికా గురించి, అక్కడకి వెళ్లేందుకు పట్టే సమయం గురించి రకరకాల ప్రశ్నలు వేశారు. వాటన్నింటికి మెలానియా ఓపిగ్గా సమాధానమిచ్చారు. ఢిల్లీ సీఎం ట్వీట్ మెలానియా పాఠశాలకు రావడానికి ముందు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆమెకు స్వాగతం చెబుతూ ట్వీట్ చేశారు.‘‘ మా స్కూలులో హ్యాపీనెస్ క్లాస్‌కు అమెరికా ఫస్ట్ లేడీ హాజరవుతున్నారు. ఢిల్లీ ప్రజలకు మా పాఠశాల విద్యార్థులు, టీచర్లకు ఇది అద్భుతమైన రోజు. శతాబ్దాలుగా భారత్ ప్రపంచానికి ఆధ్యాత్మికతను బోధిస్తోంది. మా పాఠశాల నుంచి ఆమె ఆనందోత్సాహాలతో తిరిగి వెళతారు. అదే మాకు ఎంతో సంతోషాన్నిస్తుంది’’ అని కేజ్రీవాల్ ఆ ట్వీట్లో పేర్కొన్నారు. ఏమిటీ హ్యాపీనెస్ క్లాస్‌లు?! ప్రస్తుత పోటీ ప్రపంచంలో పాఠశాలల్లో తరగతులంటే పాఠాలు బట్టీ పట్టడం, పరీక్షలు రాయడం, మార్కులు, ర్యాంకులు, అడుగడుగునా ఒత్తిళ్లు. ఈ విధానానికి చెక్ పెట్టి విద్యార్థుల మెదడుకి పదును పెడుతూ వారిలో సంతోషాన్ని పెంచే క్లాస్లివి. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ తాను చేపట్టిన విద్యావ్యవస్థ సంస్కరణలో భాగంగా ఈ హ్యాపీనెస్ క్లాస్‌లను ప్రవేశపెట్టారు. ఈ విధానం ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలల్లో నర్సరీ నుంచి ఎనిమిదో తరగతి వరకు పాఠశాలల్లో 45 నిముషాల సేపు ఈ హ్యాపీనెస్ పీరియడ్ ఉంటుంది. ఈ క్లాసులో పిల్లలందరి మానసిక ప్రశాంతత కోసం కాసేపు ధ్యానం చేయిస్తారు. విలువలతో ఎలా బతకాలో నేర్పిస్తారు. వారి మేధస్సుకు పదును పెట్టేలా, నిత్య జీవితంలో ఎదురయ్యే సమస్యలను తట్టుకొని ఆనందంగా జీవితాన్ని ఎలా గడపాలో వారికి బోధిస్తారు. ఆత్మ స్థైర్యంతో అనర్గళంగా మాట్లాడేలా చర్చలు నిర్వహిస్తారు. వారిలో కళని బయటకు తీసేలా చిన్నచిన్న నాటికలు వేయిస్తారు. -
పాఠశాలలో ఎన్నికల ప్రచారంపై ఫైర్
సాక్షి, న్యూఢిల్లీ : పాఠశాలల్లో ఎన్నికల ప్రచారం చేయడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తూ జాతీయ బాలల హక్కుల సంరక్షణ కమిషన్ (ఎన్సీపీసీఆర్) ఢిల్లీలోని ఆప్ సర్కార్‌కు లేఖ రాసింది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఇటీవల ఓ పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో పార్టీ తరపున ఎన్నికల ప్రచారం చేపట్టిన నేపథ్యంలో ఎన్సీపీసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేసింది. పాఠశాలలో రాజకీయ ప్రసంగాలు, ఎన్నికల ప్రచారం పిల్లలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. మంత్రులు, పార్టీ కార్యకర్తలు ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్నికల ప్రచారానికి రావడంతో చిన్నారుల చదువులకు ఆటంకం కలుగుతోందని పేర్కొంది. స్కూలు పిల్లల భద్రతను దృష్టిలో ఉంచుకుని పాఠశాలల్లో ప్రచార సభలకు ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించింది. పాఠశాలలోకి వచ్చే విజిటర్ల గుర్తింపును, ఏ ఉద్దేశంతో స్కూల్‌కు వస్తున్నారో తెలుసుకుని మెయిన్ గేట్ల వద్ద ప్రవేశ రిజిస్టర్లలో నమోదు చేశాకే సందర్శకులను అనుమతించేలా చర్యలు చేపట్టాలని ఢిల్లీ సర్కార్‌కు రాసిన లేఖలో ఎన్సీపీసీఆర్ కోరింది. సర్వోదయ కన్యావిద్యాలయ పాఠశాలల్లో 11,000 నూతన తరగతులకు సోమవారం శంకుస్ధాపన చేసిన సందర్భంగా జరిగిన సభలో సీఎం కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం సిసోడియాలో ఆమ్ ఆద్మీ పార్టీకి రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఓటు వేయాలని కోరడం దుమారం రేపింది. మీరు ప్రధాని నరేంద్ర మోదీని ఇష్టపడతారా లేకుంటే మీ పిల్లలను ఎక్కువగా ఇష్టపడతారా అని తల్లితండ్రులను వారు ప్రశ్నించారు. మీ పిల్లల్నే మీరు ప్రేమిస్తే వారి అభ్యున్నతికి పనిచేసే వారికే ఓటేయాలని పిలుపు ఇచ్చారు. మీరు మీ పిల్లలను ఇష్టపడకుంటే మోదీకే ఓటు వేయాలని సలహా ఇచ్చారు. మోదీ పాఠశాలల్లో ఒక క్లాస్‌రూమ్‌ను సైతం నిర్మించలేదని వారు ఆరోపించారు. -
మహాతల్లి కథాసారం
మాష్టరు హమీద్ ఢిల్లీలో బారహటోటేలోని ఒక పాఠశాలలో ఉపాధ్యాయుడు. అతడి అసలు నివాసస్థానం రషీదాబాద్లోని పహాడీ మొహల్లా. అతని తండ్రి రషీదాబాదులో కంచరిపని చేస్తూ ఉండేవాడు. హమీద్ బాల్యంలో తన పేటలోని మసీదులోనూ, తరువాత కొద్ది రోజులు ముల్లా సాహెబు బడిలోనూ, ఆ తరువాత తండ్రిగారి ఇష్టప్రకారం కొంతకాలం తాలూకా స్కూలులోనూ చదువుకొన్నాడు. హమీద్ ఉర్దూ ప్యాసయిన రోజుల్లో రషీదాబాద్‌లో ప్లేగువ్యాధి వ్యాపించి హమీద్ తండ్రిని బలిగొన్నది. ఆయన అంత్యకర్మలన్నీ పూర్తిచేసిన తరువాత హమీద్ తల్లి దగ్గర లెక్ఖ చూసుకొంటే డెబ్భయి రూపాయలు మిగిలినవి. మిడిల్ ప్యాసయిన తరవాత హమీద్‌కు ఇంగ్లీషుగూడా చదువు కొందామని అభిలాష కలిగినది. కాని ఎలాగా చదువుకోడం? వీరి పేటలో ఉండే ఒకాయన ఢిల్లీలో పోలీసుగా ఉండటం వల్ల హమీద్ రెండు మూడు సార్లు ఢిల్లీని గురించి విని ఉన్నాడు. అందువల్ల తల్లి దగ్గర పదిహేను రూపాయలు తీసుకొని మెల్లగా ఢిల్లీ చేరుకొన్నాడు. పోలీసు కానిస్టేబుల్ నసరుల్లాఖాన్ ఇల్లు చచ్చిచెడి తెలుసుకొన్నాడు. నసరుల్లాఖాన్ హమీద్ తండ్రిని బాగా ఎరుగును. అందువల్ల అతడు హమీద్‌ను ఆదరించి తన ఇంట్లో ఉండి చదువుకోవడానికి అవకాశం కలుగజేశాడు. హమీద్ మూడు సంవత్సరాల్లో పదో క్లాసుకు వచ్చాడు. లెక్ఖల్లో హమీద్ నిధి. ఒక సహధ్యాయుడికి పాఠం చెప్పడం ప్రారంభించి నెలకు ఏడు రూపాయలు సంపాదించడం ఆరంభించాడు. ఏడు రూపాయలు తన భోజనానికి సరిపోతవి గనుక వేరుగా ఉంటానని బ్రతిమిలాడినా నసరుల్లాఖాన్ అంగీకరించనందున హమీద్ అక్కడే ఉండిపోయినాడు. పదినెలల్లో హమీద్ డెబ్బయి రూపాయలు సంపాదించాడు. తల్లి