shankarapuram
-
తమిళనాడులో భారీ అగ్నిప్రమాదం.. ఆరుగురు సజీవదహనం
చెన్నై: తమిళనాడులోని కల్లకురిచి జిల్లా శంకరాపురంలో మంగళవారం ఒక బాణాసంచా దుకాణంలో పేలుళ్లు సంభవించి ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. దీపావళిని పురస్కరించుకొని శంకరాపురం పట్టణంలో ఏర్పాటు చేసిన దుకాణంలో ఆకస్మాత్తుగా టపాసులు పేలాయి. దీంతో ఒక్కసారిగా దుకాణంలో భారీగా మంటలు వ్యాపించాయి. ఈ మంటల్లో చిక్కుకుని తీవ్ర గాయాలపాలైన 10 మందిని కల్కర్చి ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన చికిత్స కోసం తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాద ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. మృతుల కుటుంబానికి 5 లక్షలు, తీవ్రంగా గాయపడ్డవారికి లక్ష రూపాయలను స్టాలిన్ ప్రభుత్వం ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. సహాయక చర్యలను కల్లకురిచి జిల్లా కలెక్టర్ శ్రీధర్, ఎస్పీ జియవుద్దీన్లు ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. బాణసంచా షాప్ కు పక్కన ఉన్న దుకాణాలు కూడా దగ్ధమైనట్లు అధికారులు తెలిపారు. At least five people were killed and as many injured in a blast at a firecracker shop in Sankarapuram town in Kallakurichi district in Tamil Nadu on Tuesday, police said.#Firecrackerblast #TamilNadu #Kallakurichi pic.twitter.com/0YpHRXCBJh — Express Chennai (@ie_chennai) October 27, 2021 చదవండి: Match Box: 14 ఏళ్ల తరువాత ధర డబుల్ .. -
రూ.53 కోట్లతో సామాజిక సేవా కార్యక్రమాలు
నిడదవోలు : లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గోల్డెన్ జూబ్లీ ఫౌండేషన్ ద్వారా దేశంలో ఇప్పటివరకు రూ. 53 కోట్ల రూపాయలతో వివిధ సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించినట్లు ఎల్ఐసీ సౌత్ ఇండియా జోనల్ చీఫ్ మేనేజర్ సునిల్‌కుమార్ పేర్కొన్నారు. మండలంలో శంకరాపురం గ్రామంలోని హృదయాలయానికి రూ.9 లక్షలు విలువ చేసే టాటా వింజర్ వాహనాన్ని శనివారం అందించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో ఆయన మాట్లాడుతూ 2006లో ఎల్ఐసీ గోల్డెన్ జూబ్లీ ఫౌండేషన్ ఏర్పడిందన్నారు. ఈ ఫౌండేషన్ ద్వారా ఇప్పటివరకు 341 ప్రాజెక్ట్‌ల ద్వారా విద్య, వైద్య, పేద విద్యార్థుల ఉపకార వేతనాలు స్వచ్ఛంద సంస్థలకు చేయూత, ఆసుపత్రులకు పరికరాల కొనుగోలు వంటి సేవా కార్యక్రమాలను నిర్వహించమన్నారు. వీటి కోసం ఇప్పటి వరకు రూ. 53 కోట్లు ఖర్చు చేసినట్టు చెప్పారు. ఆర్థికంగా వెనుకబడిన పేద మెరిట్ విద్యార్థులకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకుంటే వారి చదువు కోసం ఎల్ఐసీ ఆర్థిక సహాయాన్ని అందిస్తుందని చెప్పారు. దేశవ్యాప్తంగా పేద విద్యార్థులకు రూ. 20 కోట్ల మేర ఉపకార వేతనాలని అందించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎల్ఐసీ రాజమండ్రి డివిజన్ మేనేజర్ జె.రంగారావు తదితరులు పాల్గొన్నారు. -
