ముంబై: బద్లాపూర్‌లో చిన్నారులపై జరిగిన హత్యాచారాన్ని కవర్ చేస్తున్న ఓ మహిళా జర్నలిస్ట్‌పై శివసేన (షిండే) వర్గం నేత చేసిన అసభ్యకరమైన వ్యాఖ్యలు వివాదాస్పదయ్యాయి. హత్యాచార ఘటనను కవర్ చేస్తున్న తనపై శివసేన (షిండే) వర్గం నేత వామన్ మాత్రే.. అసభ్య వ్యాఖ్యలు చేశారని స్థానిక టీవీలో పనిచేసే మహిళా జర్నలిస్టు తెలిపారు.
‘‘బాద్లాపూర్ మాజీ మేయర్ అయిన వామన్ మాత్రే నాపై చేసిన వ్యాఖ్యలు, ఆయన ప్రవర్తన ఆమోద యోగ్యం కాదు. ఆయన వ్యాఖ్యలు నాకు చాలా ఆగ్రహం కలిగించాయి. నేను నిజాల ఆధారంగానే హత్యాచార ఘటనను కవర్ చేశాను’’ అని మహిళా జర్నలిస్ట్ అన్నారు. అనంతరం వామన్ మాత్రే స్పందిసూ.. జర్నలిస్ట్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. మహిళా జర్నలిస్ట్ శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గంతో కుమ్మక్కు అయ్యారని అన్నారు. ‘‘ఇది ఆ మహిళా జర్నలిస్ట్ చేస్తున్న ఒక స్టంట్. ఆమె నాకు చాలా రోజుల నుంచి తెలుసు. ఆమె శివసేన(యూబీటీ)కి అనుకూలంగా పనిచేస్తారు. మీరు ఈ సంఘటనను రెండుమూడు రోజులుగా కవర్ చేస్తున్నారు. బాలికలపై దాడి జరిగిందా? లేదా? అనే దాని గురించి సరైన సమాచారాన్ని నివేదించాలని అడిగాను. అంతేకాని, నేను ఆమెతో అసభ్యంగా మాట్లాడలేదు’’ అని అన్నారు.
మరోవైపు.. వామన్ మాత్రే చేసిన వ్యాఖ్యలను ప్రతిపక్షాలు తీవ్రంగా ఖండిచాయి. ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. మాత్రే వ్యాఖ్యలను ముంబై ప్రెస్ క్లబ్ ఖండించింది. ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేను కోరింది. ప్రజల సెంటిమెంట్‌ను, పత్రికా గౌరవాన్ని ఇలా నిర్లక్ష్యం చేయడం ఆమోదయోగ్యం కాదని ఒక ప్రకటనలో పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment