చెన్నై: తమిళనాడులో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ప్రైవేటు ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం కారణంగా చిన్నారి సహా ఏడుగురు మృతిచెందగా.. మరో 20 మంది అస్వస్థతకు గురైనట్టు సమాచారం. అయితే, షార్ట్ సర్య్కూట్ కారణంగానే మంటలు చెలరేగినట్టు పోలీసులు వెల్లడించారు.
వివరాల ప్రకారం.. తమిళనాడులోని దిండిగుల్‌లో ఉన్న ప్రైవేటు ఆసుపత్రిలో గురువారం రాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్ సర్య్కూట్ కారణంగా మొదట ఆసుపత్రి భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్లో మంటలు చెలరేగాయి. అనంతరం, భవనం మొత్తానికి వ్యాపించాయి. ఈ క్రమంలో ఆసుపత్రి సిబ్బంది అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ టెండర్స్ మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించగా రెండు గంటల తర్వాత మంటలు అదుపులోకి వచ్చాయి.
అగ్ని ప్రమాదం కారణంగా ఆసుపత్రి భవనం మొత్తం దట్టమైన పొగ అలుముకుంది. దీంతో, ఆసుపత్రిలో ఉన్న రోగులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అగ్నిప్రమాదం కారణంగా ఏడుగురు మృతిచెందగా.. మరో 20 మంది అస్వస్థతకు గురయ్యారు. మృతుల్లో ఒక చిన్నారి, ఇద్దరు మహిళలు ఉన్నట్టు పోలీసులు తెలిపారు.
ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో దాదాపు 30 మంది రోగులు ఉన్నట్టు ఆసుపత్రి సిబ్బంది తెలిపారు. అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే గాయపడిన, అస్వస్థతకు గురైన రోగులను 50 అంబులెన్స్‌ల సాయంతో ఇతర ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం జరిగిన ఆసుపత్రి వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
#TamilNadu : #HospitalFire
At least 6 people, including a child and 3 women died and 6 others were injured, after a #fire broke out at a four-story private Hospital in #Dindigul on Thursday night.
Reportedly the victims succumbed to suffocation caused by the thick #smoke that… pic.twitter.com/2Iac9Qt5Gh— Surya Reddy (@jsuryareddy) December 12, 2024
Comments
Please login to add a commentAdd a comment