మెరుగుపెడతామంటూ.. నిలువునా మోసం
శంకరాపురం (శంషాబాద్ రూరల్), న్యూస్‌లైన్: బంగారు నగలకు మెరుగు పెడతామంటూ మహిళలను నమ్మించి ఏడు తులాల బంగారు మంగళసూత్రాలను ఎత్తుకెళ్లిన సంఘటన శంషాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. బాధితులు, పోలీసుల కథనం ప్రకారం.. ఇద్దరు ఆగంతకులు మంగళవారం ఉదయం బైక్‌పై మండలంలోని శంకరాపురం గ్రామానికి వచ్చారు. వెండి, బంగారు నగలకు మెరుగుపెడతామంటూ గ్రామంలో తిరిగారు. ఎవరూ ఆసక్తి చూపకపోవడంతో ఊరి చివరన ఉన్న జెజ్జెల రాజు, కుమార్ సోదరుల ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో ఇంటి వద్ద వారి భార్యలు సుమలత, లావణ్య ఉన్నారు. దుండగులు తమ వద్ద ఉన్న పౌడర్‌తో ఇత్తడి వస్తువులకు మెరుగుపెడతామని చెప్పారు. వారు ఇంట్లోంచి ఇత్తడి దీపం తెచ్చిచ్చారు. పౌడర్‌తో కొద్దిసేపు కడిగి మెరిసేలా చేశారు. వెండి నగలకు కూడా మెరుగు పెడతామని చెప్పగా లావణ్య తన కాళ్ల పట్టీలు తీసిచ్చింది. వాటికీ మెరుగు పెట్టిన తర్వాత బంగారు నగలిస్తే వాటినీ మెరిసేలా చేస్తామని నమ్మబలికారు. దీంతో తోడికోడళ్లు తమ ఒంటిపై ఉన్న బంగారు మంగళ సూత్రాలను తీసిచ్చారు. వాటిని ఇంట్లోని వంట గదిలోకి తీసుకెళ్లి ఒక చిన్న గిన్నెలో పసుపు కలిపిన నీళ్లలో వేశారు. ఆ సమయంలో ఒకరు ఇంట్లో ఉండగా మరొకరు సమీపంలో నిలిపిన బైక్ వద్దకు వెళ్లాడు. లోపలికి వెళ్లిన ఆగంతకుడు నగలను కుక్కర్లో వేసి పది నిమిషాలు వేడి చేస్తే ధగధగలాడతాయని నమ్మించి వాటిని కుక్కర్లో వేసినట్లు చేసి కాజేశాడు. ఇద్దరూ కలిసి అక్కడి నుంచి నెమ్మదిగా జారుకున్నారు. ఆలస్యంగా తెలుసుకున్న బాధితులు గుర్తు తెలియని వ్యక్తులు బైక్‌పై వెళ్తుండడం చూసి స్థానికులకు అనుమానం వచ్చింది. వీరు ఎవరి ఇంటి నుంచి వస్తున్నారని ఆరా తీయడం మొదలు పెట్టారు. తాము మోసపోయామని తెలియని లావణ్య, సుమలత ఇంటి బయట నిలబడి ఉన్నారు. ఇంతలో ఓ యువతి వచ్చి మీ ఇంట్లోంచి ఎవరైనా వెళ్లారా, ఏదో ఎత్తుకెళ్లినట్లున్నారు అంది. మాకు ఓ కంపెనీ వారు పౌడర్ ఇచ్చారు.. మా ఇంట్లో నుంచి ఏమి తీసుకెళ్లలేదు అని వారు సమాధానం ఇచ్చారు. మీ ఒంటిమీద మంగళసూత్రాలు ఏమయ్యాయని ఆ యువతి అడగ్గా వంటింట్లో కుక్కర్లో పెట్టి వేడి చేస్తున్నామని చెప్పారు. ఒకసారి వెళ్లి నగలు ఉన్నాయో లేదో చూసుకోండి అని యువతి సూచించింది. తోడికోడళ్లు పరుగున వెళ్లి కుక్కర్ తెరిచి చూస్తే అందులో నగలు కనిపించలేదు. దీంతో ఇద్దరూ లబోదిబోమంటూ బయటికి వచ్చారు. విషయం తెలుసుకున్న స్థానికులు బైక్‌లపై గ్రామం నలుమూలలా వెతికినా ప్రయోజనం లేకపోయింది. సమాచారం అందుకున్న సీఐ శ్రీనివాస్, ఎస్ఐ నర్సింహ సంఘటనా స్థలానికి చేరుకుని బాధితుల నుంచి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వారం రోజుల క్రితం మొయినాబాద్ మండలం సురంగల్లోనూ ఇదే తరహా మోసానికి పాల్పడిన విషయం తెలిసిందే.