చెన్నై: తమిళనాడులోని కల్లకురిచి జిల్లా శంకరాపురంలో మంగళవారం ఒక బాణాసంచా దుకాణంలో పేలుళ్లు సంభవించి ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. దీపావళిని పురస్కరించుకొని శంకరాపురం పట్టణంలో ఏర్పాటు చేసిన దుకాణంలో ఆకస్మాత్తుగా టపాసులు పేలాయి.
దీంతో ఒక్కసారిగా దుకాణంలో భారీగా మంటలు వ్యాపించాయి. ఈ మంటల్లో చిక్కుకుని తీవ్ర గాయాలపాలైన 10 మందిని కల్‌కర్చి ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన చికిత్స కోసం తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉంది.
ప్రమాద ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. మృతుల కుటుంబానికి 5 లక్షలు, తీవ్రంగా గాయపడ్డవారికి లక్ష రూపాయలను స్టాలిన్ ప్రభుత్వం ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. సహాయక చర్యలను కల్లకురిచి జిల్లా కలెక్టర్ శ్రీధర్, ఎస్పీ జియవుద్దీన్‌లు ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. బాణసంచా షాప్ కు పక్కన ఉన్న దుకాణాలు కూడా దగ్ధమైనట్లు అధికారులు తెలిపారు.
At least five people were killed and as many injured in a blast at a firecracker shop in Sankarapuram town in Kallakurichi district in Tamil Nadu on Tuesday, police said.#Firecrackerblast #TamilNadu #Kallakurichi pic.twitter.com/0YpHRXCBJh
— Express Chennai (@ie_chennai) October 27, 2021
Comments
Please login to add a commentAdd a comment