![Four Year Old Girl Molested By Daily wager In Mumbai - Sakshi](/styles/webp/s3/article_images/2019/09/24/Rape.jpg.webp?itok=6uLERe61)
ముంబై : మహారాష్ట్రలో దారుణం జరిగింది. ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారిపై ఓ 24 ఏళ్ల యువకుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అభం శుభం తెలియని చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన నావి ముంబై నగరంలో గత ఆదివారం చోటు చేసుకోగా, ఆలస్యంగా నేడు వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నావి ముంబైలోని తలోజా ఏరియాకు చెందిన నాలుగేళ్ల చిన్నారి గత ఆదివారం ఆడుకోవడానికై బయటకు వెళ్లింది. అక్కడే ఉన్న అశోక్ కుమార్ యాదవ్(24) అనే దినసరి కూలి ఆ చిన్నారిపై కన్నేశాడు. మాయ మాటలు చెప్పి ఆమెను ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లాడు. అనంతరం ఆమెపై అత్యాచారానికి పాల్పడాడ్డడు. చిన్నారి ప్రైవేట్ భాగాలలో గాయలను చూసిన తల్లిదండ్రులు బాలికను ప్రశ్నించగా అసలు విషయం చెప్పింది. దీంతో బాలిక తండ్రి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అనంతరం చిన్నారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. బాలిక ఫిర్యాదు మేరకు అశోక్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment