
స్థానికులు చాకచక్యంతో పట్టుకొని దేహశుద్ధి చేశారు. ముఖ్యంగా మహిళలు అతడిని చావబాదారు.
సాక్షి, చిత్తూరు : తిరుపతి నగర శివారు పద్మానగర్‌లో దారుణం చోటు చేసుకుంది. ఇంటి ముందు ఆడుకుంటున్న ఎనిమిదేళ్ల బాలికపై ఓ ఆటో డ్రైవర్ అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. దారుణాన్ని గమనించిన స్థానికులు కామాంధుడిని స్తంభానికి కట్టేసి చితకబాదారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తిని పద్మానగర్‌కు చెందిన ఆటో డ్రైవర్ జాన్‌గా గుర్తించారు.
(చదవండి : పాపం.. తప్పు చేశాడని కాళ్లు విరగ్గొట్టారు)
మద్యం మత్తులో ఉన్న జాన్.. ఇంటి ముందు ఆడుకుంటున్న ఎనిమిదేళ్ల బాలికతో కాసేపు మాట్లాడి ఆ తర్వాత పక్కనే ఉన్న పొదల్లోకి తీసుకెళ్లి అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. బాలిక గట్టిగా అరవడంతో స్థానికులు అటువైపుగా వెళ్లారు. వారిని గమనించిన జాన్.. అక్కడిని నుంచి పరారయ్యేందుకు ప్రయత్నించగా.. స్థానికులు చాకచక్యంతో పట్టుకొని దేహశుద్ధి చేశారు. ముఖ్యంగా మహిళలు అతడిని చావబాదారు. అనంతరం స్థానిక పోలీసులకు అప్పగించారు.