టపాకాయలను ఎలా కాల్చాలో చూపించాడు.. అంతలోనే | Cracker Shop Firing Three People Deceased At Vellore In Tamil Nadu | Sakshi
Sakshi News home page

టపాకాయలను ఎలా కాల్చాలో చూపించాడు.. అంతలోనే

Published Tue, Apr 20 2021 7:04 AM | Last Updated on Tue, Apr 20 2021 9:07 AM

Cracker Shop Firing Three People Deceased At Vellore In Tamil Nadu - Sakshi

అగ్ని ప్రమాదం జరిగిన టపాకాయల దుకాణం

వేలూరు: కాట్పాడి సమీపంలోని లత్తేరి బస్టాండ్‌ వద్ద టపాకాయల దుకాణంలో జరిగిన ప్రమాదానికి నిర్లక్ష్యమే కారణమని సీసీ ఫుటేజీ ద్వారా వెల్లడైంది. మోహన్‌రెడ్డి(55) అనే వ్యక్తి స్థానికంగా టపాకాయల దుకాణం నడుపుతున్నాడు. ఆదివారం ఉదయం తన మనుమళ్లు తేజశ్వరన్, ధనుష్‌తో కలసి దుకాణానికి వచ్చాడు. ఆ సమయంలో వచ్చిన కొనుగోలుదారుడికి కొత్తరకం టపాకాయలను చూపించాడు. వాటిని ఎలా కాల్చాలో చూపించే క్రమంలో నిప్పు రవ్వలు పడి దుకాణంలోని టపాకాయలు అంటుకున్నాయి. ఈప్రమాదంలో మోహన్‌రెడ్డి, ఇద్దరు మనుమళ్లు మృతి చెందారు. ఈ ప్రమాదం ఘటన పూర్తి దృశ్యాలు సీసీ కెమెరాల్లో నమోదైనట్లు పోలీసులు తెలిపారు.

మోహన్‌రెడ్డి, తేజశ్వరన్, ధనుష్‌ (ఫైల్‌)   
చదవండి: అరేబియా సముద్రంలో 300 కేజీల డ్రగ్స్‌ స్వాధీనం
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement