
చెన్నై: సంస్థలు కస్టమర్లను ఆకట్టుకునేందుకు చిత్రవిచిత్రమైన ఆఫర్లతో పాటు బోలెడు డిస్కౌంట్లను ప్రకటిస్తుంటాయి. ఏదేమైనా మార్కెట్‌లో పోటీని తట్టుకుని ముందుకు సాగాలనుకుంటున్నాయి. అందుకే మార్కెటింగ్ పరంగా ట్రెండింగ్ అంశాలపై ఫోకస్ పెడుతున్నాయి కొన్ని సంస్థలు. ప్రస్తుతం టమాటా ఊహించని ధర పలుకుతూ అందరికీ షాకిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో తాజాగా ఓ దేశీయ విమాన సంస్థ తమ వద్ద ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్న వారికి టమాటాలు ఫ్రీ అంటూ ఆఫర్‌ను ప్రకటించాయి. మదురైలో దేశీయ విమాన టిక్కెట్ బుకింగ్‌కు కిలో టమాటా, అంతర్జాతీయ విమాన బుకింగ్‌కు 1.5 కిలోల టమాటాలు ఇవ్వనున్నట్లు ఓ ట్రావెల్ ఏజెన్సీ ప్రకటింంది. వివరాలు.. తమిళనాడులో టమాటా ధర రోజురోజుకూ పెరుగుతోంది. దీన్ని నియంత్రించేందుకు ప్రభుత్వం రేషన్ దుకాణాల్లో తక్కువ ధరకు టమాటాలను పంపిణీ చేస్తోంది.
ఈ స్థితిలో మదురైలోని ఓ ట్రావెల్ సంస్థ ఇక్కడ విమాన టిక్కెట్లు బుక్ చేసుకునే వారికి ఎలాంటి ఛార్జీలు ఉండవని ప్రకటన విడుదల చేసింది. డొమెస్టిక్ ఫ్‌లైట్ బుకింగ్‌కు కిలో టమాట, విదేశీ విమానాలకు 1.5 కిలో ఉన్నట్లు పేర్కొంది. కాగా కొత్త ఆఫర్‌కు ప్రయాణికుల నుం మంచి ఆదరణ లభిస్తోందని కంపెనీ ప్రకటించడం గమనార్హం.
చదవండి: ఉత్తరాది అతలాకుతలం.. వరదలపై ముందస్తుగా హెచ్చరికలేవీ? షాకింగ్ విషయాలు
Comments
Please login to add a commentAdd a comment