లాక్‌డౌన్‌ వేళ జమ్మూ కశ్మీర్‌లో దారుణం | 3 Year Old Girl Molested By Neighbour In Jammu And Kashmir | Sakshi
Sakshi News home page

మూడేళ్ల చిన్నారిపై అత్యాచారం

Published Thu, Apr 9 2020 8:37 AM | Last Updated on Thu, Apr 9 2020 10:51 AM

3 Year Old Girl Molested By Neighbour In Jammu And Kashmir - Sakshi

శ్రీనగర్‌: ఒకవైపు  ప్రపంచమంతా కరోనా కల్లోలంతో భయకంపితులవుతున్న వేళ జమ్మూ కశ్మీర్‌లో దారుణం చోటు చేసుకుంది. మూడేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు పొరుగింటి వ్యక్తి. ఈ దారుణ ఘటన రాంబన్ జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..రాంబన్‌ జిల్లాకు చెందిన మూడేళ్ల చిన్నారి బుధవారం ఇంటి ముందుకు అడుకుంటుండగా.. పవన్‌ సింగ్‌(18) అనే పొరుగింటి యువకుడు ఆమెను ఇంట్లోకి తీసుకెళ్లాడు. అనంతరం ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. చిన్నారి ఏడుపులు వినపడడంతో ఆమె తల్లి ఇంట్లోకి వెళ్లి చూడగా.. చిన్నారి అపస్మారక స్థితిలో పడిఉంది. ఆమెను వెంటనే అస్పత్రికి తరలించారు. చిన్నారి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పవన్‌ సింగ్‌ని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. చిన్నారిని వైద్యపరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించామని, రిపోర్ట్‌ ఆధారంగా తదుపరి విచారణ చేపడుతామని పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement