ప్రతీకాత్మక చిత్రం
పాకిస్థాన్ పంజాబ్ ప్రావిన్స్‌లో అత్యవసర పరిస్థితి విధించారు. మహిళలపై చిన్నారులపై అఘాయిత్య ఘటనలు పెరిగిపోతుండడంతో అక్కడి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మహిళలకు, పిల్లలకు భద్రతగా కూడా పోలీసులు వెళ్తుండడం కనిపిస్తోంది అక్కడ.
సమాజంలో ఇలాంటి(అఘాయిత్యాలు) ఘటనలను తమ ప్రభుత్వం తీవ్రంగా పరిగణనలోకి తీసుకుంటుందని పంజాబ్ హోం మంత్రి అట్టా తరార్ ప్రకటించారు. పంజాబ్‌లో ప్రతిరోజూ నాలుగు నుండి ఐదు అత్యాచార కేసులు నమోదవుతున్నాయి. లైంగిక వేధింపులను అరికట్టేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలను పరిశీలిస్తోంది. ఇందులో భాగంగానే అత్యవసర పరిస్థితి అని పేర్కొన్నారాయన.
మేధావులు, ఉపాధ్యాయులు, మహిళా సంఘాలు, న్యాయ నిపుణులు.. ఈ అంశంపై ప్రభుత్వంతో చర్చించేందుకు ముందుకు రావాలని పిలుపు ఇచ్చింది ప్రభుత్వం. అలాగే తల్లిదండ్రులు కూడా పిల్లలను రక్షించుకోవడం మీద దృష్టి సారించాలని పేర్కొంటోంది. కరోనా టైం నుంచి పాక్‌లో మహిళల మీద, పిల్లల మీద అఘాయిత్యాలు విపరీతంగా పెరిగిపోయాయి.
Comments
Please login to add a commentAdd a comment