
ప్రతీకాత్మక చిత్రం
ముంబై: గుండెల మీద ఎత్తుకుని ముద్దాడాల్సిన తండ్రి దుర్మార్గంగా ప్రవర్తించాడు. రక్షించాల్సిన తండ్రే రాబంధులా కూతురిపై అత్యాచారానికి ఒడిగట్టాడు. తాగిన మత్తులో కన్నకూతురిపై అత్యాచారానికి పాల్పడ్డ తండ్రికి మంగళవారం ముంబై కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. ముంబైలోని వాశీ ప్రాంతానికి చెందిన ఓ బాలిక ఎనిమిదో తరగతి చదువుతోంది. 2014 నవంబర్‌లో ఓ రోజు తన తండ్రి తాగి ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో బాలిక తల్లి ఇంట్లో లేదు.
మిగతా పిల్లలు ఇంటి బయట ఆడుకుంటున్నారు. ఈ సమయంలో తండ్రి రక్తసంబంధాన్ని మరిచి కూతురిపై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేయగా విచారణలోనూ బాలికపై అత్యాచారం జరిగినట్టుగా నిర్ధారణ అయింది. ఇక పలు వాదనలు విన్న ధర్మాసనం నిందితుడికి ఐదు సంవత్సరాల జైలు శిక్ష ఖరారు చేస్తూ తీర్పు వెల్లడించింది. కాగా ఘటన జరిగిన ఐదేళ్ల తర్వాత తీర్పు వెలువడటం గమనార్హం.