
సాక్షి, నెల్లూరు : జిల్లాలోని పొదలకూరులో దారుణం చోటు చేసుకుంది. పదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థినిపై ఆటో డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. విద్యార్థిని గర్భం దాల్చడంతో ఆలస్యంగా ఆటో డ్రైవర్ దురాగతం బయటపడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పొదలకూరులోని ఒక పాఠశాలలో పదో తరగతి చదువుతున్న బాలికకు బంధువైన ఆటోడ్రైవర్ పవన్ మాయమాటలు చెప్పి లొంగదీసుకున్నాడు. కొంతకాలం లైంగికదాడి చేయడంతో ఆమె గర్భం దాల్చింది. విద్యార్థిని తండ్రి బయటి ప్రాంతానికి వెళ్లి కూలీ పనులు చేసుకుంటుండగా తల్లి పట్టణంలోనే పనిచేసుకుని జీవిస్తోంది. బాలిక గర్భం దాల్చి ఏడో నెల వచ్చే వరకు ఇంట్లో తల్లి కూడా తెలుసుకోలేకపోయింది. బాలిక జరిగిన విషయం తల్లికి చెప్పడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడు అవివాహితుకావడం, ఒకరికొకరు బంధువులు అయినందున వివాహం జరిపించేందుకు పెద్దలు మధ్యస్తం చేసేందుకు ప్రయత్నించారు. మధ్యస్తం కుదరకపోవడంతో పోలీసులు కేసు నమోదు చేసి విద్యార్థినిని వైద్యపరీక్షల నిమిత్తం నెల్లూరు జీజీహెచ్‌కు తరలించారు. హెడ్‌కానిస్టేబుల్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment