
చెన్నై : అభంశుభం తెలియని నాలున్నరేళ్ల చిన్నారిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డా ఓ కామాంధుడు. బస్టాండ్‌లో కూర్చున చిన్నారి దగ్గరికెళ్లి బుగ్గలపై ముద్దులు పెడుతూ.. అసభ్యకరంగా ప్రవర్తించాడు. చిన్నారి తల్లి అప్రమత్తమై అరవడంతో.. స్థానికులు నిందితుడిని పట్టుకొని పోలీసుకు అప్పగించారు. ఈ ఘటన తమిళనాడులోని మధురైలో గత మంగళవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మధురైకి చెందిన ఓ మహిళ తన నాలున్నరేళ్ల చిన్నారితో కలిసి బంధువుల ఇంటికి వెళ్లేందుకై అరపాలయం బస్ టెర్మినల్‌లో నిలుచున్నారు.
కొద్దిసేపటి తర్వాత ఆమెకు దాహం వేయడంతో చిన్నారిని అక్కడే కూర్చోబెట్టి పక్కనే ఉన్న కుళాయి దగ్గరు వెళ్లారు. ఈక్రమంలో అక్కడే ఉన్న ఎస్ సెంథిల్ అనే లేబర్.. చిన్నారి దగ్గరికెళ్లి బిత్తిరి చర్యలకు పాల్పడ్డాడు. చిన్నారి బుగ్గలపై ముద్దులు పెడుతూ..అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో చిన్నారి బిగ్గరగా ఏడ్చింది. అప్రమత్తమైన తల్లి పరుగున వచ్చి చిన్నారిని ఒడిలోకి తీసుకుంది. అయినప్పటికీ సెంథిల్ అక్కడి నుంచి వెళ్లకుండా ఆమెతో కూడా అసభ్యకరంగా ప్రర్తించాడు. అసభ్యపదజాలంతో దూషిస్తూ.. ఆమెపై చేయిచేసుకునేందుకు యత్నించాడు. దీంతో స్థానికులు అతన్ని పట్టుకొని దేహాశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. చిన్నారి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని సెంథిల్‌ను అదుపులోకి తీసుకున్నామని మధురై పోలీసులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment