రైలు బోగీలో సిలిండర్‌ పేలి.. 10 మంది మృతి | Terrible Fire Accident In Train Coaches At Madurai Railway Station, 5 People Killed - Sakshi
Sakshi News home page

Madurai Train Fire Accident: రైలు బోగీలో పేలిన సిలిండర్‌.. పలువురు మృతి

Published Sat, Aug 26 2023 8:11 AM | Last Updated on Sat, Aug 26 2023 3:35 PM

Terrible Fire Accident In Train Coaches At Madurai Railway Station - Sakshi

ఓ వ్యక్తి దొంగతనంగా సిలిండర్‌ తీసుకెళ్లి టీ చేసుకునే ప్రయత్నంలో.. 

చెన్నై: తమిళనాడులోని మధురై రైల్వేస్టేషన్‌లో భారీ అగ్ని ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ఆగి ఉన్న రైలు బోగీ (ప్రైవేటు పార్టీ కోచ్‌)లో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో బోగీలో భారీగా మంటలు ఎగిసిపడటంతో 10 మంది మృతి చెందారు.

వివరాల ప్రకారం.. ఈ ప్రైవేటు పార్టీ కోచ్‌ ఆగస్టు 17న ఉత్తరప్రదేశ్‌లోని లక్నో నుంచి తన ప్రయాణాన్ని ప్రారంభించింది. శుక్రవారం నాగర్‌కోయిల్ జంక్షన్‌ వద్ద దీన్ని పునలూరు-మధురై ఎక్స్‌ప్రెస్‌ రైలుకు అటాచ్‌ చేశారు. నిన్న రాత్రి మదురై రైల్వే స్టేషన్‌ వద్ద దీన్ని డిటాచ్‌ చేసి స్టాబ్లింగ్‌ లైన్‌లో నిలిపి ఉంచారు. శనివారం తెల్లవారుజామున 5.15 గంటల ప్రాంతంలో రైల్లోకి అక్రమంగా తీసుకొచ్చిన సిలిండర్‌పై టీ చేస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.  

దీంతో మంటలు చేలరేగాయి. చూస్తుండగానే బోగీ అంతా వ్యాపించాయి. మంటలను గుర్తించిన కొంతమంది ప్రయాణికులు వెంటనే బోగీ నుంచి కిందకు దిగారు అని దక్షిణ రైల్వే అధికారులు వెల్లడించారు. సమాచారమందుకున్న రైల్వే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు. ఈ ఘటనలో 10 మంది మృతిచెందగా.. మరో 20 మంది గాయపడ్డారు. ప్రమాద సమయంలో బోగీలో 65 మంది ఉన్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. ఘటనపై దర్యాప్తు చేపడుతున్నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement