![Mumbai Local Train Rape Accused Molest Few Before Incident - Sakshi](/styles/webp/s3/article_images/2023/06/16/Mumbai-Molestation-Case.jpg.webp?itok=juw8o9S6)
ఫ్లాట్‌ఫాంపై యువతిని వేధిస్తున్న దృశ్యం
క్రైమ్: దేశ వాణిజ్య రాజధానిలో కాలేజీ యువతిపై చోటు చేసుకున్న అత్యాచార ఘటనలో మరో విషయం వెలుగు చూసింది. ముంబై లోకల్ ట్రైన్‌లో 20 ఏళ్ల కాలేజీ స్టూడెంట్‌పై లైంగిక దాడికి తెగబడిన 40 ఏళ్ల నవాజూ కరీం షేక్.. ఆ అఘాయిత్యానికి ముందు ప్లాట్‌ఫాంపైనా ఐదుగురిని వేధించాడు కూడా. ఇందుకు సంబంధించిన దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి.
దాడి జరిగిన అదే రోజు ఛత్రపతి శివాజీ మహరాజ్ టెర్మినస్‌లోని ప్లాట్‌ఫాం నెంబర్ 1 పైనా ఐదుగురిని వేధించిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఎరుపు రంగు టీషర్ట్‌లో కరీం.. ఐదుగురు మహిళా ప్రయాణికుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ ఫుటేజీల్లో నమోదు అయ్యాయి. వాళ్లను చూస్తూ అసభ్యంగా సైగలు చేయడంతో పాటు వాళ్లను తాకేందుకు సైతం ప్రయత్నించాడు. అయితే ఈ ఘటనలకు సంబంధించి ఎవరూ ఫిర్యాదులు మాత్రం చేయలేదు.
బుధవారం నాడు కాలేజీ నుంచి ఇంటికి వెళ్తున్న క్రమంలో లోకల్ ట్రైన్‌లో ఒంటరిగా ఉన్న యువతిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు నవాజూ కరీం. అంతకు ముందు ఆమె ఎక్కడికి వెళ్లినా అతను ఫాలో అయినట్లు పోలీసులు గుర్తించారు. అత్యాచారం అనంతరం బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. రైల్వే పోలీసుల సాయంతో ఆ రాత్రే నిందితుడు కరీంను అరెస్ట్ చేశారు.
ఇదీ చదవండి: ఎంగేజ్‌మెంట్ అయిన ఆనందం ఆవిరి
Comments
Please login to add a commentAdd a comment