దగ్గరినుండి తెచ్చినవి పది రూపాయలు మిగిలి ఉన్నవి. ఒకసారి తల్లి రెండు రూపాయలు మనియార్డరు పంపించింది. మొత్తం ఎనభయి రెండు రూపాయలు పోగుపడినవి. స్కూలుకు వేసవికాలపు సెలవులిచ్చారు. నసరుల్లాఖాన్ గూడా సెలవుబెట్టాడు. ఇద్దరూ కలిసి రషీదాబాద్ వచ్చారు. అప్పటికి హమీద్ తల్లి దగ్గర భర్త అంత్యక్రియలు చేయగా మిగిలిన పన్నెండు రూపాయలు ఉన్నవి. ఇంటిముందున్న పనసచెట్టు అమ్మడం వల్ల ప్రతి సంవత్సరం పాతిక రూపాయల ఆదాయం వస్తూ ఉండేది. ఇంటికి పోయేటప్పటికి తల్లి హమీద్‌కు వివాహ సంబంధం మాట్లాడి సిద్ధం చేసి పెట్టింది. ఆ డబ్బు, హమీద్ దగ్గర ఉన్న డబ్బు అంతా ఖర్చుపెట్టి ఏదోవిధంగా హమీద్‌ఖాన్ వివాహం పూర్తిచేసింది. పెళ్లి అయిన ఏడోరోజున తిరిగి హమీద్ ఢిల్లీ వెళ్లాడు. ఆ సంవత్సరం పరీక్షలో కృతార్థుడు అయినాడు. ఒక ప్రైవేట్ స్కూల్లో నౌకరీ కుదిరింది. నెలకు ఇరవయి రూపాయల జీతం. నసరుల్లాఖాన్ మూడు రూపాయలు అద్దెకు ఒక చిన్న ఇల్లు కుదిరించి పెట్టాడు. హమీద్ భార్యను తీసుకొచ్చి ఆ ఇంట్లో కాపురం పెట్టాడు. రషీదాబాద్‌లో తల్లి ఒంటరిగా ఉండిపోయింది. హమీద్ భార్యను ఢిల్లీ తీసుకొనివచ్చి ఏడు సంవత్సరాలు గడిచింది. అతనికి ముగ్గురు మొగపిల్లలూ, ఒక ఆడపిల్లా పుట్టారు. వారిలో ఒక మొగపిల్లవాడూ, ఆడపిల్లా చనిపోయినారు. హమీద్ భార్యకు గూడా చాలా జబ్బు చేసింది. ఒకసారి హమీద్‌కు ఎండదెబ్బ తగిలి పదిహేను రోజులు మంచంలోనే ఉండిపోయినాడు. అటు స్కూల్లో పని పెరిగిపోయింది. జీతం కూడా ముప్ఫయి రూపాయలయింది. పది రూపాయలు ప్రైవేటు చెప్పి సంపాదించేవాడు. కానీ ఆ డబ్బు అతనికి ఏమాత్రమూ సరిపోయేది కాదు. తల్లి రషీదాబాద్ రమ్మని ఉత్తరాల మీద ఉత్తరాలు వ్రాసేది. కాని డబ్బులేక తల్లిని చూడవలెనని ఎంత కుతూహలమున్నా హమీద్ పోలేకపోయినాడు. రోజూ ఉదయమే లేచి మసీదుకు పోయి నమాజు చేసుకోవడం, ఇంటికి తిరిగి వచ్చిన తరువాత ఖురాన్లోనుండి ఒక అధ్యాయం పారాయణం చేయడం అతనికి అలవాటు. మసీదు నుంచి ఇంటికి వస్తూ ఉన్నప్పుడు రోజూ జానకి నడుము వంగిపోయి కర్రపోటు వేసుకొంటూ చాకిరేవుకు పోతూ కనపడేది. కాని ఎందువల్లనో ఐదు రోజుల నుండి జానకి కనపడటం లేదు. హమీద్‌కు ఆశ్చర్యం వేసింది. తెలుసుకుందామని జానకి ఇంటికి వెళ్లాడు. ఏమైందని ప్రశ్నిస్తే నిన్నరాత్రి చనిపోయిందని జవాబు చెప్పారు. జానకి చనిపోయిందని వినగానే హమీద్ గుండె గుభీలుమన్నది. జానకికి హమీద్‌కు ఏమి సంబంధమున్నదో భగవంతునికి తెలియాలి! స్కూలుకు పోయినాడు. ఏమీ తోచలేదు. స్కూలు వదిలిపెట్టగానే ఇంటికి చేరాడు. తెల్లవార్లూ అతనికి నిద్ర పట్టలేదు. మర్నాడు బక్రీదు. స్కూలుకు సెలవు. స్టేషనుకు పోయి రషీదాబాద్ టిక్కట్టు కొన్నాడు. బక్రీదు రోజు పగలల్లా రైల్లోనే గడిచింది. నమాజు లేదు. కుర్బానీ లేదు. ముసలితల్లి ధ్యాసే. భార్య, పిల్లల మీద మక్కువ వల్ల హమీద్ తల్లిని మరిచిపోలేదు. నాలుగైదుసార్లు ఏడెనిమిది రూపాయలు మనియార్డరు గూడా పంపించాడు. ఆ డబ్బు పంపినప్పుడల్లా తనూ, పిల్లలూ చాలా ఇబ్బంది పడేవాళ్లు. తల్లికి ఉత్తరాలు వ్రాసినప్పుడు పిల్లల చేత గూడా ఏవో గీతలు గీయించేవాడు. ఆ పిచ్చిగీతలు చూసి తల్లి సంతోషించవలెనని అతని అభిప్రాయం. అతని భార్య గూడ వ్రాయడం నేర్చుకొన్నది. అత్తగారికి సలాములు తెలియపరుస్తూ ఉండేది. అటునుండి తల్లి మాటమాటకీ రమ్మని పక్కింటి దర్జీ ఆమె చేత ఉత్తరాలు వ్రాయిస్తూ ఉండేది. వచ్చే సంవత్సరం పంట రోజుల్లో తప్పక వస్తానని వ్రాసేవాడు. కుటుంబంతో పోవాలి. చేసేది ఉద్యోగం గనుక యేవో కానుకలు తీసుకొనిపోవాలి. అందుకు డబ్బు గావాలి. వచ్చే జీతంతో తిండి గడవడమే కష్టంగా ఉండేది. అందువల్ల ఎప్పటికప్పుడు ప్రయాణం ఆపుకొనేవాడు. కాని జానకి మరణవార్త విని గుండె పగిలినట్లయి ఆగలేక ఒంటరిగా బయలుదేరాడు. బక్రీదునాడు సూర్యాస్తమయం సమయానికి హమీద్ రషీదాబాద్ చేరాడు. పైనుండి భోరున వర్షం కురవడం ఆరంభించింది. మోకాళ్ల లోతు నీళ్లలో యింటికి చేరుకొన్నాడు. తలుపు వేసివున్నది. ‘‘అమ్మా’’ అని పెద్దగా పిలిచాడు. లోపలనుండి ఒక లావుపాటివాడు వచ్చి తలుపులు తెరిచాడు. మూడు సంవత్సరాల క్రితం ఆ యిల్లును కొన్నట్లున్నూ, హమీద్ తల్లి దర్జీ ఆమె ఇంట్లో వున్నదనిన్నీ చెప్పాడు. హమీద్‌కు అడుగు ముందుకు పడలేదు. ఇల్లుగూడా అమ్మవలసినంత కష్టంలో తల్లి పడిపోయింది కాబోలు అనుకున్నాడు. పనసచెట్టు ఆదాయంతో కాలక్షేపం చేస్తున్నదనుకొని పొరపాటు చేశాననుకొన్నాడు. తల్లికి మొఖం చూపించడమెలా? దర్జీ ఆమె ఇంటికి కాళ్లీడ్చుకుంటూ చేరాడు. దర్జీ సోతీ తలుపు తీసింది. ‘‘హమీద్ వచ్చాడు’’ అంటూ పరుగెత్తింది. హమీద్ తల్లి ఈమధ్య అశక్తత వల్ల ఇంట్లో అటూయిటూ నడవడం గూడా మానుకొన్నది. హమీద్ వచ్చాడనడంతోనే గభీమని లేచి ఆలింగనం చేసుకొన్నది. వెక్కి వెక్కి ఏడ్చింది. ఆమె శరీరంలో ఎముకలు తప్ప ఏమీలేవు. చాలాసేపు ఇద్దరూ మాట్లాడలేకపోయినారు. ‘‘నాయనా! చాలా దూరంనుండి వచ్చావు. గుడ్డలన్నీ తడిసిపోయినవి. గుడ్డలు మార్చుకో. టీ తీసుకొని వస్తాను. పిల్లలంతా కులాసాగా ఉన్నారా?’’ అని ప్రశ్నించింది. ‘‘అమ్మా! ఇల్లు అమ్మివేశావా? నాకు తెలియజేయలేదేమి?’’ అని అడిగాడు. ‘‘నీకు మాత్రం కష్టాలు తక్కువగా ఉన్నవి గనుకనా? నా బాధకూడా నీకెందుకు నాయనా? ఈ జన్మలో నిన్ను చూడలేనేమో అనుకున్నాను’’ అన్నది. హమీద్ బొటబొటా నీళ్లు కార్చాడు. ‘‘నీవు ఇంకా పనిచేస్తూనే ఉన్నావా?’’ ‘‘చేతులు బాగానే ఉన్నవి గాని కళ్లుమాత్రం నెలరోజుల నుండి కనపడడం లేదు నాయనా.’’ ‘‘కళ్లు కనపడడం లేదా?’’ అన్నాడు ఆతురతతో హమీద్. ‘‘నీవు కనపడుతూనే ఉన్నావు. రోజూ సూర్యుడు కనబడతాడు. అంతే. చిన్నపిల్లవాడు కులాసాగా ఉన్నాడా? వాడి వయస్సెంత?’’ ‘‘సంవత్సరంనర’’ ‘‘అయితే చొక్కా, టోపీ వాడికి సరిపోతవి’’ అంటూ ఒక పాత గుడ్డల మూట విప్పి అందులోనుండి ఒక చొక్కాను, బుటేదారి పనిచేసియున్న ఒక టోపీని బయటకు తీసింది. ‘‘మజీద్ కోసం ఇవి తయారుచేశావా?’’ అని హమీద్ కన్నీళ్లు కార్చాడు. ‘‘సలామా కోసం పంపుదామంటే నీవు రానేలేదు. తర్వాత చచ్చిపోయిందని ఉత్తరం వ్రాశావు’’ అని కన్నీళ్లు పెట్టుకొన్నది. ఏమిటేమిటో ఆలోచనలు. పక్క ఇంటి నసీబన్ గూడా వచ్చింది. నసీబన్, హమీద్ తల్లి, సోతీ వంట ఇంట్లో ఏమేమిటో చేస్తూ ఉండిపోయినారు. ఎనిమిది గంటలకు తల్లి బయటకు వచ్చి భోజనానికి లేవమన్నది. బీదస్థితిలో ఉన్నది గనుక తల్లి జొన్నరొట్టె చేసి ఉంటుందనుకొన్నాడు. కాని కబాబు, మేక గుండెకాయ కూర, పొరాఠాలు, మినప్పప్పు, మామిడికాయ పచ్చడి, ఒక కప్పులో మీగడ. తల్లి కూర్చొని కొసరి కొసరి వడ్డించింది. ‘‘నాయనా! ఒక్క మాట చెపుతాను. వింటావా?’’ హమీద్ గుండె దడదడలాడింది. తనతోగూడా ఢిల్లీ వస్తానంటుందనుకొన్నాడు. ‘‘నీవు పట్టణంలో ఉండేవాడివి. నేను పరాయివాళ్ల పంచల్లో తలదాచుకొంటున్నాను. నీకు ఎలా మర్యాద చేయగలను? నసీబన్‌ను పంపించి ఖాన్‌సాహెబ్ గారి ఇంట్లో ఒక గది బాగు చేయించాను. మంచం, పక్కా వేయించాను. కాని నీవు నాతోబాటే ఉంటే బాగా ఉంటుందని నా మనస్సు కోరుతున్నది.’’ తల్లి మాటలకు హమీద్ గుండె కరిగిపోయింది. ‘‘నీ దగ్గర ఉండకపోతే నేను యింకెక్కడకు పోతాను?’’ అన్నాడు. నసీబన్‌ను పిలిచి మంచం తన గదిలో వేయించింది. ఒక మూట విప్పి తెల్లటి దుప్పటి బయటకు తీసింది. దుప్పటి మీద రకరకాల లతలు కుట్టివున్నవి. రెండు దిండ్లు బయటకు తీసింది. తెల్లటి గలీబులు తొడిగివున్నవి. చిన్న సీసాలోనుంచి తీసి గలీబులకు అత్తరు రాసింది. మంచం కింద ఒక పీక్దానును పెట్టించింది. ఢిల్లీపూల నల్ల చెప్పుల జోడు– కొత్తది– మంచం కాళ్లవైపున పెట్టి, నిద్రపొమ్మన్నది. హమీద్ ఈ తమాషానంతా చూస్తున్నాడు. యా అల్లాహ్! ఈ సామానంతా ఎలా వచ్చింది? తల్లిని అడిగాడు. ‘‘ఏడు సంవత్సరాలు ఎదురుచూశాను. ఇల్లు అమ్మాను. పొట్ట బిగించుకొని నీ కోసం, నీ పిల్లల కోసం ఈ వస్తువుల్ని సేకరించాను. సలామాను చూడనే లేదు’’ అంటూ వెక్కి వెక్కి ఏడ్చింది. తల్లి మాటలను విని శాంతిదేవత ఆ చిన్నగదినిండా తన రెక్కలను విప్పింది. ఇక ఎవరూ ఏమీ మాట్లాడలేదు. తెల్లవారింది. హమీద్ తల్లి ఇక కళ్లు తెరవలేదు. ‘ఉర్దూ కథా సాహిత్యంలో విశిష్ట స్థానం సంపాదించుకొన్న’ రుకైయ్యా రీహానా కథ ‘తల్లి’కి సంక్షిప్త రూపం ఇది. దీన్ని వేమూరి ఆంజనేయశర్మ తెలుగులోకి అనువదించారు. విశ్వసాహిత్య గ్రంథమండలి 1946లో ప్రచురించిన ‘ఉర్దూ కథలు’ సంకలనంలో ఈ కథ ఉంది. సౌజన్యం: kathaaprapancham.in -
వేధింపులకు చెంపదెబ్బ
సాక్షి, న్యూఢిల్లీ: లైంగిక వేధింపులకు పాల్పడుతున్న వ్యక్తిని ధైర్యంగా అడ్డగించిన యూపీకి చెందిన షామ్లి ఇప్పుడు బాలికలు, యువతులకు స్ఫూర్తిగా నిలిచారు. తాజాగా దేశ రాజధానిలో ఓ స్కూల్ బాలిక నిత్యం తనను వేధిస్తున్న ప్రబుద్ధుడి చెంప పగులకొడుతున్న వీడియో హల్చల్ చేస్తోంది. ఆమెను రోజూ వేధిస్తున్నందుకు ఈ ఘటన తర్వాత నిందితుడు కుమిలిపోయాడు. నడివీధిలో ఈ ఘటన చోటుచేసుకున్నా ఏ ఒక్కరూ జోక్యం చేసుకోలేదు. మహిళలపై పెరుగుతున్న నేరాలపై సర్వోన్నత న్యాయస్ధానం ఇటీవల తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఎవరినో ప్రేమించాలని ఏ మహిళపై ఒత్తిడి తీసుకురారాదని, ఇది ఆమె స్వతంత్రంగా తీసుకోవాల్సిన నిర్ణయమని జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని సుప్రీం బెంచ్ స్పష్టం చేసింది. -
స్కూలుకు వెళ్లిన హీరోయిన్
టాలీవుడ్ నుంచి బాలీవుడ్‌కు ఎగిరిపోయి, 'పింక్' సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న హీరోయిన్ తాప్సీ పన్ను. చిన్నప్పుడు తాను చదువుకున్న స్కూలుకు ఆమె మరోసారి వెళ్లింది. చదువుతో పాటు ఆటపాటలు, ఆత్మరక్షణ విద్యలు కూడా నేర్చుకోవాలని అక్కడి విద్యార్థినులకు చెప్పింది. ఢిల్లీలోని మాతా జై కౌర్ పబ్లిక్ స్కూలుకు ఆమె వెళ్లింది. అక్కడ ఆమెకు పాఠాలు చెప్పిన నాటి టీచర్లతో పాటు కొందరు సీనియర్ అధికారులు ఆమెను సాదరంగా స్వాగతించారు. అక్కడకు వెళ్లగానే ఒక్కసారిగా పాత జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయని, తన టీచర్లు, అక్కడి పిల్లలు తనకు చాలా మంచి స్వాగతం పలికారని ఆమె చెప్పింది. స్కూల్లో పిల్లలు తనను ఆదరించడంతో పాటు ఆత్మరక్షణ విద్యలు కూడా నేర్చుకోవడం ఎంతో సంతోషంగా అనిపించిందని తెలిపింది. వాళ్లు ఒక డెమో క్లాస్ కూడా చూపించారని, అది చాలా బాగుందని తాప్సీ అంది. వచ్చిన ప్రతి ఒక్క అవకాశాన్ని ఉపయోగించుకుని జీవితంలో ఎదగాలని, ఎప్పుడూ నిరాశ చెందొద్దని పిల్లలకు ఉద్బోధించింది. ఇదే స్కూల్లో చదివేటప్పుడు తాను కూడా డిబేట్ పోటీలు, డాన్స్, డ్రామాలు, వివిధ ఆటల పోటీలలో పాల్గొనేదాన్నని వివరించింది. స్కూళ్లలో తప్పనిసరిగా ఆత్మరక్షణ విద్యలను కూడా బోధనలో ఒక భాగంగా చేయాలని తాప్సీ రెండు నెలల క్రితం తన స్కూలు యాజమాన్యాన్ని కోరింది. దాంతో సమ్మర్ క్యాంపులో భాగంగా కరాటే శిక్షణను అమ్మాయిల కోసం ప్రత్యేకంగా ఏర్పాటుచేసి, తాప్సీని ఆహ్వానించారు. -
గ్యాస్ లీక్.. 50 మంది విద్యార్థులకు అస్వస్థత
-
గ్యాస్ లీక్.. 50 మంది విద్యార్థులకు అస్వస్థత
దక్షిణ ఢిల్లీలో తెల్లవారుజామునే పెనుప్రమాదం త్రుటిలో తప్పింది. తుగ్లకాబాద్‌కు సమీపంలోని పుల్ పెహ్లాద్పూర్ ప్రాంతంలో ఉన్న రాణీ ఝాన్సీ స్కూలు సమీపంలో ఓ కంటెయినర్ నుంచి గ్యాస్ లీకైంది. దాంతో వంద మంది విద్యార్థులను స్కూలు నుంచి వెంటనే బయటకు తీసుకొచ్చేశారు. వారిలో 50 మంది అస్వస్థత పాలు కావడంతో వారిని వెంటనే సమీపంలో ఉన్న మూడు వేర్వేరు ఆస్పత్రులకు తరలించారు. ఘటన స్థలానికి అంబులెన్సులతో పాటు పోలీసులు చేరుకున్నారు. గ్యాస్ లీకేజికి కారణం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే గ్యాస్ లీకైన సమయానికి ఎక్కడా మంటలు లేకపోవడం.. సమయానికి అప్రమత్తమై విద్యార్థులను బయటకు తీసుకొచ్చేయడంతో పెద్ద ప్రమాదమే తప్పినట్లయింది. గతంలో తూర్పుగోదావరి జిల్లాలో ఓఎన్జీసీ పైపులైన్ల నుంచి గ్యాస్ లీకైనప్పుడు టీ పెట్టేందుకు స్టవ్ వెలిగించాలని అగ్గిపుల్ల గీస్తే.. ఆ మంటలు ఊరంతా వ్యాపించిన గ్యాస్‌కు అంటుకుని భారీ ప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. -
ఇద్దరు అమ్మాయిలు లైంగికంగా వేధించారు
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో అఘాయిత్యాలు నిత్యకృత్యమయ్యాయి. పశ్చిమ ఢిల్లీలోని మోతీనగర్‌లో ఓ స్కూల్లో ఇద్దరు అమ్మాయిలు కలసి జూనియర్ విద్యార్థిని కొన్ని నెలల పాటు లైంగికంగా వేధించారు. చివరకు బాధితురాలు (7) ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పగా, అమ్మాయి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇద్దరు నిందితుల్లో ఒక మైనర్ అమ్మాయి ఉంది. ఈ అమ్మాయి ఆచూకీ తెలియరాలేదు. పోలీసులు మరో నిందితురాలిని అరెస్ట్ చేశారు. స్కూల్లో భోజన విరామ సమయంలో సీనియర్ అమ్మాయిలు.. బాధితురాలిని ఖాళీ గదిలోకి తీసుకెళ్లి అసభ్యకరంగా ప్రవర్తించేవారు. బాధితురాలు అడ్డుచెబితే వారు భయపెట్టేవారు. దుస్తులు విప్పేసి అసహజ కార్యకలాపాలకు పాల్పడేవారు. బాధితురాలిని తండ్రి ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయించిన అనంతరం కౌన్సిలింగ్ ఇప్పించారు. బాధితురాలితో పాటు కుటుంబ సభ్యులకు, స్కూల్ విద్యార్థులకు నిపుణులు కౌన్సిలింగ్ ఇవ్వనున్నారు. -
ఢిల్లీలో ‘బాంబు’లాట
వసంత్ విహార్ స్కూలుకు బెదిరింపు కాల్ అర్ధ గంట తనిఖీల తర్వాత ఉత్తుత్తి కాల్ అని నిర్ధారణ ఊపిరిపీల్చుకున్న యాజమాన్యం బాంబు కాల్‌తో ఢిల్లీలో దిగిన విమానం ఇదీ బెదిరింపు కాలేనని వెల్లడి ఆకతాయిల కోసం పోలీసుల వేట న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీని గురువారం రెండు ‘బాంబు కాల్స్’ భయపెట్టాయి. దక్షిణ ఢిల్లీ వసంత్ విహార్‌లోని మోడ్రన్ స్కూళ్లో, ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో బాంబులు పెట్టినట్లు గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేయడంతో ఆయా యంత్రాంగాలు పరుగులు పెట్టాయి. చివరికి ఇవి బూటకపు కాల్స్ అని తేలడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ బెదిరింపు కాల్స్ చేసిన ఆకతాయిలను పట్టుకునేందుకు పోలీసులు వేట ప్రారంభించారు. స్కూల్లో కలకలం దక్షిణ ఢిల్లీ వసంత్ విహార్‌లోని మోడ్రన్ స్కూళ్లో బాంబు ఉందంటూ గురువారం మధ్యాహ్నం 12.50 గంటలకు ఓ గుర్తు తెలియని వ్యక్తి యాజమాన్యానికి వ్యక్తి చేశాడు. ఓ బ్యాగ్‌లో బాంబు ఉందని, అది సరిగ్గా ఒంటి గంటకు పేలుతుందని చెప్పాడు. దీంతో స్కూలు యాజమాన్యం వెంటనే పోలీసులకు సమాచారం అందించి బాంబు నిర్వీర్యం చేసే బలగాన్ని రప్పించింది. వారు బ్యాగులను తనిఖీ చేసి అంతా బూటకమని తేల్చారు. ఈ మేరకు దక్షిణ జిల్లా డీసీపీ ప్రేమ్ నాథ్ వివరాలు వెల్లడించారు. ఫోన్ చేసిన వ్యక్తి తాను సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (సీఐఏ)కు చెందినవాడినని చెప్పుకున్నాడని డీసీపీ వివరించారు. పరీక్షలకు లేని అంతరాయం స్కూళ్లో 12వ త రగతి బోర్డు పరీక్షలు జరుగుతున్న సమయంలో ఈ కాల్ వచ్చింది. అయితే ఫోన్ కాల్ వచ్చే సమయానికే విద్యార్థులు పరీక్ష రాసి బయటకు వచ్చారని, మిగతా తరగతుల విద్యార్థులకు సెలవు కావడంతో వారు స్కూలుకు రాలేదని డీసీపీ ప్రేమ్‌నాథ్ తెలిపారు. ఫోన్ కాల్ వచ్చినప్పుడు పాఠశాల భవనంలో టీచర్లు, ఇతర సిబ్బంది మాత్రమే ఉన్నారు. వారిని భవనం నుంచి బయటకు పంపించి, బాంబు, డాగ్ స్క్వాడ్లతోనూ సోదాలు జరిపించాం. అర్ధ గంట సోదాల తర్వాత ఏమీ కనిపించకపోవడంతో అది ఉత్తుత్తి బెదిరింపు కాల్ అని తేల్చాం’ అని డీసీపీ వివరించారు. ప్రస్తుతం పరిస్థితి సాధారణంగానే ఉందని వెల్లడించారు. ఈ బెదిరింపు కాల్ ఓ ల్యాండ్‌లైన్ నుంచి వచ్చిందని పోలీసు వర్గాలు తెలిపాయి. ఈ కాల్ జాడ కనిపెట్టేందుకు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నట్లు స్పష్టం చేశాయి. ఎయిర్‌పోర్టులో గోరక్‌పూర్ విమానం గోరక్‌పూర్‌కు వెళ్లాల్సిన జెట్ ఎయిర్వేస్కు చెందిన విమానంలో బాంబు ఉన్నట్లు గురువారం బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో విమానాన్ని ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేసి క్షుణ్నంగా పరిశీలించారు. అనంతరం బెదిరింపు కాల్ అని తేలడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ‘జైపూర్-గోరక్‌పూర్ జెట్ విమానం (9 డబ్ల్యూ 2647 నంబర్) మధ్యాహ్నం 3.30 గంటలకు గోరక్‌పూర్‌కు చేరుకోవాల్సి ఉంది. అయితే విమానంలో బాంబు ఉన్నట్లు మధ్యాహ్నం 12.08 గంటలకు గోరక్‌పూర్ ఎయిర్ డెరైక్టర్ కార్యాలయానికి బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో మధ్యాహ్నం 12.57 గంటలకు విమానాన్ని ఢిల్లీలో అత్యవసరంగా ల్యాండ్ చేసి క్షుణ్నంగా పరిశీలించాం’ అని పోలీస్ డిప్యూటీ కమిషనర్ (ఐజీఐ) దినేష్ కుమార్ గుప్తా వెల్లడించారు. అలాగే విమానంలోని 61 మంది ప్రయాణికులతో పాటు నలుగురు సిబ్బందిని చెక్ చేసినట్లు ఆయన వివరించారు. అనంతరం అది కేవలం బెదిరింపు కాల్ అని వెల్లడికావడంతో మధ్యాహ్నం 3.18 గంటలకు విమానం గోరక్‌పూర్‌కు బయలుదేరింది.